2010–2019
మీ సంతోషము పరిపూర్ణము కావలెనని
అక్టోబర్ 2017


2:3

మీ సంతోషము పరిపూర్ణము కావలెనని

యేసు క్రీస్తు సమస్త స్వస్థత, శాంతి, మరియు నిత్య పురోభివృద్ధి యొక్క ఆధారముగా ఉన్నాడు.

సహోదర, సహోదరిలారా, మీతో ఉండుట ఆనందకరమైనది. ఈ ఉదయకాలము నేను మీతో మాట్లాడాలని కోరేది అదే----సంపూర్ణమైన సంతోషమును కలిగియుండుట.

“విపత్తులు రాజ్యమును (మరియు) ప్రపంచమును ఊపేసాయి”1 అని ఇటీవల వార్తల ముఖ్య శీర్శిక చదవబడింది. తుఫానులు మరియు వరదల నుండి ఉష్ణధృవాలు, కరవుల వరకు, అడవిమంటలు మరియు భూకంపాలనుండి, యుద్ధములు మరియు నాశనకరమైన వ్యాధుల వరకు, “సమస్త భూమి కల్లోలములో ఉన్నది.”2

మిలియన్ల జనులు నిర్వాసితులయ్యారు, మరియు లెక్కలెనన్ని జీవితాలు ఈ సవాళ్ళచేత అంతరాయపరచబడ్డాయి. కుటుంబాలు మరియు సమాజాలలో వివాదము మరియు భయము, అనుమానము, మరియు నెరవేర్చబడని ఆశలతో లోపల పోరాటములు కూడ మనల్ని సంక్షోభంలో వదలుతాయి. జీవితపు ఉద్దేశమని లీహై బోధించిన సంతోషమును అనుభవించుట కష్టమైనది కాగలదు. .3 మనమందరము కొన్నిసార్లు అడిగియున్నాము, “శాంతి కొరకు నేను ఎక్కడికి తిరిగెదను? నా ఓదార్పు ఎక్కడున్నది  . . . ?”4 “మర్త్య జీవితంలో కష్టములు ఎదురైనప్పటికిని నేను సంతోషమును ఎలా కనుగొనగలను?”

జవాబు చాలా సర్వసాధారణమైనదిగా కనబడవచ్చు, కాని అది ఆదాము దినములనుండి నిజమైనదిగా రుజువు చేయబడింది. మన రక్షకుడైన యేసు క్రీస్తుపై దృష్టిసారించుట మరియు ఆయన ద్వారా రుజువు చేయబడి మరియు బోధింపబడిన సువార్తను జీవించుటలో శాశ్వతమైన ఆనందము కనుగొనబడును. మనము మరింతగా యేసు క్రీస్తును గూర్చి తెలుసుకొని,విశ్వాసము కలిగియుండి, అనుకరించే కొద్దీ, ఆయన సమస్త స్వస్థత, శాంతి, మరియు నిత్య పురోభివృద్ధి యొక్క ఆధారముగా ఉన్నాడని మనము ఎక్కువగా తెలుసుకోగలుగుతాము. ఆయన వద్దకు రమ్మని ఆయన మనలో ప్రతిఒక్కరిని ఆహ్వానిస్తున్నారు, 5 ఆ ఆహ్వానమును అధ్యక్షులు హెన్రీ  బి. ఐరింగ్ “ఎవరైన అంగీకరించగల అత్యంత ముఖ్యమైన ఆహ్వానము” 6 అని వర్ణించారు.

యేసు క్రీస్తును గూర్చి నేర్చుకొనుము

మనము ఆయన వద్దకు ఎలా వస్తాము? గత ఏప్రిల్, అధ్యక్షులు రస్సెల్  ఎమ్. నెల్సన్ మరియు ఎల్డర్  ఎమ్. రస్సెల్ బల్లార్డ్ రక్షకుని గురించి నేర్చుకొనుటలో భాగంగా, “జీవముగల క్రీస్తు” 7 చదవమని మనల్ని ప్రోత్సహించారు. అనేకమంది సవాలును అంగీకరించి దీవించబడ్డారు. కొంతకాలం క్రితం, ఒక ప్రియమైన స్నేహితురాలు ప్రతీ వాక్యమును ఉదహరించు సువార్త చిత్రములతో కూడిన పత్రము యొక్క ప్రతులను తన పిల్లలు ప్రతిఒక్కరికి ఇచ్చింది. ఆమె తన మనుమలు దానిని గ్రహించి మరియు కంఠస్తము చేయుటకు వారికి సహాయపడమని ఆమె తన పిల్లలను ప్రోత్సహించింది. కొంతకాలము తరువాత, ఆమె తన ఆరు సంవత్సరాల మనుమరాలు లేనీ ఉత్సాహముతో, చక్కగా నిలబడి, తాను కంఠస్తము చేసిన పాఠాంతరమును చెప్పు వీడియోను చూపించింది. ఒక ఆరు సంవత్సరాల వయస్సుగలది చేసిన యెడల, నేను కూడ చేయగలను!

 “జీవముగల క్రీస్తు” కంఠస్తము చేసిన లేనీ

మరింత దృష్టి పెట్టి, నిబద్ధతతో యేసు క్రీస్తు యొక్క జీవితము మరియు బోధనలను జ్ఞాపకమునకు “జీవముగల క్రీస్తు” నేను చదివినప్పుడు, మన రక్షకుని కొరకు నా కృతజ్ఞత మరియు ప్రేమ వృద్ధిచెందాయి. ప్రేరేపించబడిన పత్రము ప్రతీ వాక్యము ఒక ప్రసంగమును కలిగియున్నది మరియు ఆయన దైవిక పాత్రలు మరియు భూలోక మిషను గురించి నా జ్ఞానమును హెచ్చించును. అధ్యయనము మరియు ప్రతిఫలించుటకు గడిపిన ఈ సమయము ద్వారా నేను నేర్చుకొన్నది, మరియు అనుభూతి చెందినది ఏమనగా, యేసు నిజముగా “లోకము యొక్క వెలుగు, జీవము మరియు నిరీక్షణ అయి ఉన్నాడు,” ”8 అని నిర్ధారించును. ప్రాచీన లేఖనము మరియు కడవరి దిన ప్రవక్తలు వ్రాసిన మాటలు లేక ఆయనను స్తుతిస్తూ మాట్లాడిన మాటలు “ఆయన మార్గము, ఈ జీవితంలో సంతోషము మరియు రాబోయే లోకంలో నిత్య జీవమునకు నడిపించును”9అని సాక్ష్యమును వహించును.

యేసు క్రీస్తునందు విశ్వాసము కలిగియుండుము

క్రీస్తు యొక్క జీవితమును మరియు బోధనలను లెక్కలేనన్ని విధాలుగా మీరు చదివినప్పుడు, ఆయనయందు మీ విశ్వాసము హెచ్చగును. ఆయన మిమ్మల్ని వ్యక్తిగతంగా ప్రేమిస్తున్నారని మరియు పరిపూర్ణంగా అర్థము చేసుకుంటారని మీరు తెలుసుకుంటారు. ఆయన 33 సంవత్సరాల మర్త్య జీవితంలో, ఆయన తిరస్కారమును, హింస, శారీరక ఆకలి, దాహము, మరియు అలసట, 10 ఒంటరితనమును, భాష మరియు శారీరక దూషణను మరియు చివరిగా పాపులైన మనుష్యుల చేతులలో కష్టమైన వేదనను అనుభవించాడు.11 గెత్సేమనే వనములో మరియు కల్వరి సిలువపై, ఆయన మన బాధలు, ఇబ్బందులు, శోధనలు, వ్యాధులు, మరియు బలహీనతలను అనుభవించాడు. .12

మనము దేనిని భరించినప్పటికిని, ఆయనే స్వస్థత యొక్క ఆధారము. ఏ విధమైన దూషణ, నాశనకరమైన నష్టము, దీర్ఘకాల వ్యాధి లేక బలహీనపరచు బాధ, అసత్యమైన నిందలు, దుర్మార్గపు హింస, లేక పాపము నుండి ఆత్మీయ నష్టము లేక అపార్ధము అన్నియు లోక విమోచకుని చేత స్వస్థపరచబడగలవు. అయినప్పటికిని, ఆహ్వానము లేకుండా ఆయన ప్రవేశించరు. మనము ఆయన వద్దకు వెళ్ళాలి మరియు ఆయన అద్భుతములు పనిచేయుటకు మనము ఆయనను అనుమతించాలి.

ఒక అందమైన వసంతకాల దినమున, తాజా గాలిని ఆస్వాదించటానికి నేను తలుపు తెరచి ఉంచాను. తెరచి ఉంచిన తలుపులోనికి ఒక చిన్న పక్షి ఎగిరి వచ్చింది, తరువాత తాను ఉండాల్సిన చోటు ఇది కాదని గ్రహించింది. అది నిరాశగా గది చుట్టూ ఎగిరింది, తప్పించుకోవటానికి ప్రయత్నములో కిటికీ గాజు లోనికి ఎగరటానికి పలుమార్లు ప్రయత్నించింది. తెరవబడిన తలుపువైపు నడిపించటానికి దానిని మృదువుగా ప్రయత్నించాను, కానీ అది భయపడింది మరియు పారిపోసాగింది. నిర్ఘాంతపోయిన అలసటతో అది కిటికీ తెరలపై వాలింది. నేను చీపురు తీసుకొని, దాని క్రింద భాగాన్ని పక్షి భయంతో నిలిచిన చోట ఉంచాను. చీపురు తల భాగాన్ని దాని పాదాల వద్ద ఉంచినప్పుడు, పక్షి తాత్కాలికంగా వెంట్రుకలపై అడుగు పెట్టింది. నెమ్మదిగా, చాలా నెమ్మదిగా, చీపురును నాకు సాధ్యమైనంత స్థిరంగా పట్టుకొంటూ, నేను తలుపు తెరచాను. మేము తెరవబడిన తలుపును చేరిన వెంటనే, పక్షి త్వరగా స్వేచ్ఛలోనికి ఎగిరింది.

పక్షివలే, కొన్నిసార్లు మనము నమ్మటానికి భయపడతాము ఎందుకనగా మనము దేవుని యొక్క సంపూర్ణమైన ప్రేమను మరియు మనకు సహాయపడాలనే కోరికను గ్రహించము. కాని మనము పరలోక తండ్రి యొక్క ప్రణాళిక మరియు యేసు క్రీస్తు యొక్క మిషనును అధ్యయనము చేసినప్పుడు, వారి ఏకైక ఉద్దేశము మన నిత్య ఉనికి మరియు అభివృద్ధి అని మనము గ్రహిస్తాము.13 మనము అడిగి, వెదకి, మరియు తట్టినప్పుడు మనకు సహాయపడటానికి వారు సంతోషిస్తున్నారు.14 మనము విశ్వాసమును సాధన చేసి మరియు వారి జవాబులకు మనల్ని మనము బాహాటపరచినప్పుడు, మన అపార్ధములు మరియు ఊహల నిర్భందముల నుండి స్వతంత్రులమవుతాము, మరియు ముందుకు మార్గమును మనము చూపబడతాము.

యేసు క్రీస్తు శాంతి యొక్క ఆధారము కూడా. “(ఆయన) బలముపై ఆధారపడుటకు”15 మనల్ని ఆహ్వానిస్తున్నాడు మరియు “సమస్త జ్ఞానమును మించిన . . సమాధానమును,  ”15 వాగ్దానమిస్తున్నాడు, అది మనల్ని చుట్టుముట్టిన సవాళ్ళను లక్ష్యపెట్టకుండా ఆయన ఆత్మ “మన ఆత్మలతో సమాధానమును మాట్లాడినప్పుడు,”15 వచ్చు భావన. అవి వ్యక్తిగత ప్రయాసలు, కుటుంబ ఇబ్బందులు, లేక సమాజ సంక్షోభాలు అయినప్పటికిని, మన బాధపడుతున్న ఆత్మలను ఉపశమనపరచుటకు దేవుని యొక్క అద్వితీయునికి శక్తి ఉన్నదని మనము నమ్మినప్పుడు, శాంతి కలుగును.

 క్రోయేషియాలో ఒక సభ్యురాలు స్నజెజానా పాడ్వింస్కి

క్రోయేషియాలో పరిశుద్ధులలో కొద్దిమంది సభ్యులలో ఒకరైన స్నజెజానా పాడ్వింస్కి, గత సంవత్సరము ఆమె భర్త మరియు ఆమె తల్లిదండ్రులిరువురు ఆరు నెలలో తేడాలో చనిపోయారు, కాని కుటుంబాలు శాశ్వతమనే సాక్ష్యమును కలిగియుండి, ఆమె దేవాలయమునకు ప్రయాణించుటకు తాను పొదుపు చేసిన సమస్తమును ఉపయోగించింది. దేవాలయములో గడిపిన ఆ రోజులు తన జీవితంలో ప్రముఖ సంఘటన అని ఆమె పంచుకొన్నది. యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తఃము గురించి తన దృఢమైన సాక్ష్యము వలన, ఆమె శాంతిని అనుభూతిచెందింది మరియు తన చుట్టూ ఉన్నవారికి బలముగా ఉన్న స్వస్థతను అనుభవించింది.

యేసు క్రీస్తునందు విశ్వాసము స్వస్థత మరియు శాంతి కన్నా ఇంకా ఎక్కువ బహుమానములను తెచ్చును. అధ్యక్షులు హెన్రీ  బి. ఐరింగ్ చెప్పినట్లుగా: “నాకు శాంతి అవసరమైనప్పుడు ప్రభువు అనేక విధాలుగా ఆదరణకర్తతో నన్ను దర్శించిన విధానము కొరకు నేను కృతజ్ఞత కలిగియున్నాను. అయినప్పటికిని మన పరలోకమందున్న తండ్రి మన ఆదరణ గురించి మాత్రమే చింతించుటలేదు కాని మన పైకి పురోగతి గురించి కూడా చింతిస్తున్నాడు.” 18

విమోచన మరియు పునరుత్థానము యొక్క వరములు కలిపి యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తఃము వలన, మనము పశ్చాత్తాపపడగలుగుతున్నాము, మారగలము,నిత్యముగా పురోగతి చెందగలము. మనము విధేయులుగా ఉన్నప్పుడు ఆయన మనకిచ్చు శక్తి వలన, మన స్వంతంగా ఎప్పటికీ మనము కాగలదానికన్నా ఎక్కువగా కాగలము. ఎలాగో మనము పూర్తిగా గ్రహించలేకపోవచ్చు, కానీ మనలో ప్రతిఒక్కరు క్రీస్తునందు విశ్వాసము ఎక్కువగుటను భావించువారు, మన దైవిక గుర్తింపు మరియు ఉద్దేశమును గూర్చి మన అవగాహనను కూడా పొందుతారు, ఆ జ్ఞానముతో ఏకరీతిగల ఎంపికలను చేయుటకు మనల్ని నడిపించును.

“కేవలము జంతువుల,”19 స్థాయికి మనల్ని క్రిందకు నెట్టివేయు ప్రపంచమును లక్ష్యపెట్టకుండా, దేవుడు మన తండ్రి అని ఎరుగుట మనము దైవిక సాధ్యతను మరియు రాజ్యపు వాగ్దానమును కలిగియుండుటకు మనకు భరోసా ఇస్తుంది. ఈ జీవితం మలుపులేని ముగింపని లోకము మనకు చెప్పినప్పటికిని, దేవుని యొక్క అద్వితీయ కుమారుడు విమోచింపబడుటకు మరియు పునరుత్థానము చెందుటకు మనకు సాధ్యపరచెనని తెలుసుకొనుట నిత్య పురోగతి కొరకు మనకు నిరీక్షణను ఇచ్చును.

యేసు క్రీస్తును అనుకరించుట

యేసు క్రీస్తు గురించి మనము ఎక్కువగా నేర్చుకొన్నప్పుడు, మనము ఆయనయందు గొప్ప విశ్వాసమును వృద్ధి చేస్తాము మరియు సహజంగానే ఆయన మాదిరిని అనుసరించాలని కోరతాము. ఆయన ఆజ్ఞలు పాటించుట మన గొప్ప కోరిక అవుతుంది. ఆయన చేసినట్లుగా ఇతరుల బాధలను విడిపించుటకు మన హృదయాలు ఆపేక్షిస్తాయి, మరియు మనము కనుగొన్న శాంతి మరియు సమాధానమును వాళ్ళు అనుభవించాలని మనము కోరతాము.

ఆయన చేసినట్లుగా చేయుటకు ప్రయత్నించుట ఎందుకు శక్తివంతమైనది మన విశ్వాసమును మనము ఆచరణలో ఉంచినప్పుడు, పరిశుద్ధాత్మ నిత్య సత్యము యొక్క సాక్ష్యమును వహించును.20 ఆయన ఆజ్ఞలను పాటించమని యేసు తన శిష్యులకు ఉపదేశించెను ఎందుకనగా మనము ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు, మనము సంతోషమును అనుభవించుటను ప్రారంభిస్తాము, మరియు ఆయన మనము మార్గముపై కొనసాగించినప్పుడు, మనము సంపూర్ణ సంతోషమును అనుభవిస్తామని ఆయన ఎరుగును. “మీ యందు, నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను” 21 అని ఆయన వివరించాడు.

మన సాక్ష్యములు యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త యొక్క గట్టి రాతి పునాదిపై కట్టబడినవా? జీవితపు తుఫానులు మనపై ఒత్తిడి చేసినప్పుడు, సహాయము కొరకు ఎలా అన్న పుస్తకము లేక ఇంటర్నెట్‌ను మనము పిచ్చిగా వెదకుతామా? యేసు క్రీస్తును గూర్చి మన జ్ఞానమును మరియు సాక్ష్యమును కట్టుటకు మరియు బలపరచుటకు సమయాన్ని తీసుకొనుట శ్రమ మరియు దుర్దశ కాలములలో గొప్ప ప్రతిఫలాలను ఇచ్చును. ప్రతీరోజు లేఖనాలను చదువుట మరియు జీవిస్తున్న ప్రవక్తల మాటలను ధ్యానించుట, అర్ధవంతమైన వ్యక్తిగత ప్రార్థనలో నిమగ్నమగుట, ప్రతీవారము జాగ్రత్తగా సంస్కారములో పాల్గొనుట, రక్షకుడు చేసినట్లుగా సేవ చేయుట---ఈ సరళమైన కార్యక్రమాలలో ప్రతీఒక్కటీ సంతోషకరమైన జీవితానికి పునాది అవుతుంది.

సంతోషమును ఏదీ తెస్తుంది? ఒక సుదీర్ఘమైన రోజున మీ ప్రియమైన వారిని చూచుటా? ఉద్యోగము బాగా చేసారని సంతృప్తా? వేరొకరి భారమును మీరు పంచుకొన్నప్పుడు వారి కన్నులలో వెలుగా? ఒక కీర్తన యొక్క పదములు మీ హృదయములో లోతుగా చేరినప్పుడా? ఒక సన్నిహిత స్నేహితుని కరచాలనమా? మీ దీవెనలపై ప్రతిఫలించుటకు ఒక ఏకాంత క్షణము తీసుకొనుము, మరియు అప్పుడు వాటిని పంచుకొనుటకు విధానాలు కనుగొనుము. సేవ చేయుటకు మరియు మీ పొరుగున ఉన్న లేక ఎంతగానో కల్లలోలము ఉన్న ఈ ప్రపంచమంతటా ఉన్న మీ సహోదర, సహోదరీలను పైకెత్తుటను మీరు సమీపించినప్పుడు, గొప్ప శాంతిని, స్వస్థతను, మరియు పురోభివృద్ధిని కూడా మీరు అనుభవిస్తారు.

ఆయన వద్దకు రండి. యేసు క్రీస్తుపై మీ జీవితమును కేంద్రీకరించినప్పుడు, మీ పరిస్థితులు ఏమైనప్పటికిని, వాటిలో సంతోషమును మీరు కనుగొంటారని నేను సాక్ష్యమిస్తున్నాను. వాస్తవానికి, “ప్రభువు ఒకేఒక్కడు,” 22 జవాబు. శ్రద్ధగా చదువుట, ఆయనయందు గొప్ప విశ్వాసమును వృద్ధి చేయుట, మరియు ఆయనవలె ఎక్కువగా అగుటకు ప్రయత్నించుటకు సమయాన్ని చేయుము మరియు సమయాన్ని తీసుకొనుము. మనము ఆవిధంగా చేసినప్పుడు, చిన్న లేనీతో కలసి, మనము కూడా ఇలా చెప్పుటకు కదిలించబడతాము, “ఆయన దైవిక కుమారుని సాటిలేని వరము కొరకు దేవునికి కృతజ్ఞత చెల్లించబడాలి.” 23 యేసు క్రీస్తు యొక్క ఆశీర్వదించబడిన పరిశుద్ధ నామములో, ఆమేన్.