2010–2019
దూరముగా, కాని ఇప్పటికీ ఒకటిగా
అక్టోబర్ 2017


2:3

దూరముగా, కాని ఇప్పటికీ ఒకటిగా

సంఘములో, మన భిన్నత్వాలను లక్ష్యపెట్టకుండా, ప్రభువు మనము ఒకటిగా ఉండాలని ఆశిస్తున్నాడు!

జూన్ 1994 లో, మా జాతీయ సాకర్ జట్టు ఆటను టీవిలో చూడటానికి పని నుండి తిరిగి ఇంటికి వెళ్ళటానికి నేను ఆతృతగా డ్రైవింగ్ చేస్తున్నాను. నేను ప్రయాణము ప్రారంభించిన కాసేపటికి, ఒక వ్యక్తి తన చక్రాల కుర్చీలో త్వరగా ముందుకు వెళుతున్నాడు, అది మా బ్రెజీలియన్ జెండాతో ఆలంకరించబడినది. అప్పుడు అతడు కూడా క్రీడను చూడటానికి వెళుతున్నాడని నేను ఎరుగుదును !

మా దారులు కలిసినప్పుడు, మా కన్నులు కలిసాయి; ఒక క్షణం, నేను ఆ వ్యక్తితో ఒకటిగా ఉన్నట్లు బలంగా భావించాను! మేము వేర్వేరు దిశలలో వెళుతున్నాము, ఒకరినొకరం ఎరుగము, స్పష్టంగా, సమాజిక మరియు భౌతిక పరిస్థితులను కలిగియున్నాము, కాని సాకర్ కోసం ఒకే ఆసక్తి మరియు మా దేశము కోసం ప్రేమ ఆ క్షణమందు ఒకటిగా భావించునట్లు చేసాయి! అప్పటినుండి నేను ఆ వ్యక్తిని చూడలేదు, కానీ అనేక సంవత్సరాలు తరువాత, నేనింకా ఆ కళ్ళను చూడగలను మరియు ఆ వ్యక్తితో బలమైన సంబంధమును భావిస్తాను. అన్నిటికిపైగా, ఆ సంవత్సరము మేము ఆ క్రీడను మరియు వరల్డ్ కప్ గెలిచాము.

సంఘములో, మనకు భిన్నత్వాలు ఉన్నప్పటికిని, మనము ఒకటిగా ఉండాలని ప్రభువు మనల్ని ఆశిస్తున్నారు! “ఒకటిగా ఉండుము; మరియు మీరు ఒకటి కాని యెడల మీరు నావారు కాదు,”1 అని ప్రభువు సిద్ధాంతము మరియు నిబంధనలలో చెప్పారు.

ఒక గుంపుగా ఆరాధించుటకు మనమందరము ఒక సమావేశ గృహమును ప్రవేశించినప్పుడు, జాతి, సామాజిక స్థాయి, రాజకీయ, విద్యా సంబంధిత, మరియు వృత్తి సంబంధమైన నెరవేర్పులు కలిపి మన భిన్నత్వాలను వదలివేయాలి, మరియు బదులుగా మన సామాజిక ఆత్మీయ ఉద్దేశాలపై దృష్టిసారించాలి. కలిసి మనము కీర్తనలు పాడతాము, సంస్కారమందు అదేవిధమైన నిబంధనల గురించి ధ్యానిస్తాము, ప్రసంగాలు, పాఠములు, మరియు ప్రార్థనల తరువాత ఒకేవిధంగా వినబడేలా “ఆమేన్” అని చెప్తాము, అనగా మనము పంచుకొన్న దానితో మనము కలిసి అంగీకరిస్తున్నాము.

మనము కలిసి చేసే ఈ విషయాలు సమూహము లోపల ఏకమనే బలమైన భావనను సృష్టించుటకు సహాయపడతాయి.

అయిప్పటికిని, మన ఐక్యతను నిజముగా తీర్మానించి, పటిష్టపరిచేది లేక నాశనము చేసేది ఏమనగా, మన సంఘ సభ్యులనుండి దూరముగా మనమున్నప్పుడు ఎలా ప్రవరిస్తామన్నది. మనందరికి తెలిసినట్లుగా, అది అనివార్యమైనది మరియు చివరికి మనము ఒకరినొకరి గురించి మాట్లాడతామన్నది సాధారణమైనది.

ఒకరినొకరి గురించి ఏమి చెప్పాలని ఎన్నుకొన్న దానిపై ఆధారపడి, మోర్మన్ యొక్క నీళ్ళ వద్ద తాను బాప్తీస్మమిచ్చిన వారికి ఆల్మా బోధించినట్లుగా, మన మాటలు మన “హృదయాలు కలిసి మెలసి ” ”2 ఉంటాయి లేక అవి మన మధ్య ఉండాల్సిన ప్రేమ, నమ్మకమును, మరియు మంచితనమును నెమ్మదిగా నాశనం చేస్తాయి.

“అవును, అతడు మంచి బిషప్పు, ఓ, కాని అతడు చిన్నవానిగా ఉన్నప్పుడు మీరు అతడిని చూడాల్సింది!”

దీనికి “బిషప్పు చాలా మంచివాడు, సంవత్సరాలుగా అతడు పరిపక్వత, జ్ఞానమందు చాలా ఎదిగాడు.”

ఇలా చెప్పుట ద్వారా తరచుగా మనము జనులపై శాశ్వతమైన ముద్రలను వేస్తాము, “మా ఉపశమన సమాజ అధ్యక్షురాలు మారదు; ఆమె చాలా మొండిది!” వ్యతిరేకంగా మనము, “ఉపశమన సమాజ అధ్యక్షురాలు ఈమధ్య అంత అనుకూలంగా లేదు; ఆమె కాస్త కష్టమైన సమయాలను ఎదుర్కొంటూ ఉండవచ్చు. మనము ఆమెకు సహాయపడదాము మరియు ఆమెక సహకరిద్దాము!”

సహోదర, సహాదరిలారా, మన సంఘ పరిధి నుండి కలిపి ఎవరినీ, మెరుగుపరుచుకోలేరని, చిత్రీకరించుటకు మనకు హక్కు లేదు!” బదులుగా, మన పొరుగువారి గురించి మన మాటలు యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తమునందు మన నమ్మకమును ప్రతిఫలించాలి, ఆయనయందు, ఆయన ద్వారా, మనము ఎల్లప్పుడు ఉత్తమంగా మారగలము!

కొందరు స్వల్పమైన విషయాల కొరకు సంఘ నాయకులు మరియు సభ్యులనుండి విభజింపబడి, విమర్శించుట ప్రారంభిస్తారు.

1831లో సంఘ సభ్యుడైన సైమండ్స్ రైడర్ అని పిలవబడిన వ్యక్తి పరిస్థితి అదే. అతడికి సంబంధించిన ఒక బయల్పాటును చదివిన తరువాత, అతడి పేరు తప్పుగా వ్రాయబడుట చూసి కలవరపడ్డాడు., ఆ లేఖలో, అతడి చివరి పేరు రైడర్,వై అక్షరానికి బదులుగా అక్షరంతో వ్రాయబడింది. ఈ సంఘటనకు అతడి స్పందన అతడు ప్రవక్తను ప్రశ్నించుటకు చివరకు జోసెఫ్‌ను హింసించుటకు మరియు సంఘము నుండి పడిపోవుటకు దారితీసింది.3

మన మత నాయకులనుండి మనమందరము ఎదైన సరిదిద్దబడిన అనుభవాన్ని కూడా పొందవచ్చు, అది వారితో మనము ఎలా ఐక్యపరచబడతామో అన్నది ఒక పరీక్ష.

44 సంవత్సరాల క్రితం, నాకా 11 సంవత్సరాలు, కానీ నా కుటుంబము హాజరుగుతున్న సంఘ సమావేశ భవనము, పునర్నిర్మిచబడుట నాకు జ్ఞాపకమున్నది. ఆ నిర్మాణము ప్రారంభము కాకముందు, ఆ ప్రయత్నములో ఒక సమావేశము జరిగింది, దానిలో సభ్యులు ఎలా పాల్గొంటారో స్థానిక నాయకులు మరియు ప్రాంతీయ నాయకులు చర్చిస్తున్నారు. సంవత్సరాలుగా అధ్యక్షత వహించిన మా నాన్న, ఈ పని ఒక కాంట్రాక్టరు ద్వారా చేయబడాలి కాని ఔత్సాహికుల చేత కాదని తన బలమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.

అతడి అభిప్రాయము తిరస్కరించబడుట మాత్రమే కాదు కానీ, ఆ సందర్భములో అతడు తీవ్రంగా, బహిరంగంగా గద్దించబడుట మేము విన్నాము. ఇప్పుడు, సంఘానికి మరియు ఐరోపాలో ప్రపంచ యుద్ధ సైనికునిగా చాలా అంకితమివ్వబడిన ఈ వ్యక్తి తాను నమ్మిన దాని కొరకు వ్యతిరేకించబడుట మరియు పోరాడుటకు అలవాటుపడినవాడు! ఈ సంఘటన తరువాత అతడి స్పందన ఎలా ఉంటుందని ఒకరు ఆశ్చర్యపడ్డారు. అతడు తన అభిప్రాయముతో పట్టుదలగా ఉండి, ఇదివరకే చేయబడిన నిర్ణయాన్ని వ్యతిరేకించుట కొనసాగిస్తాడా?

మా వార్డులో సువార్తలో బలహీనమైన కుటుంబాలను నేనిదివరకే చూసాను ఎందుకనగా వాళ్ళు నడిపించేవారితో ఏకము కాలేదు. ప్రాథమికలో నా స్నేహితులు అనేకులు వారి యౌవనములో విశ్వాసముగా నిలిచియుండని వారిని నాకైనేను ప్రత్యక్షంగా చూసాము ఎందుకనగా వారి తల్లిదండ్రులు ఎల్లప్పుడు సంఘములో ఉన్నవారితో లోపాలను వెదకుచున్నారు.

అయినప్పటికిని, మా నాన్న, మా సహ పరిశుద్ధులతో ఒకటిగా ఉండుటకు నిర్ణయించుకున్నాడు. కొన్నిరోజుల తరువాత, నిర్మాణములో సహాయపడుటకు వార్డు సభ్యులు సమావేశమవుతున్నప్పుడు, ఏ విధంగానైన సహాయపడుటకు మేము లభ్యమగునట్లు సమావేశము వద్దకు తనను అనుసరించమని మా కుటుంబాన్ని అతడు “ఆహ్వానించాడు!”

నేను కోపంతో ఉన్నాను. “నాన్నా, సభ్యులు దాన్ని చేయటానికి మీరు వ్యతిరేకిస్తే, నిర్మాణములో అసలు మనము ఎందుకు సహాయపడాలి?” అని అడగాలని నాకనిపించింది. కానీ అతడి ముఖముపై చూపు దానిని చేయటానికి నన్ను నిరాశపరచింది. నేను పునఃసమర్పణ కోసం బాగా ఉండాలని కోరాను. అందుచేత, అదృష్టవశాత్తు, నేను మౌనంగా ఉండటానికి మరియు వెళ్ళి, నిర్మాణములో సహాయపడుటకు నిర్ణయించాను!

ఈ పని ముగింపబడకముందే ఆయన చనిపోయాడు కనుక క్రొత్త సంఘ భవనము పూర్తి చేయబడుటను నాన్న చూడలేకపోయాడు. కాని కుటుంబములోని మేము, మా అమ్మచేత నడిపించబడి, అది పూర్తయ్యేవరకు మా వంతు చేయుట కొనసాగించాము, మరియు అది ఆయనతో, సంఘ సభ్యులతో, మా నాయకులతో, మరిముఖ్యంగా ప్రభువుతో మమ్మల్ని ఒకటిగా ఉంచింది!

గెత్సేమనేలో ఆయన సమయానికి కేవలం క్షణాలకు ముందు, యేసు తన అపోస్తులులు మరియు పరిశుద్ధులందరి కొరకు తండ్రికి ప్రార్థిస్తున్నప్పుడు, ఆయన చెప్పాడు, “తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమైయుండవలెను.” 4

సహోదర, సహోదరిలారా, సంఘ సభ్యులు మరియు నాయకులతో ఒకటిగా ఉండుటకు మనము నిర్ణయించినప్పుడు---మనము కలిసి సమావేశమైనప్పుడు, ప్రత్యేకంగా మనము వేరుగా ఉన్నప్పుడు రెండును---మన పరలోక తండ్రి మరియు రక్షకునితో మరింత పరిపూర్ణంగా ఒకటిగా కూడా మనము భావిస్తామని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.