ప్రభువు వైపు తిరుగుము
మనకు జరుగు సమస్తమును మనము అదుపుచేయలేము, కానీ మన జీవితాలలో మార్పులకు మనము ఎలా స్పందించాలో మనము పూర్తిగా అదుపు చేయగలము.
1998 వసంతకాలములో, కారోల్, నేను వ్యాపార ప్రయాణాన్ని కుటుంబ సెలవుగా ఈమధ్య విధవరాలైన అత్తగారితో పాటు, మా నలుగురు పిల్లలను కొన్నిరోజుల కోసం హావాయికి తీసుకెళ్ళటానికి జతపరచగలిగాము.
హావాయికి మా ప్రయాణమునకు ముందు రాత్రి, మా నాలుగు నెలల కుమారుడు, జోనాతాన్, రెండు చెవులలో ఇన్ఫెక్షన్‌తో గుర్తించబడ్డాడు, మరియు కనీసము మూడు-నాలుగు రోజులు వరకు అతడు ప్రయాణము చేయరాదని మేము చెప్పబడ్ఢాము. మిగిలిన కుటుంబముతో నేను ప్రయాణించుచుండగా, కారోల్ ఇంట్లో జోనాతాన్‌తో ఉండటానికి నిర్ణయము చేయబడింది.
మేము చేరుకున్న వెంటనే, నేను అనుకున్నవిధంగా ఈ ప్రయాణములేదని నా మొదటి గుర్తింపులో అనిపించింది. చంద్రుని వెలుగు క్రింద, ఈత చెట్ల వరుస, మా యెదుట ఉన్న సముద్రపు దర్శనముతో నడుస్తూ, నేను ఆ ద్వీపపు అందమును వ్యాఖ్యానించుటకు తిరిగాను, ఆ రోమాంటిక్ క్షణములో, కారోల్ చూడటానికి బదులుగా, నేను ప్రియముగా ప్రేమించే--- మా అత్తగారి కన్నులలోనికి చూచుట కనుగొన్నాను. నేను ఆశించింది ఇదికాదు. లేక కారోల్ ఒక్కటే రోగియైన మా పసివానితో తన సెలవు దినాన్ని గడుపుటకు ఊహించలేదు.
భంగపరచబడిన సెలవు దినము కంటే ఎక్కువ అధిక తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొంటూ, ఊహించని మార్గముపై మనల్ని మనం కనుగొన్నప్పుడు మన జీవితాలలో సమయాలున్నాయి. మనము ప్రణాళిక చేసిన లేక ఆశించిన జీవితమును మార్చివేయు ఘటనలు మనల్ని అదుపు చేసినప్పుడు, మనము ఎలా స్పందిస్తాము?
1944 జూన్ 6న, హైరమ్ షమ్వే, అమెరికా సైన్యములో రెండవ ల్యుటినెంట్ రెండవ ప్రపంచయుద్ధ దండయాత్రలో భాగంగా, డి-రోజులో భాగంగా, అనుకున్నవిధంగా ఓ మాహా సముద్రతీరానికి వెళ్ళాడు. క్రిందకు దిగేవరకు అతడు క్షేమంగా వెళ్ళాడు, కానీ జూలై 27న, మిత్రరాజ్యల కూటమిలో భాగముగా, అతడు యాంటీ టాంక్ గని పేలుట ద్వారా తీవ్రంగా గాయపడ్డాడు. క్షణంలో, అతడి జీవితం మరియు భవిష్యత్ వైద్య వృత్తి నాటకీయంగా ప్రభావితం చేయబడినవి. బహు శస్త్ర చికిత్సలు, అతడి తీవ్ర గాయాలలో అధికము నుండి స్వస్థపడుటకు అతడికి సహాయపడిన తరువాత, సహోదరుడు షమ్వే ఎన్నటికీ తన చూపును పొందలేకపోయాడు. అతడు ఎలా స్పందించాలి?
పునరావాస హాస్పిటల్ లో మూడు సంవత్సరాల తరువాత, అతడు వయోమింగ్, లవెల్‌లో ఇంటికి తిరిగి వచ్చాడు. ఒక వైద్యునిగా కావాలనుకున్న అతడి కల ఇక సాధ్యము కాదని తెలుసు, కాని అతడు ముందుకు సాగుటకు, వివాహము చేసుకొనుటకు, ఒక కుటుంబానికి సహకరించుటకు తీర్మానించాడు.
చివరకు అతడు మేరీలాండ్, బాల్టిమోర్ లో, పునరావాస సలహాదారునిగా, మరియు అంధులకు ఉద్యోగ నిపుణుడిగా ఉద్యోగాన్ని కనుగొన్నాడు. తన స్వంత పునరావాస ప్రక్రియలో, అతడు గ్రహించిన దానికన్నా అంధులు ఎక్కువ సమర్ధులని అతడు నేర్చుకున్నాడు, మరియు ఈ స్థానములో ఎనిమిది సంవత్సరాలలో, అతడు దేశములో ఏ ఇతర సలహాదారుని కన్నా ఎక్కువమంది ఉద్యోగము పొందటానికి సహాయపడ్డాడు.
ఇప్పుడు ఒక కుటుంబము కొరకు సమకూర్చగలడని తన సామర్ధ్యమునందు నమ్మకము కలిగి, తన ప్రియురాలికి ఇలా చెప్పుట ద్వారా హైరమ్ ప్రస్తావించాడు, “నీవు ఉత్తరాలు చదివి, సాక్సులను క్రమంగా ఉంచి, కారు నడిపితే, మిగిలినదంతా నేను చేస్తాను.” త్వరలో వారు సాల్ట్ లేక్ దేవాలయములో బంధింపబడ్డారు మరియు ఎనిమిదిమంది పిల్లలతో దీవించబడ్డారు.
1954లో షమ్వేలు వయోమింగ్‌కు తిరిగి వెళ్ళారు, అక్కడ సహోదరుడు షమ్వే చెవిటి, అంధులు కొరకు రాష్ట్ర విద్యా డైరక్టరుగా 32 సంవత్సరాలు పనిచేసాడు. ఆ సమయమందు, అతడు చెయిన్ని మొదటి వార్డు యొక్క బిషప్పుగా ఏడు సంవత్సరాలు మరియు తరువాత 17 సంవత్సరాలు స్టేకు గోత్రజనకునిగా సేవ చేసాడు. అతడు పదవీ విరమణ పొందిన తరువాత, సహోదర, సహోదరుడు షమ్వే లండన్ ఇంగ్లండ్ దక్షిణ మిషనులో సీనియరు దంపతులుగా కూడా సేవ చేసారు.
హైరమ్ స్మిత్ పరీక్షించు పరిస్థితుల క్రింద కూడా, విస్తారమైన పిల్లలు, మనుమలు, మరియు మునిమనుమల యొక్క తన గొప్ప సంతానమునకు విశ్వాసము యొక్క వారసత్వమును మరియు ప్రభువునందు నమ్మకమును వదలుచు, 2011 మార్చిలో చనిపోయాడు.1
హైరమ్ స్మిత్ యొక్క జీవితం యుద్ధముచేత మార్చబడింది, కాని అతడు తన దైవిక స్వభావమును మరియు నిత్య సాధ్యతను సందేహించలేదు. అతడి వలె, మనము దేవుని యొక్క ఆత్మ కుమారులు మరియు కుమార్తెలము, మరియు మనము “భౌతిక శరీరమును సంపాదించి మరియు పరిపూర్ణత వైపు అభివృద్ధి చెందుటకు భూలోక అనుభవమును పొందుట ద్వారా ఆయన ప్రణాళికను అంగీకరించాము మరియు నిత్య జీవము యొక్క వారసులుగా (మన) దైవిక గమ్యమును చివరిగా గ్రహించాము.”2 ఏ మార్పు, శ్రమ, లేక వ్యతిరేకత యొక్క పరిమాణము ఆ నిత్య గమనమును మార్చదు---మన స్వతంత్రతను మనము సాధన చేసినప్పుడు, మన ఎంపికలు మాత్రమే మార్చగలవు.
మర్త్యత్వములో మనము ఎదుర్కొనే మార్పులు, మరియు దానివలన సవాళ్ళు వేర్వేరు ఆకారములు, పరిమాణములలో వచ్చును మరియు మనలో ప్రతి ఒక్కరిని ప్రభావితం చేయును. స్నేహితులు మరియు కుటుంబము వీటి ద్వారా కలిగిన సవాళ్ళను మీ వలె, నేను ప్రత్యక్షంగా చూసాను.
-
ఒక ప్రియమైన వారి మరణము
-
బాధాకరమైన విడాకులు
-
బహుశా వివాహము చేసుకునే అవకాశము ఎన్నడూ లేకుండుట.
-
తీవ్రమైన వ్యాధి లేక గాయము.
-
ప్రపంచమంతటా మనము ఇటీవల ప్రత్యక్షంగా చూసినట్లుగా ప్రకృతి విపత్తులు కూడ.
జాబితా కొనసాగును. ప్రతీ “మార్పు” మన వ్యక్తిగత పరిస్థితులకు ప్రత్యేకమైనది అయినప్పటికిని, శ్రమ లేక సవాలులో ఉమ్మడి అంశమున్నది---యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తః త్యాగము ద్వారా నిరీక్షణ మరియు శాంతి ఎల్లప్పుడు లభ్యమవుతున్నాయి. యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తః త్యాగము ప్రతీ గాయపడిన శరీరము, ఆత్మ, మరియు విరిగిన హృదయమునకు అంతిమ దిద్దుబాటు మరియు స్వస్థత కొలమానములనిచ్చును.
సవాలు మధ్యలో ముందుకు సాగుటకు బదులుగా వ్యక్తిగతంగా మనకేది అవసరమో వేరొకరు గ్రహించని రీతిలో ఆయన ఎరుగును. స్నేహితులు మరియు ప్రియమైన వారి వలె కాకుండా, రక్షకుడు మనపట్ల సానుభూతి చూపటమే కాదు, కానీ ఆయన పరిపూర్ణముగా సహానుభూతి చూపును, ఎందుకనగా మనమున్న స్థానములో ఆయన ఉన్నాడు. మన పాపముల కొరకు వెల చెల్లించి మరియు బాధింపబడుటకు అదనముగా, యేసు క్రీస్తు ప్రతీ బాటను కూడ నడిచాడు, ప్రతీ సవాలుతో వ్యవహరించాడు, మర్త్యత్వములో మనము ఎప్పటికీ ఎదుర్కొనే----ప్రతీ శారీరక, భావావేశ లేక ఆత్మీయ గాయమును అనుభవించాడు.
అధ్యక్షులు బాయిడ్ కె. పాకర్ బోధించారు: “యేసు క్రీస్తు యొక్క కనికరము మరియు కృప పాపములు చేసిన వారికి మాత్రమే పరిమితం చేయబడలేదు. . . , , కాని అది ఆయనను అంగీకరించి మరియు ఆయనను వెంబడించు . . .వారందరికి శాశ్వతమైన శాంతి యొక్క వాగ్దానమును అవి చుట్టుముట్టును.” 3
ఈ మర్త్య అనుభవములో, మనకు జరిగే వాటన్నిటిని మనము అదుపు చేయలేము, కాని మన జీవితాలలో సవాళ్ళకు మనము ఎలా స్పందించాలో పూర్తిగా అదుపు చేయగలము. మనము ఎదుర్కొను సవాళ్ళు మరియు శ్రమలు ఏ పర్యవసానాలను కలిగిలేవు మరియు సులువుగా చూడబడి లేక నిర్వహించబడతాయని అర్థము కలిగించవు. కాని దాని అర్థమేమనగా నిరీక్షణకు హేతువు ఉన్నదని మరియు యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము వలన, మనము ముందుకు సాగగలము మరియు మంచిరోజులను---ఆనందము, వెలుగు, మరియు సంతోషమును కనుగొనగలము.
మోషైయాలో మనము రాజైన నోవాహ్ యొక్క మాజీ గురువు ఆల్మా మరియు అతని జనుల యొక్క వృత్తాంతమును చదువుతాము, వారు, “ప్రభువు చేత హెచ్చరించబడి . . . రాజైన నోవహ్ యొక్క సైన్యము ముందు అరణ్యములోనికి పారిపోయిరి.” ఎనిమిది రోజుల తరువాత, “చాలా సుందరమైన మరియు సంతోషకరమైన దేశమునకు . . . వారు వచ్చిరి” అక్కడ “వారు తమ గుడారములను వేసుకొని, మరియు భూమిని సేద్యపరచుటకు మొదలుపెట్టిరి.” 4
వారి పరిస్థితి ఆశాజనకంగా ఉన్నది. వారు యేసు క్రీస్తు యొక్క సువార్తను అంగీకరించారు. వారు ప్రభువును సేవించి మరియు ఆయన ఆజ్ఞలను పాటిస్తానని నిబంధన చేసి వారు బాప్తీస్మము పొందారు. మరియు “వారు దేశమందు వృద్ధి చెంది మరియు మిక్కిలిగా వర్ధిల్లిరి.”5
అయినప్పటికిని, వారి పరిస్థితులు త్వరలో మారును. “లేమనీయుల యొక్క ఒక సైన్యము దేశము యొక్క సరిహద్దులలో ఉండెను.” 6 త్వరలో ఆల్మా మరియు అతని జనులు దాస్యములో ఉంచబడ్డారు, మరియు “వారి శ్రమలు ఎంత గొప్పవనగా, వారు దేవునికి బలముగా మొరపెట్టుట మొదలుపెట్టిరి.” అదనముగా వారు, తమ మొరలను ఆపవలెనని తమను చెరపట్టిన వారిచేత ఆజ్ఞాపించబడిరి, “ఎవడు దేవునికి ప్రార్థన చేయుచు కనిపించునో అతడు చంపబడును.” 7 ఆల్మా మరియు అతడి జనులు తమ క్రొత్త పరిస్థితిని పొందుటకు అర్హులగునట్లు ఏదీ చేయలేదు. వారు ఎలా స్పందించాలి?
దేవునిని నిందించుటకు బదులుగా, వారు ఆయన వైపు తిరిగారు మరియు “వారు ఆయనకు తమ హృదయములను కుమ్మరించిరి.” వారి విశ్వాసము మరియు మౌన ప్రార్థనలకు స్పందనగా, ప్రభువు స్పందించాడు: “మంచి ఓదార్పును పొందుడి, . . . మీ భుజములపై నున్న భారములను నేను సడలించెదను. అందువలన మీరు దాస్యములో ఉన్నప్పుడు కూడ మీరు వాటిని మీ వీపులపైన కూడ తెలుసుకొనరు.” తరువాత వెంటనే “వారు తమ భారములను సునాయాసముగా భరించునట్లు ప్రభువు వారిని బలపరచెను మరియు వారు సంతోషముగాను మరియు సహనముతోను ప్రభువు యొక్క చిత్తమంతటికి లోబడిరి.” 8 దాస్యమునుండి ఇంకా విడిపింపబడనప్పటికినీ, ప్రభువు నుండి కాదు ప్రభువు వైపు తిరుగుట ద్వారా, వారి అవసరతల ప్రకారము మరియు ప్రభువు యొక్క జ్ఞానము ప్రకారము దీవించబడ్డారు.
ఎల్డర్ డాల్లిన్ హెచ్. ఓక్స్ ఇలా బోధించారు : “స్వస్థత దీవెనలు అనేక విధాలుగా వచ్చును, మనల్ని శ్రేష్టముగా ప్రేమించు ఆయనకు తెలిసినట్లుగా, ఒక్కొక్కటి మన వ్యక్తిగత అవసరాలు సరిపోవును. కొన్నిసార్లు ‘స్వస్థత‘ మన వ్యాధిని నయము చేయును లేక మన భారమును పైకెత్తును. కాని కొన్నిసార్లు మనము ఇవ్వబడిన బలముచేత లేక జ్ఞానము లేక మనపైన ఉంచబడిన భారములను భరించుటకు సహనముచేత మనము ‘స్వస్థపరచబడతాము.’ ” 9
చివరకు, “వారి విశ్వాసము మరియు వారి సహనము ఎంత గొప్పదనగా,” మన వలే ఆల్మా మరియు అతడి జనులు ప్రభువు చేత విడిపించబడిరి, “వారు కృతజ్ఞతలు చెల్లించిరి . . . ఏలయనగా వారు దాస్యమందు ఉండిరి, మరియు వారి దేవుడైన ప్రభువు తప్ప ఎవడును వారిని విడిపించలేకపోయెను.”10
విచారకరమైన పరిహాసమేదనగా, చాలా తరచుగా అవసరతలో ఉన్నవారు వారి సహాయము యొక్క పరిపూర్ణమైన ఆధారమైన---మన రక్షకుని నుండి దూరమవుతారు. పరిచయమైన లేఖన వృత్తాంతము “ఇత్తడి సర్పము” మనము సవాళ్ళతో ఎదుర్కొనబడినప్పుడు, మనము ఎంపిక చేయగలమని బోధించును. అనేకమంది ఇశ్రాయేలు సంతతి ఎగిరే అగ్ని సర్పములచేత కరవబడిన తరువాత ”11 “ఒక సూచన పైకెత్తబడెను . . .దానివైపు చూచువారెవరైనా . . జీవించుదురు. (కాని అది ఒక ఎంపిక) మరియు అనేకమంది చూచి బ్రతికిరి . .
కానీ అనేకమంది వారు చూడకుండా కఠినపరచబడిన వారు అనేకులు ఉండిరి. . . , కాబట్టి వారు నశించిరి.” 12
ప్రాచీన ఇశ్రాయేలీయువలే, రక్షకుని వైపు చూచి, జీవించాలని మనము కూడా ఆహ్వానించబడ్డాము మరియు ప్రోత్సహించబడ్డాము----ఏలయనగా ఆయన కాడి సులువైనది మరియు మనది భారమైనప్పటికిని, ఆయన భారము తేలికైనది.
“దేవునియందు తమ నమ్మికయుంచు వారెవరైనను, వారి శోధనలందు మరియు వారి కష్టములందు మరియు వారి శ్రమలందు సహాయము పొందుదురని మరియు అంత్యదినమున లేపబడుదురని నేనెరుగుదును,” 13 అని చెప్పినప్పుడు, ఈ పరిశుద్ధ సత్యమును చిన్నవాడైన ఆల్మా బోధించాడు.
ఈ కడవరి దినాలలో, ప్రభువు మనకు విస్తారమైన వనరులను ఇచ్చారు, మన “ఇత్తడి సర్పములు ” అన్నీ మనము క్రీస్తు వైపు చూచుటకు సహాయపడుటకు రూపకల్పన చేయబడినవి. జీవితపు సవాళ్ళను ఎదుర్కొనుటతో వ్యవహరించుట వాస్తవమును నిర్లక్ష్యము చేయుట కాదు కానీ మేలుగా దృష్టిసారించుటకు మరియు నిర్మించుటకు మనము ఎన్నుకొను పునాది.
ఈ వనరులు క్రింద చేర్చబడియున్నవి, కానీ పరిమితం చేయబడలేదు:
-
లేఖనములను మరియు జీవిస్తున్న ప్రవక్తల బోధనలను క్రమముగా చదువుట
-
తరచైన, మనఃపూర్వకముగల ప్రార్థన మరియు ఉపవాసము.
-
సంస్కారములో యోగ్యతగా పాల్గొనుట.
-
దేవాలయమునకు క్రమముగా హాజరగుము
-
యాజకత్వపు దీవెనలు
-
శిక్షణ పొందిన నిపుణుల ద్వారా తెలివైన సలహా,
-
మరియు ఇంకా మందులు, సరిగా సూచించబడి మరియు అనుమతించబడినట్లుగా మాత్రమే ఉపయోగించాలి.
జీవితపు పరిస్థితిలో ఏ మార్పు వచ్చినప్పటికిని, మరియు మనము ఊహించని బాటలో ప్రయాణించాల్సి వచ్చినప్పటికి, ఎలా స్పందించాలన్నది మన ఎంపిక. రక్షకుని వైపు తిరుగుట మరియు చాపబడిన ఆయన హస్తమును పట్టుకొనుట ఎల్లప్పుడు మన శ్రేష్టమైన ఎంపిక.
ఎల్డర్ రిచర్డ్ జి. స్కాట్ ఈ నిత్య సత్యమును బోధించెను: “మిక్కిలి సవాళ్ళుగల కష్టములను జయించుటకు బలము, ధైర్యము, మరియు సామర్ధ్యముతోపాట నిజమైన, సహించే సంతోషము యేసు క్రీస్తునందు దృష్టిసారించబడిన జీవితం నుండి వచ్చును. . . తక్షణ ఫలితాలు వస్తాయనే గ్యారంటీ లేదు, కానీ ప్రభువు యొక్క సమయములో, పరిష్కారములు వస్తాయని, శాంతి ప్రబలును, మరియు శూన్యము నింపబడుననే పూర్తి అభయమున్నది.”14
ఈ సత్యములకు నేను నా సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.