2010–2019
మేలు చేయుటకు భయపడవద్దు
అక్టోబర్ 2017


2:3

మేలు చేయుటకు భయపడవద్దు

ఆయన బండమీద మనము విశ్వాసముతో నిలిచియున్నప్పుడు, అనుమానము మరియు భయము అదృశ్యమవుతాయి, మేలు చేయుటకు కోరిక వృద్ధిచెందుతాయని ప్రభువు మనకు చెప్పుచున్నాడు.

నా ప్రియమైన సహోదర, సహోదరిలారా, ఈ రోజు నేను మాట్లాడుతున్నప్పుడు, ప్రభువు యొక్క ఆత్మ మనతో ఉండాలని నేను వినయముగా ప్రార్థిస్తున్నాను. ఇది ఆయన సంఘము, గంభీరమైన ప్రార్థనలు, ప్రేరేపించబడిన ప్రసంగాలు, మరియు ఈ సమావేశములో దూతలు పాడిన పాటల కొరకు ప్రభువుకు కృతజ్ఞతతో నా హృదయము నిండినది.

గత ఏప్రిలలో, అధ్యక్షులు థామస్  ఎస్. మాన్సన్ ఇచ్చిన సందేశము నాతో కలిపి ప్రపంచమంతటా హృదయాలను కదిలించింది. ఆయన మోర్మన్ గ్రంథము యొక్క శక్తిని గూర్చి మాట్లాడారు. దానిని అధ్యయనము చేసి, ధ్యానించి, మరియు దాని బోధనలను అన్వయించుకోవాలని ఆయన మనల్ని ప్రేరేపించారు. మనము ప్రతీరోజు మోర్మన్ గ్రంథమును అధ్యయనము చేసి, ధ్యానించుటకు సమయాన్ని అంకితమిచ్చి, దానిలోని ఆజ్ఞలను పాటించినప్పుడు, దాని సత్యమును గూర్చి మనము కీలకమైన సాక్ష్మమును కలిగియుంటామని, మరియు తత్పలితంగా వచ్చిన జీవముగల క్రీస్తును గూర్చి సాక్ష్యము కష్టకాలములను క్షేమంగా దాటునట్లు చూచునని ఆయన వాగ్దానమిచ్చారు. (See “The Power of the Book of Mormon,” Liahona, May 2017, 86–87.)

మీలో అనేకుల వలె, నేను ప్రవక్త యొక్క మాటలను నాతో ప్రభువు యొక్క స్వరముగా విన్నాను. మరియు, మీలో అనేకుల వలె నేను ఆ మాటలకు విధేయుడగుటకు నిర్ణయించుకున్నాను. నేను బాలునిగా ఉన్నప్పటినుండి, నేను మోర్మన్ గ్రంథము దేవుని యొక్క వాక్యమని, తండ్రి మరియు కుమారుడు జోసెఫ్ స్మిత్‌తో మాట్లాడారని, మరియు ప్రభువు యొక్క సంఘమునకు యాజకత్వపు తాళపు చెవులు పునఃస్థాపించుటకు ప్రాచీన అపోస్తలులు వచ్చారని సాక్ష్యమును నేను అనుభూతిచెందాను.

ఆ సాక్ష్యముతో, నేను 50 సంవత్సరాలకు పైగా మోర్మన్ గ్రంథమును చదువుతున్నాను. అందుచేత అధ్యక్షులు మాన్సన్ మాటలు వేరొకరి కోసమని నేను యుక్తముగా అనుకొనవచ్చు. అయినప్పటికినీ, మీలో అనేకుల వలె, నేను గొప్ప ప్రయత్నము చేయుటకు ప్రవక్త యొక్క ప్రోత్సాహమును మరియు ఆయన వాగ్దానమును నేను అనుభూతిచెందాను. నేను చేసినట్లుగా మీలో అనేకులు చేసారు: అధికమైన ఉద్దేశ్యముతో, లేఖనమును ఎక్కువ శ్రద్ధగా ధ్యానించాను, ప్రభువును మరియు ఆయన కొరకు ఇతరులను సేవించుటకు బలముగా ప్రయత్నించాను.

నాకు మరియు మీలో అనేకులకు సంతోషకరమైన ఫలితము, ప్రభువు వాగ్దానము చేసినది. ఆయన ప్రేరేపించబడిన సలహాను హృదయములోనికి తీసుకున్న మనకు ఆత్మ మరింత స్పష్టముగా మాట్లాడుట విన్నాను. మనము శోధనను ఎదిరించుటకు గొప్ప శక్తిని కనుగొన్నాము మరియు పునరుత్థానము చెందిన యేసు క్రీస్తునందు, ఆయన సువార్తయందు, మరియు ఆయన జీవిస్తున్న సంఘమునందు గొప్ప విశ్వాసమును అనుభూతి చెందాము.

ప్రపంచములో అధికమగుచున్న అల్లకల్లలోల సమయములో, సాక్ష్యములో వృద్ధి చెందిన వారు, అనుమానము మరియు భయమును తరిమివేసారు మరియు శాంతి యొక్క భావనలను మనకు తెచ్చియున్నారు. అధ్యక్షులు మాన్సన్ యొక్క సలహాను అనుసరించుట  నాపై మిగిలిన రెండు అద్భుతమైన ప్రభావాలను తెచ్చాయి: మొదట, లోకములో అల్లకల్లలోము అధికమవుతున్నట్లు కనబడుచుండగా, ఆయన వాగ్దానము చేసిన ఆత్మ జరగబోయే దానిగురించి ఆశావాదము యొక్క భావనను తెచ్చింది. రెండవది, నాకు---మరియు మీకు---నిరాశలో ఉన్న వారి కొరకు ప్రభువు ఇచ్చిన ఆయన ప్రేమ యొక్క గొప్ప భావన. మనము ఇతరులను విడిపించుటకు వెళ్ళాలనే కోరిక అధికమగుటను కూడా భావించాము. ఆ కోరిక అధ్యక్షులు మాన్సన్ యొక్క పరిచర్య మరియు బోధనకు ప్రధానమైనదిగా ఉన్నది.

వారి ముందున్న కార్యములు అణచివేసేవిగా కనబడినప్పుడు, ప్రవక్త జోసెఫ్ స్మిత్ మరియు ఆలీవర్ కౌడరీలకు ధైర్యమును మరియు ఇతరుల కొరకు ప్రేమను ప్రభువు వాగ్దానమిచ్చాడు. వారి బండగా ఆయనయందు వారి విశ్వాసము నుండి అవసరమైన ధైర్యము వస్తుందని ప్రభువు చెప్పాడు.

“నా కుమారులారా, మేలు చేయుటకు భయపడవద్దు, ఏలయనగా మీరేమి విత్తుతారో దానినే కోస్తారు, కాబట్టి, మీరు మంచిని విత్తిన యెడల మీ ప్రతిఫలముగా మంచిని కోస్తారు.

“కాబట్టి, భయపడకుడి, చిన్నమందా, మేలు చేయుము, భూమి మరియు నరకము మీకు వ్యతిరేకమైనప్పటికిని, మీరు నా బండమీద కట్టబడిన యెడల, అవి ప్రబలవు.

“ఇదిగో, నేను మిమ్మల్ని నిందించను, మీ మార్గముల వెంబడి వెళ్ళుము, నేను మీకాజ్ఞాపించిన కార్యమును శాంతముగా నెరవేర్చుము.

“ప్రతీ ఆలోచన యందు నావైపు చూడుము, సందేహించకుము, భయపడవద్దు.

“ఇదిగో నా ప్రక్కన గ్రుచ్చబడిన గాయములను, మరియు నా చేతులు, పాదములలోని మేకుల ముద్రలను కూడా చూడుము, విశ్వాసముగా ఉండుము, నా ఆజ్ఞలను పాటించుము, మరియు పరలోక రాజ్యమును మీరు వారసత్వముగా పొందుతారు” (సి మరియు ని 6:33–37).

ఆయన బండపై విశ్వాసముతో మనము నిలిచియున్నప్పుడు, అనుమానము మరియు భయము అదృశ్యమవుతాయి, మేలు చేయుటకు కోరిక వృద్ధిచెందుతుందని ప్రభువు పునఃస్థాపన యొక్క నాయకులతో చెప్పాడు మరియు ఆయన మనతో చెప్పును. యేసు క్రీస్తును గూర్చి సాక్ష్యమును మన హృదయాలలో నాటుటకు మనము అధ్యక్షులు మాన్సన్ యొక్క ఆహ్వానమును అంగీకరించినప్పుడు, మనము శక్తిని, కోరికను, మరియు మన స్వంత అవసరాల కొరకు చింతించకుండా ఇతరులను విడిపించుటకు వెళ్ళుటకు ధైర్యమును పొందుతాము.

విశ్వాసులైన కడవరి దిన పరిశుద్ధులు భయంకరమైన శ్రమలను ఎదుర్కొన్నప్పుడు, అటువంటి విశ్వాసమును మరియు ధైర్యమును నేను అనేకసార్లు చూసాను. ఉదాహరణకు, 1976 జూన్  5, నేను ఐడహోలో ఉన్నాను. ఆనకట్ట నీళ్ళ క్రుమ్మరించబడ్డాయి. వేలమంది వారి ఇండ్లనుండి పారిపోయారు. వేల గృహాలు మరియు వ్యాపారాలు నాశనము చేయబడినవి. అద్భుతంగా, 15 కంటే తక్కువమంది చనిపోయారు.

నేను అక్కడ చూసింది, కడవరి దిన పరిశుద్ధులు యేసు క్రీస్తు యొక్క బండ మీద సాక్ష్యముపై దృఢముగా నిలబడినప్పుడల్లా నేను చూసాను. ఆయన వారిని కావలికాస్తాడనుటలో అనుమానము లేదు కనుక, వారు భయము లేకుండా ఉన్నారు. ఇతరులను విడిపించుటకు వెళ్ళుటకు వారు తమ స్వంత శ్రమలను నిర్లక్ష్యము చేస్తున్నారు. మరియు ప్రతిఫలమును అడగకుండా వారు ప్రభువు కొరకు ప్రేమతో దానిని చేస్తున్నారు.

ఉదాహరణకు, టెటన్ ఆనకట్ట తెగినప్పుడు, ఒక కడవరి దిన పరిశుద్ధ దంపతులు వారి ఇంటికి మైళ్ళ దూరము ప్రయాణిస్తున్నారు. రేడియోలో వార్తలు విన్న వెంటనే వాళ్ళు రెక్స్‌బర్గ్ కు త్వరగా వెళ్ళారు. వారి స్వంత ఇల్లు నాశనమయ్యిందా లేదో చూడటానికి వెళ్ళటానికి బదులుగా, వాళ్ళు తమ బిషప్ కోసం వెదకటానికి వెళ్ళారు. అతడు కోలుకోవటానికి కేంద్రముగా ఉపయోగిస్తున్న భవనములో ఉన్నాడు. పసుపు రంగు స్కూలు బస్సులో వస్తున్న వేలమంది స్వచ్ఛంధ సేవకులను నడిపించుటలో సహాయపడుతున్నాడు.

ఆ దంపతులు బిషప్పు వద్దకు వెళ్ళి ఇలా అడిగారు, “మేము ఇప్పుడే వచ్చాము. బిషప్, సహాయపడటానికి మేము ఎక్కడికి వెళ్ళగలము?” అతడు ఒక కుటుంబము యొక్క పేర్లను వారికిచ్చాడు. ఆ దంపతులు ఒక దాని తరువాత మరొక ఇంటిలో మట్టిని మరియు నీటిని తీసివేస్తూ ఉన్నారు. చివరికి వారి స్వంత ఇంటిని చూసే తీరిక చేసుకున్నారు. అది శుభ్రపరచటానికి ఏమీ మిగిల్చకుండా వరదలో కొట్టుకొనిపోయింది. మరలా వారు త్వరగా తమ బిషప్ వద్దకు  తిరిగి వచ్చారు. “బిషప్, మేము సహాయపడటానికి మీకేవరైనా ఉన్నారా?”

ప్రశాంతమైన ధైర్యము మరియు క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమ---దాతృత్వము---సంవత్సరాలుగా మరియు ప్రపంచమంతటా పునరావృతం చేయబడింది. అది మిస్సోరిలో ప్రవక్త జోసెఫ్ స్మిత్ కాలములోని హింసలు మరియు శ్రమలుగల భయంకరమైన దినాలలో జరిగింది. బ్రిగమ్ యంగ్ నవూ నుండి నిర్గమమును నడిపించి, తరువాత ప్రభువు కోసం సీయోనును సృష్టించుటకు ఒకరినొకరికి సహాయపడుటకు, పశ్చిమ అమెరికా సంయుక్త రాష్ట్రాలంతటా ఎడారి ప్రదేశాలకు పిలవబడినప్పుడు అది జరిగింది.

ఆ అగ్రగాముల వ్రాసిన ఆరోపణలను మీరు చదివిన యెడల, విశ్వాసము యొక్క అద్భుతము అనుమానము మరియు భయమును తరిమివేయుటను మీరు చూస్తారు. వారి స్వంత గొఱ్ఱెలకు లేక దున్నని వారి స్వంత పొలాలకు వద్దకు తిరిగి వెళ్ళకముందు, ప్రభువు కోసం వేరొకరికి సహాయపడుటకు వారి స్వంత ఆసక్తులను విడిచిపెట్టు పరిశుద్ధులను మీరు చదువుతారు.

కొన్ని సంవత్సరాల క్రితం, అదే అద్భుతమును నేను సెయింట్ థామస్, మరియు ఫ్లోరిడా, ప్యుర్టోరికోలోని ఇర్మా తుఫాను ఫలితంగా చూసాను, అక్కడ శుద్ధి చేయు ప్రయత్నాలను ప్రారంభించుటకు కడవరి దిన పరిశుద్ధులు ఇతర సంఘాలు, స్థానిక సమాజ గుంపులు, మరియు జాతీయ సంస్థలతో భాగస్వామ్యం అయ్యారు.

రెక్స్‌బర్గ్ లోని నా స్నేహితుల వలె, ఫ్లోరిడాలోని సభ్యులు కాని దంపతులొకరు వారి స్వంత ఇంటిలో పని చేయుటకు బదులుగా సమాజమునకు సహాయపడుటపై దృష్టిసారించారు. కొందరు కడవరి దిన పరిశుద్ధులు వారి దారికి అడ్డముగా ఉన్న పెద్ద వృక్షాలతో సహాయము చేస్తామని చెప్పగా, దంపతులు ఎంతగానో ఆనందించారని వారు వివరించారు మరియు వారి స్వంత ఇంటికి అవసరమైన సహాయమును ప్రభువు అందిస్తారని విశ్వాసము కలిగియుండి, ఇతరులకు సహాయపడుటకు వెళ్ళారు. సంఘ సభ్యులు సహాయము చేయుటకు సమీపించినప్పుడు, దంపతులు ప్రార్థన చేస్తున్నారని ఆ భర్త చెప్పాడు. సహాయము వస్తుందని వారొక జవాబును పొందారు. అది కొన్ని గంటలలో ఆ ఆభయము వచ్చింది.

సహాయక హస్తముల పసుపు రంగు టీ-షర్టులను ధరించిన కడవరి దిన పరిశుద్ధులను కొందరు “పసుపు రంగు దూతలు” అని పిలుస్తున్నారనే నివేదికను నేను విన్నాను. ఒక కడవరి దిన పరిశుద్ధురాలు తన కారును శుభ్రపరచుటకు తీసుకెళ్ళింది మరియు ఆమెకు సహాయపడిన వ్యక్తి, తన తోటలోని వృక్షాలను తీసివేసి, తరువాత వారు “దేవుని యొక్క బిడ్డగా ఉండుట గురించి అనే ఒక పాటను నాకు పాడారని” అతడు వివరించినప్పుడు తనకు కలిగిన “ఆత్మీయ అనుభవమును” ఆమెకు వివరించాడు.

మన విశ్వాసమునకు చెందని---మరొక ఫ్లోరిడా వాస్తవ్యురాలు---తన నాశనమైన తోటలో పని చేస్తున్నప్పుడు, నిష్పలంగా, వేడెక్కి, మరియు కన్నీళ్ళకు దగ్గరైనప్పుడు, తన ఇంటికి కడవరి-దిన పరిశుద్ధులు వచ్చారని వివరించింది. ఆమె మాటలలో, స్వచ్ఛంధ సేవకులు, “ఒక స్వచ్ఛమైన అద్భుతమును,” సృష్టించారు. వారు శ్రద్ధతోనే కాదు కాని హాస్యము, మరియు చిరునవ్వులతో, తిరిగి ఏమీ అంగీకరించకుండా సేవ చేసారు.

ఒక శనివారము సాయంత్రము ఫోరిడాలోని కడవరి దిన పరిశుద్ధుల గుంపును నేను దర్శించినప్పుడు, ఆ శ్రద్ధను నేను చూసాను మరియు ఆ చిరునవ్వును విన్నాను. కొందరి హస్తములను నేను కరచాలనము చేయుటకు తగినంత సేపు స్వచ్ఛంధ సేవకులు తమ శుభ్రపరచు పని ఆపారు. జార్జియాలో వారి స్టేకులోని 90 సభ్యులు, ఆ రాత్రి ముందుగా ఫోరిడాలో సహాయార్ధము చేరుటకు ఒక ప్రణాళికను ఏర్పరచారని వారు చెప్పారు.

వాళ్ళు ఉదయము 4 గంటలకు జార్జియాను వదిలి అనేక గంటలు ప్రయాణించారు, రాత్రి, పగలు పనిచేసారు, మరియు మరుసటి రోజు తిరిగి పనిచేయుటకు ప్రణాళిక చేసారు.

అదంతా వారు చిరునవ్వులు మరియు మంచి హాస్యముతో వివరించారు. వారికి గల ఏకైక ఒత్తిడి, కృతజ్ఞత తెలుపుట ఆపమని కోరటమని నేను గ్రహించాను, ఆవిధంగా వాళ్ళు పనికి తిరిగి వెళ్లగలరు. విడిపించే మరొక జట్టుకు వెళ్ళుటకు మా వాహనములోనికి మేము వెళ్ళినప్పుడు, స్టేకు అధ్యక్షుడు తన ఱంపమును ప్రారంభించాడు మరియు వంగిన వృక్షముపై పనిచేస్తున్నాడు మరియు బిషప్ చెట్ల కొమ్మలను తీసివేస్తున్నాడు.

ఆ రోజు ఉదయమే, మరొక స్థలానికి మేము వెళ్ళినప్పుడు, ఒక వ్యక్తి కారు వద్దకు నడిచివచ్చాడు, తన టోపీని తీసి,   స్వచ్ఛంధ సేవకులకు ధన్యవాదాలు తెలిపాడు. “నేను మీ సభ్యుడను కాను. మీరు మాకోసం చేసిన దానిని నేను నమ్మలేకపోతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక,” అని అతడన్నాడు. తన పసుపు రంగు చొక్కాతో అతడి ప్రక్కన నిలబడిన ఎల్ డి ఎస్ స్వచ్ఛంధ సేవకుడు చిరునవ్వు నవ్వాడు మరియు తాను ఏ పొగడ్తకు అర్హుడు కాదన్నట్లుగా భుజాలు ఎగరేసాడు.

నమ్మలేకపోతున్న అతడికి సహాయపడుటకు జార్జియా నుండి స్వచ్ఛంధ సేవకులు వచ్చియుండగా, ఫ్లోరిడాలో చాలా నాశనమైన భాగము నుండి వందల కడవరి దిన పరిశుద్ధులు ఫ్లోరిడాలోని మరొక ప్రాంతానికి దక్షిణముగా వందల మైళ్ళు వెళ్ళారు, అక్కడు జనులు తీవ్రంగా నష్టపోయారరని వారు విన్నారు.

ఆరోజు ప్రవక్త జోసెఫ్ స్మిత్ యొక్క ప్రవచనాత్మక మాటలను నేను జ్ఞాపకం చేసుకున్నాను మరియు బాగా గ్రహించాను: “దేవుని యొక్క ప్రేమతో నింపబడిన వ్యక్తి, తన కుటుంబమును మాత్రమే దీవించుటకు తృప్తి చెందడు, కానీ, సమస్త మానవ జాతిని దీవించుటకు ఆతృతగా సమస్త లోకము తిరుగును” (Teachings of Presidents of the Church: Joseph Smith [2007], 426).

ప్రతీచోట కడవరి దిన పరిశుద్ధుల జీవితాలలో అటువంటి ప్రేమను మనము చూస్తాము. ప్రతీసారి లోకములో ఎదోఒకచోట దురదృష్టకర సంఘటనలు జరుగును. కడవరి దిన పరిశుద్ధులు సంఘము యొక్క మానవ సంక్షేమమునకు విరాళమిస్తారు మరియు స్వచ్చంధ సేవ చేస్తారు. విజ్ఞప్తి చేయనవసరములేదు. వాస్తవానికి, కొన్ని సందర్భాలలో, కోలుకునే స్థలమునకు ప్రయాణించుటకు స్వచ్చంధ సేవకులను తీసుకొనివచ్చుటకు పనిని నడిపించువారు సిద్ధపడే వరకు ఆగమని మేము వారిని అడగాల్సియున్నది.

దీవించాలనే ఆ కోరిక యేసు క్రీస్తు, ఆయన సువార్త, ఆయన పునఃస్థాపించబడిన సంఘము, మరియు ఆయన ప్రవక్త గూర్చి సాక్ష్యమును పొందుట జనుల యొక్క ఫలము. అందువలనే ప్రభువు యొక్క జనులు సందేహించరు మరియు భయపడరు. అందువలనే మిషనరీలు ప్రపంచములోని ప్రతీ మూలలో సేవ చేయుటకు స్వచ్చంధ సేవ చేస్తున్నారు. అందువలనే తల్లిదండ్రులు ఇతరుల కొరకు పిల్లలతో కలిసి ప్రార్థన చేస్తారు. మోర్మన్ గ్రంథమును హృదయానికి తీసుకొని తమను తాము నిమగ్నము చేసుకోవాలన్న అధ్యక్షులు మాన్సన్ యొక్క మనవిని తీసుకోమని నాయకులు యువతకు సవాలు చేస్తున్నారు. నాయకుల చేత ప్రేరేపించబడుట వలన ఫలము రాదు కాని యువత మరియు సభ్యులు విశ్వాసము ద్వారా అమలు చేయుట వలన వచ్చును. ఆ విశ్వాసము అమలు చేయబడుటకు---నిస్వార్ధమైన త్యాగము అవసరము—అది దేవుని యొక్క ప్రేమను అనుభూతిచెందుటకు వారిని అనుమతించునట్లు హృదయము యొక్క మార్పును తెచ్చును.

అయినప్పటికిని, ప్రవక్త యొక్క సలహాను అనుసరించుటను మనము కొనసాగించినంతవరకు మాత్రమే మన హృదయాల మార్పు నిలిచియుండును. ఒక పెద్ద ప్రయత్నము చేసిన తరువాత మనము ఆపివేసిన యెడల, మార్పు క్రమంగా అంతరించును.

విశ్వాసులైన కడవరి దిన పరిశుద్ధులు ప్రభువైన యేసు క్రీస్తునందు, దేవుని యొక్క వాక్యముగా మోర్మన్ గ్రంథమును, మరియు ఆయన నిజమైన సంఘములో యాజకత్వపు తాళపు చెవుల యొక్క పునఃస్థాపన యందు వారి విశ్వాసమును హెచ్చించుకున్నారు. ఆ అధికమైన సాక్ష్యము గొప్ప సాహసమును మరియు దేవుని యొక్క మిగిలిన పిల్లల కొరకు చింతను మనకిచ్చెను. కాని ముందుంచబడిన సవాళ్ళు మరియు అవకాశములకు ఇంకా ఎక్కువ అవసరము.

వివరాలను మనము ముందుగా చూడలేము, కానీ మనకు విశాలమైన చిత్రము తెలుసు. కడవరి దినాలలో, ప్రపంచము అల్లకల్లోలములో ఉంటుందని మనకు తెలుసు. ఏ ఇబ్బంది వచ్చినప్పటికిని, ప్రభువు యొక్క సువార్త ప్రతీ రాజ్యము, జాతి, భాష మరియు జనులకు తీసుకొనిపోబడుటకు విశ్వాసులైన కడవరి దిన పరిశుద్ధులను ప్రభువు నడిపించును. ప్రభువు యొక్క నిజమైన శిష్యులు ఆయన తిరిగి వచ్చినప్పుడు, ఆయనను స్వీకరించుటకు యోగ్యులుగా సిద్ధపడియుంటారని మనకు తెలుసు. మనము భయపడనవసరం లేదు.

కనుక, మన హృదయాలలో మనమిదివరకే నిర్మించిన విశ్వాసము మరియు ధైర్యమున్నంత వరకు, మన నుండి---మన తరువాత తరములనుండి ప్రభువు ఎక్కువగా ఆశిస్తున్నారు. వారు బలముగా ఉండాలి మరియు ధైర్యముగా ఉండాలి ఎందుకనగా వారింకా గొప్పవి మరియు మనము చేసే దానికంటె ఎక్కువ కఠినమైనవి చేస్తారు. మరియు మన ఆత్మల యొక్క విరోధి నుండి ఎక్కువైన వ్యతిరేకతను వారు ఎదుర్కొంటారు.

మనము ముందుకు సాగినప్పుడు, ఆశావాదమునకు మార్గము, ప్రభువుచేత మనకివ్వబడింది: “ప్రతీ ఆలోచనయందు నావైపు చూడుము, సందేహించవద్దు, భయపడవద్దు” (సి మరియు ని 6:36). దానిని ఎలా చేయాలో అధ్యక్షులు మాన్సన్ మనకు చెప్పారు. మనము మోర్మన్ గ్రంథమును మరియు ప్రవక్త యొక్క మాటలను ధ్యానించాలి మరియు అన్వయించుకోవాలి. ఎల్లప్పుడు ప్రార్థించుము. విశ్వసించుము. మన పూర్ణ హృదయము, బలము, మనస్సు, మరియు శక్తితో ప్రభువును సేవించాలి. క్రీస్తు యొక్క ప్రేమయైన దాతృత్వము యొక్క వరము కొరకు మన హృదయాల యొక్క సమస్త శక్తితో మనము ప్రార్థించాలి (మొరోనై 7:47–48 చూడుము). అన్నిటికిపైగా, ప్రవచనాత్మక సలహాను వెంబడించుటలో మనము ఏకరీతిగా మరియు పట్టుదలతో ఉండాలి.

మార్గము కష్టముగా ఉన్నప్పుడు, మనము ప్రభువు యొక్క వాగ్దానముపై ఆధారపడగలము---రక్షకుని యొక్క మాటలను ఆయన తరచుగా వ్యాఖ్యానించినప్పుడు, ఆ వాగ్దానము అధ్యక్షులు మాన్సన్ మనకు జ్ఞాపకము చేసారు: “మిమ్మల్ని ఎవరు స్వీకరిస్తారో అక్కడ నేను ఉంటాను, ఏలయనగా నేను మీ ముఖము ముందు వెళ్లెదను. నేను మీ కుడి చేతివైపు మరియు మీ ఎడమచేతి వైపు ఉంటాను, మరియు నా ఆత్మ మీ హృదయాలలో ఉండును, మరియు మిమ్మల్ని వహించుటకు నా దూతలు మీ చుట్టూ ఉంటారు ”(సి మరియు ని 84:88).

ఆయన పనిమీద మీరున్నప్పుడు ప్రభువు మీ ముఖము ముందుగా వెళతాడని నేను సాక్ష్యమిస్తున్నాను. కొన్నిసార్లు ఇతరులను వహించుటకు ప్రభువు పంపిన దూతగా మీరు ఉంటారు. కొన్నిసార్లు, మిమ్మల్ని వహించుటకు దూతల చేత చుట్టబడిన వారు మీరే అయ్యుంటారు. కానీ ప్రతీ సంస్కార కార్యక్రమములో మీరు వాగ్దానము చేయబడినట్లుగా, ఎల్లప్పుడు మీ హృదయములో ఆయన ఆత్మను కలిగియుంటారు. మీరు కేవలము ఆయన ఆజ్ఞలను పాటించాలి.

భూమి మీద దేవుని రాజ్యము కోసం మంచి రోజులు ముందున్నాయి. ప్రవక్త జోసెఫ్ స్మిత్ యొక్క దినముల నుండి ఉన్నట్లుగా, వ్యతిరేకత యేసు క్రీస్తునందు మన విశ్వాసమును బలపరచును. విశ్వాసము ఎల్లప్పుడు భయాన్ని ఓడించును. కలిసి నిలబడుట ఐక్యతను తెచ్చును. మరియు అవసరతలో ఉన్నవారి కొరకు మీ ప్రార్ధనలు ప్రేమగల దేవుని చేత వినబడినవి మరియు జవాబివ్వబడినవి. ఆయన కునుకడు లేక నిద్రపోడు.

తండ్రియైన దేవుడు జీవిస్తున్నాడని మరియు మీరు ఆయన వద్దకు రావాలని కోరుతున్నాడని నేను సాక్ష్యమును చెప్పుచున్నాను. ఇది ప్రభువైన యేసు క్రీస్తు యొక్క నిజమైన సంఘము. ఆయన మిమ్మల్ని ఎరుగును. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మిమ్మల్ని కావలికాస్తున్నాడు. ఆయన మీ, నా పాపములు మరియు పరలోక తండ్రి యొక్క పిల్లలలందరి కొరకు ప్రాయశ్చిత్తఃము చేసాడు. మీ జీవితములో మరియు ఇతరులకు మీ సేవయందు ఆయనను వెంబడించుటయే నిత్య జీవమునకు ఏకైక మార్గము.

ఆవిధంగా నేను సాక్ష్యమిస్తున్నాను, నా దీవెన మరియు ప్రేమను మీతో వదలుచున్నాను. యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో, ఆమేన్.