సంఘ లెక్కల తనిఖీ విభాగ నివేదిక, 2017
యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క ప్రథమ అధ్యక్షత్వమునకు
సిద్ధాంతము మరియు నిబంధనలు 120 అధ్యాయములో బయల్పాటు చేత నిర్దేశించబడిన విధంగా, దశమ భాగముల వినియోగముపై---ప్రథమ అధ్యక్షత్వము, పన్నెండుమంది అపోస్తలుల కూటమి మరియు అధ్యక్షత్వము వహించు బిషప్రిక్కులను కలిగియున్న సలహాసభ---సంఘ నిధుల వ్యయమునకు అధికారమిచ్చును. సంఘ సంస్థలు ఆమోదించబడిన బడ్జెట్లు, విధి విధానాలను అనుసరించి నిధులను వినియోగించెదరు.
విశ్వాసయోగ్యమైన అధికారులను కలిగియున్న సంఘ లెక్కల తనిఖీ విభాగము మిగిలిన సంఘ విభాగముల నుండి స్వతంత్రముగా ఉండి, పొందిన విరాళములు, చేయబడిన ఖర్చులు మరియు సంఘ ఆస్తులను కాపాడుటకు సంబంధించి న్యాయమైన హామీని ఇచ్చే ఉద్దేశము కొరకు లెక్కల తనిఖీ చేయు బాధ్యతను కలిగియున్నది.
జరిగిన తనిఖీలపై ఆధారపడి, సంఘ లెక్కల తనిఖీ విభాగ అభిప్రాయము ప్రకారము, అన్ని వస్తువులకు సంబంధించి, పొందిన విరాళములు, చేయబడిన ఖర్చులు మరియు 2017వ సంవత్సరము కొరకు సంఘ ఆస్తులు వ్రాయబడినవి మరియు ఆమోదించబడిన సంఘ బడ్జెట్లు, విధానాలు, లెక్కల అభ్యాసాలకు అనుగుణంగా నిర్వహించబడినవి. సంఘము దాని సభ్యులకు బోధించిన విధముగా ఉన్నంతలో జీవించుట, అప్పులు చేయకుండుట మరియు ఆపత్కాలము కొరకు పొదుపు చేయుట వంటి ఆచరణలను అనుసరించును.
మర్యాదపూర్వకంగా సమర్పించబడినది,
సంఘ లెక్కల తనిఖీ విభాగము
కెవిన్ ఆర్. జెర్గెన్సన్
కార్యనిర్వహణాధికారి