2010–2019
సాత్వీకులు మరియు దీనులు
ఏప్రిల్ 2018


2:3

సాత్వీకులు మరియు దీనులు

విమోచకుని యొక్క స్వభావ సిద్ధమైన సాత్వీకము మరియు నీతిపూర్వక స్పందన, సుముఖతగల విధేయత మరియు బలమైన ఆత్మనిగ్రహం చేత గుర్తించబడుచున్నది.

మన సంఘ నాయకులను ఆమోదించు పవిత్ర అవకాశమునకు నేను సంతోషిస్తున్నాను. ఎల్డర్ గాంగ్, మరియు ఎల్డర్ సోరెస్‌లను పన్నెండుమంది అపోస్తలుల కూటమిలోనికి హృదయపూర్వకంగా ఆహ్వానించుచున్నాను. ఈ విశ్వసనీయులైన పురుషుల పరిచర్యలు ప్రపంచమంతటా వ్యక్తులను, మరియు కుటుంబాలను ఆశీర్వదించును, మరియు నేను వారితో కలిసి సేవ చేయుటకు, వారినుండి నేర్చుకొనుటకు నేను కుతూహలముతో ఉన్నాను.

రక్షకుని యొక్క దైవత్వ స్వభావము1 యొక్క ముఖ్యమైన అంశమును గూర్చి మనమందరము కలిసి నేర్చుకొనుటకును, మన జీవితములలో అనుకరించుటకును, పరిశుద్ధాత్మ మనకు బోధించి, జ్ఞానోదయమును కలిగించవలెనని నేను దేవునికి మనవి చేయుచున్నాను.

క్రీస్తును పోలిన ప్రత్యేక లక్షణమును, తరువాత నా సందేశములో గుర్తించకముందు ఈ లక్షణమును గుర్తించునట్లు కొన్ని మాదిరులను నేను మీ ముందుంచుతాను. దయచేసి ప్రతి మాదిరిని జాగ్రత్తగా ఆలకించి నేను అడిగే ప్రశ్నలకు తగిన జవాబులను కనుగొనడానికి నాతో పాటు ప్రయత్నించండి.

ఉదాహరణ# 1. ధనికుడైన యువకుడు మరియు అమ్యులేక్

క్రొత్త నిబంధనలో, ఒక ధనికుడైన యువకుని గూర్చి మనము నేర్చుకున్నాము. అతడు యేసు క్రీస్తును ఇలా అడిగాడు, “ బోధకుడా, నిత్యజీవమును పొందుటకు నేను ఏ మంచికార్యము చేయవలెను?” 2 రక్షకుడు మొదట అతనిని ఆజ్ఞలను పాటించుము అని ఆదేశించాడు. ఆ తరువాత ఆ యువకునికి అతని ప్రత్యేక అవసరతలు మరియు పరిస్థితులకు అనుకూలమైన మరొక అర్హతను ఇచ్చాడు.

“నీవు పరిపూర్ణుడవుడగుటకు కోరిన యెడల, పోయి ఆస్తిని బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును: నీవు వచ్చి, నన్ను వెంబడించుమని యేసు అతనితో చెప్పెను.

“అయితే ఆ యువకుడు మిగుల ఆస్తిగలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను.”3

ఆ ధనికుడైన ఆ యువకుని ప్రతి స్పందనను మోర్మన్ గ్రంధంలో అమ్యులేక్ యొక్క అనుభవంతో పోల్చి చూచినట్లయితే, అమ్యులేక్ ఎంతో శ్రమించి ఐశ్వర్యవంతుడయ్యాడు మరియు అతనికి అనేకమంది బంధువుల వర్గం, స్నేహితులను కలిగి అభివృద్ధి చెందాడు.4అనేక పర్యాయములు తాను పిలవబడ్డాడు కాని వినలేదని, దేవుని గూర్చి సంగతులు ఎరిగియున్నాడు కాని గ్రహించనివాడనని తన గురించి తాను వివరించాడు.5వాస్తవంగా మంచి వ్యక్తియైన అమ్యులేక్ క్రొత్త నిబంధనలో వివరించబడిన ధనికుడైన యువకునివలే లోకసంబంధమైన విషయముల వైపు ఆకర్షింపబడియున్నాడు.

అమ్యులేక్ మొదట్లో హృదయాన్ని కఠినపరచుకున్నప్పటికి, దేవదూత స్వరమునకు విధేయుడై, ప్రవక్త ఆల్మాను తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు, మరియు అతనిని పోషించియున్నాడు. ఆల్మా దర్శించిన సమయంలో అతడు ఆత్మీయంగా మేల్కొలపబడ్డాడు మరియు సువార్తను బోధించుటకు పిలువబడ్డాడు. ఆ తరువాత, అమ్యులేక్, “తన సమస్త బంగారమును, వెండి, ప్రశస్త వస్తువులను దేవుని యొక్క వాక్యము కొరకు, (మరియు) ఒకప్పటి అతని స్నేహితులు మరియు అతని తండ్రి మరియు అతని బంధువుల చేత కూడ తిరస్కరించబడెను.”6

ధనికుడైన యువకుని ప్రవర్తనకు, అమ్యులేక్ ప్రవర్తనకు మధ్య గల వ్యత్యాసము మనకు ఏమి వివరిస్తున్నదని మీరనుకొనుచున్నారు?

ఉదాహరణ# 2. పహోరన్

మోర్మన్ గ్రంధములో వర్ణించబడిన అపాయకరమైన ఒక యుద్ధ కాలములో, నీఫైయుల సైన్యాదిపతియైన మొరోనై, మరియు ప్రధాన న్యాయాధిపతి, రాజ్యాధిపతియైన పహోరానుకు మధ్య ఒకరినుండి ఒకరికి పత్రికలు పంపబడినవి మొరోనై తన సైన్యమునకు, తగినంత పోషణ, సహాయము రాజ్యదిపతి నుండి లభించనందున సైన్యము బహు ఇబ్బందులను ఎదుర్కొనుట వలన, పహోరన్‌కు “ఖండన రీతిలలో”7 వ్రాసాడు మరియు అతడిని, అతని తోటి నాయకుల యొక్కఆలోచనరహితము, సోమరితనము, అశ్రద్ధ, మరియు దేశద్రోహులని నిందిస్తూ ఖండిస్తూ పత్రికలు వ్రాసి పంపెను.8

పహోరాను మొరోనై వ్రాసిన నిందలను, నేరారోపణలను బట్టి, అతనిని ద్వేషించుట సులభమైనప్పటికిని కానీ అతడు అలా చేయలేదు. అతడు కనికరముతో స్పందించాడు మరియు మొరోనైకి తెలియని, ప్రభుత్వ వ్యతిరేకతను వివరించాడు. తరువాత పహరోను ప్రకటించాడు:

“ఇదిగో మొరోనై నేను చెప్పుచున్నాను, మీ గొప్ప బాధలయందు నేను సంతోషించను, అవును అది నా ఆత్మను దుఃఖపెట్టుచున్నది. …

“…నీ లేఖ యందు నీవు నన్ను మందలించితివి. కానీ అది అంత ప్రాముఖ్యము కాదు; నేను కోపముగా లేను, కానీ నీ హృదయము యొక్క గొప్పతనమందు ఆనందించుచున్నాను.”9

మొరోనై నిందలకు పహోరన్ సంయమనముతో వ్రాసిన జవాబు ఏమి వివరిస్తుదని మీరనుకొనుచున్నారు?

మాదిరి # 3. అధ్యక్షుడు రస్సెల్ ఎం. నెల్సన్ మరియు అధ్యక్షడు హెన్రీ బి. ఐరింగ్

ఆరు నెలల క్రిందట జరిగిన సర్వసభ్య సమావేశములో, అధ్యక్షుడు రస్సెల్ ఎం. నెల్సన్ తనకు అధ్యక్షుడు థామస్ ఎస్. మాన్సన్ మోర్మన్ గ్రంధమును అధ్యయనము చేసి, ధ్యానించి, అందులోని సత్యములను, అన్వయించమని తనను ఆహ్వానించినపుడు ఏ విధంగా ప్రతి స్పందించాడో వర్ణించారు. “నేను ఆయన సలహాను అనుసరించడానికి ప్రయత్నించాను. మిగతా విషయాల మధ్య, మోర్మన్ గ్రంధం , ఏమిటి, అది దేనిని ధృవీకరించును, దేనిని తప్పని నిరూపించును, అది దేనిని నెరవేర్చును, అది దేనిని స్పష్టపరచును, మరియు అది దేనిని బయల్పరచునో ఒక జాబితా తయారుచేశాను. ఈ కటకములగుండా మోర్మన్ గ్రంధాన్ని చూచుట, జ్ఞానవృద్ధి కలిగించి, ప్రేరేపణ కలిగించు అభ్యాసముగా ఉన్నది! దానిని మీకు సిఫారసు చేస్తున్నాను.”10

అధ్యక్షుడు హెన్రీ బి. ఐరింగ్ అదే విధంగా అధ్యక్షుడు మాన్సన్ యొక్క అభ్యర్ధన ‘తన జీవితంలో ఎంత ముఖ్యమైనదో నొక్కిచెప్పారు. ఆయన గమనించినది:

“నేను మోర్మన్ గ్రంధాన్ని 50 సంవత్సరాలపాటు, ప్రతిరోజు చదివాను. కనుక అధ్యక్షుడు మాన్సన్ మాటలు సహేతుకంగా మరెవరికో అనుకోవచ్చు. అయినప్పటికినీ, మీలో అనేకుల వలే, ప్రవక్త యొక్క ప్రోత్సహామును నేను అనుభవించాను మరియు ఆయన వాగ్దానము గొప్ప ప్రయత్నము చేయుటకు నన్ను ఆహ్వానించింది. …

“నాకును, మీలో అనేకులకును ఆనందదాయకమైన ఫలితము నచ్చినది ప్రవక్త వాగ్దానమిచ్చినది.”11

అధ్యక్షుడు మాన్సన్ యొక్క ఆహ్వానానికి ప్రభువు సంఘ నాయకులైన ఈ ఇద్దరి తక్షణమైన, హృదయపూర్వకమైన స్పందనలు ఏమని వివరిస్తున్నాయని మీరనుకొనుచున్నారు?

అమ్యులేక్, పహోరన్, అధ్యక్షుడు నెల్సన్, అధ్యక్షుడు ఐరింగ్, యొక్క ఆత్మీయంగా బలమైన స్పందనకు కారణం కేవలం రక్షకుని పోలిన గుణం ఒక్కటే అని నేను సూచించడంలేదు. నిశ్చయముగా, ఈ నలుగురు ఘనుల జీవితాలలో పరస్పర సంబంధం కలిగిన అనేక సుగుణాలు, అనుభవజ్ఞానం, వీరి జీవితాలలో ప్రతిబింబిస్తున్నఆత్మీయ పరిపక్వతకు దోహదమైనవి. కాని రక్షకుడు మరియు ఆయన ప్రవక్తలు, మనమందరమూ పరిపూర్ణంగా అర్ధం చేసుకొని, మన జీవితాలలో పొందుపరచుటకు ప్రయాసపడాల్సిన ఒక ముఖ్యమైన గుణాన్నిఎత్తి చూపించారు.

సాత్వీకము

క్రింది లేఖనములో ప్రభువు తనను వర్ణించుటకు ఉపయోగించిన లక్షణమును దయచేసి గమనించుము: “నేను సాత్వీకుడను, దీనమనస్కు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తుకొని, నా యొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.”12

నిర్ధేశికంగా, అన్ని సుగుణాలలోను స్వభావాలలోను, సాత్వీకతను తన బోధల ద్వారా రక్షకుడు ప్రత్యేకంగా ఎంపికచేసి నొక్కి చెప్పాడు.

ప్రవక్త జోసెఫ్ స్మిత్ 1829 లో పొందిన ప్రకటనలో కూడా అదే విధమైన నమూనా విశదమౌతుంది. ప్రభువు ఈ విధంగా నిర్దారిస్తున్నాడు. “నన్ను గూర్చి తెలుసుకొనుడి, నా మాటలు వినుడి; నా ఆత్మయొక్క సాత్వీకమునందు నడుచుకొనుడి, మరియు మీకు నాలో శాంతి లభించును.” 13

విమోచకుని యొక్క నిర్వచించు స్వభావము సాత్వీకము, మరియు నీతిపూర్వక ప్రతిస్పందన, సముఖతగల విధేయత మరియు బలమైన ఆత్మనిగ్రహము చేత ప్రత్యేకపరచును. అమ్యులేక్, పహోరన్, అధ్యక్షుడు నెల్సన్, మరియు అధ్యక్షుడు ఐరింగ్‌లను, వారి వారి ప్రతిస్పందనను మరింత పరిపూర్ణంగా అర్ధం చేసుకోడానికి, ఈ గుణం సహాయపడుతుంది.

ఉదాహరణకు, అధ్యక్షుడు నెల్సన్ మరియు అధ్యక్షుడు ఐరింగ్ నీతిమత్వముతో మరియు వెంటనే స్పందించి, మోర్మన్ గ్రంధము పఠించి అధ్యయనము చేయమన్నఅధ్యక్షుడు మాన్సన్ యొక్క సందేశమునకు వెంటనే స్పందించారు. వారిరువురు చూడడానికి సంఘములో ముఖ్యమైన స్థానములలో లేఖనములను దశాబ్దాలపాటు, విస్తృతంగా ధ్యానించినప్పటికి, వారి ప్రతిస్పందనలో ఎటువంటి సంశయముగాని, అహంభావంగాని ప్రదర్శించలేదు.

అమ్యులేక్ దేవుని చిత్తమునకు ఇష్టపూర్వకంగా సమర్పించుకొని, సువార్తను ప్రకటించుటకు ఒక పిలుపును అంగీకరించెను మరియు తన సౌకర్యవంతమైన పరిస్థితులను మరియు పరిచయమైన అనుబంధములను విడిచిపెట్టెను. మరియు పహోరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటుదారుల నుండి తలెత్తిన సవాళ్ళను మొరోనైకి వివరించినప్పుడు¸ ప్రతిస్పందించుటకు బదులుగా, అతడు జ్ఞానముతోను, స్వీయ-నిగ్రహముతోను, దీవించబడ్డాడు.

క్రీస్తును పోలిన సాత్వీక గుణము మన సమకాలీన ప్రపంచములో తరచూ అపార్ధం చేసుకోబడుచున్నది. సాత్వీకము బలమైనది, కానీ, బలహీనమైనది కాదు; చురుకైనది, మందకొడి కాదు; దైర్యముగలది, పిరికిది కాదు; నిగ్రహముగలది, అతిశయించదు. నిరాడంబరమైనది, స్వయం-అధికారమివ్వదు; కాదు. కృప గలది, దురుసుగలది కాదు. సాత్వీకముగల వ్యక్తి సులభముగా కోపపడడు, డాంబికములేని వాడు, లేక అహంకారములేని వాడు మరియు , ఇతరుల విజయాన్ని తక్షణమే అంగీకరిస్తాడు.

ఎందుకనగా వినయము సాధారణంగా దేవునిపై ఆధారపడుటను మరియు ఆయన నడిపింపు మరియు సహకారము యొక్క నిరంతరం అవసరతను సూచించును,సాత్వీకము యొక్క ప్రత్యేకించు లక్షణము పరిశుద్ధాత్మనుండి మరియు తక్కువ సమర్ధత, అనుభవము, లేక విద్యగల వారు, ముఖ్యమైన స్థానములు కలిగిలేనివారు, లేక మరొకవిధంగా తోడ్పడుటకు ఎక్కువ లేనట్లు కనబడు జనులనుండి నేర్చుకొనుటకు ఒక ప్రత్యేకమైన ఆత్మీయ గ్రహణశీలత. నయమాను, సిరియా రాజ్యపు సైన్యాధిపతి యైనా, తన గర్వాన్ని ప్రక్కన పెట్టి, ఏడుసార్లు యొర్దాను నదిలో స్నానము చేయమన్న ఎలీషా ప్రవక్తకు లోబడమన్న తన సేవకుల సలహాను వినయముగా అంగీకరించాడు.14 ఘనత, హోదా, అధికారము, ఐశ్వర్యము, మరియు ముఖస్తుతి నుండి తరచుగా కలిగే గర్వాంధకారము నుండి ప్రధాన రక్షణ సాత్వీకము.

సాత్వీకము-- క్రీస్తును పోలిన స్వభావము, మరియు ఒక ఆత్మీయవరము

సాత్వీకము అనే లక్షణమును కోరిక ద్వారా, నైతిక స్వతంత్రతను నీతిగా సాధన చేయుట, మన పాపముల యొక్క పరిహారమును ఎల్లప్పుడు నిలుపుకొనుటకు ప్రయాసపడుట ద్వారా వృద్ధి చెందబడును.15 అది మనము యుక్తముగా వెదకగల ఆత్మీయమైన వరము కూడ.16 అయినప్పటికినీ, అటువంటి దీవెన ఇవ్వబడిన ఉద్దేశ్యములు, దేవుని బిడ్డలకు మేలు చేయుటకు మరియు సేవచేయుటకు మనకు ఇవ్వబడినదని మనము జ్ఞాపకముంచుకోవాలి.17

మనము రక్షకుని యొద్దకు వచ్చి, ఆయనను అనుసరించినప్పుడు, ఆయనవలె ఎక్కువగా మారుటకు మనము అధికంగా, ఎదుగుటకు సాధ్యము చేయబడతాము. క్రమశిక్షణ చేయబడిన ఆత్మనిగ్రహము, స్తిమితమైన, ప్రశాంతమైన ప్రవర్తనతో మనము ఆత్మచే, శక్తిని పొందుతాము. ఆవిధంగా, బోధకుని శిష్యులుగా మనము సాత్వీకులము కాగలము, కేవలము మనము చేసే కార్యముల వలన కాదు.

“మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మాటలయందును, కార్యములందును ప్రవీణుడైయుండెను.”18 అయినప్పటికినీ అతడు “భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు.”19 అతని విజ్ఞానము మరియు నేర్పు అతడిని గర్విష్ఠునిగా చేయవచ్చు. బదులుగా, అతడు దీవించబడిన లక్షణము మరియు ఆత్మీయవరమైన సాత్వీకము అతడి జీవితములో తగ్గించబడిన అహంకారముతో దీవించబడ్డాడు మరియు దేవుని యొక్క ఉద్దేశ్యములను నెరవేర్చుటకు ఒక సాధనముగా వృద్ధి చెందాడు.

బోధకుడు సాత్వీకమునకు ఒక మాదిరిగా

సాత్వీకము యొక్క మిక్కిలి అద్భుతమైన మరియు అర్ధవంతమైన మాదిరులు రక్షకుని జీవితములో కనుగొనబడును.

ఆ మహా విమోచకుడు, “అన్నిటి కంటే తక్కువగా తన్ను తాను తగ్గించుకొనెను”20 మరియు “మనలను ప్రతీ అవినీతి నుండి పవిత్రపరచుటకు శ్రమ పడెను, రక్తము చిందించెను, మరియు మరణించెను,” 21 తన శిష్యుల మురికి పాదములను సున్నితముగా కడిగెను.22 అటువంటి సాత్వీకము ఒక సేవకునిగా, నాయకునిగా, ఆ ప్రభువు యొక్క ప్రత్యేక లక్షణము.

గెత్సేమనేలో ఆయన తీవ్రమైన వేదనను అనుభవించినప్పుడు, యేసు, నీతిపూర్వక స్పందన మరియు సుముఖతగల విధేయతకు అత్యుత్తమ ఉదాహరణను మనకు అందించాడు.

“ఆ చోటు చేరి ఆయన వారితో చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయుడని (తన శిష్యులతో) చెప్పెను.

“మరియు . . . . ఆయన మోకాళ్లూని

“తండ్రీ, యీ గిన్నె నా యొద్దనుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము: ఆయనను నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను.”23

శాశ్వతంగా అత్యవసరమైన మరియు వేదానాత్మకమైన అనుభవము దేవుని జ్ఞానము మన స్వంత జ్ఞానమునకు పైగా ఉంచాల్సిన ప్రాముఖ్యతను మనలో ప్రతి ఒక్కరికి రక్షకుని సాత్వీకము చేయుచున్నది.

ప్రభువు యొక్క ఏకరీతిగల సుముఖమైన విధేయత మరియు బలమైన ఆత్మ-నిగ్రహము రెండును మనందరికి విస్మయము కలిగించేది మరియు ఉపదేశకరమైనవి. సాయుధులైన దేవాలయ రక్షక భటులు, మరియు రోమను సైనిక బృందము, గేత్సేమనే దగ్గర యేసును పట్టుకొని బంధించవలెనని చేరుకున్నప్పుడు, పేతురు కత్తి దూసి, ప్రధాన యాజకుని సేవకుని యొక్క కుడి చెవిని తెగ నరికెను.24 రక్షకుడు సేవకుని చెవిని ముట్టి అతడిని స్వస్థపరచెను.25 దయచేసి గమనించండి, వ్యక్తిని ఆయన బందింపబడకుండా మరియు సిలువ వేయబడకుండా కూడా అతడిని ఆపియుండగల అదే పరలోకపు శక్తిని ఉపయోగిస్తూ ఆయన తనను బంధించటానికి వచ్చిన వ్యక్తిని సమీపించి దీవించాడు.

బోధకుడు సిలువ వేయబడుటకు పిలాతు ఎదుట ఏ విధంగా నిందింపబడి, ఖండింపబడెనో కూడా ఆలోచించండి.26 తనను అప్పగించినప్పుడు, యేసు ప్రకటించెను, “ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన యెడల ఆయన పండ్రెండు దేవదూతల వ్యూహముల కంటె ఎక్కువమంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా?”27 అయినప్పటికినీ, “సజీవులు మరియు మృతులు ఇద్దరియొక్క నిత్యుడైన న్యాయాధిపతి”28 తాత్కాలిక రాజకీయంగా నియమించబడిన వానియెదుట విరుద్ధముగా తీర్పు తీర్చబడ్డాడు. “అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరమియ్యలేదు, గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను.”29 రక్షకుని యొక్క సాత్వీకము తన క్రమబద్ధమైన జవాబులో, బలమైన నిగ్రహము మరియు స్వప్రయోజనము కొరకు తన ఆనంతమైన శక్తిని వినియోగించుటకు విముఖతయందు రుజువు చేయబడింది.

వాగ్దానము మరియు సాక్ష్యము

ఆత్మీయమైన శక్తులు, వరములు అనుగ్రహింపబడుటకు పునాదిగా సాత్వీకతను మోర్మన్ గుర్తించుచున్నాడు.

“అందువలన, ఒక మనుష్యుడు విశ్వాసము కలిగిన యెడల, అతడు తప్పక నిరీక్షణ కలిగియుండవలెను. ఏలయనగా విశ్వాసము లేకుండా ఎట్టి నిరీక్షణ ఉండలేదు.

“మరియు తిరిగి ఇదిగో, నేను మీతో చెప్పుచున్నాను. అతడు సాత్వీకుడు మరియు హృదయమందు దీనత్వము కలిగియుంటేనే తప్ప, అతడు విశ్వాసము మరియు నిరీక్షణ కలిగియుండలేడు.

“అట్లయిన యెడల, అతని విశ్వాసము మరియు నిరీక్షణ వ్యర్ధమైనవి, ఏలయనగా హృదయమందు సాత్వీకులు మరియు దీనులు తప్ప, ఎవడును దేవుని యెదుట అంగీకరించబడడు. మరియు ఒక మనుష్యుడు హృదయమందు సాత్వీకుడు మరియు దీనుడై యుండి, మరియు యేసే క్రీస్తని పరిశుద్ధాత్మ యొక్క ద్వారా ఒప్పుకొనిన యెడల, అతడు దాతృత్వము కలిగియుండవలెను. ఏలయనగా, అతడు దాతృత్వము కలిగిలేని యెడల, అతడు ఏమియుకాడు. అందువలన అతడు దాతృత్వము కలిగియుండవలెను. ”30

రక్షకుడు ఇలా ప్రకటిస్తున్నాడు, “ సాత్వీకులు ధన్యులు: వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.”31 సాత్వీకము దైవ స్వభావము యొక్క ముఖ్యమైన అంశము మరియు రక్షకుని ప్రాయశ్చిత్తము వలన మన జీవితాలలో పొందవచ్చును మరియు పెంపొందించవచ్చును.

యేసు క్రీస్తు మన పునరుత్థానుడు మరియు జీవించుచున్న విమోచకుడు అని నేను సాక్ష్యమిచ్చుచున్నాను. ఆయన ఆత్మ యొక్క సాత్వీకమునందు మనము నడిపింపబడినప్పుడు ఆయన మనలను నడిపించును, కాపాడును, మరియు బలపరచును, అని మీకు వాగ్దానము చేయుచున్నాను. ఈ సత్యములు మరియు వాగ్దానములను గూర్చి నా నిశ్చయమైన సాక్ష్యమును నేను ప్రకటించుచు, వాగ్దానము చేయున్నాను ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున, ఆమేన్.