ప్రణాళిక మరియు ప్రకటన
కుటుంబమునకు ప్రస్తుత సవాళ్ళ ద్వారా మనల్ని ఆమోదించుటకు మనకు అవసరమైన సువార్త సత్యములను గూర్చి ప్రభువు యొక్క పునరుద్ఘాటనే కుటుంబ ప్రకటన.
మన కుటుంబ ప్రకటనలో స్పష్టంగా కనిపిస్తున్నట్లుగా, యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్దుల సంఘము యొక్క సభ్యులు ప్రత్యేకమైన సిద్ధాంతముతో మరియు లోకమును వేర్వేరు విధానాలలో వీక్షించుటతో దీవించబడ్డారు.మనము అనేక ప్రాపంచిక కార్యక్రమాలలో పాల్గొంటాము, కాని యేసు క్రీస్తు యొక్క బోధనలు మరియు ఆయన ప్రాచీన మరియు ఆధునిక అపోస్తులుల యొక్క బోధనలను అనుసరించుటకు మనము వెదకినప్పుడు కొన్ని విషయాలపై మనము పాల్గొనుటను వదలుకుంటాము.
ఒక ఉపమానంలో, యేసు, “వాక్యము వింటారు” కానీ “నిష్బలునిగాను”గా అయినప్పుడు ఆ వాక్యము “ఐహిక విచారమును, ధనమోసము చేత “అణచివేయబడ్డారని” యేసు వివరించెను. (మత్తయి 13:22). ) తర్వాత, యేసు “మనుష్యుల సంగతులనే తలచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక యున్నావని” పేతురును సరిదిద్ది, “ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించు కొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? (మత్తయి 16:23, 26) అని ప్రకటించెను. మర్తత్యములో ఆయన చివరి బోధనలందు తన అపోస్తులకు ఇలా చెప్పాడు, “మీరు లోకసంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును; అయితే మీరు లోకసంబంధులు కారు: అందుచేతనే లోకము మిమ్ములను ద్వేషించుచున్నది” (యోహాను 15:19; యోహాను 17:14, 16 కూడా చూడుము).
అదేవిధంగా, యేసు యొక్క ప్రాచీన అపోస్తులుల రచనలు సువార్త బోధనలకు వ్యతిరేకతను సూచించుటకు “లోకము” యొక్క ప్రతిరూపమును తరచుగా ఉపయోగించారు. “మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక” (రోమా 12: 2), అపోస్తలుడైన పౌలు బోధించాడు, “ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెఱ్ఱితనమే” (1 కొరింథీయులకు 3:19). మరియు, అతడు హెచ్చరించారు, “క్రీస్తును అనుసరింపక ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనను ఉండునేమోనని జాగ్రత్తగా ఉండుడి” (కొలొస్సయులకు 2:8). అపోస్తలుడైన యాకోబు ఇలా బోధించాడు, “యీ లోకస్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి యెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును”(యాకోబు 4:4).
మోర్మన్ గ్రంథము తరచుగా “లోకము” యొక్క వ్యతిరేక రూపమును చిత్రాన్ని ఉపయోగిస్తుంది. “లోకము యొక్క కన్నులయందు వ్యాప్తి చెందుటకు నిర్మింపబడిన వారు మరియు లోకము యొక్క వస్తువులను కోరువారు” నశింపబడుదురని నీఫై ప్రవచించెను ((1 నీఫై 22:23; 2 నీఫై 9:30 కూడా చూడండి). అల్మా “లోకము యొక్క వ్యర్థమైన సంగంతులతో హెచ్చించుకొనుచున్నారో” వారిని ఖండించారు (ఆల్మా 31:27). ఇనుమ కడ్డీని, దేవుని వాక్యమును అనుసరించడానికి ప్రయత్నించారో, వారు ప్రపంచ వ్యతిరేకతను ఎదుర్కొంటారని లెహీ కలలో చూపించబడింది. “గొప్ప మరియు విశాలమైన భవనం” యొక్క జనులు “వృక్షము యొద్దకు వచ్చి దాని ఫలమును తినుచున్న వారి వైపు తమ వ్రేళ్ళను చూపుచు ఎగతాళి చేయు ధోరణిలో ఉండిరి”. (1 నీఫై 8: 26–27, 33). ఈ కలను అనువదించుటలో నీఫై తన దర్శనములో, ఈ ఎగతాళి మరియు వ్యతిరేకత “భూమి యొక్క సమూహములు, . . . లోకమును మరియు దాని జ్ఞానమును .. భూమి యొక్క జ్ఞానం... లోకము యొక్క గర్వము;” నుండి (1 1 నీఫై 11: 34–36) వచ్చిందని అతడు నేర్చుకున్నాడు.
“లోకమునకు చెందవద్దు” లేక ఆధునిక ఆజ్ఞయైన “లోకమును విడిచిపెట్టుము” అనే ఈ లేఖన హెచ్చరికలు మరియు ఆజ్ఞల యొక్క అర్థమేమిటి”? ( సి మరియు ని 53:2). ఈ బోధనలను అధ్యక్షులు ఎస్. మాన్సన్ సంక్షిప్తపరిచారు: “ఆత్మీయమైన దానినుండి చాలా దూరమైన ఈ లోకములో మనము అప్రమత్తంగా ఉండాలి. దేవుని యొక్క రాజ్యములో నిత్య జీవము: మనము ఎక్కువగా కోరే దానికి అప్పగించు ప్రక్రియను తిరస్కరిస్తూ, మన ప్రమాణాలనుండి అనుగుణంగా లేనిది ఏదైనా మనము తిరస్కరించాలి. ”1
దేవుడు తన పిల్లలందరి కొరకు ఆయన కోరుకున్న మహిమల వైపు అవసరమైన మెట్టుగా మర్త్యత్వమును అనుభవించుటకు తన ఆత్మ పిల్లలకు ఒక స్థలమును అందించుటకు ఆయన ప్రణాళిక ప్రకారము ఆయన ఈ భూమిని సృష్టించాడు. వివిధ రాజ్యాలు మరియు మహిమలు ఉన్నప్పటికీ, అయన పిల్లల కొరకు పరలోక తండ్రి యొక్క అంతిమ కోరిక ఏమిటంటే, అధ్యక్షులు మాన్సన్ దానిని “దేవుని రాజ్యములో నిత్యజీవితం,” అని పిలిచారు, అది కుటుంబాలందు ఉన్నత స్థితిని కలిగియుండుట. ఇది రక్షణ కంటే ఎక్కువ. “దేవుని యొక్క నిత్య ప్రణాళికలో రక్షణ అనేది వ్యక్తిగత విషయము, (కాని) ఉన్నత స్థితి ఒక కుటుంబ విషయము”2 అని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మనకు గుర్తు చేసారు.
నేను తరువాత చర్చించబోయే, ఏసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త మరియు ప్రేరేపించబడిన, కుటుంబ ప్రకటన ఉన్నతస్థితి కొరకు మర్త్య సిద్ధపాటును నడిపించుటకు ఆవశ్యకమైన బోధనలు. క్షీణిస్తున్న లోకము యొక్క వివాహము మరియు ఇతర సంప్రదాయములతో మనము జీవించినప్పుడు, ఉన్నత స్థితి కొరకు ప్రయాసపడువారు, లోక విధానము నుండి భిన్నమైనదైనప్పుడు ప్రభువు విధానము ప్రకారము కుటుంబ జీవితంలో వ్యక్తిగత ఎంపికలు చేయాలి.
ఈ మర్త్య జీవితంలో, మన జననమునకు ముందు జరిగిన దాని యొక్క జ్ఞాపకాన్ని మనము కలిగిలేము, మరియు మనమిప్పుడు వ్యతిరేకతను అనుభవిస్తాము. సరైన ఎంపికల పరంపరలో దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయులగుటకు ఎంపిక చేయుట ద్వారా మనము ఆత్మీయంగా ఎదుగుతాము మరియు పరిపక్వత చెందుతాము. మన ఎంపికల తప్పువైనప్పుడు ఇవి నిబంధనలు, విధులు మరియు పశ్చాత్తాపమును కలిపియున్నవి. వ్యతిరేకంగా, మనము దేవుని యొక్క ప్రణాళికయందు విశ్వాసము లేకుండా మరియు అవిధేయులమై, లేక దానికి అవసరమైన చర్యలనుండి మనము ఉద్దేశ్వపూర్వకంగా నిలిపివేసిన యెడల, ఆ అభివృద్ధిని మరియు పరిపక్వతను మనము నష్టపోతాము. “ఏలయనగా ఇదిగో ఈజీవితము దేవుని కలుసుకొనుటకు మనుష్యులు సిద్దపడు సమయమైయున్నది” (Alma 34:32) అని మోర్మన్ బోధించాడు.
దేవుని యొక్క రక్షణ ప్రణాళికను గ్రహించు కడవరి –దిన పరిశుద్ధులు, ప్రత్యేకమైన ప్రపంచ వీక్షణను కలిగియున్నారు, అది దేవుని ఆజ్ఞలకు కారణమును, ఆయనకు అవసరమైన విధుల మార్పు చెందని స్వభావమును మరియు మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క ప్రధాన పాత్రను చూచుటకు వారికి సహాయపడును, మన రక్షకుని యొక్క ప్రాయశ్చిత్తము మరణమునుండి మనల్ని తిరిగి పొందును, మన పశ్చాత్తాపమునకు లోబడి, మనల్ని పాపమునుండి రక్షించును. ఆ ప్రపంచ వీక్షణతో, కడవరి-దిన పరిశుద్ధులు ప్రత్యేక ప్రాధాన్యతలను మరియు ఆచారములను కలిగియున్నారు మరియు మర్త్య జీవితంలోని నిరాశ మరియు బాధలను సహించుటకు బలముతో దీవించబడ్డారు
అనివార్యంగా, దేవుని యొక్క రక్షణ ప్రణాళికను అనుసరించడానికి ప్రయత్నించే వారి చర్యలు కుటుంబసభ్యులకు లేదా స్నేహితులకు దాని సూత్రాలను నమ్మని వారు అపార్ధము చేసుకోనుట లేదా వివాదాస్పధం కావచ్చు. అలాంటి సంఘర్షణ ఎప్పుడూ ఉంటుంది. దేవుని ప్రణాళికను అనుసరించడానికి ప్రయత్నించిన ప్రతి తరం సవాళ్లను కలిగియున్నది. ప్రాచీనముగా, యెషయా ప్రవక్త ఇశ్రాయేలీయులకు బలాన్ని ఇచ్చాడు. “నా బోధను హృదయమందుంచుకొన్న జనులారా, ఆలకించుడి మనుష్యులు పెట్టు నిందకు భయపడుకుడి వారి దూషణ మాటలకు దిగులుపడుకుడి” అని వారికి చెప్పాడు. (యెషయా 51:7; 2 నీఫై 8:7 కూడా చూడుము). కానీ దేవుని యొక్క ప్రణాళికను గ్రహించని లేదా నమ్మని వారితో వివాదం ఏదైనప్పటికీ, అర్ధము చేసుకొన్న వారు, ప్రపంచ విధానమునకు బదులుగా, ఎల్లప్పుడు ప్రభువు యొక్క విధానమును ఎన్నుకుంటారు.
నిత్య జీవితము మరియు ఉన్నతస్థితి కొరకు సిద్ధపడుటకు ప్రతీ కుటుంబము అనుసరించాల్సిన సువార్త ప్రణాళిక సంఘము యొక్క 1995 ప్రకటనలో సంక్షిప్తపరచబడింది, “కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన. ”3 దాని ప్రకటనలు, ప్రస్తుత చట్టాలు, అభ్యాసాలు, మరియు మనం జీవిస్తున్న ప్రపంచం యొక్క వాదన నుండి స్పష్టముగా గోచరమైనవి. మన కాలములో, వివాహము, స్వలింగ వివాహం, మరియు అటువంటి సంబంధాలలో పిల్లలను పెంచుట అసమానతలు స్పష్టంగా కనిపిస్తాయి. ఉన్నతస్థితిని నమ్మని లేక ఆపేక్షించని వారు మరియు ప్రపంచ విధానములచేత ఎక్కువగా ఒప్పించబడిన వారు ఈ కుటుంబ ప్రకటనను, మార్చబడాల్సిన సూత్రము యొక్క వివరణగా చూస్తారు. వ్యతిరేకంగా, కడవరి దిన పరిశుద్ధులు మన నిత్య అభివృద్ధి సంభవించగల అతి ముఖ్యమైన చోట కుటుంబ అనుబంధాలని నిర్ధారించును.
వివాహం లేకుండా సహజీవనం మరియు స్వలింగ వివాహమును బహిరంగంగా అంగీకరించుట వేగవంతముగా పెరుగుతున్న ప్రజా అంగీకారాన్ని మేము చూశాము. సంబంధిత మీడియా అనుకూలపక్ష వాదము, విద్య, మరియు వృత్తి అవసరాలు కూడా కడవరి-దిన పరిశుద్ధులకు సవాళ్లుగా నిలుస్తున్నాయి. అన్నిటి కొరకు ప్రేమను చూపుటకు మనము వెదకినప్పుడు, మన వ్యక్తిగత జీవితాలలో సువార్త చట్టములు మరియు బోధనలను అనుసరించుటలో పోటీపడే డిమాండ్లను సమతూల్యము చేయుటకు మనము ప్రయత్నించాలి.4 అలా చేయడంలో, మనము కొన్నిసార్లు, యెషయా పిలిచిన “మనుష్యుల నింద” ను ఎదుర్కొంటున్నాము, కాని భయపడాల్సినవసరం లేదు.
మార్పుచెందిన కడవరి-దిన పరిశుద్ధలు కుటుంబ ప్రకటనను నమ్ముతారు, దాదాపు ముప్పావు శతాబ్దము క్రితం జారీ చేయబడినవి మరియు ఇప్పుడు అనేక భాషలలో అనువదించబడి, కుటుంబానికి ప్రస్తుతము గల సవాళ్ళ గుండా మనల్ని ఆమోదించుటకు మనకవసరమైన సువార్త సత్యముల ప్రభువు యొక్క పునరుద్ఘాటనను కలిగియున్నది. . రెండు ఉదాహరణలు స్వలింగ వివాహం మరియు వివాహం లేకుండా సహజీవనం. కుటుంభ ప్రకటన వెలువడిన 20 సంవత్సరాల తరువాత, వేల సంవత్సరాల నుండి పురుషుడు మరియు స్త్రీ మధ్య పరిమితము చేయబడిన వివాహమును త్రోసిపుచ్చుతూ, స్వలింగ వివాహానికి సుప్రీం కోర్టు అధికారమిచ్చింది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో దిగ్భ్రాంతి చేందే శాతము తండ్రికి వివాహము కాని తల్లిగి పుట్టిన పిల్లల ఎక్కవవుతున్నది: 1960 లో 5 శాతము, 5 1995 లో 32 శాతము, 6 ఇప్పుడు 40 శాతము.7
“ఒక పురుషుడు మరియు ఒక స్త్రీమధ్య వివాహం దేవుని చేత నియమించబడింది మరియు కుటుంబము ఆయన పిల్లల యొక్క నిత్య గమ్యము కొరకు సృష్టికర్త యొక్క ప్రణాళికకు కేంద్రమైనది, “ అని ప్రకటించుట ద్వారా ప్రారంభమగును. “లింగం అనేది వ్యక్తిగత మర్త్యత్వమునకు ముందు, మర్త్యత్వము, నిత్య గుర్తింపు, మరియు ఉద్దేశము యొక్క ఆవశ్యకమైన స్వభావము. “. అదింకను ఇలా ప్రకటించును. “ భర్త, భార్యగా చట్టబద్ధంగా వివాహము చేయబడిన స్త్రీ, పురుషుని మధ్య మాత్రమే పిల్లల్ని కనే శక్తులు నియమింపబడాలి.”
భూమిని వృద్ధి చేసి మరియు నింపుటకు భర్త మరియు భార్య యొక్క నిరంతర బాధ్యతను మరియు “ఒకరినొకరి కొరకు మరియు వారి పిల్లల కొరకు ప్రేమించుటకు మరియు సంరక్షించే గంభీరమైన బాధ్యతను” ప్రకటన నిర్ధారించును: “వివాహము యొక్క బంధములలోపల పుట్టుటకు, మరియు పూర్తి విశ్వాసముతో వివాహ ప్రమాణములను తండ్రి, తల్లిచేత పెంచబడుటకు హక్కుగా కలిగియున్నారు.” అది సహవాసి లేక సంతానమును దూషించుటకు వ్యతిరేకంగా అది గంభీరముగా హెచ్చరించును, మరియు “ప్రభువైన యేసు క్రీస్తు యొక్క బోధనలపై కనుగొనబడినప్పుడు, కుటుంబ జీవితంలో సంతోషము ఎక్కువగా సాధించబడునని ” అది నిర్ధారించును. చివరకి, “సమాజము యొక్క ప్రధాన విభాగముగా కుటుంబమును కాపాడి మరియు బలపరచుటకు ” అది రూపకల్పన చేసిన అధికారిక కొలతల అభివృద్ధి కొరకు అది పిలుచును.
1995 లో సంఘ అధ్యక్షులు మరియు ప్రభువు యొక్క 14 ఇతర అపోస్తలులు ఈ ముఖ్యమైన సిద్దాంతపరమైన ప్రకటనలను విడుదల చేశారు. ఇంకా జీవిస్తున్న అపోస్తులులలో ఏడుగురిలో ఒకరిగా, దానిని భావించు వారందరి సమాచారము కొరకు కుటుంబ ప్రకటనకు నడిపించిన దానిని పంచుకొనుటకు నేను బాధ్యుడిగా భావిస్తున్నాను.
దాదాపు 23 సంవత్సరాల క్రితం, కుటుంబముపై ప్రకటన కొరకు అవసరతను గుర్తించుటకు సంఘ నాయకులకు ప్రేరేపణ వచ్చింది. వివాహం మరియు కుటుంబం గురించి సిద్దాంతపరమైన సత్యములను తిరిగి వాఖ్యానాలు లేకుండా, బాగా గ్రహించిన కొందరికి ఇది ఆశ్చరము కలిగించియుండవచ్చు. .8 అయినప్పటికిని, మనము నిర్ధారణను భావించాము మరియు పని చేసాము. సంవత్సరము క్రితం పన్నెండు మంది అపోస్తలుల సభ్యుల చేత విషయములు గుర్తించబడ్డాయి మరియు చర్చించబడ్డాయి. భాష ప్రతిపాదించబడింది, పునర్వీక్షంచబడింది, మరియు సవరించబడ్డాయి. మేము దేనిని చెప్పాలి మరియు దానిని ఎలా చెప్పాలో ఆయన ప్రేరేపణ కొరకు మేము నిరంతరము ప్రభువును వేడుకున్నాము. మనమందరము ప్రభువు వాగ్దానము చేసినట్లుగా, “వరుస వెంబడి వరుస, సూత్రము వెంబడి సూత్రము” నేర్చుకున్నాము (D&C 98:12).
ఈ బయల్పాటు ప్రక్రియలో, ప్రతిపాదించబడిన విషయము సమర్పించబడింది, వారు సంఘ బోధనలు మరియు సిద్ధాంతమును పర్యవేక్షణ చేసి, అధికారికంగా ప్రకటిస్తారు. ప్రథమ అధ్యక్షత్వము తదుపరి మార్పులు చేసిన తరువాత, కుటుంబముప ప్రకటనను, సంఘ అధ్యక్షులైన గార్డన్ బి. హింక్లీ చేత ప్రకటించబడింది. 1995 సెప్టెంబరు 23 న, జరిగిన స్త్రీ సమావేశంలో, ఈ మాటలతో ఆయన ప్రకటనను పరిచయము చేసారు: “సత్యము ముగించబడిన మిక్కిల కుతంత్రము ప్రమాణాలు మరియు విలువలతో సంబంధించి అత్యధిక మోసముతో, లోకము యొక్క నెమ్మదియైన మరకను తీసుకొనుటకు ఆకర్షణ మరియు ప్రలోభముతో, మేము హెచ్చరించుటకు మరియు తిరిగి హెచ్చరించాలని భావించాము.9
నిత్య సత్యమును గూర్చి ప్రకటన, నిత్యజీవము కొరకు వెదకు ఆయన పిల్లల కొరకు ప్రభువు యొక్క చిత్తమని నేను సాక్ష్యమిస్తున్నాను. గత 22 సంవత్సరాలుగా, అది సంఘ బోధన మరియు ఆచరణకు మూలముగా ఉన్నది. దానిని ఆవిధంగా భావించుము, దానిని బోధించుము, దాని చేత దీవించుము, మరియు మీరు నిత్య జీవము వైపు ముందుకు త్రోసుకొని వెళ్ళినప్పుడు, మీరు దీవించబడతారు.
నలభై సంవత్సరాల క్రితం, అధ్యక్షులు ఎజ్రా టాఫ్ట్ బెన్సన్ ఇలా బోధించారు, “ప్రతి తరము దాని పరీక్షలను,నిలబడటానికి మరియు నిరూపించడానికి దానికి అవకాశమును కలిగియున్నది..”10 . కుటుంబ ప్రకటన వైప మన స్వభావమును మరియు ఉపయోగము ఈ తరము యొక్క పరీక్షలలో ఒకటి. ఆ పరీక్షలో స్థిరముగా నిలబడాలని కడవరి-దిన పరిశుద్ధులందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను.
కుటుంబ ప్రకటన ప్రకటించబడిన రెండు సంవత్సరాల తరువాత చెప్పబడిన అధ్యక్షలు గార్డాన్ బి. హింక్లీ బోధనలతోనేను ముగిస్తాను. ఆయన ఇలా అన్నరు: “చాలా అస్థిరమైన లోకములో అద్భుతమైన భవిష్యత్తును నేను చూస్తాను. మనము మన విలువలను పట్టుకొనిన యెడల, మన వారసత్వముపై మన నిర్మించిన యెడల, ప్రభువు యెదుట విధేయతలో మనము నడిచిన యెడల, కేవలము మనము సువార్తను జీవించిన యెడల, మనము దివ్యమైనర మరియు అద్భుతమైన విధానములో దీవించబడతాము. అసమాన్యమైన సంతోషమునకు మూలమును కనుగొనిన అసమాన్యమైన జనులుగా మనము చూడబడతాము.”11
దేవుని పిల్లల యొక్క ఉన్నత స్థితి కొరను ఆయన అపోస్తులులకు ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా బయల్పరచబడిన, కుటుంబ ప్రకటన యొక్క సత్యమును మరియు నిత్య ప్రాముఖ్యతను గూర్చి నేను యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్ (సిద్ధాంతము మరియు నిబంధనలు 131:1–4 చూడుము).