అక్టోబర్ 2017 స్త్రీల యొక్క ప్రధాన సభ స్త్రీల యొక్క ప్రధాన సభ షారోన్ యుబాంక్మీ దీపమును వెలిగించుముసహోదరి యూబాంక్ కడవరి-దిన పరిశుద్ధ స్త్రీలను నీతిగా ఉంటూ, విశ్వాసమును వ్యక్తపరుస్తూ, విభిన్నముగా మరియు వేరుగా ఉండమని అధ్యక్షులు స్పెన్సర్ డబ్ల్యు. కింబల్ ఇచ్చిన కార్యవిధిని అనుసరించమని ప్రోత్సహిస్తున్నారు. నీల్ ఎఫ్. మారియట్దేవునితో నిలిచియుండుట మరియు గాయమును రూపుమాపుటఆయనకు దగ్గరవ్వాలన్న దేవుని ఆహ్వానమును పంచుకొనుచు, ఆయననుండి మనల్ని వేరు చేయు అంతరమును మూసివేయగల రక్షకుని యొక్క శక్తి గురించి సహోదరి మారియట్ సాక్ష్యమిస్తున్నారు. జోయ్ డి. జోన్స్లెక్కకు మించిన విలువమన దైవిక విలువ యొక్క సత్యమును ఆత్మ నిర్ధారించగలదని సహోదరి జోన్స్ బోధిస్తున్నారు. రక్షకుని కొరకు మన ప్రేమ బలహీనతలు మరియు స్వీయ-అనుమానాలను జయించుటకు మనకు సహాయపడగలదు. డీటర్ ఎఫ్. ఉఖ్డార్ఫ్ముగ్గురు సహోదరిలుమనము దేవుని యొక్క పిల్లలమని మరియు శిష్యత్వము యొక్క మార్గము సంతోషమునకు నడిపించునని బోధించుటకు---విచారము, కోపిష్ఠి, మరియు సంతోషముగల---ముగ్గురు సహోదరీల యొక్క ఉపమానమును అధ్యక్షులు ఉఖ్డార్ఫ్ చెప్పుచున్నారు. శనివారము ఉదయకాల సమావేశము శనివారము ఉదయకాల సమావేశము డైటర్ ఎఫ్. ఉక్డార్ఫ్ఇంటి కొరకు ఆపేక్షప్రభువు వైపు తిరుగుట మన జీవితాలను మరింత మెరుగైనవిగా చేయునని మరియు ఇతరుల జీవితాలను మంచిగా చేయుటకు మనకు సహాయపడునని అధ్యక్షులు ఉక్డార్ఫ్ బోధిస్తున్నారు. బోన్నీ ఎల్. ఆస్కార్సన్మన ముందున్న అవసరాలుమనకు సన్నిహితముగా ఉన్నవారికి సేవ చేయమని సహోదరి ఆస్కార్సన్ మనకు బోధిస్తున్నారు: మన కుటుంబాలు, స్నేహితులు, వార్డు మరియు సమాజ సభ్యులకు సేవ చేయమని మనకు బోధిస్తున్నారు. సువార్తను జీవించుట యొక్క సారము సేవ చేయుట. డాల్లిన్ హెచ్. ఓక్స్రక్షణ మరియు ప్రకటనకుటుంబ ప్రకటనలో సిద్ధాంతము ఉన్నత స్థితి కొరకు మనల్ని ఎలా సిద్ధపరచును మరియు కుటుంబమును ఎదుర్కొనుచున్న ఆధునిక సవాళ్ళ ద్వారా మనల్ని నడిపించునో ఎల్డర్ ఓక్స్ వివరించారు. ఎల్దర్ జాన్ సి. పింగ్రీ జూర్.“మీ కొరకు నాకొక కార్యమున్నది”మనందరి కొరకు ఒక కార్యమును కలిగియున్నాడని ఎల్డర్ పింగ్రీ సాక్ష్యమిస్తున్నారు. ఆ కార్యమును నెరవేర్చుటకు మనకు సహాయపడుటకు సూత్రములను కూడా ఆయన పంచుకొన్నాడు మరియు సాతాను మనకు వ్యతిరేకించు విధానములను హెచ్చరించెను. డి. టాడ్ క్రిస్టాఫర్సన్పరలోకము నుండి వచ్చిన జీవాహారముఉపమానంగా ఆయన శరీరమును భుజించి మరియు ఆయన రక్తమును త్రాగమన్న రక్షకుని ఆహ్వానమును అంగీకరించుట ద్వారా ఎల్డర్ క్రిస్టాఫర్సన్ మనల్ని ఆహ్వానిస్తున్నారు. జెఫ్రి ఆర్. హాలండ్చివరకు---మీరును పరిపూర్ణులుగా ఉండుముపరిపూర్ణముగా ఉండుము అన్న ఆజ్ఞకు స్పందించుటలో, మనము నిరాశ చెందరాదు కానీ నిత్యత్వములో లక్ష్యమును సాధించుటకు పట్టుదల కలిగియుండాలని ఎల్డర్ జెఫ్రి ఆర్. హాలండ్ బోధిస్తున్నారు. శనివారం మధ్యాహ్న సమావేశము శనివారం మధ్యాహ్న సమావేశము హెన్రీ బి. ఐరింగ్సంఘ అధికారుల యొక్క ఆమోదపు ఓటుఅధ్యక్షులు ఐరింగ్ గారు ప్రధాన సంఘ నాయకుల పేర్లను ఆమోదపు ఓటు కొరకు ప్రతిపాదిస్తారు. గారీ ఇ. స్టీవెన్సన్ఆధ్యాత్మిక గ్రహణంఎల్డర్ స్టీవెన్సన్ సూర్య గ్రహణాన్ని ఆధ్యాత్మిక గ్రహణంతో పోల్చారు. గర్వాన్ని అధిగమించి, ఇతరులను ప్రేరేపించడానికి సాంఘిక ప్రసార మాధ్యమాలను ఉపయోగించడానికి సువార్త దృష్టి మనకు సహాయపడగలదు. స్టీఫెన్ డబ్ల్యు. ఓవెన్పశ్చాత్తాపము ఎల్లప్పుడూ సవ్యమైనదిపశ్చాత్తాపము అనేది రక్షకుడిచ్చిన బహుమానమని సహోదరుడు ఓవెన్ బోధిస్తున్నారు. తప్పిపోయిన కుమారుని వలె మనము రోజువారీ ఎంపికలను చేస్తాము, అవి మనల్ని మన పరలోక తండ్రి వైపు నడిపిస్తాయి. క్వింటిన్ ఎల్. కుక్నిత్య సంగతులుఆయన సంఘమును స్థాపించుటకు ప్రభువుకు సహాయపడుటలో మరియు దేవుని కలుసుకొనుటకు వ్యక్తులను సిద్ధపరచుటకు సహాయపడుటలో వినయము ఆవశ్యకమని ఎల్డర్ కుక్ బోధిస్తున్నారు. రొనాల్డ్ ఎ. రాస్బాండ్దైవ ప్రణాళిక ద్వారామన జీవితాలు ప్రభువు యొక్క దైవ ప్రణాళికలో భాగమని మరియు మనము నీతిమంతులుగా ఉండేందుకు ప్రయత్నించినప్పుడు ఆయన మనల్ని నడిపిస్తారని ఎల్డర్ రాస్బాండ్ వివరిస్తున్నారు. O. Vincent Haleckఒ. విన్సెంట్ హాలెక్విధవరాలి హృదయముదేవుని రాజ్యము నిర్మించుటలో సహాయపడేందుకు మనకు చేతనైనదంతా చేసినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తారని వాగ్దానమిస్తూ “విధవరాలి హృదయమును” కలిగియుండాలని ఎల్డర్ హాలెక్ మనల్ని ప్రోత్సహిస్తున్నారు. రస్సెల్ ఎమ్. నెల్సన్మోర్మన్ గ్రంథము: ఇది లేకపోతే మీ జీవితం ఎలా ఉండేది?అధ్యక్షులు నెల్సన్ గారు మోర్మన్ గ్రంథము యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్నారు, అది క్రీస్తు గురించి బోధిస్తుందని సాక్ష్యమిస్తున్నారు మరియు ప్రతిరోజు దానిని ప్రార్థనాపూర్వకముగా అధ్యయనము చేయమని మనల్ని ప్రోత్సహిస్తున్నారు. ఆదివారము ఉదయకాల సమావేశము ఆదివారము ఉదయకాల సమావేశము జీన్ బి. బింగమ్మీ సంతోషము పరిపూర్ణము కావలెననిమర్త్య జీవితపు కష్టాలను లక్ష్యపెట్టకుండా, మనము సమస్త స్వస్థత, శాంతి, మరియు నిత్య పురోభివృద్ధి యొక్క ఆధారముగా యేసు క్రీస్తు వైపు తిరగగలమని, సహోదరి బింగమ్ బోధిస్తున్నారు. డోనాల్డ్ ఎల్. హాల్స్ట్రామ్అద్భుతకార్యముల దినము ఆగిపోయినదా?ఎల్టర్ హాల్స్ట్రామ్ వేర్వేరు విధాలైన అద్భుతాలను గూర్చి బోధిస్తున్నారు మరియు సువార్త ద్వారా మనమందరము పొందగల ఆత్మీయ అద్భతాలను గూర్చి సాక్ష్యమిస్తున్నారు. డేవిడ్ ఏ. బెడ్నార్అత్యంత ఘనమైన మరియు విలువైన వాగ్దానాలుసువార్త యొక్క వాగ్దనములపై దృష్టిసారించుట, సబ్బాతు దినము, దేవాలయము, మరియు మన గృహాలు ఈ సూత్రములను ఎలా జ్ఞాపకము చేసుకొనుటకు మనకు సహాయపడతాయో ఎల్డర్ బెడ్నార్ బోధిస్తున్నారు. డబ్ల్యు. క్రిస్టాఫర్ వాడెల్ప్రభువు వైపు తిరుగుముజీవితము మనందరికీ తెచ్చే సవాళ్ళను లక్ష్యపెట్టకుండా, మనము రక్షకుని వైపు తిరుగుటకు, ఆయన సహాయమును పొందుటకు, మరియు ప్రతిఫలమిచ్చు జీవితాలను జీవించుటకు ఎన్నుకొనగలమని బిషప్ వాడెల్ బోధిస్తున్నారు. డబ్ల్యు. క్రైయిగ్ జ్విక్ప్రభువా, నా కన్నులు తెరవుముయేసుక్రీస్తు పై దృష్టిసారించుట మనము ఉన్నదున్నట్లుగా చూసేదానిని మించి చూచుటకు మనకు సహాయపడగలదు, ఆవిధంగా మనము రక్షకుడు ఇతరులను చూసినట్లుగా మనము వారిని చూడగలమని ఎల్డర్ జ్విక్ మనకు బోధిస్తున్నారు. హెన్రీ బి. ఐరింగ్మేలు చేయుటకు భయపడవద్దుమనము మోర్మన్ గ్రంథమును చదివి, యేసు క్రీస్తునందు విశ్వాసమును వృద్ధి చేసినప్పుడు, మనము భయమును జయిస్తాము మరియు అవసరతలో ఉన్నవారికి సహాయపడుటకు కోరికను కలిగియుంటాము. ఆదివారం మద్యాహ్న సభ ఆదివారం మద్యాహ్న సభ ఎమ్. రస్సెల్ బల్లార్డ్సుదీర్ఘ ప్రయాణము కొనసాగును!మోర్మన్ అగ్రగామి సుదీర్ఘ ప్రయాణమును మనము జ్ఞాపకముంచుకొనుచుండగా, దేవునియందు విశ్వాసము మరియు ఇతరుల కొరకు కనికరముతో మన జీవితాల గుండా మనము సుదీర్ఘ ప్రయాణము చేయాలని ఎల్డర్ బల్లార్డ్ మనకు బోధిస్తున్నారు. టాడ్ ఆర్. కాల్లిస్టర్దేవుని యొక్క ఖచ్చితమైన సాక్ష్యము : మోర్మన్ గ్రంథముసంఘమును విమర్శించువారు ఎలా ప్రయత్నించి మోర్మన్ గ్రంథమును రుజువు చేయలేక విఫలమయ్యారో సహోదరుడు కాల్లిస్టర్ వివరించును. జోసెఫ్ స్మిత్ దానిని బయల్పాటు ద్వారా అనువదించాడని ఆయన సాక్ష్యమిస్తున్నారు. జోని ఎల్. కాష్దూరముగా, కాని ఇప్పటికీ ఒకటిగామన సంఘ నాయకులు మరియు సహ సభ్యులతో ఒకటికి ఉండాల్సిన ప్రాముఖ్యతను ఎల్డర్ కాష్ వివరిస్తున్నారు. స్టాన్లీ జి. ఎల్లిస్మనం ఆయనను నమ్ముచున్నామా? కష్టమైనది మంచిదిప్రభువు మనల్ని నమ్ముతున్నారని ఎల్డర్ ఎల్లిస్ బోధిస్తున్నారు. ఆయనను నమ్ముటకు మనము విశ్వాసము కలిగియున్నామా? కష్టమైన అనుభవాలు మనల్ని బలముగా మరియు ఎక్కువ వినయులుగా చేయగలవు. ఆడిల్సన్ డి పౌలా పరెల్లాఅత్యవసరమైన సత్యములు—అమలుపరచు మన అవసరముమన సంతోషము మరియు ఉన్నతస్థితికి అవసరమైన సత్యములను ప్రథమ దర్శనము మరియు ప్రవక్త జోసెఫ్ స్మిత్ తెచ్చెనని ఎల్డర్ పరెల్లా మనకు జ్ఞాపకము చేస్తున్నారు. ఇయాన్ ఎస్. ఆర్డెన్శ్రేష్టమైన గ్రంథముల నుండి నేర్చుకొనుడిమనం ప్రతికూలత మరియు ప్రశ్నలను ఎదుర్కొన్నప్పుడు, యేసు క్రీస్తు మరియు మోర్మన్ గ్రంథము గురించి మన సాక్ష్యములను దృఢపరచుకొనుట మన విశ్వాసము వృద్ధచెందుటలో మనకు ఏవిధంగా సహాయపడగలదో ఎల్డర్ ఆర్డెన్ బోధిస్తున్నారు. జోస్ ఎల్. ఆలెన్సోఆయన మనల్ని ప్రేమించినట్టే ఒకరి నొకరు ప్రేమించాలిఇతరులకు సేవ చేయుట మరియు క్షమించుట ద్వారా మనము రక్షకుని యొక్క మాదిరిని ఎలా అనుసరించగలమో ఎల్డర్ ఆలెన్సో మనకు బోధించును. నీల్ ఎల్. ఆండర్సన్ చేతప్రభువు యొక్క స్వరముప్రభువు యొక్క ప్రవక్తలు మరియు అపోస్తులులు ఆయన కొరకు మాట్లాడతారని, మరియు వారి సలహాను ఆయన విని, అనుసరించాలని ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నారని ఎల్డర్ ఆండర్సన్ సాక్ష్యమిస్తున్నారు.