2010–2019
గంభీరమైన సమావేశము
ఏప్రిల్ 2018


గంభీరమైన సమావేశము

సహోదర, సహోదరిలారా, మనము ఈరోజు కూడుకొన్న గంభీరమైన సమావేశము యొక్క వ్యవహారమును నిర్వహించమని అధ్యక్షులు నెల్సన్ అడిగారు.

ఇది ప్రపంచమంతటా యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘ సభ్యుల కొరకు గొప్ప ప్రాముఖ్యతను కలిగియున్న సందర్భము.

1880, అక్టోబరు  10 తేది నుండి, బ్రిగమ్ యంగ్ తరువాత ప్రవక్త, దీర్ఘదర్శి, మరియు బయల్పాటుదారునిగా యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘ సభ్యుల యొక్క అధ్యక్షునిగా జాన్ టేలర్ ఆమోదించబడినప్పడు, ఈ సందర్భాలలో ప్రతిఒక్కటి, సంఘము యొక్క స్వరమును వ్యక్తపరచుటకు సంఘ శరీరముగా పద్ధతి ప్రకారమైన గంభీరమైన సమావేశముగా నియమించబడినవి.

మనము కోరములు మరియు గుంపుల ద్వారా అనుమతిని పొందుతాము. మీరెక్కడ ఉన్నప్పటికిని, మీరు అడగబడినప్పుడు మాత్రమే నిలబడుటకు ఆహ్వానించబడతారు మరియు సమర్పించబడిన పేర్లను ఆమోదించుటకు మీరు ఇష్టపడితే మీ చేతిని పైకెత్తుట ద్వారా వ్యక్తపరచుము. నిలబడమని అడిగినప్పుడు మాత్రమే మీరు సమ్మతిని తెలపాలి.

టాబర్నాకిల్ మరియు టెంపుల్ స్క్వేర్ ఆసెంబ్లీ హాలుకు నియమించబడిన ప్రధాన అధికారులు, ఆ భవనాలలోని ఓటింగ్‌ను గమనిస్తారు. స్టేకు కేంద్రాలలో, స్టేకు అధ్యక్షత్వములోని సభ్యులొకరు ఓటింగ్‌ను గమనిస్తారు. ఎవరైనా అసమ్మతిని చూపిన యెడల, ఆ వ్యక్తులు వారి సంబంధిత స్టేకు అధ్యక్షులను సంప్రదించాలి.

ఇప్పుడు మనము కొనసాగిద్దాము. మరలా, ఆవిధంగా చేయమని అడిగినప్పుడు మాత్రమే దయచేసి సమ్మతిని తెలుపుము.

ప్రథమ అధ్యక్షత్వము యొక్క సభ్యులను దయచేసి లేచి నిలబడమని మేము అడుగుచున్నాము.

ప్రవక్త, దీర్ఘదర్శి, మరియు బయల్పాటుదారునిగా మరియు యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘ అధ్యక్షునిగా రస్సెల్ మారియన్ నెల్సన్‌ను ప్రథమ అధ్యక్షత్వము ఆమోదించుటకు ప్రస్తావించబడింది.

అనుమతించు ప్రథమ అధ్యక్షత్వము, దయచేసి దానిని ప్రత్యక్షపరచుము.

సంఘము యొక్క ప్రథమ అధ్యక్షత్వములో డాల్లిన్ హెచ్. ఓక్స్ మొదటి సలహాదారునిగా, మరియు హెన్రీ బి. ఐరింగ్ రెండవ సలహాదారునిగా ప్రథమ అధ్యక్షత్వము ఆమోదించుటకు ప్రస్తావించడమైనది

అనుమతించు ప్రథమ అధ్యక్షత్వపు సభ్యులు, దానిని ప్రత్యక్షపరచవచ్చు.

పన్నెండుమంది అపొస్తులుల కోరము యొక్క అధ్యక్షునిగా డాల్లిన్ హార్రిస్ ఓక్స్ మరియు పన్నెండుమంది అపొస్తులుల కూటమి యొక్క తాత్కాలిక అధ్యక్షునిగా మెల్విన్ రస్సెల్ బల్లార్డ్‌ను ప్రథమ అధ్యక్షత్వము ఆమోదించుటకు ప్రస్తావించబడింది.

అనుమతించు ప్రథమ అధ్యక్షత్వము యొక్క సభ్యులు, దానిని ప్రత్యక్షపరచవచ్చు.

తరువాత పన్నెండుమంది అపొస్తులుల కూటమి యొక్క సభ్యులుగా వీరిని ప్రథమ అధ్యక్షత్వము ఆమోదించుటకు ప్రస్తావించబడింది: ఎమ్.  రస్సెల్ బల్లార్డ్‌, జెఫ్రీ  ఆర్. హాలండ్, డీటర్  ఎఫ్. ఉక్‌డార్ఫ్, డేవిడ్  ఎ. బెడ్నార్, క్వింటిన్  ఎల్. కుక్, డి.  టాడ్ క్రిస్టాఫర్సన్, నీల్  ఎల్. ఆండర్సన్, రోనాల్డ్  ఎ. రాస్‌బాండ్, గారీ  ఈ. స్టీవెన్‌సన్, డేల్  జి. రెన్‌లండ్, గార్రిట్ వాల్టర్ గాంగ్, మరియు యులిసెస్ సోరెస్.

ప్రథమ అధ్యక్షత్వము యొక్క సభ్యులారా, దయచేసి దానిని ప్రత్యక్షపరచుము.

ప్రథమ అధ్యక్షత్వములోని సలహాదారులు మరియు పన్నెండుమంది అపొస్తులుల కూటమిని ప్రవక్తలు, దీర్ఘదర్శులు, మరియు బయల్పాటుదారులుగా ప్రథమ అధ్యక్షత్వము ఆమోదించుటకు ప్రస్తావించబడింది.

ప్రథమ అధ్యక్షత్వము యొక్క సభ్యులు, దయచేసి దానిని ప్రత్యక్షపరచుము.

ప్రథమ అధ్యక్షత్వము ఇప్పుడు కూర్చోంటారు.

ఎల్డర్ గాంగ్ మరియు ఎల్డర్ సోరెస్, పన్నెండుమంది అపొస్తులుల కూటమితో వారి స్థానములను తీసుకొనుటకు మేము ఆహ్వానిస్తున్నాము.

పన్నెండుమంది అపొస్తులుల కూటమి యొక్క సభ్యులు మాత్రమే, ఎల్డర్ గాంగ్ మరియు ఎల్డర్ సోరెస్ కలిపి, దయచేసి లేచి నిలబడుము.

ప్రవక్త, దీర్ఘదర్శి, మరియు బయల్పాటుదారునిగా మరియు యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘ అధ్యక్షునిగా రస్సెల్ మారియన్ నెల్సన్‌ను, ఆయన సలహాదారులు మరియు ప్రథమ అధ్యక్షత్వము చేత వారు సమర్పించబడి మరియు అనుమతించబడినట్లుగా పన్నెండుమంది అపొస్తులుల కూటమి యొక్క సభ్యులతో కలిసి పన్నెండుమంది అపొస్తులుల కూటమి ఆమోదించుటకు ప్రస్తావించబడింది.

అనుమతించు పన్నెండుమంది అపొస్తులుల కూటమి యొక్క సభ్యులారా, దయచేసి దానిని ప్రత్యక్షపరచుము.

మీరు కూర్చోవచ్చు.

ప్రధాన అధికారి డెబ్బదులు మరియు అధ్యక్షత్వము వహించు బిషప్రిక్ యొక్క సభ్యులు దయచేసి నిలబడమని మేము అడుగుచున్నాము.

ప్రవక్త, దీర్ఘదర్శి, మరియు బయల్పాటుదారునిగా మరియు యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘ అధ్యక్షునిగా రస్సెల్ మారియన్ నెల్సన్‌ను, ఆయన సలహాదారులు మరియు ప్రథమ అధ్యక్షత్వము చేత వారు సమర్పించబడి మరియు అనుమతించబడినట్లుగా పన్నెండుమంది అపొస్తులుల కూటమి యొక్క సభ్యులతో కలిసి ప్రధాన అధికారి డెబ్బదులు మరియు అధ్యక్షత్వము వహించు బిషప్రిక్ యొక్క సభ్యులు ఆమోదించుటకు ప్రస్తావించబడింది.

అనుమతించు ప్రధాన అధికారి డెబ్బదులు మరియు అధ్యక్షత్వము వహించు బిషప్రిక్ యొక్క సభ్యులు దయచేసి దానిని ప్రత్యక్షపరచుము.

మీరు కూర్చోవచ్చు.

ప్రపంచములో మీరెక్కడ ఉన్నప్పటికినీ, దయచేసి లేచి నిలబడమని క్రింద వారిని మేము అడుగుచున్నాము: ప్రాంతీయ డెబ్బదులు, నియమించబడిన గోత్రజనకులు, ప్రధాన యాజకులు, మరియు ఎల్డర్లు.

ప్రవక్త, దీర్ఘదర్శి, మరియు బయల్పాటుదారునిగా మరియు యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘ అధ్యక్షునిగా రస్సెల్ మారియన్ నెల్సన్‌ను, మరియు ఆయన సలహాదారులు సమర్పించబడి, అనుమతించబడినట్లుగా పన్నెండుమంది అపొస్తులుల కూటమి యొక్క సభ్యులతో కలిసి ఆమోదించుటకు ప్రస్తావించబడింది.

అనుమతించు వారందరూ, దయచేసి దానిని ప్రత్యక్షపరచుము.

వ్యతిరేకించు వారెవరైనా, దానిని ప్రత్యక్షపరచవచ్చు.

దయచేసి కూర్చొనుము.

ఉపశమన సమాజ సభ్యులందరూ---18 సంత్సరాలు పైబడిన స్త్రీలందరూ---దయచేసి నిలబడండి.

ప్రవక్త, దీర్ఘదర్శి, మరియు బయల్పాటుదారునిగా మరియు యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘ అధ్యక్షునిగా రస్సెల్ మారియన్ నెల్సన్‌ను, మరియు ఆయన సలహాదారులు, ముందుగా సమర్పించబడి, అనుమతించబడినట్లుగా పన్నెండుమంది అపొస్తులుల కూటమి యొక్క సభ్యులతో కలిసి ఆమోదించుటకు ప్రస్తావించబడింది.

అనుమతించు వారందరూ, దయచేసి దానిని ప్రత్యక్షపరచుము.

వ్యతిరేకించు వారెవరైనా సూచించవచ్చు.

మీరు కూర్చోవచ్చు.

అహరోను యాజకత్వము కలిగియున్నవారు మాత్రమే---నియమించబడిన యాజకులు, బోధకులు, మరియు పరిచారకులు—దయచేసి నిలబడుము.

ప్రవక్త, దీర్ఘదర్శి, మరియు బయల్పాటుదారునిగా మరియు యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘ అధ్యక్షునిగా రస్సెల్ మారియన్ నెల్సన్‌ను, ఆయన సలహాదారులు, మరియు ముందుగా సమర్పించబడి, అనుమతించబడినట్లుగా పన్నెండుమంది అపొస్తులుల కూటమి యొక్క సభ్యులతో కలిసి ఆమోదించుటకు ప్రస్తావించబడింది.

అనుమతించు వారందరూ, చేతిని పైకెత్తుట ద్వారా దయచేసి దానిని సూచించుము.

వ్యతిరేకించు వారెవరైనా, దానిని సూచించవచ్చు.

మీరు కూర్చోవచ్చు.

12 నుండి 18 పైబడిన వయస్సుగల యువతులు దయచేసి నిలబడతారా.

ప్రవక్త, దీర్ఘదర్శి, మరియు బయల్పాటుదారునిగా మరియు యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘ అధ్యక్షునిగా రస్సెల్ మారియన్ నెల్సన్‌ను, ఆయన సలహాదారులు, మరియు ముందుగా సమర్పించబడి, అనుమతించబడినట్లుగా పన్నెండుమంది అపొస్తులుల కూటమి యొక్క సభ్యులతో కలిసి ఆమోదించుటకు ప్రస్తావించబడింది.

అనుమతించు వారందరూ, చేతిని పైకెత్తుట ద్వారా దయచేసి సూచించుము.

వ్యతిరేకించు వారెవరైనా, దానిని సూచించవచ్చు.

మీరు కూర్చోవచ్చు.

ఇప్పుడు మేము మొత్తము సభ్యత్వమును అడుగుతాము, మీరు ఎక్కడ ఉన్నప్పటికినీ, ఇంతకు ముందు నిలబడిన వారందరూ కలిపి, దయచేసి నిలబడుము.

ప్రవక్త, దీర్ఘదర్శి, మరియు బయల్పాటుదారునిగా మరియు యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘ అధ్యక్షునిగా రస్సెల్ మారియన్ నెల్సన్‌ను, ఆయన సలహాదారులతో కలిసి, మరియు వారు సమర్పించబడి, అనుమతించబడినట్లుగా పన్నెండుమంది అపొస్తులుల కూటమి యొక్క సభ్యులతో కలిసి ఆమోదించుటకు ప్రస్తావించబడింది.

అనుమతించు వారందరూ, చేతిని పైకెత్తుట ద్వారా దయచేసి సూచించుము.

వ్యతిరేకించు వారెవరైనా, దానిని సూచించవచ్చు.

మీరు కూర్చోవచ్చు.

సహోదర, సహోదరిలారా, మీ ప్రేమ మరియు సహకారము కొరకు మీకు ధన్యవాదములు.

ముద్రించు