ప్రభువు యొక్క స్వరము
ప్రభువు యొక్క స్వరమును మీరు విన్నారని నేను సాక్ష్యమిస్తున్నాను. ఎలా స్పందిస్తామన్నది మనలో ప్రతీఒక్కరికి పరీక్ష.
మొదట, చిన్న పిల్లల కొరకు ఒక దయగల మాట. అవును, ఇది చివరి సమావేశము, మరియు అవును, నేను ముగింపు ప్రసంగీకుడను.
ఇటీవల, ప్రోవో పట్టణ కేంద్ర దేవాలయమును దర్శించుచుండగా, దూరము నుండి, మొదటి దర్శనము అనే శీర్షిక గల ఛాయాచిత్రమును నేను ప్రశంసించాను. బాలుడైన జోసెఫ్ స్మిత్‌ను పరలోకము నుండి తండ్రి మరియు కుమారుడు దర్శించినప్పుడు పరలోకము నుండి వెలుగు మరియు శక్తిని ఆ ఛాయాచిత్రము చిత్రీకరించుచున్నది.
పునఃస్థాపనలో ప్రవేశపెట్టబడిన ఆ పరిశుద్ధమైన సంఘటనతో పోలిక చేయకుండా, నేను ఈ సర్వసభ్య సమావేశముపై దేవుని యొక్క వెలుగు మరియు ఆత్మీయ శక్తి ప్రతిఫలించు అటువంటి దృశ్యమును, మరియు తిరిగి, ఆ శక్తి మరియు వెలుగు ప్రపంచమంతటా కదులుటను నేను ఊహించగలను.
యేసే క్రీస్తని, ఆయన ఈ పరిశుద్ధ కార్యము యొక్క వ్యవహారాలను నడిపిస్తున్నారని, మరియు సర్వసభ్య సమావేశము ఆయన తన సంఘమునకు మరియు మనకు వ్యక్తిగతంగా నడిపింపు ఇచ్చే చాలా ముఖ్యమైన సమయాలలో ఒకటని నేను మీకు నా సాక్ష్యమిస్తున్నాను.
ఉన్నతమునుండి బోధింపబడుట
సంఘము స్థాపించబడినప్పుడు, ప్రభువు జోసెఫ్ స్మిత్‌ను ఒక ప్రవక్త, దీర్ఘదర్శి, మరియు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అపోస్తలునిగా నియమించాడు: 1
“నా స్వంత స్వరమునుండి వచ్చినట్లుగా, పూర్తి సహనము మరియు విశ్వాసముతో, అతని మాటను మీరు స్వీకరించాలి.
“వీటిని చేయుట ద్వారా నరకపు ద్వారములు మీకు వ్యతిరేకంగా ప్రబలవు; . . . దేవుడైన ప్రభువు మీ యెదుటనుండి చీకటి యొక్క శక్తులను చెదరగొట్టును, మరియు మీ మేలు కొరకు పరలోకములను కదిలించును.” 2
తరువాత, ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తులుల కోరము యొక్క సభ్యులందరు, ప్రవక్తలు, దీర్ఘ దర్శులు, మరియు బయల్పాటుదారులుగా ఆమోదించబడ్డారు మరియు నియమించబడ్డారు.3
ఇప్పుడు, అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ యొక్క నడిపింపు క్రింద మనము కలుసుకొన్నప్పుడు, మనము “ప్రభువు యొక్క చిత్తమును . . . . ప్రభువు యొక్క మనస్సును, . . . ప్రభువు యొక్క స్వరమును, మరియు రక్షించుటకు దేవుని యొక్క శక్తిని” 4 వినుటకు ముందుగా ఆశిస్తున్నాము. మనము ఆయన వాగ్దానమునందు నమ్ముతున్నాము: “నా స్వంత స్వరము చేత లేక నా సేవకుల స్వరముచేత అయినా, ఒక్కటే.” 5
కల్లలోలము మరియు కలవరము నిండిన మన ఆధునిక ప్రపంచములో, ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తులుల కోరము యొక్క మాటలను విశ్వసించుట మన ఆత్మీయ అభివృద్ధి మరియు సహనమునకు కీలకమైనది. 6
ఈ అద్భుతమైన సమావేశము కొరకు మనము కలిసి వచ్చాము. 200 దేశములకు పైగా 93 పైగా భాషలలో మాట్లాడు మిలియన్ల కడవరి దిన పరిశుద్ధులు మరియు ఇతర విశ్వాసములకు చెందినవారు, ఈ సమావేశములకు హాజరయ్యారు లేక సమావేశ సందేశములను చదువుతారు.
మనము ప్రార్థించి మరియు సిద్ధపడి వచ్చాము. మనలో అనేకులకు, ఒత్తిడి చేయు చింతలున్నాయి మరియు గంభీరమైన ప్రశ్నలున్నాయి. మన రక్షకుడైన యేసు క్రీస్తునందు మన విశ్వాసము క్రొత్తదిగా చేయుటకు, శోధనలను జయించుటకు మరియు అంతరాయములను తప్పించుకొనుటకు మన సామర్ధ్యమును బలపరచుకోవాలని మనము కోరతాము. మనము ఉన్నతము నుండి బోధింపబడుటకు వచ్చాము.
ప్రభువు యొక్క మనస్సు మరియు చిత్తము
సాధారణంగా ప్రతీ సమావేశములో మాట్లాడు, ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమందికి వారి సందేశాలను సిద్ధపరచే అపారమైన బాధ్యత పునరావృతమయ్యే భారము మరియు పరిశుద్ధమైన నమ్మకము రెండూ ఉన్నాయి.
సంవత్సరాల క్రితం, ప్రధాన అధికారిగా సేవ చేయకముందు, ప్రతీ స్టేకు సమావేశము కొరకు ప్రత్యేకంగా ప్రసంగము సిద్ధపరుస్తారా అని నేను ఎల్డర్ డాల్లిన్ హెచ్. ఓక్స్‌ను అడిగాను. లేదని ఆయన జవాబిచ్చారు, అయితే ఇలా అన్నారు, “కాని నా సర్వసభ్య సమావేశ ప్రసంగాలు ప్రత్యేకంగా ఉంటాయి. నేను చెప్పాలని ప్రభువు కోరిన చానిని నేను చెప్పుటకు నిశ్చయపరచుటకు నేను దాదాపు 12 నుండి 15 చిత్తు కాగితాలను చేస్తాను.”7
సర్వసభ్య సమావేశ ప్రసంగాలకు ప్రేరేపణ ఎప్పుడు మరియు ఏవిధంగా వస్తుంది?
ఏ అంశములు నియమించబడకుండా , ప్రతీఒక్క సమావేశము యొక్క నిత్య సత్యము విషయాలను పరలోకము మనోహరముగా సమన్వయపరచుట మేము చూచియున్నాము.
నా సహోదరులలో ఒకరు తనకు గత ఏప్రిల్ తరువాత వెంటనే తన ప్రసంగము కొరకు విషయము ఇవ్వబడిందని నాకు చెప్పారు. మరొకరు తాను ఇంకా ప్రార్థించి మరియు ప్రభువుపై ఆధారపడ్డానని చెప్పారు. ప్రత్యేకంగా సున్నితమైన ప్రసంగమును సిద్ధపరచుటకు తనకు ఎంతసేపు పట్టిందని వేరోకరిని అడిగినప్పుడు, “ఇరవై-ఐదు సంవత్సరాలు” అని జవాబిచ్చారు.
కొన్నిసార్లు ముఖ్యమైన ఉద్దేశము త్వరగా వస్తుంది, కానీ భావము మరియు వివరాలకు ఇంకా విస్తారమైన ఆత్మీయ ఆరోహణ అవసరమగును. ఉపవాసము మరియు ప్రార్థన, అధ్యయనము మరియు ప్రార్థన ఎల్లప్పుడు ప్రక్రియలో భాగము. ప్రభువు తన పరిశుద్ధులకు తన స్వరమును తగ్గించే నెపము ఏదీ ఇష్టపడడు.
సర్వసభ్య సమావేశ ప్రసంగము కొరకు నడిపింపు వచ్చును. అది తరచుగా రాత్రి లేక ప్రసంగము మనస్సు యొక్క ఆలోచనల నుండి దూరముగా ఉన్నప్పుడు, తెల్లవారుజాము గడియలలో వస్తాయి. హఠాత్తుగా, ముందుగా ఊహించని అంతర్దృష్టి కొన్నిసార్లు స్వచ్ఛమైన బయల్పాటు రూపములో ప్రత్యేకమైన మాటలు మరియు వాక్యభాగములుగా ప్రవహించును.8
మీరు విన్నప్పుడు, మీరు పొందు సందేశాలు చాలా అక్షరార్ధమైనవి లేక కేవలం మీకోసమే మలచబడియుండవచ్చు.
అనేక సంవత్సరాల క్రితం, సర్వసభ్య సమావేశములో మాట్లాడుతూ, ఒక మిషను సేవ చేయుటకు నేను సిద్ధపడియున్నానా అని ఆశ్చర్యపడినప్పుడు, నా మనస్సులోనికి వచ్చిన వాక్యభాగము గురించి నేను చెప్పాను. ఆ వాక్యభాగము “నీకు ప్రతీది తెలియదు, కానీ నీకు తగినంత తెలుసు!” 9 ఆ రోజు సర్వసభ్య సమావేశములో ఒక యువతి వివాహ ప్రస్తావన చేసిన యువకుడిని తనకు ఎంతవరకు తెలుసని ఆశ్చర్యపడుతూ, ప్రార్థన చేస్తున్నాని నాతో చెప్పింది. నీకు ప్రతీది తెలియదు, కానీ నీకు తగినంత తెలుసు!” అన్నమాటలు నేను చెప్పినప్పుడు, ఆమెకు అతడిని తగినంతగా ఎరుగునని ఆత్మ నిర్ధారించిది. వారు వివాహము చేసుకొని అనేక సంవత్సరాలుగా సంతోషంగా ఉన్నారు.
మీరు మీ ఆత్మను సిద్ధపరచి మరియు ప్రభువు యొక్క స్వరము వింటారనే ముందుగా ఊహాతో వచ్చినప్పుడు, మీ కొరకు ప్రత్యేకంగా మలచబడిన ఆలోచనలు మరియు భావనలు మీ మనస్సులోనికి వస్తాయి. ఈ సమావేశములో వాటిని ముందే మీరనుభూతి చెందారు, లేక ముందు వారాలలో సందేశాలను మీరు చదివినప్పుడు మీరు భావిస్తారు.
ఇప్పుడు మరియు ముందున్న నెలల కొరకు
అధ్యక్షులు ఎస్. మాన్సస్ చెప్పారు:
“సమావేశ సందేశాలను చదువుటకు సమయాన్ని తీసుకొనుము, ” 10
“(వాటిని) ధ్యానించుము. . . . గొప్ప లోతుగా నేను వాటిని చదివినప్పుడు ఈ ప్రేరేపించబడిన ప్రసంగములనుండి నేను ఇంకా ఎక్కువ అధికంగా పొందుతానని, నేను కనుగొన్నాను.” 11
సర్వసభ్య సమావేశము యొక్క బోధనలు ఇప్పుడు మరియు ముందున్న నెలలలో మనముందుంచబడిన ప్రభువు యొక్క ఆలోచనలు.
గొఱ్ఱెల కాపరి “(తన గొఱ్ఱెలకు) ముందుగా వెళ్ళును, మరియు గొఱ్ఱెలు అతని స్వరమెరుగును కనుక అవి అతడిని వెంబడించును.” 12
తరచుగా ఆయన స్వరము మన జీవితాలలో దేనికైనా మార్చుకొనుటకు మనల్ని నడిపించును. ఆయన పశ్చాత్తాపపడుటకు మనల్ని ఆహ్వానించును. ఆయనను వెంబడించుటకు ఆయన మనల్ని ఆహ్వానించును.
ఈ సమావేశములో వ్యాఖ్యానములను గూర్చి ఆలోచించుము:
అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ ఈ ఉదయకాల ప్రసంగమునుండి: “తండ్రియైన దేవుడు జీవిస్తున్నాడని నేను నా సాక్ష్యమిచ్చుచున్నాను మరియు ఆయన వద్దకు ఇంటికి తిరిగి రమ్మని మిమ్మల్ని కోరుతున్నారు. ఇది ప్రభువైన యేసు క్రీస్తు యొక్క నిజమైన సంఘము. ఆయన మిమ్మల్ని ఎరిగియున్నాడు, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ; ఆయన మీపై కావలికాస్తున్నారు. ” 13
అధ్యక్షులు డీటర్ ఎఫ్. ఉక్‌డార్ఫ్ నిన్నటి ప్రసంగించిన దానినుండి: “ దేవుని వద్దకు నడిపించు అనివార్యమైన ప్రయాణముపై బయలుదేరి లేక కొనసాగించినప్పుడు మన జీవితాలు ఉత్తమంగా ఉంటాయి . . . మరియు మన చుట్టూ ఉన్నవారిని దీవించుటకు అసాధారణమైన విధానాలలో ప్రభువు మనల్ని ఉపయోగించును మరియు ఆయన నిత్య ఉద్దేశాలను నెరవేర్చును. ”14
అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ నిన్న సాయంత్రపు ప్రసంగము నుండి: “మోర్మన్ గ్రంథములో మిమ్మల్ని మీరు నిమగ్నము చేసుకున్నప్పుడు, అశ్లీల చిత్రములు మరియు మిగిలిన మనస్సును స్తబ్ధంగా చేసే వ్యసనాల యొక్క పట్టుకొనే తెగులు , దినము యొక్క కీడులకు వ్యతిరేకంగా నిరోధించబడగలరని నేను వాగ్దానమిస్తున్నాను.”15
నిన్న ఎల్డర్ డాల్లిన్ ఓక్స్ నిన్నటి ప్రసంగము నుండి: “కుటుంబముపై ప్రకటన నిత్య సత్యము యొక్క వాఖ్యానమని, ఆయన పిల్లలకు ప్రభువు యొక్క చిత్తమని నేను సాక్ష్యమిస్తున్నాను.”16
కేవలము కొన్ని నిముషాల క్రితం ఎల్డర్ ఎమ్. రస్సెల్ బల్లార్డ్: “దేవుని యొక్క పిల్లలను మనము కనికరముతో హత్తుకోవాలి మరియు జాతివివక్ష, లింగవివక్ష మరియు జాతీయత కలిపి ఏ పక్షపాతమునైనా తీసివేయాలి.”17
మనకు ఒక అదనపు నిముషము ఉన్నది కనుక, ఎల్డర్ రాబర్ట్ డి. హేల్స్ గురించి క్లుప్తమైన ప్రతిఫలింపును చేర్చాలని నేను కోరుతున్నాను. ఆయన ఆరోగ్యము అనుమతించిన యెడల ఆదివారము ఉదయకాల సమావేశములో క్లుప్తమైన సందేశమును తానివ్వవచ్చని ప్రథమ అధ్యక్షత్వము ఎల్డర్ హేల్స్‌కు చెప్పారు. ఆయన ఆరోగ్యము దానిని అనుమతించనప్పటికీ, ఆయన ఒక సందేశమును సిద్ధపరిచాడు, దానిని ఆయన గత వారము పూర్తిచేసారు, మరియు నాతో పంచుకున్నారు. దాదాపు మూడు గంటల క్రితం ఆయన చనిపోకముందు ఇవ్వబడింది, ఆయన ప్రసంగమునుండి నేను కేవలము మూడు వరసలను పంచుకుంటాను.
ఎల్డర్ హేల్స్‌ను వ్యాఖ్యానిస్తున్నాను: “విశ్వాసమును కలిగియుండుటకు మనము ఎన్నుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో నిలబడుటకు మనము సిద్ధపడియుంటాము. . . . రక్షకుని యొక్క సిలువశ్రమ తరువాత, మర్త్యత్వములో వారు జీవిస్తుండగా (ఆయన) గూర్చి సాక్ష్యమునందు విశ్వాసముగా ఉన్నవారికి మాత్రమే ఆయన కనిపించాడు.’ [ సి మరియు ని 138:12.] ‘ప్రవక్తల. . . యొక్క సాక్ష్యమును తిరస్కరించిన వారు (రక్షకుని యొక్క సన్నిధిని) గమనించలేకపోయారు, లేక ఆయన ముఖమును చూడలేకపోయారు.’ [D&C 138:21.] . . . . మన విశ్వాసము ప్రభువు యొక్క సన్నిధిలో ఉండుటకు మనల్ని సిద్ధపరచును.”
ఈ ఉదయకాల సమావేశము అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ముగింపులో భవనాన్ని త్వరగా విడిచి తన మధ్యాహ్నా భోజనాన్ని మాని, ఎల్డర్ హేల్స్ పడక దగ్గరకు త్వరపడి వెళ్ళి, అక్కడ, ఎల్డర్ హేల్స్ మర్త్యత్వమును దాటి పట్టభద్రతను పొందినప్పుడు, ఆయన కోరము అధ్యక్షులు, దూతవంటి మేరీ హేల్స్ తోపాటు ఉండుటకు ప్రేరేపణ ఇచ్చుటకు ప్రభువు ఎంత దయగలవాడు.
ప్రభువు యొక్క స్వరమునకు స్పందించుట
ఈ సమావేశములో మనము ప్రభువు యొక్క స్వరము విన్నామని నేను సాక్ష్యమిస్తున్నాను.
ప్రభువు సేవకుల యొక్క మాటలు లోకము యొక్క ఆలోచనకు మరియు మన స్వంత ఆలోచనకు వ్యతిరేకమైనప్పుడు మనము భయపడనవసరం లేదు. ఇది ఎల్లప్పుడు ఈవిధంగా ఉన్నది. దేవాలయములో నేను నా సహోదరులతో కలిసి మోకరించాను, మరియు వారి ఆత్మల మంచితనమును ధృవీకరిస్తున్నాను. వారి గొప్ప కోరిక ప్రభువును సంతోషపరచుట మరియు ఆయన సన్నిధికి తిరిగి వెళ్ళుటకు దేవుని పిల్లలకు సహాయపడుట.
డెబ్బది, బిషప్రిక్కు, ఉపశమన సమాజము, యువతులు, ప్రాథమిక యొక్క ప్రధాన అధ్యక్షత్వములు మరియు ఇతర సహాయక నాయకులు ఈ సమావేశానికి గొప్ప ప్రేరేపణను చేర్చియున్నారు, అదేవిధంగా మనోహరమైన సంగీతము మరియ ఆలోచనాపూర్వకమైన ప్రార్థనలున్నాయి.
సర్వసభ్య సమావేశము యొక్క సందేశాలలో పరలోకపు నడిపింపు యొక్క నిధి పెట్టె మీ ఆవిష్కరణ కోసం వేచియున్నది. మనము విన్నదానికి, చదివినదానికి, మరియు మనము అనుభూతిచెందిన దానికి ఎలా స్పందించామో మనలో ప్రతీఒక్కరికీ పరీక్ష.
అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ జీవితం నుండి ప్రవచనాత్మక మాటలకు స్పందించుట గురించి ఒక అనుభవాన్ని నేను మీతో పంచుకుంటాను.
1979లో, ప్రధాన అధికారిగా తన పిలుపుకు ఐదు సంవత్సరాలకు ముందు, సర్వసభ్య సమావేశానికి ముందు ఒక సమావేశానికి సహోదరుడు నెల్సన్ హాజరయ్యారు. అధ్యక్షులు స్పెన్సర్ డబ్ల్యు. కింబల్ “హాజరైన వారందరిని మొత్తము ప్రపంచానికి సువార్తను తీసుకొనుటలో వారి పెద్ద అంగలను పొడిగించమని సవాలు చేసారు. దేశాల మధ్య ప్రత్యేకంగా చైనాను అధ్యక్షులు కింబల్ ఇలా ప్రకటిస్తూ చెప్పారు, మనము చైనా వారికి సేవ చేయాలి. మనము వారి భాషను నేర్చుకోవాలి. మనము వారి కొరకు ప్రార్థన చేయాలి మరియు వారికి సహాయపడాలి.” 18
54 వయస్సులో, సహోదరుడు నెల్సన్ మండారిన్ భాషను అధ్యయనము చేయాలనే భావన కలిగింది. తీరికలేని గుండె శస్త్ర చికిత్స నిపుణులు అయినప్పటికిని, ఆయన వెంటనే ఒక శిక్షకుడిని ఏర్పాటు చేసారు.
తన చదువు ప్రారంభించిన స్వల్పకాలంలో, డా. నెల్సన్ ఒక సభకు హాజరయ్యారు, ఊహించనిరీతిలో “ఒక ప్రసిద్ధి చెందిన చైనీస్ శస్త్ర చికిత్స నిపుణుడైన డా. వు యింగ్కై” ప్రక్కన తాను కూర్చొన్నట్లుగా కనుగొన్నారు. . . (సహోదరుడు నెల్సన్) మాండారిన్ నేర్చుకుంటున్నారు కనుక, ఆయన డా. వు తో సంభాషణ ప్రారంభించారు.” 19
ప్రవక్తను వెంబడించుటకు డా. నెల్సన్ యొక్క కోరిక సాల్ట్‌లేక్ దర్శిస్తున్న డా. వు కు మరియు డా. నెల్సన్ చైనాకు ప్రయాణించి ఉపన్యాసాలు ఇచ్చుటకు మరియు శస్త్ర చికిత్సలు చేయుటకు నడిపించాయి.
చైనా ప్రజల కొరకు ఆయన ప్రేమ, ఆయన కొరకు వారి ప్రేమ, గౌరవములు పెరిగాయి.
పన్నెండు మంది అపోస్తులులకు ఆయన పిలుపు వచ్చిన పది నెలల తరువాత, 1985, ఫిబ్రవరిలో, చైనాలో మిక్కిలి ప్రసిద్ధి చెందిన ఓపెరా గాయకుని బలహీనమగుచున్న గుండెకు శస్త్ర చికిత్స చేయుటకు బీజింగ్‌కు రమ్మని డా. నెల్సన్ ప్రాధేయపడుతూ ఆశ్చర్యకరమైన ఫోను పిలుపును పొందారు. అధ్యక్షులు గార్డన్ బి. హింక్లీ ప్రోత్సాహాముతో, ఎల్డర్ నెల్సన్ చైనాకు తిరిగి వెళ్లారు. అది చైనా రిపబ్లిక్ యొక్క జనులలో చేసిన చివరి శస్త్ర చికిత్స ఆపరేషను.
రెండు సంవత్సరాల క్రితం, 2015 అక్టోబరులో, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ “చైనా యొక్క పాత స్నేహితుడు” అని ఆయనకు పేరు పెడుతూ అధికారిక ప్రకటనతో మరొకసారి గౌరవించబడ్డారు.
తరువాత, ఇప్పుడు 93-సంవత్సరాల అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ “(గత ఏప్రిల్ సమావేశములో) మనలో ప్రతీఒక్కరు, ప్రతీరోజు మోర్మన్ గ్రంథమును ప్రార్థనాపూర్వకంగా చదివి, ధ్యానించాలి” అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సస్ యొక్క మనవి గురించి మాట్లాడుట మనము విన్నాము.
తీరికలేని ఒక గుండె శస్త్ర చికిత్స నిపుణుడు ఒక మాండారిన్ శిక్షకుడను నియమించుకున్నట్లుగానే, అధ్యక్షులు నెల్సన్ వెంటనే అధ్యక్షులు మాన్సస్ యొక్క సలహా తీసుకొని తన స్వంత జీవితానికి దానిని అన్వయించారు. చదవటం కంటే ఎక్కువగా, ఆయన “మోర్మన్ గ్రంథమనగా ఏమిటి, అది దేనిని నిర్ధారిస్తుంది, అది దేనిని తప్పని నిరూపిస్తుందినెరవేరుస్తుంది, అది దేనిని స్పష్టపరుస్తుంది, , మరియు అది బయల్పరచేదేమిటి,”20 జాబితాలను చేసానని ఆయన అన్నారు.
మరియు తరువాత, ఈ ఉదయకాలమున ఆసక్తికరంగా, అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ కూడా అధ్యక్షులు మాన్సన్ యొక్క ఉపదేశానికి తన స్పందన గురించి మాట్లాడారు. ఈ మాటలు మీకు గుర్తున్నాయా? “మీలో అనేకుల వలే, ప్రభువు నాతో మాట్లాడినట్లుగా ప్రవక్త యొక్క మాటలను నేను విన్నాను. మరియు మీలో అనేకుల వలే, ఆ మాటలకు విధేయుడగుటకు నేను నిర్ణయించాను,” 21 అని ఆయన అన్నారు.
మన స్వంత జీవితాల కోసం మాదిరులుగా వీటిని చూద్దామా
ఒక వాగ్దానము మరియు ఒక దీవెన
ఈ సర్వసభ్య సమావేశము యొక్క బోధనలందు, ప్రభువు యొక్క స్వరమును మీరు విని, తరువాత ఆ ప్రేరేపణలపై పనిచేసినప్పుడు, పరలోక హస్తము మీపైనుండుట మీరు అనుభూతి చెందుతారు, మీ జీవితాలు మరియు మీ చుట్టూ ఉన్నవారి జీవితాలు దీవించబడతాయి. 22
ఈ సమావేశమందు, మనము మన ప్రియమైన ప్రవక్త గురించి ఆలోచించాము. అధ్యక్షులు మాన్సన్ మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము. ఈ స్టేజి నుండి ఇవ్వబడిన ఆయన మాటలతో నేను ముగిస్తాను. ఆయన మనతో ఉండగలిగిన యెడల, ఈరోజు మనలో ప్రతిఒక్కరికి ఇవ్వాలని ఆయన కోరుకునే దీవెన అని నేను నమ్ముచున్నాను. ఆయన అన్నారు: “మనము ఈ సమావేశమును విడిచి వెళ్లినప్పుడు, మీలో ప్రతీఒక్కరిపై పరలోకము యొక్క దీవెనలను నేను ఆర్ధిస్తున్నాను. . . మన పరలోక తండ్రి మిమ్మల్ని మరియు మీ కుటుంబాలను దీవించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ సమావేశము యొక్క సందేశములు మరియు ఆత్మ----మీ గృహాలందు, మీ పనిలో, మీ సమావేశాలు, మరియు మీ రాకపోకలలో వ్యక్తీకరణను కనుగొనును గాక.”
ఆయన ముగించారు: “నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆయన వాగ్దానము చేసిన శాంతి ఇప్పుడు మరియు ఎల్లప్పుడు మీతో ఉండును గాక.” 23
యేసు క్రీస్తు నామములో, ఆమేన్.