2010–2019
సుదీర్ఘ ప్రయాణము కొనసాగును!
అక్టోబర్ 2017


సుదీర్ఘ ప్రయాణము కొనసాగును!

మన పరలోక తండ్రి వద్దకు సుదీర్ఘ ప్రయాణము మన జీవితాల యొక్క అతి ముఖ్యమైన ప్రయాణము.

నూట డబ్భై సంవత్సరాల క్రితం, బ్రిగమ్ యంగ్ మొదటిసారి సాల్ట్ లేక్ సిటీ వేలీ వైపు చూసారు మరియు, “ఇది సరైన స్థలము!” 1 ఆయనకు స్థలము బయల్పరచబడింది కనుక ఆయన దానిని ఎరిగియున్నాడు.

1869 సంవత్సరానికి 70,000 పరిశుద్ధులు అదేవిధమైన సుదీర్ఘమైన ప్రయాణము చేసారు. వారి భాష, సంస్కృతి, మరియు జాతీయతలో భిన్నత్వాలు లక్ష్యపెట్టకుండా, వారు తండ్రి, కుమారుని, మరియు పరిశుద్ధాత్మ, పునఃస్థాపించబడిన యేసు క్రీస్తు యొక్క సువార్తను గూర్చి సాక్ష్యమును, మరియు శాంతి, సంతోషముగల మరియు రక్షకుని యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపాటులో అందమైన ప్రదేశముగా సీయోను కట్టాలనే కోరికను పంచుకున్నారు.

చిత్రం
జేన్ మాన్నింగ్ జేమ్స్

యుటా చేరుకున్న పరిశుద్ధులలో మొదటివారి మధ్య పునఃస్థాపించబడిన సంఘానికి మార్పు చెందిన---స్వేచ్ఛగా విడిచిపెట్టబడిన బానిస కూతురైన---జేన్ మాన్నింగ్ జేమ్స్ ఉన్నది, మరియు కష్టమైన సవాళ్ళను ఎదుర్కొన్న మిక్కిలి అసాధారణమైన శిష్యురాలు. సహోదరి జేమ్స్ 1908లో తన మరణము వరకు విశ్వాసురాలైన కడవరి దిన పరిశుద్ధురాలిగా నిలిచియున్నది.

ఆమె వ్రాసింది: “నేను ఇక్కడ చెప్పాలని కోరుతున్నాను, యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము చేత బోధింపబడినట్లుగా యేసు క్రీస్తునందు నా విశ్వాసము, నేడు బలంగా ఉన్నది, లదు, సాధ్యమైతే నేను మొదట బాప్తీస్మము పొందిన రోజు కన్నా బలంగా ఉన్నది. నేను దశమభాగములు, అర్పణలు చెల్లిస్తాను, బుద్ధి వాక్యమును పాటిస్తున్నాను, నేను త్వరగా నిద్రపోయి త్వరగా లేస్తాను, అందరికీ మంచి మాదిరిగా ఉండుటకు నా బలహీనమైన విధానములో నేను ప్రయత్నిస్తున్నాను.” 2

సహోదరి జేమ్స్, అనేకమంది ఇతర కడవరి దిన పరిశుద్ధుల వల, సీయోనును రక్తము, చెమట, మరియు కన్నీళ్ళతో నిర్మించటమే కాదు కానీ, ఆయనను మనఃపూర్వకంగా వెదకు వారందరికి గొప్ప వైద్యుడైన---యేసు క్రీస్తును విశ్వాసమునందు పట్టుకొనుచు ఆమెకు సాధ్యమైనంతగా సువార్త సూత్రములను జీవించుట ద్వారా, ప్రభువు యొక్క దీవెనలు కూడా వెదకియున్నది.

ప్రాచీన పరిశుద్ధులు పరిపూర్ణులు కాదు, కానీ, వారు ఒక పునాదిని స్థాపించారు, దానిపై మనము కుటుంబాలను మరియు నిబంధనలు ప్రేమించి, మరియు పాటించు సమాజమును కట్టుచున్నాము, అది ప్రపంచమంతటా వేర్వేరు క్రొత్త కథనాలందు గుర్తించబడింది, ఎందుకనగా యేసు క్రీస్తుకు మన ఒడంబడిక మరియు దగ్గరగా, దూరముగా ఉన్నవారికి సహాయపడుటకు మన స్వచ్చంధ ప్రయత్నాలు.3

అధ్యక్షులు ఐరింగ్, మీ నివాళికి టెక్సాస్, మెక్సికోలో మరియు మిగిలిన ప్రదేశాలలో సేవ చేస్తున్న పదుల-వేలమంది పసుపురంగు చొక్కాలు ధరించిన దేవదూతలు నా ప్రశంసను కూడా చేర్చవచ్చా.

మన అగ్రగామి పితరులు మరియు తల్లులు కలిపి, మనముందు వెళ్ళిన వారికి మన సంబంధాలను మనము కోల్పోయిన యెడల, మనము చాలా ప్రశస్తమైన నిధిని కోల్పోతామని నాకు లోతైన నమ్మకమున్నది. గతములో నేను “ప్రతీ మెట్టులో విశ్వాసము” గురించి మాట్లాడాను మరియు భవిష్యత్తులో కొనసాగిస్తాను ఎందుకనగా ప్రాచీన పరిశుద్ధులు ప్రభువైన యేసు క్రీస్తునందు మరియు ఆయన పునఃస్థాపించబడిన సువార్తనందు కలిగియున్నటువంటి విశ్వాసమును నవతరములు కలిగియుండాలని నేను ఎరుగుదును.4

నా స్వంత అగ్రగామి పితరులు మరియు తల్లులు చేతి బండ్లను లాగి మరియు బండ్లను నడిపి మరియు యూటాకు నడిచిన విశ్వాసులైన ఆ అగ్రగాముల మధ్య ఉన్నారు. వాళ్ళు, సహోదరి జేన్ మాన్నింగ్ జేమ్స్ వలే, తమ స్వంత సుదీర్ఘ ప్రయాణమును చేసినప్పుడు వారి ప్రతీ అడుగులలో లోతైన విశ్వాసమున్నది.

వారి దిన చర్య పుస్తకాలు కష్టాలు, ఆకలి, వ్యాధి మరియు దేవునియందు, యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్తనందు వారి విశ్వాసము యొక్క సాక్ష్యముల వర్ణనలతో కూడ నింపబడినవి.

వారు స్వల్ప ఐహిక వస్తువులను కలిగియున్నారు కానీ యేసు క్రీస్తు యొక్క సంఘమునందు వారు కనుగొన్న సహోదర, సహోదరిత్వము నుండి దీవెనలను సమృద్ధిగా ఆనందించారు. వారు చేయగలిగినప్పుడు, వారు కృంగిన వారిని లేవనెత్తారు మరియు ఒకరినొకరికి సేవ మరియు దేవుని యాజకత్వము ద్వారా దీవించారు.

యూటా, కాష్ వేలీలో సహోదరీలు, “అవసరతలో ఉన్నవారికి సహాయపడుటకు ఒకటిగా పని చేయుటకు” 5 ఉపశమన సమాజము యొక్క ఆత్మయందు పరిశుద్ధులకు పరిచర్య చేసారు. మా ముత్తవ్వ మార్గరెట్ మెక్నీల్ బల్లార్డ్ తన భర్త హెన్రీ లోగాన్ రెండవ వార్డుకు 40 సంవత్సరాలుగా బిషప్‌గా అధ్యక్షత్వము వహించినప్పుడు అతడి ప్రక్కన సేవ చేసింది. మార్గరెట్ 30 సంవత్సరాలుగా వార్డు ఉపశమన సమాజ అధ్యక్షురాలిగా ఉన్నది. ఆమె తన ఇంటికి, పేదవారిని, రోగులను, విధవరాళ్ళను మరియు ఆనాధలను తీసుకొని వెళ్ళింది, మరియు ఆమె చనిపోయిన వారికి శుభ్రమైన దేవాలయ వస్త్రాలతో ధరింపచేసింది.

చరిత్ర ప్రసిద్ధమైన 19వ శతాబ్దపు మోర్మన్ అగ్రగామి సుదీర్ఘ ప్రయాణమును గుర్తుంచుకొనుట యుక్తమైనది మరియు ముఖ్యమైనది అయినప్పటికిని, “ప్రతీ అడుగులో (మన స్వంత) విశ్వాసమును ” మనము రుజువు చేసినప్పుడు, మనలో ప్రతీఒక్కరికి “జీవితము గుండా సుదీర్ఘ ప్రయాణము కొనసాగును!” అని మనము జ్ఞాపకముంచుకోవాలి.

చిత్రం
సభ్యులు వారి సమూహములకు సమకూర్చబడతారు

క్రొత్తగా మారినవారు పశ్చిమ అమెరికా సంయుక్త రాష్ట్రాలకు అగ్రగామి స్థావరాలకు ఇక సమకూడనవసరం లేదు. బదులుగా, మార్పు చెందిన వారు తమ స్థానిక స మూహములతో సమావేశమవ్వాలి, అక్కడ పరిశుద్ధులు యేసు క్రీస్తు నామములో మన పరలోక తండ్రిని ఆరాధిస్తారు. ప్రపంచమంతటా, 300,000 పైగా సమూహములు స్థాపించబడి, అందరూ తమ స్వంత సీయోనుకు సమావేశమయ్యారు. లేఖనాలు వ్రాసినట్లుగా, “ఏలయనగా ఇది సీయోను---హృదయమందు శుద్ధిగల వారు.” 6

జీవితపు రోడ్డుపై మనము నడుస్తున్నప్పుడు, మనము “(ప్రభువు) ఆజ్ఞాపించిన విషయాలన్నిటిని చేస్తామా” 7 అని చూచుటకు మనము పరీక్షించబడతాము.

వ్యక్తిగత నెరవేర్పు మరియు ఆత్మీయ జ్ఞానోదయమునకు నడిపిస్తూ---మనలో అనేకులు కనిపెట్టే అద్భుతమైన ప్రయాణములో ఉన్నారు. అయినప్పటికిని, వారిలో కొందరు, విచారము, పాపము, వేదన, మరియు నిరాశకు నడిపించే సుదీర్ఘ ప్రయాణముపై ఉన్నారు.

ఈ భావనలో, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి: మీ చివరి గమ్యమేమిటి? మీ అడుగుజాడలు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? మీ ప్రయాణము రక్షకుడు వాగ్దానము చేసిన “అనేకనేక దీవెనలకు” మిమ్మల్ని నడిపిస్తున్నాయా?8

మన పరలోక తండ్రి వద్దకు తిరుగు ప్రయాణము మన జీవితాలలో అత్యంత ముఖ్యమైన ప్రయాణము, మరియు ఆయనయందు మరియు ఆయన ప్రియమైన కుమారునియందు మన విశ్వాసమును మనము హెచ్చించినప్పుడు అది ప్రతీరోజు, ప్రతీవారము, ప్రతీ నెల మరియు ప్రతీ సంవత్సరము కొనసాగును.

జీవితములో మన అడుగుజాడలు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయో మనము జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఈ ప్రశ్నలకు జవాబిచ్చినప్పుడు ఆయన శిష్యులకు యేసు యొక్క సలహాను ఆలకించాలి: “ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు మరియు యుగసమాప్తికి మీ సూచనలేమిటి?”

“యేసు వారితో ఇట్లనెను, ఎవడును (మరియు స్త్రీని నేను చేరుస్తాను) మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి.” 9

ఈరోజు సంఘ నాయకుల నుండి ముందుగా ఇవ్వబడిన సలహాను నేను పునరావృతం చేస్తాను.

  • సహోదర, సహోదరిలారా, క్రీస్తు యొక్క సిద్ధాంతమును పరిశుద్ధముగా కాపాడుకొనుము మరియు సిద్ధాంతముతో పునరాలోచన చేయు వారి చేత ఎన్నడూ మోసగించబడకుము. ఈ కడవరి యుగముకు ప్రవక్త అయిన జోసెఫ్ స్మిత్ ద్వారా తండ్రి మరియు కుమారుని యొక్క సువార్త పునఃస్థాపించబడింది.

  • వారి సంఘ పిలుపుకు నియమించబడని లేక ప్రత్యేకించబడని వారిని మరియు సంఘ సభ్యుల ఉమ్మడి సమ్మతి చేత అంగీకరించబడని వారిని వినకుము. 10

  • నేటి అపోస్తలులు, మరియు ప్రవక్తలు కలిగి లేరు లేక గ్రహించలేదని చెప్పు సంస్థలు, గుంపులు, లేక వ్యక్తుల సిద్ధాంతపరమైన ప్రశ్నలకు రహస్యమైన జవాబులను గూర్చి జాగ్రత్తగా ఉండుము.

  • ధనికులు అయ్యే ప్రక్రియలతో మిమ్మల్ని వశ్యము చేయువారిని వినకుము. మన సభ్యులు చాలా ఎక్కువ ధనాన్ని కోల్పోయారు, అందుచేత జాగ్రత్తగా ఉండుము.

కొన్ని స్థలములలో, మన జనులలో అనేకమంది, గురుతును దాటి చూస్తున్నారు మరియు స్వస్థత, చేయూతని అందించుటకు ఖరీదైన మరియు ప్రశ్నింపదగిన ఆచరణలందు రహస్యమైన జ్ఞానమును వెదకుచున్నారు.

ఒక సంవత్సరము క్రితం జారీచేయబడిన అధికారిక సంఘ వ్యాఖ్యానము, వివరించును: “డబ్బుకు బదులుగా ---అద్భుతమైన స్వస్థత లేక సరిగా నియమించబడిన యాజకత్వ నాయకులు కాని బయటివారి స్వస్థత శక్తిని చేరుకొనుటకు ప్రత్యేక పద్ధతులను కలిగియున్నామని చెప్పు ఏ గుంపులోనైనా పాల్గొనుటకు జాగ్రత్తగా ఉండుము.” 11

సంఘ చేతిపుస్తకము సలహా ఇచ్చును: “సభ్యులు నైతికంగా, లేక న్యాయపరంగా ప్రశ్నించగల వైద్య లేక ఆరోగ్య సాధనలను ఉపయోగించరాదు. స్థానిక నాయకులు ఆరోగ్య సమస్యలున్న సభ్యులు, సమర్ధులైన వైద్యులు తాము సాధన చేసే దేశాలలో లైసెన్సు పొందిన వారితో సంప్రదించమని నాయకులు సభ్యులకు సలహా ఇవ్వాలి.”12

సహోదర, సహోదరీలారా, అటువంటి పద్ధతులు భావావేశపరంగా ఆకర్షణీయంగా కనబడవచ్చు కానీ ఆత్మీయంగా మరియు శారీరకంగా హానికరమని చివరకు రుజువు చేయబడతాయని తెలుసుకొనుము మరియు తెలివిగా ఉండుము.

మన అగ్రగామి పూర్వీకులకు, స్వతంత్రత మరియు స్వయం ఉపాధి కీలకమైనవి, కాని వారి సమాజ భావన అంతే ముఖ్యమైనది. వాళ్ళు కలిసి పని చేసారు మరియు వారి కాలపు శారీరక, భావావేశ సవాళ్ళను జయించుటకు ఒకరికొకరు సహాయపడ్డారు. పురుషులకు, యాజకత్వ కోరమున్నది, మరియు స్త్రీలు ఉపశమన సమాజము చేత సేవ చేయబడ్డారు. ఈ ఫలితాలు మన కాలములో మారలేదు.

ఉపశమన సమాజము మరియు యాజకత్వ కోరములు మన సభ్యుల ఆత్మీయ మరియు భౌతిక శ్రేయస్సు కొరకు సమకూర్చాలి.

“ప్రతీ అడుగులో విశ్వాసము” కలిగియుండుట ద్వారా సువార్త బాటపై నిలిచియుండుము, ఆవిధంగా మీరు పరలోక తండ్రి మరియు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సన్నిధికి తిరిగి వెళ్ళగలరు. ప్రభువు మన ప్రశస్తమైన రక్షకుడు. ఆయన లోకము యొక్క విమోచకుడు. మనము ఆయన పరిశుద్ధ నామమును ఘనపరచాలి మరియు ఏవిధంగాను దానిని దుర్వినియోగం చేయరాదు, ఎల్లప్పుడు ఆయన ఆజ్ఞలను పాటించుటకు ప్రయాసపడాలి. మనము ఆవిధంగా చేసిన యెడల, ఆయన మనల్ని దీవించును మరియు పరలోక తండ్రి వద్దకు మనల్ని తిరిగి నడిపించును.

ఈరోజు అతడు లేక ఆమె స్వంత ప్రయాణము చేస్తున్న ఎవరినైన, వారి ప్రయాణములో వారు ఎక్కడున్నప్పటికిని, వారిని స్వాగతించాలి మరియు హత్తుకోవాలని నా స్వరము వినుచున్న ప్రతీఒక్కరిని నేను ఆహ్వానిస్తున్నాను.

పునఃస్థాపన యొక్క సందేశము కన్నా ఎవరైన పంచుకొనగల దీవెన ఏదీలేదు, అది పొంది, జీవించినప్పుడు, శాశ్వతమైన సంతోషము మరియు శాంతి---నిత్య జీవము కూడ వాగ్దానమివ్వబడినవని దయచేసి జ్ఞాపకముంచుకొనుము. వారి అనుదిన జీవితాలను సువార్త సిద్ధాంతము యొక్క శక్తి నడిపించునట్లు, దేవుని యొక్క పిల్లలను కనుగొనుటకు, బోధించుటకు, మరియు బాప్తీస్మమిచ్చుటకు మనము మన మిషనరీలకు సహాయపడుటలో మన శక్తి, బలము, మరియు సాక్ష్యములను ఉపయోగిద్దాము.

దేవుని యొక్క పిల్లలను మనము కనికరముతో హత్తుకోవాలి మరియు జాతి, లింగవివక్ష, మరియు జాతీయత కలిపి, ఏ పక్షపాతమైనా తీసివేయాలి. “పునఃస్తాపించబడిన సువార్త యొక్క దీవెనలు దేవుని యొక్క ప్రతీ బిడ్డ కొరకైనవని మనము నమ్మతున్నామని చెప్పబడాలి”

“సుదీర్ఘ ప్రయాణము కొనసాగునని ” నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ప్రేమ మరియు కనికరమందు దేవుని యొక్క పిల్లలందరిని సమీపించుట ద్వారా ముందుకు త్రోసుకొనిపోవుటకు మీరు కొనసాగించినప్పుడు సువార్త బాటపై నిలిచియుండమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, ఆవిధంగా మనము మన పరలోక తండ్రి మరియు ఆయన ప్రియమైన కుమారుని ననిజముగా ప్రేమించు వారందరికి ఎదురచూస్తున్న “గొప్ప దీవెనలు” పొందుటకు ఒకటిగా మన హృదయాలను శుద్ధిగా చేసుకొని మరియు మన చేతులను శుభ్రపరచుకొందుముగాక, దీని కొరకు నేను యేసు క్రీస్తు నామములో వినయముగా ప్రార్థిస్తున్నాను, ఆమేన్.

ముద్రించు