2010–2019
పరలోకము నుండి వచ్చిన జీవాహారము
అక్టోబర్ 2017


పరలోకము నుండి వచ్చిన జీవాహారము

మనము క్రీస్తునందు నివసించుటకు మరియు ఆయన మనయందు నివసించుటకు ఆపేక్షించిన యెడల, తరువాత మనము వెదికేది పరిశుద్ధతయే.

గలిలయలో “ఐదు యవల రొట్టెలు మరియు రెండు చిన్న చేపలతో”1 మాత్రమే యేసు అద్భుతముగా ఐదు వేల మందికి తినిపించిన తరువాత రోజు, ఆయన కపెర్నహూములోని ప్రజలతో మరలా మాట్లాడారు. వారు మరలా ఆహారమివ్వబడుటలో వారికున్నట్లుగా ఆయన బోధనలందు అంత ఆసక్తి కలిగిలేరని రక్షకుడు గ్రహించాడు. 2 ఆప్రకారము, “నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును.”3 యేసు ప్రకటించెను:

“జీవాహారమును నేనే.

“మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి.

“దీనిని తినువాడు చావ కుండునట్లు పరలోకమునుండి దిగివచ్చిన ఆహార మిదే.

“పరలోకమునుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును; మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవముకొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.”4

రక్షకుడు ఉద్దేశించిన అర్థము ఆయన వాఖ్యానమును వినినవారు అక్షరాలా మాత్రమే గ్రహించి, దాదాపుగా కోల్పోబడింది. ఆ ఆలోచనయందు వెనుదిరిగి, వారు ఆశ్ఛర్యపడిరి. “మును అక్కడ విన్న “ఈయన తన శరీరమును ఏలాగు తిన నియ్యగలడని యొకనితో ఒకడు వాదించిరి”5 అప్పుడు యేసు ఇట్లనెను:

“మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని, మీలో మీరు జీవము గలవారు కారు.

“నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు; అంత్యదినమున నేను వానిని లేపుదును.

“నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై యున్నది.”6

అప్పుడు ఆయన తన రూపకాలంకారము యొక్క లోతైన అర్థమును వ్యక్తపరిచాడు.

“నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము.

“జీవముగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును.”7

ఇంకను ఆయనను వినువారు యేసును, మరియు “గ్రహించలేకపోయారు, మరియు చాలామంది ఇది వినినప్పుడు ఇలా చెప్పారు “యిది కఠినమైన మాట, యిది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. it? మరియు అప్పటినుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకతీసి, మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు. ”8

ఆయన యొక్క శరీరమును భుజించుట మరియు ఆయన రక్తము త్రాగుట అనేది మనము రక్షకుడిని ఎంతగా పూర్తిగా మన జీవితములోకి--- మనము ఏకమగునట్లు—మన ప్రాణములోనికి తీసుకొనిరావలెనో వ్యక్తపరిచే అద్భుతమైన విధానము.. ఇది ఎలా జరుగును?

మొదట, ఆయన శరీరము మరియు రక్తమును త్యాగము చేయుటలో మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేసెనని మరియు శారీరక, ఆత్మీయ ఆధ్యాత్మిక మరణమును జయించారని మనము గ్రహిస్తాము.9 స్పష్టంగా అప్పుడు, ఆయన ప్రాయశ్చిత్తఃము నుండి శక్తిని మరియు దీవెనలను మనము పొందినప్పుడు, మనము ఆయన శరీరమును భుజించి మరియు రక్తమును త్రాగుతున్నాము.

క్రీస్తు యొక్క సిద్ధాంతమ మనము ప్రాయశ్చిత్తః కృపను పొందటానికి మనము చేయాల్సిన దానిని తెలియజేయును. అది ఏమనగా క్రీస్తు యందు నమ్మకముంచి, విశ్వాసము కలిగియుండి, పశ్చాత్తాపడి మరియు బాప్తీస్మము పొంది మరియు పరిశుద్దాత్మను పొందుట. “అగ్ని ద్వారా మరియు పరిశుద్ధాత్మ ద్వారా మన పాపములకు విమోచన కలుగును.”10 రక్షకుని యొక్క ప్రాయశ్చిత్తః కృపకు మరియు ఆయన రాజ్యమునకు తిన్నని ఇరుకైన మార్గమునకు ఇదే ద్వారము మరియు మన ప్రవేశము.

“అందువలన మీరు క్రీస్తు వాక్యముని విందారగించుచు ముందునకు త్రోసుకుని వెళ్ళిపోయి మరియు అంతము వరకు స్థిరముగానుండిన యెడల, ఇదిగో మీరు నిత్యజీవముని పొందుదురని తండ్రి ఇట్లు చెప్పుచున్నాడు.

“… ఇదిగో ఇది క్రీస్తు యొక్క సిద్ధాంతము మరియు అంతము లేని ఒక్క దేవుడైన తండ్రి , కుమారుని మరియు పరిశుదాత్మ యొక్క నిజమైన సిద్ధాంతము.”11

ప్రభురాత్రి భోజనము యొక్క చిహ్నము ధ్యానించుటకు అందమైనది. జీవాహారమును మరియు జీవజలమైన ఆయన శరీరము మరియు రక్తమును సూచించు 12 రొట్టె మరియు నీళ్ళు, ఆయన మనల్ని విమోచించుటకు చెల్లించిన మూల్యము యొక్క వెలను మనకు తీవ్రముగా జ్ఞాపకము చేయును. రొట్టె విరవబడినప్పుడు, రక్షకుని యొక్క చీల్చబడిన శరీరమును మనము జ్ఞాపకము చేసుకుంటాము. “అది విరవబడి మరియు చీల్చబడినది కనుక, దానిని తీసుకునే వ్యక్తులు ప్రత్యేకమైన వారు అయినట్లుగా, రొట్టె యొక్క ప్రతీ ముక్క ప్రత్యేకమైనది. మనమందరము పశ్చాత్తాపపడాల్సిన ప్రత్యేక పాపములున్నాయి. ఈ విధియందు మనము జ్ఞాపకముంచుకొను, ప్రభువైన యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తఃము ద్వారా బలపరచబడవలిసిన ప్రత్యేకమైన అవసరతలను మనము కలిగియున్నాము,”13 అని ఎల్డర్ డాల్లిన్ హెచ్. ఓక్స్ ఒకసారి గమనించారు. మనము నీటిని త్రాగినప్పుడు, గెత్సేమనేలో మరియు సిలువపై ఆయన చిందించిన రక్తము మరియు దాని పరిశుద్ధపరచే శక్తిని గూర్చి మనము ఆలోచిస్తాము. 14“అపరిశుద్ధమైనదేది ఆయన రాజ్యములో ప్రవేశించలేదని,” తెలుసుకొని, “వారి విశ్వాసము, వారి పాపముల యొక్క పశ్చాత్తాపము, మరియు అంతము వరకు వారి విశ్వసనీయత వలన(రక్షకుని) యొక్క రక్తములో వారి వస్త్రములను కడుగుకొను” వారి మధ్య ఉండుటకు మనము తీర్మానించుకోవాలి. ”15

మన పాపములు మరియు పాపముల యొక్క మరకలను తీసివేయడానికి రక్షకుని యొక్క ప్రాయశ్చిత్తః కృపను పొందడం గురించి నేను మాట్లాడాను. ఉపమానముగా ఆయన శరీరమును భుజించుట మరియు రక్తముని త్రాగడానికి ఇంకను అర్ధం ఉన్నది, మరియు అది క్రీస్తు యొక్క లక్షణాలు మరియు స్వభావమును అంతర్గతీకరించుటకు మరియు ప్రకృతి సంబంధియైన అయిన మనుష్యుని పక్కన పెట్టి, “ప్రభువైన క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా”16 పరిశుద్దులవలె మనము మారేదము. ప్రతీవారము సంస్కారము యొక్క రొట్టె మరియు నీటిని తీసుకొన్నప్పుడు, మన జీవితము మరియు ప్రాణములోనికి ఆయన పాపరహిత జీవితము యొక్క నమూనాను మరియు ఆయన స్వభావమును ఎంత పరిపూర్ణముగా మరియు పూర్తిగా పొందుపరచాలో మనము పరిగణించాలి. యేసు పాపము లేనివాడైతే తప్ప ఆయన ఇతరుల పాపముల కొరకు ఆయన ప్రాయశ్చిత్తఃము చేయలేరు. న్యాయము ఆయనపై ఏ హక్కు లేదు గనుక, న్యాయమును తృప్తిపరచుటకు మన స్థానములో ఆయనకై ఆయన అర్పించుకోగలిగాడు మరియు తరువాత కనికరమును పొడిగించాడు. ఆయన ప్రాయశ్చిత్తః త్వాగమును మనము జ్ఞాపకముంచుకొని మరియు గౌరవించినప్పుడు, ఆయన పాపరహిత జీవితమును కూడా మనము ధ్యానించాలి.

ఇది మన వంతుగా శక్తివంతమైన ప్రయత్నము చేయవల్సిన అవసరత ఉన్నదని మనకు సూచిస్తుంది. మనము ఇప్పుడు ఎలాగా ఉన్నామో అలాగే ఉండుటకు తృప్తి చెందలేము కాని “క్రీస్తు యొక్క పరిపూర్ణత యొక్క ఆకార పరిమాణము”17 వైపు నిరంతరము కొనసాగుతూ ఉండాలి. మోర్మన్ గ్రంథములో లమోనై రాజు యొక్క తండ్రి గారి వలే, మనము మన పాపములను ఇచ్చి వేయుటకు సిద్ధంగా ఉండాలి,”18వ్యక్తిగతముగా మరియు జతగా, ప్రభువు మన నుంచి ఎం ఆశిస్తున్నాడో దాని మీద దృష్టిసారించాలి.

కొంత కాలం క్రితం , ఒక స్నేహితుడు మిషను అధ్యక్షుడగా సేవ చేస్తున్నప్పుడు తనకు జరిగిన ఒక అనుభవమును గుర్తుచేసుకున్నాడు. అతనికి ఒక శస్త్రచికిత్స జరిగింది, దానికి కొన్ని వారములు విశ్రాంతి అవసరమైంది. అతడు కోలుకొనుచుండగా, అతడు తన సమయాన్ని లేఖనాలను పరిశోధించుటకు సమర్పించాడు. ఒక మధ్యాహ్నాము, 3  నీఫై 27వ అధ్యాయములోని రక్షకుని మాటలను ధ్యానించినప్పుడు, అతను నిద్రలోకి జారుకున్నాడు. తదనంతరము అతడు వివరించాడు:.

“నేను కల గన్నాను, దానిలో జీవితము యొక్క స్పష్టమైన విస్తృత వీక్షణను నాకిచ్చింది. నేను నా పాపములు, బలహీనమైన ఎంపికలు, జనులను నేను అసహనముతో చూచిన . . . సమయములు, నేను చెప్పాల్సిన, లేక చేయాల్సిన మంచి విషయాలను విడిచిపెట్టుట . . . కేవలము కొన్ని నిముషాలలో నా జీవితము యొక్క . . . విస్తారమైన (పునర్వీక్షణ) నాకు చూపబడింది, కానీ అది ఇంకా ఎక్కువ సుదీర్ఘమైనదిగా కనబడింది. నేను మేల్కోన్నాను, భయపడ్డాను, మరియు . . . వెంటనే మంచము ప్రక్కన నేను మోకరించాను మరియు నేను ఇదివరకెన్నడూ చేయనట్లుగా, నా హృదయపు భావనలను క్రుమ్మరిస్తూ, క్షమాపణ కొరకు వేడుకొనుటకు ప్రార్థించసాగాను.

“నా కలకు ముందు, నేను అంతగా పశ్చాత్తాపపడే అవసరమున్నదని నాకు తెలీదు. హఠాత్తుగా, నా లోపాలు మరియు బలహీనతలు చాలా స్పష్టంగా నాకు కనపడ్డాయి ఆలా ఉండిన నాకు దేవుని యొక్క మంచితనము మరియు పరిశుద్ధత మధ్యలో నాకు కొన్ని మిలియన్లమైళ్లు దూరం కనిపించింది. ఆరోజు మధ్యాహ్నం నా ప్రార్ధనలో, పరలోక తండ్రి మరియు రక్షకుడు నా కొరకు మరియు నా భార్య, పిల్లలతో నేను విలువిచ్చే అనుబంధముల కొరకు వారు చేసిన దాని కొరకు నా కుటుంబము కొరకు చేసిన దానికోసం నా పూర్ణ హృదయముతో నా లోతైన కృతజ్ఞతను నేను తెలియజేసాను. నా మోకాళ్ళ మీద ఉన్నప్పుడు, నేనంత అయోగ్యముగా భావించినప్పటికిని, చాలా స్పష్టముగా ఉన్న దేవుని యొక్క ప్రేమ మరియు కనికరమును కూడా నేను అనుభూతి చెందాను. . . …

“నేను ఆ రోజు నుండి అదేరీతిలో లేనని నేను చెప్పగలను... నా హృదయము మారింది.. . . దాని తరువాత నేను సువార్తను ప్రకటించుటకు ఆతృతగల భావనతో జతపరచబడి, ప్రేమించుటకు గొప్ప సామర్ధ్యముతో, మరియు ఇతరులపట్ల ఎక్కువ సానుభూతిని నేను వృద్ధి చేసాను. ఇదివరకెన్నడూ లేనట్లుగా విశ్వాసము, నిరీక్షణ, మరియు మోర్మన్ గ్రంథములో కనుగొనబడి పశ్చాత్తాపము యొక్క వరము యొక్క సందేశములను నేను వివరించగలను.”19

ఈ మంచి వ్యక్తికి తన పాపములు మరియు తప్పిదముల స్పష్టమైన బయల్పాటు అతడిని నిరుత్సాహపరచలేదు లేకు లేక అతడిని నిరాశకు నడిపించలేదు. అవును, అతడు దిగ్భ్రాంతి చెందాడు మరియు పశ్చాత్తాపము పడ్డాడు. అతడు తాను పశ్చాత్తాపము పడాల్సినవసరమున్నదని లోతుగా భావించాడు, అతడు తగ్గించుకున్నాడు, అయినప్పటికిని అతడు కృతజ్ఞత, శాంతి, మరియు నిరీక్షణను --నిజమైన నిరీక్షణను ఎందుకనగాయేసు క్రీస్తు “పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము.”20

నా స్నేహితుడు తన కలలో తన జీవితము మరియు దేవుని యొక్కపరిశుద్ధతకు మధ్య గ్రహించిన ఖాళీని గూర్చి మాట్లాడాడు.. పరిశుద్ధత సరైన పదము. క్రీస్తు యొక్క శరీరమును భుజించితిని మరియు రక్తమును త్రాగుట అనగా పరిశుద్ధతను వెదకుట. దేవుడు ఇలా ఆజ్ఞాపించారు “నేను పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును పరిశుద్ధులైయుండుడి.”21

హానోకుమనకు సలహా ఇచ్చాడు, “మనుష్యులందరూ ప్రతిచోటా, తప్పక పశ్చాత్తాపపడాలని, మీ పిల్లలకు దానిని బోధించుడి, లేనియెడల వారు దేవుని యొక్క రాజ్యమును ఏవిధంగాను వారసత్వముగా పొందలేరుచ ఏలయనగా అపవిత్రమైనదేదియు అక్కడ నివసించలేదు లేక అయన సన్నధిలో నివసించలేదు, ఏలయనగా, ఆదాము యొక్క భాషలో, పరిశుద్ధుడైన మనుష్యుడ అని అయన పేరు మరియు ఆయన అద్వితీయుని పేరు మనుష్య కుమారుడు, యేసు క్రీస్తు కూడా.”22 నేను బాలునిగా ఉన్నప్పుడు, క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తుని మనుష్య కుమారుడు అని ఎందుకు పిలుస్తారు అతను నిజముగా దేవుని కుమారుడు కదా అని ఆశ్చర్యపడ్డాను, కానీ హానోకు యొక్క ప్రకటనలో ఈ ప్రస్తావనలు వాస్తవానికి ఆయన దైవత్వము మరియు పరిశుద్ధత యొక్క గుర్తింపని---ఆయన తండ్రియైన దేవుడు, ఆయన పరిశుద్ధత యొక్క మనుష్య కుమారుడని అది స్పష్టపరచును.

మనము క్రీస్తు యందు నివసించుటకు మరియు అయన మనయందు నివసించుటకు ఆపేక్షించిన యెడల,23 అప్పుడు మనము శరీరము మరియు ఆత్మయందు పరిశుద్ధతను వెదకాలి.24 దానిని మనము దేవాలయములో వెదకుతాము, అక్కడ “ప్రభువుకు పరిశుద్ధత” అని వ్రాయబడింది. దానిని మనము మన వివాహాలలో, కుటుంబాలలో మరియు గృహములలో వెదకాలి.25 మనము ప్రతివారము దేవుని పవిత్ర దినమున వెదుకుతాము. మన ప్రతిదిన జీవితమూ యొక్క వివరాలలో దానిని వెదుకుతాము: “మన సంభాషణ, మన దుస్తులు, మన ఆలోచనలు. అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ చెప్పినట్లుగా, “మనము చదివే సమస్తము, చూసే సమస్తము, వినే సమస్తము, మరియు ఆలోచించే సమస్తము యొక్క ఫలితము మనము.”26 ఆలోచించే దాన్ని బట్టి ప్రతీరోజు మన సిలువను మనము మోసినప్పుడు మనము పరిశుద్ధతను వెదుకుతాము.”27

సహోదరి కారోల్  ఎఫ్. మెఖాంకీ గమనించారు: “దేవుని ఎదుట సుగుణమైనది మరియు ప్రశంసనీయమైన వాటినుంజిన మనల్ని దూరంగా లాగివేయుగల విస్తారమైన పరీక్షలు, శోధనలు మరియు శ్రమల లను మనము గుర్తిస్తాము. కానీ మన మర్త్య అనుభవాల పరిశుద్ధతను ఎన్నుకునే అవకాశాన్ని మనకు ఇస్తాయి. చాలా తరచుగా అది మనల్ని పరిశుద్ధపరచి మరియు పరిశుద్ధముగా చేయునట్లు మన నిబంధనలను కాపాడుకొనుటకు మనము చేసే త్యాగాలు.28 మరియు “మనము చేసే త్యాగాలు” మనము ఇతరులకు చేసే సేవను కూడా నేను జతపరుస్తాను.

మనము ఇతరుల సేవలో ఉన్నప్పుడు మనము దేవుని సేవలో ఉందుము అని మనము యెరుగుదుము.29 మరియు ప్రభువు మనకి గుర్తుచేసేది ఏమనగా అటువంటి సేవ అయన జీవితము మరియు స్వభావంనకు ప్రధానమైనది: “మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను.” 30 అధ్యక్షులు మెరియన్ జి. రామ్నీ తెలివిగా వివరించారు: “ సిలెస్టియల్ రాజ్యములో ఉన్నత స్థితిని జీవించిగలుగునట్లు, సేవ అనేది మనము భూమిమీద సహించగలది ఏదైనా కాదు. సిలేస్టియల్ రాజ్యములో ఉన్నత స్థితి యొక్క ప్రతీ నరాలు సేవతో చేయబడినవి.”31

ప్రభువు యొక్క వెయ్యేళ్ళ పాలన దినములో, గుఱ్ఱముల యొక్క ఘంటలు కూడా “ప్రభువుకు పరిశుద్ధత”32 అనే శాసనమును మోస్తాయని జెకర్యా ప్రవచించాడు. సామాన్యమైన లేక ప్రాపంచికమైన విషయాలుగా అదేవిధంగా మతపరమైన ఆచరణతో నేరుగా సంబంధితమైనవిగా కనబడిన వాటిపై, ఆ ఆత్మయందు, ఈ వేలీలోని ఆగ్రగామ పరిశుద్ధులు, ఆ జ్ఞాపకమును ముద్రవేసారు, “ప్రభువుకు పరిశుద్ధత.” అది సంస్కారపు కప్పులు, ప్లేట్లు పై లిఖించబడింది మరియు డెబ్బదుల నియామకపు సర్టిఫికెట్లపై మరియు ఉపశమన సమాజపు బానరుపై ముద్రించబడింది. జిసిఎమ్ఐ విభాగపు దుకాణము, సీయోను యొక్క సహకార వ్యాపార సంస్థ ప్రదర్శన కిటికీలపై కూడా కనబడును. అది సుత్తిపైన మరియు డ్రమ్ముపైన కనుగొనబడును. “ప్రభువుకు పరిశుద్ధత” అధ్యక్షులు బ్రిగమ్ యంగ్ యొక్క ఇంటి యొక్క తలుపుల పిడిపై పోతపోయబడింది. పరిశుద్ధతకు ఈ సూచనలు అకారణంగా అసాధారణమైనవి లేక ఊహించని స్థలములు అసంబద్ధమైనవిగా కనబడవచ్చు, కాని అవి పరిశుద్ధతపై మన దృష్టి ఎంత పరివ్యాప్తమైనవి మరియు స్థిరముగా ఉండాల్సినవసరమున్నదో సూచించును.

చిత్రం
సంస్కార కప్పు
చిత్రం
సంస్కార ప్లేటు
చిత్రం
జిసిఎమ్ఐ విభాగపు దుకాణము
చిత్రం
సుత్తి
చిత్రం
డ్రమ్ము
చిత్రం
తలుపు పిడి

రక్షకుని యొక్క శరీరమును భుజించుట మరియు ఆయన రక్తమును త్రాగుట అనగా క్రీస్తు వంటి స్వభావముతో ఏకరీతిగా లేని దానిని మన జీవితాలలోనుండి తీసివేయుట మరియు అయన లక్షణాలను మనవిగా చేసుకొనుట. ఇది పశ్చాత్తాపము యొక్క విశాలమైన అర్ధ: మన గత పాపము నుండి వెనుకకు తిరగడమేకాదు కాని ముందుకు సాగుతూ “మనం హృదయమును మరియు చిత్తమును దేవునివైపు వైపుకు తిప్పడము కూడా.33 నా స్నేహితుడికి తన బయల్పాటు కలలో జరిగినట్లుగా, దేవుడు మనకు మన లోపాలు మరియు పరాజయాలను మనకు చూపించును, కాని బలహీనత బలముగా మారుటకు కూడా ఆయన మనకు సహాయపడును.34 “నాకు కొదువ ఏమని?”35మనము మనఃపూర్వకంగా అడిగిన యెడల, ఊహించుటకు ఆయన మనల్ని విడువడు, కానీ మన సంతోషము కొరకు ఆయన ప్రేమయందు జవాబిచ్చును. మరియు ఆయన మనకు నిరీక్షణను ఇచ్చును.

ఇది మిక్కిలి ప్రయత్నము, పరిశుద్ధత కొరకు మన ప్రయాసపడుటలో మనము ఒంటరిగా ఉన్న యెడల అది భయంకరముగా భయపెట్టును. మహిమగల సత్యమేదనగా మనము ఒంటరివారము కాదు. మనము దేవుని యొక్క ప్రేమను, క్రీస్తు యొక్క కృపను, పరిశుద్ధాత్మ యొక్క ఓదార్పును, నడిపింపును, మరియు క్రీస్తు యొక్క శరీరమందు సహ పరిశుద్ధుల సహవాసము మరియు ప్రోత్సాహమును కలిగియున్నాము.మనము ఎక్కడ ఉన్నామో సంతృప్తి చెందవద్దు, అయితే మనము నిరాశ చెందరాదు., ఒక సాధారణమైనది కానీ ఆలోచనాపూర్వకమైన కీర్తన మనల్ని ప్రేరిపించినట్లుగా:

పరిశుద్ధముగా ఉండుటకు సమయమును తీసుకొనుము, లోకము త్వరపడును;

యేసుతో ఒంటరిగా రహస్యమందు ఎక్కువ సమయమును గడుపుము.

యేసు వైపు చూచుట ద్వారా, మీరు ఆయన వలే కావాలి;

నీ ప్రవర్తనయందు ఆయన పోలికను నీ స్నేహితులు చూచెదరు.36

యేసు క్రీస్తు“పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే”37 మరియు “(ఆయన) శరీరమును తిని, (ఆయన) రక్తమును త్రాగువాడే నిత్యజీవము గలవాడు,”38 అని నేను సాక్ష్యము ఇస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

ముద్రించు