2010–2019
ఇదంతా జనులను గూర్చినది
ఏప్రిల్ 2018


ఇదంతా జనులను గూర్చినది

సంఘము ప్రభువు యొక్క శిష్యులైన మీ గూర్చినది---ఆయనను ప్రేమించి, వెంబడించువారు మరియు ఆయన నామమును వారిపై తీసుకొనువారు.

అత్యంత సుందరమైన ప్యారిస్ ఫ్రాన్స్ దేవాలయ నిర్మాణము కొరకు ఏర్పాట్లు జరుగుచుండగా నాకు కలిగిన ఒక అనుభవము నేనెన్నడు మరిచిపోలేను. 2010 లో దేవాలయము కొరకు స్థలము లభించినప్పుడు ఆ నగర మేయరు మన సంఘము గురించి మరింతగా తెలుసుకోవలెనని మమ్ములను కలుసుకోవాలని కోరాడు. నిర్మాణానికి ఆమోద పత్రము పొందడానికి ఈ కలయిక అత్యంత కీలకమైన మెట్టు. సిద్ధపరచి ఆసక్తికరమైన కడవరి-దిన పరిశుద్ధుల దేవాలయముల అనేక చిత్రాలను చేర్చిన ఒక ప్రదర్శనను మేము శ్రద్ధగా సిద్ధపరిచాము. వాటి నిర్మాణ అందము మా నగర మేయరు మా ప్రాజెక్టుకు సహకరించి ప్రోత్సహించుటకు ఒప్పించునని నేను చాలా బలంగా ఆశించాను.

నాకు ఆశ్చర్యం కలిగించినదేమిటంటే, మేయరు మా ప్రదర్శనను పరిశీలించడానికి బదులుగా, అతడు మరియు అతడి జట్టు సభ్యులతో కలిసి సంఘము ఎటువంటిదో కనుగొనుటకు వారి స్వంత పరిశోధనను నిర్వహించుటకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ మరుసటి నెల, నగర పాలక వర్గ సభ్యురాలు, మరియు మతపరమైన చరిత్ర యొక్క అధ్యాపకురాలిగా కూడా ఉన్న ఆమె సమర్పించిన నివేదిక తెలియచేయడానికి మమ్మల్ని తిరిగి ఆహ్వానించారు. ఆమె ఇలా అన్నది, “అన్నిటికి పైగా మీ సంఘ సభ్యులెవరో గ్రహించాలని మేము కోరాము. మొదటగా, మీ సంస్కార సమావేశాలలో ఒకటి మేము హాజరయ్యాము. మేము మందిరము వెనుక భాగములో కూర్చొని, సమూహములోని జనులను మరియు వారేమి చేస్తున్నారో జాగ్రత్తగా గమనించాము. తరువాత మీ స్టేకు కేంద్రం చుట్టుప్రక్కల నివసిస్తున్న ఇరుగుపొరుగు వారిని కలుసుకొని, మోర్మనులైన మీరు ఎలాంటి వారని వారిని మేము అడిగాము. ”

“ఐతే మీ నిర్ణయాలేమిటి?” అని కాస్త ఆతృతగా భావిస్తూ నేను అడిగాను. ఆమె జవాబిచ్చింది. “మాకు తెలిసిన అన్ని సంఘములలోను, యేసు క్రీస్తు స్థాపించిన మొదటి సంఘమునకు అతి సన్నిహితముగా మీ యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము ఉన్నదని మేము కనుగొన్నాము,” అని జవాబిచ్చింది. అందుకు నేను ఇంచుమించు నిరాకరిస్తూ, “అది పూర్తిగా ఖచ్చితముకాదు! ఇది సన్నిహితముగా ఉన్న సంఘము కాదు; ఇదే యేసు క్రీస్తు యొక్క సంఘము---అదే సంఘము, నిజమైన సంఘము!” అని చెప్పి ఆపాలనుకున్నాను బదులుగా, నేను తమాయించుకొని దేవునికి మనసులోనే దేవునికి కృతజ్ఞతతో ప్రార్ధన చేసుకున్నాను. ఆ తరువాత మేయరు తమ పరిశీలనలను ఆధారంగా తనకు, తన బృందానికిగాని, తమ సామాజిక ప్రాంతంలో దేవాలయ నిర్మాణానికి ఎటువంటి ఆక్షేపణ లేదని మాకు సలహా ఇచ్చాడు.

ఈనాడు, ఆ అద్భుతమైన అనుభవమును గూర్చి నేను ఆలోచించినప్పుడు ఆ మేయరు యొక్క జ్ఞానము, వివేచనాస్పూర్తికి నేను కృతజ్ఞుడను. సంఘమును అర్ధము చేసుకొనుటకు ముఖ్యమైనది కంటికి కనుపించే భవనాల రూపమును బట్టి కాదు లేక క్రమబద్ధమైన పరిపాలనా విధానమునుబట్టి గాని కాదు కానీ యేసు క్రీస్తు యొక్క మాదిరిని వెంబడించుటకు ప్రతీరోజు ప్రయాసపడే దాని విశ్వాసులైన మిలియన్ల సభ్యుల ద్వారా గ్రహించుట అతడు కీలకమైనదని ఎరుగును.

సంఘమునకు నిర్వచనము మోర్మన్ గ్రంథములోని ఒక పాఠ్యభాగములోని వాక్యము నుండి రూపొందించ వచ్చును. “మరియు . . . ఎవరైతే [అనగా ప్రభువు యొక్క శిష్యులు] యేసు నామమున బాప్తీస్మము పొందారో వారు క్రీస్తు సంఘము అని పిలువబడిరి.”1

మరొక మాటలలో, సంఘం అంటే కేవలము ప్రజల గూర్చినది. ప్రభువు యొక్క శిష్యులైన---మీ గూర్చినది-- – ఎవరైతే ఆయనను ప్రేమించి, నిబంధన ద్వారా ఆయన నామమును వారిపై తీసుకొని ఆయనను అనుసరించి నడుచుకొనువారు.

అధ్యక్షుడు రస్సెల్ ఎం. నెల్సన్ ఒకసారి సంఘమును ఒక చక్కని మోటారు వాహనముతో సరిపోల్చారు. మన వాహనము శుభ్రంగా, మెరుస్తూ ఉంటే మనందరికి చాలా ఇష్టం. కానీ కారు యొక్క ఉద్దేశ్యము ఆకర్షణీయమైన యంత్రములా నిలబెట్టడానికి కాదు; కారులో జనులను తీసుకొనివెళ్ళటకు. 2 అదే పద్ధతిలో సంఘ సభ్యులమైన మనం కూడా, పరిశుభ్రముగా, బాగా నిర్వహించబడిన అందమైన ఆరాధనా స్థలములను కలిగియుండుటను మనము ఆనందిస్తాము. కాని ఇవి కేవలం ఉపయోగపడే సౌకర్యాలు. మన ముఖ్య ఉద్దేశ్యం ఏదనగా దేవుని యొక్క ప్రతీ కుమారుని, కుమార్తెను క్రీస్తు దగ్గరకు ఆహ్వానించడం, మరియు వారిని దేవుని యొక్క నిబంధన మార్గంలో నడిపించడం. అంతకంటే ముఖ్యమైనది ఏదీ లేదు. మన కార్యము జనులు మరియు నిబంధనలను గూర్చినది.

పునస్థాపించబడిన సంఘమునకు బయల్పాటు ద్వారా ఇవ్వబడిన పేరు ప్రతీ సువార్త నిబంధనలో రెండు అతి ముఖ్యమైన అంశములను కలిపి బంధించుట అద్భుతమైనది కాదా? మొదటిగా యేసు క్రీస్తు నామము. ఈ సంఘము ఆయనకు చెందినది, ఆయన పరిశుద్ధపరచు ప్రాయశ్చిత్తము మరియు నిబంధనలు మాత్రమే రక్షణకు, మహోన్నతస్థితికి మార్గము. రెండవ పేరు మనల్ని సూచించును: పరిశుద్ధులను లేక మరొక మాటలలో, ఆయన సాక్షులు మరియు ఆయన శిష్యులు.

మనుష్యులపై దృష్టి కేంద్రీకరించాల్సిన ప్రాముఖ్యతను నేను ఫ్రాన్స్ దేశంలో స్టేకు అధ్యక్షునిగా సేవ చేసినప్పుడు నేర్చుకున్నాను. నా సేవ ప్రారంభ దశలో, స్టేకు ఉన్నతి కోసం నేను చాలా పెద్ద లక్ష్యంను మనస్సులో కలిగియున్నాను: క్రొత్త వార్డులను ఏర్పాటు చేయుట, క్రొత్త సమావేశ గృహాలను నిర్మించుట, మరియు మా ప్రాంతములో ఒక క్రొత్త దేవాలయ నిర్మాణము కూడా. ఆరు సంవత్సరాల తరువాత నేను విరమణ పొందినప్పుడు, నా లక్ష్యాలలో ఒక్కటి కూడా నెరవేర్చబడలేదు. ఈ ఆరు సంవత్సరాల కాలంలో నా లక్ష్యాలు చాలా భిన్నంగా ఉన్నాయి తప్ప, ఇది పూర్తి వైఫల్యముగా భావించబడియుండవచ్చు.

నా విరమించబడిన దినమున స్టేజిపై నేను కూర్చోన్నప్పుడు, కృతజ్ఞతా భావం మరియు విజయోత్సాహం నాలో పొంగిపొర్లాయి. హాజరైన వందలాది సభ్యుల ముఖాల వైపు నేను చూసాను. వారిలో ప్రతీ ఒక్కరితో జతపరచబడిన ఆత్మీయ అనుభవమును నేను జ్ఞాపకము చేసుకోగలను.

వారిలో కొంతమంది బాప్తీస్మపు నీటిలో ప్రవేశించిన సోదరులు, సోదరీలు, వారిలో కొందరికి దేవాలయము యొక్క పరిశుద్ధ విధులను పొందునట్లు మొదటి సిఫారసులపై నేను సంతకం చేశాను, మరియు వారు నేను పూర్తి-కాల మిషనరీలుగా ప్రత్యేకించి నియమించబడిన వారు లేక విడుదల చేయబడిన వారు, మరియు పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన యువకులు, మరియు దంపతులు కూడా ఉన్నారు. అక్కడ వారి జీవితాలలో శ్రమలను మరియు దుర్దశను అనుభవిస్తున్నప్పుడు, నేను పరిచర్య చేసిన అనేకమంది ఇతరులున్నారు. నేను వారిలో ప్రతీ ఒక్కరిపట్ల బలమైన సహోదర ప్రేమను అనుభవించాను. వారికి సేవ చేయడంలో నేను స్వచ్ఛమైన ఆనందాన్ని కనుగొన్నాను మరియు రక్షకుని యెడల వారి విశ్వాసం, నమ్మకం వృద్ధిచెందుట చూచి హర్షించాను.

అధ్యక్షుడు ఎం. రస్సెల్ బల్లార్డ్ ఇలా బోధించాడు, “మన సంఘ బాధ్యతలలో అతి ముఖ్యమైనదేమిటి, సంఖ్యాపరమైన నివేదికలు, జరిపించబడిన సభలు కాదు, కాని వ్యక్తులైన జనులు--మన రక్షకుడు చేసిన విధంగా ఒక్కొక్కరికి పరిచర్య చేయబడి—పైకెత్తబడి, ప్రోత్సహించబడి, మరియు చివరకు మార్చబడుచున్నారు.”3

నా ప్రియమైన సోదర, సోదరిలారా, మనము సువార్త సేవలో చురుకుగా ఉన్నామా, లేక కేవలం సంఘములో తీరిక లేకుండా ఉన్నామా? ప్రతి విషయంలోనూ మన రక్షకుని మాదిరిని అనుసరించుట కీలకమైనది. మనము దానిని చేసిన యెడల, పనులను చేయుట మరియు కార్యక్రమాలను అన్వయించుట కంటే వ్యక్తులను రక్షించుటపై మనము సహజంగా దృష్టిసారిస్తాము.

వచ్చే ఆదివారం రక్షకుడు మీ వార్డు, లేక బ్రాంచిని దర్శిస్తే ఎలా ఉంటుందోనని మీరు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? ఆయన ఏమి చేస్తారు? దృశ్య సంబంధిత పరికరాలు సరిగా ఉన్నవో, లేదో అని లేక తరగతి గదిలో కుర్చీలు సరిగా అమర్చబడి ఉన్నవో లేదో అని చింతిస్తాడా? లేక ఆయన ప్రేమించుటకు, బోధించడానికి మరియు దీవించడానికి ఎవరినైనా కనుగొంటాడా? బహుశా స్వాగతించడానికి ఒక క్రొత్త సభ్యుడను లేక ఒక స్నేహితుడను వెదుకుతాడా లేక ఆదరణ అవసరమైన రోగియైన సోదరుని లేక సోదరీని పైకెత్తి మరియు ప్రోత్సహించబడుట అవసరమైన అస్థిరముగా ఉన్న యౌవనుని వెదకుతాడా?

ఏ తరగతులను యేసు దర్శిస్తాడు? ఆయన మొదట ప్రాధమిక పిల్లల తరగతిని దర్శిస్తే నేను ఆశ్చర్యపడను. బహుశా ఆయన మోకరించి, వారి కళ్ళలోకి చూస్తూ మాట్లాడవచ్చు. వారి తన ప్రేమను తెలియచేసి, వారికి కధలను చెప్పి, వారు గీసిన బొమ్మలను మెచ్చుకొని, మరియు తన పరలోకమందున్న తండ్రిని గూర్చి సాక్ష్యమిచ్చును. ఆయన స్వభావము, సరళమైనదిగా, స్వచ్ఛముగా మరియు కపటత లేకుండా ఉంటుంది. ఆ విధంగా మనం చేయగలమా?

ప్రభువు చేయమన్నది చేయుటకు మీరు ప్రయాసపడినప్పుడు, మీరు సహాయపడి మరియు దీవించగల ఆ జనులను కనుగొనుట కంటే ఎక్కువ ముఖ్యమైనదిగా ఏదీ ఉండదని నేను మీకు వాగ్దానము చేయుచున్నాను. సంఘములో మీరు వ్యక్తులకు బోధించుటకు మరియు వారి హృదయాలను తాకుటపై దృష్టిసారించాలి. ఒక పరిపూర్ణమైన ప్రోత్సాహకార్యక్రమమును ఏర్పాటు చేయుటకు బదులుగా ఒక ఆత్మీయ అనుభవమును బలపరచుటకు, మీరు చేసిన దర్శనాల సంఖ్యను గుర్తించుటకంటే మేలుగా, మీ సహవాసులకు పరిచర్య చేయుటగా మీ ఆలోచన ఉండాలి. అది మీ గూర్చినది కాదు, కాని మనము మన సహోదర, సహోదరీలను పిలిచే వారి గూర్చినది.

కొన్నిసార్లు మనము సంఘానికి వెళ్లటం గురించి మాట్లాడతాము. కాని సంఘము ఒక భవనం లేక దాని ఒక ప్రత్యేక స్థలం కంటే ఎక్కువ గొప్పది. అది ఇక్కడ సాల్ట్‌లేక్ పట్టణములోని సంఘ ప్రధాన కార్యాలయము వద్ద ఉన్నట్లుగా ప్రపంచములోని మారుమూల ప్రాంతాలలో మిక్కిలి సాధారణమైన గృహాలలో అది అంతే నిజముగా, సజీవముగా ఉన్నది. ప్రభువే చెప్పారు, “ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామమున కూడుకొందురో అక్కడ వారి మధ్య నేనున్నాను” 4.

మనం ఎక్కడకు వెళ్ళితే అక్కడకు మనతో సంఘాన్ని తీసుకు వెళతాము: మన పని వద్దకు, పాఠశాలకు, విహార స్థలానికి, మరియు ప్రత్యేకంగా మన గృహాలలోనికి. మన ఉనికి మరియు ప్రభావము మనము ఎక్కడ ఉన్నప్పటికినీ మనకై మనం ఒక పరిశుద్ధ స్థలమును కనుగొంటాము.

మన విశ్వాసము యొక్క సభ్యుడు కాని ఒక స్నేహితునితో జరిగిన సంభాషణ నాకు జ్ఞాపకమున్నది. మన సంఘములో యోగ్యుడైన ప్రతి పురుషుడు యాజకత్వం పొందగలడని తెలుసుకొని ఆశ్చర్యపడ్డాడు. “అయితే మీ వార్డులో ఎంతమంది యాజకత్వము గల సోదరులను మీరు కలిగియున్నారు? అని అతడు అడిగాడు.

“30 – 40 మధ్య” నేను జవాబిచ్చాను.

అతడు దిగ్భ్రమతో, “మా సంఘంలో, మాకు ఒక్క యాజకుడు మాత్రమే ఉంటాడు. కాని, ఆదివారం ఉదయం అంతమంది యాజకులు మీకు ఎందుకు అవసరం?” అన్నాడు.

అతని ప్రశ్న నాకు కుతూహలము కలిగించి నేను ఇలా జవాబిచ్చుటకు ప్రేరేపించబడ్డాను. “నీతో నేను ఏకీభవిస్తున్నాను. సంఘములో ఆదివారం నాడు అంతమంది యాజకులు అవసరం అని నేను అనుకోను. కాని ప్రతీ ఇంటిలోను ఒక యాజకత్వ నాయకుడు మాకుఅవసరం. ఒక గృహములో యాజకుడు లేనప్పుడు, ఆ కుటుంబమును కావలికాయుటకు మరియు పరిచర్య చేయుటకు, ఇతర యాజకత్వ నాయకులు పిలవబడతారు.”

మనది ఆదివారము మాత్రమే పాల్గొనే సంఘం కాదు. వారంలో ప్రతి రోజు మేము ఎక్కడ ఉన్నా, మేము ఏ పని చేస్తున్నప్పటికి, మా ఆరాధన కొనసాగును. ప్రత్యేకంగా మా గృహాలు “మా విశ్వాసము యొక్క ప్రాధమిక పవిత్ర స్థలాలు.”5 తరచుగా మా గృహాలలోనే, మేము ప్రార్ధన చేస్తాము, మేము దీవిస్తాము, మేము అధ్యయనము చేస్తాము, మేము దేవుని యొక్క వాక్యమును బోధిస్తాము, మరియు శుద్ధమైన ప్రేమతో మేము సేవ చేస్తాము. అధికారిక ఆరాధనా స్థలములలో ఉన్నంతగా, కొన్నిసార్లు ఇంకా ఎక్కువగా కూడ మా గృహాలు ఆత్మ సమృద్ధిగా ఉండే పరిశుద్ధ స్థలాలుగా ఉంటాయని నా స్వంత అనుభవముతో నేను సాక్ష్యమివ్వగలను.

ఈ సంఘము యేసు క్రీస్తు యొక్క సంఘమని నేను సాక్ష్యమిచ్చుచున్నాను. దాని శక్తి మరియు జీవము ఇతరులను శ్రద్ధ తీసుకొనుట ద్వారా ఆయన మహోన్నతమైన మాదిరిని అనుసరించుటకు ప్రతీరోజు ప్రయత్నిస్తున్న ఆయన శిష్యులైన మిలియన్ల మంది యొక్క అనుదిన క్రియల నుండి వచ్చును. క్రీస్తు జీవిస్తున్నాడు మరియు ఈ సంఘమును ఆయన నడిపించును. అధ్యక్షులు రస్సెల్ ఎం. నెల్సన్‌ మన దినములలో మనల్ని నడిపించుటకు ఆయన ఏర్పరచుకొనిన ప్రవక్త. ఈ విషయాలను గూర్చి యేసు క్రీస్తు నామములో నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.

ముద్రించు