దేవునితో నిలిచియుండుట మరియు గాయమును రూపుమాపుట
తండ్రితో మరియు ఒకరినొకరితో ప్రేమగల సహవాసములోనికి మనల్ని తెచ్చుటకు క్రీస్తుకు శక్తి ఉన్నది.
పరలోకతండ్రిని గూర్చి మన జ్ఞానమును మరియు విధేయతను లోతుగా చేయుటను మనము కొనసాగించాల్సిన అవసరమున్నది. ఆయనతో మన అనుబంధము శాశ్వతమైనది. మనము ఆయన ప్రియమైన పిల్లలము, మరియు అది మారదు. ఆయనకు దగ్గరగా రమ్మన్నఆయన ఆహ్వానమును మనము హృదయపూర్వకంగా ఎలా అంగీకరించగలము మరియు ఆవిధంగా ఈ జీవితంలో మరియు రాబోయే లోకములో ఆయన మనకివ్వాలని ఆపేక్షిస్తున్న దీవెనలను మనము ఆనందించగలము?
ప్రభువు ప్రాచీన ఇశ్రాయేలుకు చెప్పాడు, మరియు ఆయన మనకు చెప్పుచున్నాడు, “శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, గనుక విడువక నీ యెడల కృప చూపుచున్నాను.”1 తండ్రి మాట్లాడినట్లుగా, ఆయన మనతో కూడా చెప్పును, “నీవు నాలో నిలిచియుండుము, మరియు నేను నీలో నిలిచియుందును; కాబట్టి నాతో నడువుము” 2 ఆయనయందు నిలిచియుండునట్లు మరియు ఆయనతో నడుచుటకు తగినంతగా మనము ఆయనను నమ్ముతున్నామా?
ఈ భూమి మీద నేర్చుకోవటానికి మరియు వృద్ధి చెందటానికి మనమిక్కడ ఉన్నాము, మరియు అత్యంత ముఖ్యమైన వృద్ధి మరియు నేర్చుకొనుట పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుతో మన నిబంధన సంబంధము నుండి వచ్చును. వారితో మన విశ్వసనీయమైన అనుబంధము నుండి, దైవిక జ్ఞానము, ప్రేమ, శక్తి మరియు ఇతరులకు సేవ చేయుటకు సామర్ధ్యము వచ్చును.
“దేవుడు తన గురించి బయల్పరచిన సమస్తమును నేర్చుకొనుటకు మనకు బాధ్యత ఉన్నది.”3 తండ్రియైన దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తును మన అభివృద్ధి కొరకు భూమిని సృష్టించుటకు నడిపించాడని, మన రక్షణ కొరకు న్యాయము యొక్క అక్కరలను తీర్చుటకు పరలోక తండ్రి తన కుమారుని ఇచ్చాడని, తండ్రి యొక్క యాజకత్వ శక్తి మరియు మన దీవెనల కొరకు, కుమారుని యొక్క నిజమైన సంఘము అవసరమైన విధులతో పునఃస్థాపించబడిందని మనము తప్పక గ్రహించాలి. మన సంతోషము మరియు అభివృద్ధి కొరకు ఈ సిద్ధపాట్ల ద్వారా కనబరచబడిన ప్రేమ యొక్క లోతును మీరు అనుభవించగలరా? పరలోక తండ్రి యొక్క ప్రణాళిక ఏమనగా సువార్త యొక్క విధులు మరియు చట్టములకు విధేయులమై, నిత్యజీవమును సంపాదించి మరియు దేవుని వలె అగుట అని మనము తెలుసుకోవాల్సినవసరం ఉన్నది. .4 పరలోక తండ్రి మనకిచ్చు నిజమైన, శాశ్వతమైన సంతోషము ఇదే. ఇతర నిజమైన మరియు శాశ్వతమైన సంతోషము ఏదీ లేదు.
ఈ నిజమైన సంతోష గమనమునుండి మనల్ని దూరము చేసే సవాళ్ళతో మనము తరచుగా ఎదుర్కొనబడుచున్నాము. శ్రమలు మనల్ని దీనులుగా చేసి, మనము మోకరించేలా చేయుటకు బదులుగా మనల్ని అంతరాయపరచిన యెడల మనము దేవునితో మన నమ్మకమైన సంబంధమును కోల్పోతాము.
ఈ సాధారణమైన శ్లోకము మన ప్రాధాన్యతలను లెక్కించమని మనల్ని వేడుకొనును:
కొన్ని విషయాలు ముఖ్యమైనవి; కొన్ని ముఖ్యమైనవి కాదు.
కొన్ని విషయాలు శాశ్వతంగా ఉంటాయి, కాని అనేకము ఉండవు. 5
సహోదరీలారా మీకేది ముఖ్యమైనది? మీకేది శాశ్వతమైనది? తండ్రికి శాశ్వతంగా విలువగల ముఖ్యమైన విషయమేదనగా, మనము ఆయనను గూర్చి నేర్చుకొనుట, మనల్ని మనం తగ్గించుకొనుట, మరియు భూలోక అనుభవాల ద్వారా ఆయనకు విధేయతయందు ఎదుగుట. మన స్వార్ధమును సేవలోనికి, మన భయాలు విశ్వాసములోనికి మార్చుకోవాలని ఆయన మనల్ని కోరుచున్నాడు. ఈ శాశ్వతమైన విషయాలు మనకు మిక్కిలి తీవ్రమైన పరీక్షలు కావచ్చు.
ఇది మన మర్త్య పరిమితులతో, ప్రేమించుట అతి కష్టమైనప్పుడు, ప్రేమించమని, సేవ చేయుట అసౌకర్యమైనప్పుడు, మనకు సాధ్యము కాదని మనము అనుకున్నప్పుడు క్షమించమని తండ్రి అడుగుచున్నారు. ఎలా? ఆయన కుమారుని నామములో పరలోక తండ్రి యొక్క సహాయము కొరకు మనఃపూర్వకంగా సమీపించి, మరియు ఆయన సహాయము లేకుండా, గర్వంగా మన స్వంత ఇష్టమును నిర్ణయించుటకు బదులుగా ఆయన విధానములో చేయుట.
లోపలి పాత్రను శుభ్రపరచుట గురించి అధ్యక్షులు ఎజ్రాటాప్ట్ బెన్సన్ మాట్లాడినప్పుడు నా గర్వమును నేను గుర్తించాను.6 నన్ను నేను ఒక పాత్ర వలె ఊహించాను. నా జీవితంలోని గర్వమును నేనేలా తీసివేయగలను? వినయము కలిగియుండుటకు మరియు ఇతరులను ప్రేమించుటకు నన్ను నేను బలవంతం చేసుకొనుట అసమంజసమైనది, శూన్యమైనది మరియు అది కేవలము పనిచేయదు. మన పాపములు మరియు తప్పులు మన సమస్త ప్రేమ యొక్క ఊటయైన మన పరలోక తండ్రికి మనకు మధ్య ఒక గాయమును లేక ఖాళీని సృష్టించును.
రక్షకుని యొక్క ప్రాయశ్చిత్తఃము మాత్రమే మన పాపములనుండి మనల్ని శుద్ధి చేయును మరియు ఆ అంతరమును లేక పగులును పూరించును.
మన పరలోక తండ్రి ప్రేమ యొక్క బాహువులందు చుట్టబడాలని మనము కోరతాము, ఆవిధంగా మనము మొదట ఆయన చిత్తమును ఉంచి, మన పాత్రలోనికి శుభ్రపరచబడిన నీటిని పోయమని నలిగిన హృదయముతో క్రీస్తును వేడుకుంటాము. మొదట అది నెమ్మదిగా రావచ్చు, కాని మనము వెదకి, అడిగినప్పుడు, అది సమృద్ధిగా వచ్చును. ఈ జీవజలము మనల్ని నింపుట ప్రారంభించును మరియు ఆయన ప్రేమతో పొంగిపొరలును, మనము మన ఆత్మ యొక్క పాత్ర కొనను తీసుకొని స్వస్థత, ఆశ, మరియు చేర్చబడాలని ఆపేక్షించు ఇతరులతో మనము పంచుకొనగలము. మన లోపలి కడవ శుభ్రపడినప్పుడు, మన భూలోక అనుబంధాలు స్వస్థపరచబడతాయి.
మన వ్యక్తిగత కార్యక్రమాలను త్యాగము చేయుట, దేవుని యొక్క నిత్య ప్రణాళికల కొరకు స్థలమిచ్చుట అవసరము. తండ్రి కొరకు మాట్లాడిన రక్షకుడు మనతో వేడుకొంటున్నాడు, “నా దగ్గరకు రమ్ము మరియు నేను మీకు దగ్గరగా వస్తాను” 7 తండ్రికి దగ్గరగుట అనగా లేఖనాల ద్వారా ఆయన సత్యమును నేర్చుకొనుట, ప్రవచనత్మాక సలహాను అనుసరించి, మరింత పరిపూర్ణంగా ఆయనను తెలుసుకొనుటకు ప్రయాసపడుట.
తండ్రితో మరియు ఒకరినొకరితో ప్రేమగల సహవాసములోనికి మనల్ని తెచ్చుటకు క్రీస్తుకు శక్తి ఉన్నదని మనము గ్రహించామా? పరిశుద్ధాత్మ వరము ద్వారా ఆయన, అనుబంధాలకు అవసరమైన పరిజ్ఞానమును మనకు ఇవ్వగలడు.
ప్రాధమిక బోధకులు ఒకరు తన 11 సంవత్సరాల వయస్సుల బాలుర తరగతితో కలిగిన శక్తివంతమైన అనుభవము గురించి నాతో చెప్పాడు. వారిలో ఒకరు నేను జిమ్మీ అని పిలుస్తాను, అతడు తరగతిలో సహకరించని ఒంటరివాడు. ఒక ఆదివారము, అతడు తన పాఠమును ప్రక్కన పెట్టి, తాను జిమ్మీని ఎందుకు ప్రేమిస్తున్నాడో చెప్పాలని ప్రేరేపించబడ్డాడు. అతడు ఈ చిన్నవాని యందు తన కృతజ్ఞత మరియు తన నమ్మకము గురించి మాట్లాడాడు. తరువాత బోధకుడు తరగతి సభ్యులను అతడి గురించి వారు ప్రశంసించేది ఏదైనా చెప్పమని అడిగాడు. తరగతి సభ్యులు ఒకరి తరువాత ఒకరు జిమ్మీ వారికి ఎందుకు ప్రత్యేకమైన వాడో చెప్పినప్పుడు, ఆ బాలుడు తన తల క్రిందకు దించుకున్నాడు మరియు అతడి ముఖము క్రిందుగా కన్నీళ్ళు కారసాగాయి. ఈ బోధకుడు మరియు తరగతి జిమ్మీ యొక్క ఒంటరి హృదయానికి ఒక వారధి కట్టారు. సాధారణమైన ప్రేమ, నిజాయతీగా వ్యక్తపరచబడి, ఇతరులకు నిరీక్షణ మరియు ప్రేమను ఇచ్చును. నేను దీనిని “గాయమును రూపుమాపుట” అని పిలుస్తాను.
బహుశా మన జీవితంలో ప్రియమైన మర్త్యత్వమునకు ముందు ప్రపంచములోమన జీవితము, ఇక్కడ భూమిపై నిజమైన, శాశ్వతమైన ప్రేమ కొరకు మనము ఆపేక్షించుటకు కారణము. ప్రేమనిచ్చుటకు మరియు ప్రేమించబడుటకు, మనము దైవికంగా ఏర్పరచబడ్డాము, మనము దేవునితో ఉన్నప్పుడు లోతైన ప్రేమ కలుగును. మోర్మన్ యొక్క గ్రంథము “క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా (దేవునితో) సమాధానపడుడి”8 అని మనల్ని ఆహ్వానిస్తున్నది.
ఉపవాసము యొక్క చట్టము విశ్వసనీయంగా జీవించువారి గురించి యెషయా మాట్లాడాడు, ఆవిధంగా వారు తమ స్వంత సంతతికి “గాయమును రూపుమాపువారు.” వారు “పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను కట్టెదరు,”9 అని యెషయా వాగ్దానమిచ్చును. అదేవిధంగా, మనకు, పరలోక తండ్రికి మధ్య గాయమును రక్షకుడు బాగుచేస్తాడు. ఆయన తన గొప్ప ప్రాయశ్చిత్తః త్యాగము ద్వారా దేవుని యొక్క గొప్ప ప్రేమలో పాలుపంచుకొనుటకు మరియు మన వ్యక్తిగత జీవితాలలో “పాడైన స్థలములను” బాగుచేయుటకు మనకు మార్గము తెరచును. ఒకరినొకరి నుండి భావావేశ వేర్పాటును స్వస్థపరచుటకు దేవుని ప్రేమ యొక్క అంగీకారము, మన సహజమైన స్వార్ధము మరియు భయంకరమైన ధోరణులను త్యాగము చేయుటతో జతపరచబడవలెను.
ఒక మరపురాని రాత్రి, ఒక బంధువు మరియు నేను ఒక రాజకీయ సమస్య గురించి ఏకీభవించలేదు. ఆమె త్వరగా మరియు సమగ్రంగా నా వాఖ్యానాలను విమర్శించింది మరియు కుటుంబ సభ్యులు వినేంత దూరములో నేను తప్పని రుజువు చేస్తూ వాదించింది. నేను అవివేకంగా, తెలియని దానిలా భావించాను---మరియు బహుశా నేను కావచ్చు. ఆ రాత్రి ప్రార్థించుటకు నేను మోకరించినప్పుడు, ఈ బంధువురాలు ఎంత కష్టమైనదో వివరించుటకు నేను త్వరపడ్డాను! నేను మాట్లాడుట కొనసాగించాను. బహుశా నేను నా ఫిర్యాదును ఆపియుండవచ్చు, మరియు నా ఆసక్తిని పొందటానికి పరిశుద్ధాత్మకు అవకాశము కలిగియుండవచ్చు---ఎందుకనగా నా ఆశ్చర్యానికి, “నేను ఆమెను ప్రేమించాలని బహుశా మీరు కోరవచ్చు,” అని నాకై నేను చెప్పుట విన్నాను. ఆమెను ప్రేమించాలా? “ఆమెను నేను ఎలా ప్రేమించాలి? ఆమెను ఇష్టపడతానని కూడా నేను అనుకోవటం లేదు. నా హృదయము కఠినంగా ఉంది; నా భావాలు గాయపరచబడినవి. నేను దానిని చేయలేను.”
అప్పుడు, ఆత్మ నుండి సహాయముతో, నేను దీనిని చెప్పినప్పుడు నాకొక క్రొత్త ఆలోచన కలిగింది, “కానీ పరలోక తండ్రి మీరామెను ప్రేమిస్తున్నారు. ఆమె కొరకు మీకు గల ప్రేమలో కొంత భాగము మీరు నాకిస్తారా---ఆవిధంగా నేను కూడా ఆమెను ప్రేమించగలను” ? నా కఠినమైన భావాలు మృదువుగా చేయబడినవి, నా హృదయము మారుట ప్రారంభమైంది, మరియు నేను ఈ వ్యక్తిని వేరుగా చూడసాగాను. పరలోక తండ్రి చూసిన ఈ వ్యక్తి యొక్క నిజమైన విలువను మరియు మంచితనమును నేను గ్రహించసాగాను. “ప్రభువు తన జనుల గాయములను కట్టి వారి దెబ్బను బాగుచేయును.” 10
కాలక్రమేణా మా మాధ్య ఖాళీ సంతోషంగా మూయబడింది. కానీ ఆమె నా మార్పు చెందిన హృదయాన్ని అంగీకరించనప్పటికిని ఆయన సహాయము కొరకు మనము వేడుకొనిన యెడల, కఠినమైనవారని మనము అనుకున్న వారిని కూడా ప్రేమించుటకు పరలోక తండ్రి మనకు సాధ్యపరుస్తారని నేను నేర్చుకున్నాను. రక్షకుని యొక్క ప్రాయశ్చిత్తఃము మన పరలోక తండ్రి నుండి దాతృత్వము యొక్క నిరంతర ప్రవాహము కొరకు మధ్యవర్తి. అందరి కొరకు దాతృత్వమును కలిగియుండుటకు బదులుగా మనము ఈ ప్రేమను అంగీకరించి, మరియు దానిలో నిలిచియుండుటకు ఎన్నుకోవాలి.
తండ్రికి మరియు కుమారునికి మన హృదయాన్ని మనము ఇచ్చినప్పుడు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు మారనప్పటికిని, మన ప్రపంచాన్ని మనము మారుస్తాము. మనము పరలోక తండ్రికి దగ్గర అవుతాము మరియు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులుగా ఉండుటకు మన ప్రయత్నాలను ఆయన మృదువుగా అంగీకరించుటను మనము అనుభూతిచెందుతాము. మన వివేచన, నమ్మకము మరియు విశ్వాసము పెరుగుతాయి.
ఈ ప్రేమ కొరకు హృదయము యొక్క సమస్త శక్తితో ప్రార్థించమని మోర్మన్ మనకు చెప్పుచున్నాడు మరియు దాని ఆధారమైన---పరలోక తండ్రి నుండి అది మనకు దయచేయబడును.11 అప్పడు మాత్రమే మనము భూలోక సంబంధాల గాయములను రూపుమాపు వారిగా కాగలము.
మన తండ్రి యొక్క అంతములేని ప్రేమ, ఆయన మహిమ, సంతోషమునకు మనల్ని తిరిగి తెచ్చుటకు మనల్ని సమీపించును. మనకు, ఆయనకు మధ్య గాయమును రూపుమాపుటకు ఆయన తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తునిచ్చాడు. పరలోకమందున్న తండ్రితో పునఃకలయక శాశ్వతమైన ప్రేమ మరియు నిత్య ఉద్దేశము యొక్క సారము. నిజముగా ముఖ్యమైనది ఏదో నేర్చుకొనుటకు, ఆయన ప్రేమించినట్లుగా ప్రేమించుటకు మరియు ఆయన వలె ఎదుగుటకు ఇప్పుడే ఆయనతో మనము అనుసంధానము చేసుకోవాలి. పరలోక తండ్రి మరియు రక్షకునితో మన విశ్వసనీయమైన సంబంధము వారికి, మనకు శాశ్వతంగా ముఖ్యమైనదని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో ఆమేన్.