దేవుని యొక్క ఖచ్చితమైన సాక్ష్యము: మోర్మన్ గ్రంథము
మోర్మన్ గ్రంథము యేసు క్రీస్తు యొక్క దైవత్వమును గూర్చి, జోసెఫ్ స్మిత్ యొక్క ప్రవచనాత్మక పిలుపు, మరియు ఈ సంఘము యొక్క సంపూర్ణమైన సత్యమును గూర్చి దేవుని యొక్క ఖచ్చితమైన సాక్ష్యము.
మోర్మన్ గ్రంథము మన మతము యొక్క మూలరాయి మాత్రమే కాదు, కానీ, అది మన సాక్ష్యముల యొక్క మూలరాయి కూడా అవుతుంది, ఆవిధంగా శ్రమలు లేక జవాబివ్వబడిన ప్రశ్నలు మనల్ని ఎదుర్కొన్నప్పుడు, అది మన సాక్ష్యమును భద్రముగా స్థానములో ఉంచును. సత్యము యొక్క త్రాసుపై ఈ గ్రంథము ఒక బరువు విమర్శకుల యొక్క జతపరచబడిన వాదనలను అధిగమించును. ఎందుకు? అది సత్యమైతే, అప్పుడు జోసెఫ్ స్మిత్ దేవుని యొక్క ప్రవక్త మరియు వ్యతిరేకంగా ఏ చారిత్రాత్మకమైన లేక ఇతర వివాదములను లక్ష్యపెట్టకుండా, ఇది యేసు క్రీస్తు యొక్క సంఘము. ఈ కారణము వలన, విమర్శకులు మోర్మన్ గ్రంథము యొక్క దైవిక మూలమును ఖండించుటకు ఉద్దేశిస్తున్నారు, కానీ ఈ గ్రంథము సత్యము కనుక వారు ఎదుర్కొను అడ్డంకులు అధిగమించలేనివి.
మొదట, విమర్శకులు 23 సంవత్సరాల వ్యవసాయ బాలుడు, పరిమితమైన విద్యతో, ప్రత్యేకమైన వందల పేర్లు మరియు స్థలములతో, అదేవిధంగా వివరణాత్మక కథలను మరియు సంఘటనలను ఎలా సృష్టించాడో వివరించాలి. తదనుగుణంగా, అనేకమంది విమర్శకులు అతడు మోర్మన్ గ్రంథములో చారిత్రక విషయమును సృష్టించుటకు విస్తారమైన గ్రంథాలు మరియు ఇతర స్థానిక వనరులపై ఆధారపడిన అతడు సృజనాత్మక మేథావి అని ప్రతిపాదించారు. కాని వారి ప్రకటనలకు విరుద్ధముగా, ఆ అనువాదము ప్రారంభం కాకముందు ఈ ఆరోపించబడిన వనరులలో దేనినైనా జోసెఫ్ ఉపయోగించటం చూసామని చెప్పిన ఒక్క సాక్షి ఎవరూలేరు.
ఈ వాదన నిజమైతే కూడా మోర్మన్ గ్రంథము యొక్క ఉనికిని వివరించుటకు మిక్కిలిగా సరిపోదు. ఒకరు ఈ ప్రశ్నకు కూడా జవాబివ్వాలి: జోసెఫ్ అనువదించినప్పుడు, అతడు ఏదైనా వివరాలు వ్రాయలేదు కనుక, ఈ ఆరోపించబడిన వనరులను జోసెఫ్ ఎలా చదివాడు, అసంబద్ధమైన వాటిని ఎలా వడపోసాడు, ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎప్పుడు, క్రమబద్ధతను ఎలా కాపాడుకున్నాడు, మరియు పరిపూర్ణమైన జ్ఞాపకముతో దానిని ఎలా వివరించాడు? జోసెఫ్ అనువదించినప్పుడు, అతడు ఏవిధమైన వివరణలను కలిగిలేడు. వాస్తవానికి, అతడి భార్య గుర్తుచేసుకున్నది: “అతని వద్ద లిఖిత ప్రతి లేదు లేక చదవటానికి పుస్తకము లేదు. . . . అటువంటిది ఏదైనా అతడి వద్ద ఉంటే, దానిని అతడు నా వద్దనుండి దాయడు.” 1
ఏ వివరణలు లేకుండా జోసెఫ్ 500 పైగా పేజీలను చెప్పి వ్రాయించే అసాధారణమైన సాహస కృత్యమును ఎలా చేసాడు? ఆవిధంగా చేయుటకు, అతడు సృజనాత్మక మేధావి మాత్రమే కాదు కాని అపూర్వమైన పరిపూర్ణమైన జ్ఞాపకాన్ని కూడా కలిగియుండాలి. కాని అది నిజమైతే, అతడి విమర్శకులు ఈ అసాధారణమైన ప్రతిభపై ఎందుకు దృష్టిసారించలేదు?
కాని ఇంకా అధికమున్నది. ఈ వాదనలు గ్రంథము యొక్క చారిత్రక విషయానికి మాత్రమే పరిగణించబడతాయి. నిజమైన వివాదాలు ఇంకా ఉన్నాయి: ఆత్మను సమృద్ధిగా అనుభవించునట్లు చేయు గ్రంథమును జోసెఫ్ ఎలా ఉత్పత్తి చేసాడు, మరియు అటువంటి లోతైన సిద్ధాంతమును అతడు ఎక్కడనుండి పొందాడు, దానిలో అనేకము అతడి కాలములో క్రైస్తవ నమ్మకాలను స్పష్టపరచి లేక వ్యతిరేకించును?
ఉదాహరణకు, ఆదాము యొక్క పతనము, అభివృద్ధికి మెట్టు అని మోర్మన్ గ్రంథము బోధించును. అది బాప్తీస్మము వద్ద చేయబడిన నిబంధనలను బయల్పరచును, అది బైబిలులో చెప్పబడలేదు.
అదనముగా, క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తఃము వలన, ఆయన మనల్ని శుద్ధి చేయటమే కాదు కాని మనల్ని పరిపూర్ణులుగా చేయగలరనే శక్తివంతమైన అంతర్ జ్ఞానము జోసెఫ్‌కు ఎక్కడ నుండి వచ్చింది? అల్మా- 32లో విశ్వాసముపై అద్భుతమైన ప్రసంగమును అతడు ఎక్కడనుండి పొందాడు? లేక రక్షకుని ప్రాయశ్చిత్తః త్యాగముపై రాజైన బెంజిమన్ ప్రసంగము, బహుశా సమస్త లేఖనములో, మిక్కిలి అసాధారణమైన ప్రసంగము? లేక ఓలీవ వృక్షము యొక్క రూపకాలంకారము దాని సంక్లిష్టత మరియు సమృద్ధియైన సిద్ధాంతముతో? ఈ రూపకాలంకారమును నేను చదివినప్పుడు, దాని భావనలను అనుసరించుటకు నాకు రేఖాచిత్రము కావాలి. ఏవిధమైన వివరణలు లేకుండా జోసెఫ్ స్మిత్ తన స్వంత ఆలోచనలతో చెప్పి వ్రాయించాడని మనమిప్పుడు నమ్మాలా?
అటువంటి ముగింపుకు వ్యతిరేకంగా, దాని యొక్క మహోన్నతమైన సిద్ధాంత సత్యములు ప్రత్యేకంగా యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తఃముపై అపూర్వమైన ప్రసంగముల ద్వారా చూపబడినట్లుగా, మోర్మన్ గ్రంథము అంతటా దేవుని యొక్క ప్రభావము రుజువు చేయబడుట కనుగొనబడును.
జోసెఫ్ ఒక ప్రవక్త కాని యెడల, అప్పుడు దీనికి మరియు అనేక ఇతర అసాధారణమైన సిద్ధాంతపరమైన అంతర్ జ్ఞానములను వివరించుటకు బదులుగా, ఈ విమర్శకులు అతడు వేదాంతపరమైన మేధావి అని కూడా వాదించాలి. కాని అదే సందర్భమైతే , అటువంటి ప్రత్యేకమైన మరియు స్పష్టపరచు సిద్ధాంతముల విస్తృతశ్రేణిని ఉత్పన్నము చేయుటకు క్రీస్తు యొక్క పరిచర్య తరువాత 1,800 సంవత్సరాలలో జోసెఫ్ మాత్రమే ఎందుకు చేసాడు? అది తెలివికాదు బయల్పాటు కనుక, అది ఈ గ్రంథము యొక్క ఆధారము.
జోసెఫ్ పరిపూర్ణమైన జ్ఞాపకముతో--సృజనాత్మక మరియు వేదాంతపరమైన మేధావి అని మనము అనుకున్నప్పుడు కూడా---ఈ ప్రతిభలు ఒంటరిగా అతడిని నైపుణ్యముగల రచయతగా చేయవు. కనుక, మోర్మన్ గ్రంథము యొక్క ఉనికిని వివరించుటకు, జోసెఫ్ 23 సంవత్సరాల వయస్సులో, సహజంగా ప్రతిభావంతుడైన రచయత అని కూడ విమర్శకులు ఒప్పుకోవాలి. లేని యెడల, అతడు డజన్ల పేర్లు, స్థలములు, మరియు అసందర్భములు లేకుండా అంతర్గతంగా క్రమబద్ధంగా ఎలా వ్రాసాడు, అతడు సవివరమైన యుద్ధ తంత్రములు ఎలా వ్రాసాడు మరియు శక్తివంతమైన ప్రసంగములు మరియు లేఖనాలలో గుర్తించబడి, కంఠస్తము చేయబడిన, ఉదహరించబడిన, మరియు మిలియన్ల జనులచేత ఫ్రిడ్జ్ తలుపులపై ఉంచబడిన వాక్యభాగాలను ఎలా వ్రాయగలిగాడు, అవి “మీ తోటి ప్రాణుల యొక్క సేవలో మీరున్న యెడల మీరు మీ దేవుని సన్నిధిలో ఉన్నారు” (మోషైయ 2:17), “మనుష్యులు సంతోషమును కలిగియుండునట్లు వారు ఉన్నారు” (2 2 నీఫై 2:25). ఈ సందేశాలు శక్తి కలిగియున్నవి---సజీవమైన ఊపిరి గలవి మరియు ప్రేరేపెంచేవి. జోసెఫ్ స్మిత్ 23 సంవత్సరాల వయస్సులో దాదాపు 65 పని దినాలలో ఒకే చిత్తుప్రతిలో అపూర్వమైన కార్యమును వ్రాయుటకు అవసరమైన నైపుణ్యములను కలిగియున్నాడనుట కేవలము వాస్తవానికి విరుద్ధమైనది.
అనుభవశాలి మరియు నైపుణ్యముగల రచయత అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇటీవల సర్వసభ్య సమావేశ ప్రసంగమును 40 సార్లు పైగా తిరిగి వ్రాసానని తెలిపారు. అటుతర్వాత ప్రధానంగా స్వల్ప వ్యాకరణ మార్పులు చేసి, జోసెఫ్ స్మిత్ మొత్తము మోర్మన్ గ్రంథము తన స్వంతంగా, ఒకేసారి చెప్పాడని మనము నమ్మాలా?
అటువంటి ప్రయత్నము యొక్క అసాధ్యతను జోసెఫ్ యొక్క భార్య ఎమ్మా నిర్ధారించింది: “(యువకునిగా) జోసెఫ్ స్మిత్ వ్రాయలేడు లేక పొందికైన మరియు చక్కని మాటలతో చెప్పలేడు, మోర్మన్ గ్రంథము వంటి గ్రంథమును అస్సలు చెప్పి వ్రాయించలేడు.”2
చివరిగా, ఒకరు రాబోయే వాదనలన్నిటిని అంగీకరించినప్పటికిని, అవి నిజము కావచ్చనే అనుమానము ఉన్నప్పటికిని, విమర్శకులు మరొక పెద్ద అడ్డంకును ఎదుర్కొంటారు. మోర్మన్ గ్రంథము బంగారు పలకలపై వ్రాయబడిందని జోసెఫ్ చెప్పాడు. ఇలా చెప్పుట జోసెఫ్ స్మిత్ కాలములో నిరంతరం విమర్శించబడ్డాడు, ఎందుకనగా సంవత్సరాల తరువాత, లోహపు పలకలు కనుగొనేంతవరకు, ప్రాచీన చరిత్రలు తాళపత్రము లేక దళసరి కాగితముపై వ్రాయబడినవని “ప్రతీఒక్కరికి” తెలుసు. అదనముగా, ప్రాచీన అమెరికాలో సిమ్మెంటు నిర్మాణాలు కనుగొనబడేంత వరకు ----మోర్మన్ గ్రంథములో వివరించబడినట్లుగా, సిమ్మెంటును ఉపయోగించుట ఈ ప్రాచీన అమెరికన్ల యాంత్రిక నైపుణ్యమును మించినదని విమర్శకులు వాదించారు. విమర్శకులు వీటిని మరియు అలాంటి అసంభవమైన అన్వేషణలను ఎలా అంగీకరిస్తారు? మీరు చూడండి, జోసెఫ్, చాలా అదృష్టవంతుడైన ఊహాకుడు. ఎదోవిధంగా, అతడి ఊహాలు ఖచ్చితంగా ఉండుట చాలా అరుదైనప్పటికిని, ఇప్పటికే ఉన్న అన్ని శాస్త్రీయ మరియు విద్యా పరిజ్ఞానమునకు వ్యతిరేకంగా, ఇతరులందరు తప్పైనప్పుడు అతడు సరిగా ఊహించాడు.
ఇవన్నీ పరిశీలించిన తరువాత, విమర్శకులచేత చెప్పబడినట్లుగా, ఈ ఆరోపించబడిన వాస్తవాలు మరియు శక్తులన్నీ, జోసెఫ్ స్మిత్ మోర్మన్ గ్రంథమును వ్రాయటానికి సాధ్యపరచే విధానములో ఆకస్మికంగా జతపరచబడి, ఆలాగున ఘోరమైన మరియు మోసపూరితమైన గ్రంథమును ఉత్పన్నము చేయుటకు సాధ్యపరచాయని ఎవరైనా ఎలా నమ్మగలరు. కాని దీనికేమి అర్థమున్నది? అటువంటి ప్రకటనకు ప్రత్యక్ష వ్యతిరేకతలో, ఈ గ్రంథము సాతానును తిరస్కరించుటకు మరియు క్రీస్తు వంటి జీవితాలను జీవించుటకు మిలియన్లను ప్రేరేపించింది.
విమర్శకుల వివరణలు నమ్మటానికి ఎవరైనా ఎన్నుకున్నప్పటికిని, ఆవిధంగా చేయటం మేధో లేక ఆధ్యాత్మిక పురోభివృద్ధికి దారితీయదు. విమర్శకుల వివరణలు నమ్మటానికి నేను నిరూపించబడని అంచనాల పరంపరను అంగీకరించాల్సియున్నది. అదనంగా, 3 11 మంది సాక్ష్యములలో ప్రతీఒక్కరు తమ సాక్ష్యమునకు జీవితకాలమంతా విశ్వాసముగా ఉన్న సాక్ష్యమును నేను నిరాకరించాలి; దాని పరలోకపు సత్యములతో ఈ పరిశుద్ధ గ్రంథము యొక్క పేజీలను నింపిన దైవిక సత్యములను నేను తిరస్కరించాలి, నాతో కలిపి సమూహములను ఏ ఇతర గ్రంథము కన్నను దీనిని చదువుట ద్వారా దేవునికి చేరువైన వాస్తవమును నేను నిరాకరించాలి; మరియు అన్నిటిపైగా, పరిశుద్ధాత్మ యొక్క నిర్ధారించు గుసగుసలను నేను నిరాకారించాలి. సత్యమని నేనెరిగిన ప్రతీదానికి ఇది వ్యతిరేకము.
నా మంచి తెలివైన స్నేహితులొకరు కొంతకాలము సంఘాన్ని విడిచిపెట్టాడు. అతడు తిరిగి వచ్చుట గురించి ఇటీవల నాకు వ్రాసాడు: “మొదట, నేను మోర్మన్ గ్రంథమును చారిత్రకంగా, భౌగోళికంగా, భాషాపరంగా, మరియు సాంస్కృతికంగా నాకు రుజువు చేయబడాలని కోరాను. కాని అది యేసు క్రీస్తు యొక్క సువార్త మరియు ఆయన రక్షించే మిషను గురించి బోధించే దానిపై నా దృష్టిని నేను మార్చినప్పుడు, దాని యదార్ధతను గూర్చిన సాక్ష్యమును నేను పొందసాగాను. ఒకరోజు నా గదిలో నేను మోర్మన్ గ్రంథమును చదువుతుండగా, నేను నిదానించాను, మోకరించాను, మరియు హృదయపూర్వకంగా ప్రార్థన చేసాను, సంఘము మరియు మోర్మన్ గ్రంథము ఖచ్చితంగా నిజమని నా ఆత్మతో పరలోక తండ్రి మెల్లగా చెప్పినట్లు ధ్వనించుటను నేను అనుభూతిచెందాను. నా మూడున్నర--సంవత్సరాల కాలము సంఘాన్ని తిరిగి పరిశోధించుట దాని యధార్ధతకు హృదయపూర్వకంగా మరియు నిశ్చయముగా నన్ను తిరిగి నడిపించింది.”
నా స్నేహితుడు చేసినట్లుగా, ఒకరు మోర్మన్ గ్రంథమును వినయముగా చదవటానికి మరియు ధ్యానించుటకు సమయాన్ని తీసుకొన్నప్పుడు, మరియు ఆత్మ యొక్క మధురమైన ఆత్మ ఫలాలను వినినప్పుడు, అప్పుడు, చివరకు అతడు లేక ఆమె కోరిన సాక్ష్యమును పొందును.
మోర్మన్ గ్రంథము మనకు దేవుని యొక్క ప్రశస్తమైన వరములలో ఒకటి. అది దేవుని యొక్క వాక్యమును యుద్ధమునకు పంపును---అది ఖడ్గము మరియు కవచము—అది నీతిపరుల హృదయాల కొరకు పోరాడుటకు మరియు సత్యము యొక్క ముఖ్యమైన రక్షకునిగా సేవ చేయును. పరిశుద్ధులుగా, మనము మోర్మన్ గ్రంథమును కాపాడుటకు విశేషావకాశమును కలిగియుండుట మాత్రమే కాదు కాని చురుకుగా దానిని ఉపయోగించుటకు---దాని దైవిక సిద్ధాంతము మరియు యేసు క్రీస్తును గూర్చి మహోన్నతమైన సాక్ష్యమును వహించుటకు కూడా అవకాశమును కలిగియున్నాము.
మోర్మన్ గ్రంథము దేవుని యొక్క శక్తిచేత అనువదించబడిందని నేను గంభీరముగా సాక్ష్యమిస్తున్నాను. అది యేసు క్రీస్తును గూర్చి, జోసెఫ్ స్మిత్ యొక్క ప్రవచనాత్మక పిలుపు, మరియు ఈ సంఘము యొక్క సంపూర్ణమైన సత్యమును గూర్చి దేవుని యొక్క ఖచ్చితమైన సాక్ష్యము. అది మన సాక్ష్యముల యొక్క మూలరాయి అగును గాక, ఆవిధంగా వారు “ఎన్నడునూ పడిపోలేదు” (ఆల్మా 23:6) అని పరివర్తన చెందిన లేమనీయులను గూర్చి చెప్పబడినట్లుగా మన గురించి చెప్పబడునుగాక. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.