మీ దీపమును వెలిగించుము
నా సహోదరిలారా, ప్రవక్తలు మనల్ని పిలుస్తున్నారు. మీరు నీతిగా ఉంటారా? మీ విశ్వాసమును మీరు స్పష్టంగా వ్యక్తపరుస్తారా? మీ దీపమును వెలిగిస్తారా?
మీకు తెలియక పోవచ్చు, కానీ అధ్యక్షులు మాన్సన్ నేను కవల పిల్లలము. ఉత్తర కాలిఫోర్నాయాలో నేను పుట్టిన రోజున, అదే గడియలో 36 సంవత్సరాల థామస్ ఎస్. మాన్సన్ గారు క్రొత్త అపోస్తలునిగా ఆమోదించబడ్డారు. దేవుని యొక్క ప్రవక్త అధ్యక్షులు మాన్సన్‌తో నా ప్రత్యేకమైన, వ్యక్తిగత బంధమును నేను ప్రేమిస్తున్నాను.
ప్రవక్తలు స్త్రీల గురించి మాట్లాడుచున్నారు.1 ఈ సమావేశములో వారి మాటలలో కొన్నిటిని మీరు వింటారు. నా మాటలకు, నేను దాదాపు 40 సంవత్సరాల క్రితం అధ్యక్షులు స్పెన్సర్ డబ్ల్యు కింబల్ చేత వ్రాయబడిన అసాధారణమైన ప్రవచనమునకు వెళతాను. 1979 సెప్టెంబరు ప్రపంచవ్యాప్త సంఘ స్త్రీలు తమ స్వంత ప్రధాన సమావేశములో కలుసుకొనుట కేవలము రెండవసారి. అధ్యక్షులు కింబల్ తన ప్రసంగాన్ని సిద్ధపరిచారు, కాని సమావేశ దినము వచ్చినప్పుడు, ఆయన హాస్పిటల్ లో ఉన్నారు. కనుక బదులుగా, ఆయన తరఫున తన ప్రసంగాన్ని తన భార్య కామిల్లా ఐరింగ్ కింబల్‌ను చదవమని అడిగారు. 2
సహోదరి కింబల్ ప్రవక్త మాటలను చదివారు, అది రెండవ రాకడకు ముందు ప్రపంచములో మంచి స్త్రీలపై ఎల్ డి ఎస్ స్త్రీల యొక్క ప్రభావము నొక్కిచెప్పబడింది. ముగింపులో, సంఘ స్త్రీలకు బలమైన ఉద్వేగాన్ని కలిగించే బాధ్యత ఉన్నది, దానిని అప్పటినుండి మనము మాట్లాడుచున్నాము.
అధ్యక్షులు కింబల్ చెప్పిన దానిలో కొంచెము నేను వ్యాఖ్యానిస్తాను:
“చివరిగా, నా ప్రియమైన సహోదరిలారా, ఇదివరకెన్నడూ చెప్పబడనిది లేక కనీసము ఈవిధంగా చెప్పబడనిది మీకు సూచింపనియ్యుము. ప్రపంచములోని మంచి స్త్రీలలో అనేకులు … విస్తారమైన సంఖ్యలలో సంఘములోనికి ఆకర్షించబడతారు కనుక కడవరి దినాలలో సంఘములకు వచ్చు అధిక అభివృద్ధిలో అధికము కలుగును. సంఘము యొక్క స్త్రీలు వారి జీవితాలలో నీతిని మరియు స్పష్టమైన వ్యక్తీకరణను ప్రతిఫలించినంత మట్టుకు మరియు లోకపు స్త్రీలకు భిన్నంగా---సంతోషకరమైన విధానాలలో, ప్రత్యేకంగా మరియు భిన్నంగా చూడబడినంత వరకు ఇది జరుగుతుంది.
“సంఘములోనికి వచ్చు స్త్రీల మధ్య ప్రపంచములోని నిజమైన కధానాయికులు స్వార్ధముగా ఉండుట కంటె నీతిగా ఉండుటతో ఎక్కువ చింత కలిగియున్నారు. ఈ నిజమైన కధానాయికలు యధార్ధమైన వినయమును కలిగియున్నారు, అది దృశ్యతపైన కంటె న్యాయబుద్ధిపై అత్యధిక విలువనుంచుతారు…
“… సంఘము యొక్క మహిళా మార్గదర్శులు కడవరి దినాలలో సంఘము యొక్క సంఖ్యాపరమైన మరియు ఆత్మీయ వృద్ధి రెండిటిలో గణనీయమైన బలముగా ఉంటారు.”3
అది ఎటువంటి ప్రవచనాత్మక వ్యాఖ్యానము. సంక్షిప్తపరచుటకు:
-
రాబోయే సంవత్సరాలలో సంఘానికి కలిగే ప్రధాన అభివృద్దిలో అధికము స్త్రీల యొక్క మంచి సంబంధాల వలన కలుగును.
-
ఉపశమన సమాజ స్త్రీలు, యువతులు, మరియు ప్రాథమిక బాలికలు ఇతర విశ్వాసాలు, నమ్మకాలకు చెందిన నిజాయితీ, విశ్వాసము, దైవత్వముగల స్త్రీలతో నిర్మించబడిన స్నేహాలు కడవరి దినాలలో సంఘము వృద్ధి చెందుటలో గణనీయమైన బలముగా ఉండును.
-
ఇతర నేపథ్యములనుండి ఈ స్త్రీలను “కధానాయికలు” అని అధ్యక్షులు కింబల్ పిలిచారు, వీరు స్వార్ధముగా ఉండుట కంటె నీతిగా ఉండుటకు ఎక్కువ చింత కలిగియున్నారు, వీరు దృశ్యత కంటె న్యాయబుద్ధి ఎక్కువ విలువైనదని మనకు చూపుతారు.
ప్రపంచమంతటా నా పనిని నేను చేసినప్పుడు ఈ మంచి స్త్రీలలో అనేకమందిని నేను కలిసాను. వారి స్నేహములు నాకు ప్రశస్తమైనవి. మీ స్నేహితులు మరియు పొరుగువారి మధ్య మీరు కూడా వారిని ఎరిగియున్నారు. వాళ్ళు ఇప్పుడు సంఘ సభ్యులు కాకపోవచ్చు, కాని మనము స్నేహమందు జతపరచబడుట చాలా ముఖ్యమైనది. సరే, మన వంతు మనము ఎలా చేస్తాము? మనము ఏమి చేయాలి? అధ్యక్షులు కింబల్ ఐదు విషయాలను సూచించారు:
మొదటిది నీతి కలిగియుండుట. నీతి కలిగియుండుట అనగా పరిపూర్ణంగా ఉండుట లేక ఎన్నడూ తప్పు చేయమని కాదు. దాని అర్ధము దేవునితో బలమైన సంబంధమును పెంపొందిస్తూ, మన పాపములు, తప్పిదములకు పశ్చాత్తాపపడుట, ఇతరులకు ఉచితంగా సహాయపడుట.
పశ్చాత్తాపడిన స్త్రీలు చరిత్ర గమనమును మారుస్తారు. తన చిన్నతనంలో కారు ప్రమాదం జరిగిన నా స్నేహితురాలొకరున్నారు, దానినుండి, ఆమె, నొప్పి మందులకు బానిస అయ్యింది. తరువాత, ఆమె తల్లిదండ్రులు విడాకులు పొందారు. ఆమె క్లుప్త సంబంధములో గర్భవతియ్యింది, మరియు ఆమె వ్యసనాలు కొనసాగాయి. కాని ఒకరాత్రి, ఆమె తన జీవితపు కల్లోలము మరియు గందరగోళమును చూసింది, “ఇక చాలు,” అనుకొన్నది. తనకు సహాయపడమని రక్షకుని వేడుకొన్నది. తన భయంకరమైన పరిస్థితుల కంటె యేసు క్రీస్తు బలమైనవాడని, మరియు పశ్చాత్తాపపడినప్పడు ఆమె ఆయన బలముపై ఆధారపడగలదని తాను నేర్చుకున్నానని ఆమె అన్నది.
ప్రభువు మరియు ఆయన చిత్తమునకు తిరిగి వచ్చుట ద్వారా, ఆమె తన చరిత్ర గమనము మార్చుకొన్నది. ఆమె నీతిగలది, మరియు తప్పులు చేసి, మార్చుకోవాలని కోరు ఇతరులకు ఆమె అటువంటి విశాలమైన హృదయాన్ని కలిగియున్నది. మనందరి వలె, ఆమె జీవితం పరిపూర్ణమైనది కాదు, కానీ ఎలా పశ్చాత్తాపపడాలి మరియు ప్రయత్నించుట కొనసాగించాలో ఆమెకు తెలుసు.
రెండవది, వ్యక్తపరచుట. వ్యక్తపరచుట అనగా ఏదైన విషయము గురించి ఎందుకు మరియు ఎలా భావిస్తున్నారో స్పష్టముగా వ్యక్తపరచుట. ఈ సంవత్సరము ప్రారంభములో, నా ఫేస్ బుక్ న్యూస్‌ఫీడ్‌పైన పోస్ట్ ఒకటి ఉన్నది, అది క్రైస్తవత్వమును విమర్శించింది. నేను దానిని చదివాను మరియు కాస్త కోపం వచ్చింది, కాని నిర్లక్ష్యము చేసాను. అయితే, మన విశ్వాసమునకు చెందని నా పరిచయస్తురాలొకరు తన స్వంత వ్యాఖ్యానముతో స్పందించింది. ఆమె వ్రాసింది: “(ఇది) యేసు దేనికొరకు నిలబడ్డాడో దానికి వ్యతిరేకము----ఆయన … తన కాలములో తీవ్రమైన అభిప్రాయములు కలిగియున్నాడు, ఎందుకనగా ఆయన లోకమును సమానము చేసాడు … ఆయన వేశ్యలను గూర్చి (మాట్లాడాడు), పన్ను అధికారితో కలిసి (ఆయన భుజించాడు) … , బలహీనులైన స్త్రీలు మరియు పిల్లలతో స్నేహము చేసాడు … , (మరియు) మంచి సమరయుని వృత్తాంతమును మనకిచ్చారు … నిజమైన క్రైస్తవులు ప్రపంచములో అత్యంత ప్రేమగల జనులుగా ఉండుటకు ప్రయాసపడతారు.” నేను దానిని చదివినప్పుడు, “నేను దానిని ఎందుకు వ్రాయలేదు”? అని అనుకున్నాను.
మన విశ్వాసము కొరకు కారణాలను స్పష్టంగా బాగా వ్యక్తపరచాల్సిన అవసరము మనలో ప్రతిఒక్కరికున్నది. యేసు క్రీస్తు గురించి మీరు ఎలా భావిస్తున్నారు? సంఘములో మీరెందుకు నిలిచియున్నారు? ఆయన నిజమైన ప్రవక్త అని మీకేలా తెలుసు? సామాజిక మీడియాపై, మీ స్నేహితులతో మౌన సంభాషణలో, మీ మనుమలతో సంభాషించినప్పుడు---మీకు తెలిసిన దానిని, మీరు అనుభూతిచెందిన దానిని స్పష్టంగా వ్యక్తపరచుటకు మీ స్వరము మరియు శక్తిని ఉపయోగించుము. మీరెందుకు నమ్ముతున్నారో, మీకేలా తెలుసు, మీరెప్పుడైన అనుమానించినా, ఎలా అనిపించింది, మీరు దానిని ఎలా జయిస్తారు, వారికి చెప్పుము. అపోస్తులుడైన పేతురు చెప్పినట్లుగా, “భయపడకుడి … కాని మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి, మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్టించుడి” 4
మూడవది భిన్నమైనది. ఈ జూలైలో ఫ్లోరిడాలోని పనామా సిటీ సముద్రతీరమున జరిగిన వృత్తాంతమును నన్ను మీతో చెప్పనియ్యుము. 5 సాయంకాలము, సముద్రములోనికి 100 గజాల (90 మీ) నుండి సహాయము కోసం కేకలు వేస్తున్న తన ఇద్దరు కుమారులను రాబర్టా యుర్స్ర్ చూసింది. వారు బలమైన సుడిగుండములో చిక్కుకొని, సముద్రములోనికి మోసుకొనిపోబడ్డారు. దగ్గరలోని దంపతులు బాలురను రక్షించటానికి ప్రయత్నించారు, కాని వారు కూడా ప్రవాహములో చిక్కుకున్నారు, కనుక యుర్ర్స్ కుటుంబ సభ్యులు ప్రయాసపడుతున్న ఈతగాళ్ళకు సహాయపడటానికి దూకారు, మరియు త్వరగా తొమ్మదిమంది జనులు బలమైన సుడిగుండంలో చిక్కుకున్నారు.
అక్కడ తాళ్ళు ఏమీలేవు. అక్కడ అంగరక్షణ ఏదీ లేదు. రక్షించే పడవ కొరకు పోలీసులు పంపారు, కానీ సముద్రములోని జనులు 20 నిముషాలుగా ప్రయాసపడుతున్నారు మరియు వాళ్ళు బాగా అలసిపోయారు మరియు వారి తలలు నీటిలోకి జారిపోతున్నాయి. సముద్రతీరము వద్దనుండి చూస్తున్నవారి మధ్య జెస్సికా మా సిమ్మోన్స్ ఉన్నది. ఆమె భర్తకు మానవ గొలుసుగా ఏర్పాడాలనే ఆలోచన కలిగింది. వారికి సహాయపడమని సముద్రతీరముపై నున్న జనులను కేకలు వారు వేసారు. డజన్లమంది జనులు చేతులను కలిపి, సముద్రములోనికి నడిచారు. జెస్సికా వ్రాసింది, “వేర్వేరు జాతులు మరియు పురుషులు, స్త్రీలు పూర్తిగా పరాయి వారికి సహాయపడుటకు ముందుకు వచ్చుటను చూచుట పూర్తిగా ఆశ్చర్యకరమైనది!! ” 6 80మంది-వ్యక్తుల గొలుసు ఈతగాళ్ల వైపు చాపబడింది. ఆ అపురూపమైన క్షణము యొక్క చిత్రమును చూడుము.
సముద్రతీరముపైన ప్రతీఒక్కరు, సంప్రదాయ పరిష్కారములను మాత్రమే ఆలోచించగలిగారు మరియు వారు స్తంభించిపోయారు. కాని ఒక దంపతులు హాఠాత్తుగా, వేరోక పరిష్కారమును ఆలోచించారు. క్రొత్తదనము మరియు సృజనాత్మకత ఆత్మీయ వరములు. మన నిబంధనలను మనము పాటించినప్పుడు, మన సంప్రదాయము మరియు సమాజములో ఇతరులనుండి మనల్ని ప్రత్యేకించును, కాని అది ప్రేరేపణకు మనకు ప్రవేశమిచ్చును, ఆవిధంగా మనము వేర్వేరు పరిష్కారాలను, వేర్వేరు పద్ధతులను, వేర్వేరు ప్రయోగాలను ఆలోచించగలము. మనము ఎల్లప్పుడు లోకముతో సరిపడకపోవచ్చు, కానీ అనుకూల విధానాలలో ప్రత్యేకంగా ఉండుటకు ప్రయాసపడుతున్న ఇతరులకు సహాయపడుటకు మనల్ని అనుమతించును.
నాలగవది ప్రత్యేకంగా ఉండుట. ప్రత్యేకంగా ఉండుట అనగా గుర్తించబడినట్లుగా బాగా నిర్వచింపబడుట. సముద్రతీరముపై జెస్సికా మా సిమ్మన్స్ గూర్చిన వృత్తాంతమును నేను తిరిగి వెళతాను. ఈతగాళ్ళ వైపు మానవ గొలుసు చాపబడిన తరువాత, తాను సహాయపడగలనని ఆమెకు తెలుసు. “నేను ఊపిరి ఆపి, ఒలింపిక్ కొలను చుట్టూ సులువుగా వెళ్లగలను. (బలమైన సుడిగుండము నుండి ఎలా బయటపడాలో నాకు తెలుసు). ప్రతీ ఈతగాడిని మానవ గొలుసులోనికి నేను తేగలనని నాకు తెలుసు,” 7 అని జెస్సికా మా చెప్పింది. ఆమె, ఆమె భర్త తేలియాడే బోర్డును త్వరగా తీసుకొని గొలుసు క్రిందుగా మరొక విడిపించు వ్యక్తి ఈతగాళ్ళను చేరేంత వరకు, ఈదుతూ వెళ్ళారు, మరియు తరువాత వారు ఒకరి తరువాత ఒకరిని మోసుకొని గొలుసు వద్దకు తెచ్చారు, వాళ్ళు వీరిని సముద్రతీరానికి భద్రంగా చేర్చారు. జెస్సికాకు ఒక ప్రత్యేకమైన నైపుణ్యమున్నది : సుడిగుండమునకు వ్యతిరేకంగా ఎలా ఈతకొట్టాలో ఆమెకు తెలుసు.
పునఃస్థాపించబడిన సువార్త గుర్తించబడినట్లుగా బాగా నిర్వచించబడింది. కాని దానిని మనము ఎలా అనుసరించాలో ప్రత్యేకంగా ఉండాలి. జెస్సికా ఈతను సాధన చేసినట్లుగా, మనము అత్యవసరమునకు ముందు సువార్తను జీవించుటను సాధన చేయాల్సినవసరమున్నది, ఆవిధంగా, భయపడకుండా, ఇతరులు ప్రవాహములో కొట్టుకొనిపోతున్నప్పుడు సహాయపడుటకు తగినంత బలముగా మనముంటాము.
చివరిగా ఐదవది, సంతోషకరమైన విధానాలలో పైన చెప్పబడిన ఒకటి నుండి నాలుగు మెట్లను చేయుట. సంతోషముగా ఉండుట అనగా ఏమి జరుగుతున్నప్పటికిని, మీ ముఖముపై కృత్రిమమైన నవ్వును పరుచుట అని అర్థము కాదు. కానీ దాని అర్ధము దేవుని యొక్క చట్టములను పాటించుట మరియు ఇతరులను బలపరచి కట్టుట.8 మనము కట్టినప్పుడు, మనము ఇతరుల భారములను పైకెత్తినప్పుడు, అది మన శ్రమలు తీసివేయలేని విధానాలలో మన జీవితాలను దీవించును. నా వద్దనున్న అధ్యక్షులు గార్డన్ బి. హింక్లీ ఇచ్చిన వ్యాఖ్యానాన్ని నేను ప్రతీరోజు చూడగల చోట ఉంచాను: ఆయన చెప్పారు: “నిరాశావాదము లేక ద్వేషము చేత … మీరు దేనిని కట్టలేరు. మీరు ఆశావాదముతో చూడాలి, విశ్వాసముతో పనిచేయాలి, మరియు విషయాలు సంభవిస్తాయి.”9
సంతోషము, ఆశావాదముగల ఆత్మ యొక్క మాదిరి, నాకు తెలిసిన 13 సంవత్సరాల బాలిక పేరు ఎల్సా, ఆమె కుటుంబము తన స్నేహితుల నుండి 1,800 మైళ్ళు (2,900 కిమీ), బాటన్ రోగ్, లౌసియానాకు మారారు. మీరు 13 ఏళ్ళవారై ఒక క్రొత్త ప్రదేశానికి మారటం అంత సులుభమైనది కాదు. మారటానికి ఎల్సా అర్ధవంతముగా నిశ్చయముగా లేదు, అందువలన నాన్న ఆమెకు దీవెన ఇచ్చాడు. ఆ దీవెన ఇస్తున్న క్షణములో, ఆమె తల్లి ఫోనుకు సందేశముతో మ్రోగింది. లౌసియానాలో నివసిస్తున్న యువతులు, ఈ చిత్రాన్ని శీర్షికతో పంపారు, “దయచేసి మా వార్డుకు మారండి” 10
ఈ యువతులు ఆశావాదముతో ఉన్నారు, వారు ఎల్సాను కలుసుకోకుండానే ఆమెను ఇష్టపడ్డారు. వారి ఉత్సాహము రాబోవు మార్పు గురించి ఎల్సాలో ఆశావాదాన్ని కల్పించింది మరియు అంతా సవ్యముగా ఉండాలన్న తన ప్రార్థనకు జవాబిచ్చింది.
సంతోషము మరియు ఆశావాదమునుండి వచ్చు శక్తి మనల్ని దీవించుట మాత్రమే కాదు--అది మన చుట్టూ ఉన్నవారిని కట్టును. ఇతరులలో నిజమైన సంతోషాన్ని వెలిగించుటకు మీరు చేయగల స్వల్ప విషయమేదైనా అధ్యక్షులు కింబల్ వెలిగించిన దీపమును మీరిదివరకే వహిస్తున్నారని చూపును.
అధ్యక్షులు కింబల్ యొక్క ప్రసంగమివ్వబడిన సమయములో నాకు 15 సంవత్సరాలు. అప్పటి నుండి అధ్యక్షులు కింబల్ నుండి ఈ బాధ్యతను 40 పైగా ఉన్న మనము వహిస్తున్నాము. ఇప్పుడు, నేను 8-సంవత్సరాలు, 14-సంవత్సరాలు, మరియు 20-సంవత్సరాలు, 35-సంవత్సరాల వారిని చూస్తున్నాను, మరియు ఈ కాగడాను నేను మీకు అందిస్తాను. మీరు ఈ సంఘము యొక్క భవిష్యత్ నాయకులు, మరియు అది ఈ వెలుగును ముందుకు తీసుకొనివెళ్ళుటకు మరియు ఈ ప్రవచనము యొక్క నెరవేర్పుగా ఉండుట మీ ఇష్టము. 40 పైబడిన మేము, మా చేతులను మీ చేతులగుండా జతపరుస్తాము మరియు మీ బలము, శక్తిని అనుభూతి చెందుతాము. మీరు మకవసరము.
సిద్ధాంతము మరియు నిబంధనలు 49:26–28 లో ఉన్న లేఖనాన్ని వినుము. అది వేర్వేరు పరిస్థితుల క్రింద వ్రాయబడియుండవచ్చు, కాని నేటి రాత్రి పరిశుద్ధాత్మ ద్వారా, ఈ పరిశుద్ధ కార్యమునకు మీ వ్యక్తిగత పిలుపుగా మీరు దానిని తీసుకుంటారని నేనాశిస్తున్నాను.
“ఇదిగో నేను మీతో చెప్పుచున్నాను, నేను మీకాజ్ఞాపించినట్లుగా ముందుకు సాగుము; మీ పాపములన్నిటి కొరకు పశ్చాత్తాపపడుము; అడుగుడి, మీకివ్వబడును; తట్టుడి, మరియు అది మీకు తెరవబడును.
“ఇదిగో, నేను మీ ముందుగా వెళతాను మరియు మీ వెనుక ఉంటాను; మరియు నేను మీ మధ్యలో ఉంటాను, మరియు మీరు కలవరపడరు.
“ఇదిగో, నేను యేసు క్రీస్తును, మరియు నేను త్వరగా వస్తాను.” 11
నా స్వంత సాక్ష్యమును చేరుస్తాను. మనమెవరము లేక మనమేమి చేసినప్పటికిని యేసు క్రీస్తు మనందరినీ షరతులు లేకుండా ప్రేమిస్తున్నాడు, కాని అదేవిధంగా మనము ఆయనను షరతులు లేకుండా ప్రేమించుటకు ఆయన మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. మనము ఆయనను ప్రేమించినప్పుడు, మనము ఆయన ఆజ్ఞలను పాటిస్తాము. మనము ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడు, ఆయన కార్యమునందు ఆయన మిమ్మల్ని ఉపయోగించగలడు. ఆయన కార్యము మరియు మహిమ స్త్రీ, పురుషుల యొక్క నిత్యజీవము.
నా సహోదరిలారా, ప్రవక్తలు మనల్ని పిలుస్తున్నారు. మీరు నీతిగా ఉంటారా? మీ విశ్వాసమును మీరు స్పష్టంగా వ్యక్తపరుస్తారా? మీ శ్రమలను లక్ష్యపెట్టకుండా మీ సంతోషము మంచివారు, దివ్యమైన వారు, మీ స్నేహము అవసరమైన ఇతరులను ఆకర్షిస్తుందా? మీరు మీ దీపమును వెలిగిస్తారా? ప్రభువైన యేసు క్రీస్తు మీ ముందుగా వెళ్ళి మీ మధ్య ఉంటారని నేను సాక్ష్యమిస్తున్నాను.
మన ప్రియమైన ప్రవక్త అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ యొక్క మాటలతో నేను ముగిస్తాను: “నా ప్రియమైన సహోదరిలారా, ఇది మీ దినము, ఇది మీ సమయము.” 12 యేసు క్రీస్తు నామములో, ఆమేన్.