మనం ఆయనను నమ్ముచున్నామా? కష్టమైనది మంచిది
సమస్య ఏదైనప్పటికి, విశ్వాసముతో ముందుకు సాగి, ప్రభువును, ఆయన ప్రణాళికను నమ్మేవారికి కష్టము మంచిగా ఉండవచ్చును
నేను ప్రారంభించకముందు, ఇటీవల తుఫానులు మరియు భూకంపముల నాశనము చేత ప్రభావితం చేయబడిన మనందరి తరఫున ప్రాతినిధ్యము వహిస్తున్న ఒకరిగా, అన్ని సహాయక హస్తములు మరియు మనకు సహాయమును, నిరీక్షణను, ఇచ్చిన సంధాన కర్తల కొరకు నా హృదయపూర్వక ప్రశంసను నేను తెలియజేస్తున్నాను.
2006 అక్టోబర్‌లో, నా మొదటి సర్వసభ్య సమావేశ ప్రసంగాన్ని ఇచ్చాను. ప్రపంచవ్యాప్త సంఘానికి ముఖ్యమైనదని నేను భావించినది, ఈ నిశ్చిత ప్రకటనను కలిగియున్నది: “ప్రభువు మనల్ని నమ్ముచున్నారు!”
నిజంగా ఆయన మనల్ని అనేక విధాలుగా నమ్ముచున్నారు. ఆయన యేసు క్రీస్తు యొక్క సువార్తను మరియు ఈ యుగములో దాని సంపూర్ణతను ఇచ్చారు. తాళపు చేతులతో సంపూర్ణముగా ఉన్న యాజకత్వ అధికారమును సరిగా ఉపయోగించబడుటకు మనకు అప్పగించారు. ఆ శక్తితో మనం దీవించగలము, సేవ చెయ్యగలము, విధులను పొందగలము, మరియు నిబంధనలను చెయ్యగలము. ఆయన పరిశుద్ధ దేవాలయముతో పాటు తన పునఃస్థాపించబడిన సంఘముతో మనల్ని నమ్ముచున్నారు. ఆయన తన సేవకులను బంధించే శక్తి-అనగా భూమిమీద బంధించి, పరలోకములో కూడా బంధించు శక్తితో మనల్ని నమ్ముచున్నారు! ఆయన పిల్లలకు తల్లిదండ్రులుగా, శిక్షకులుగా, సంరక్షించువారిగా కూడా ఆయన మనల్ని నమ్ముచున్నారు.
లోకములో అనేక భాగాలలో ప్రధాన అధికారిగా సేవను ఇన్ని సంవత్సరాలు చేసిన తరువాత, ఇంకా ఎక్కువ నిశ్చయతతో నేను ప్రకటించుచున్నాను: ఆయన మనల్ని నమ్ముచున్నారు.
ఈ సమావేశానికి నా ప్రశ్న ఏమంటే, “మనం ఆయన్ని నమ్ముచున్నామా?”
మనం ఆయన్ని నమ్ముచున్నామా?
అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ తరచు మనకు ఇలా గుర్తుచేస్తారు “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము.
“నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.
నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు” (సామెతలు 3:5–7).
ఆయన ఆజ్ఞలు మన మంచికే అని మనం వాటిని నమ్ముచున్నామా? ఆయన నాయకులు, అంసపూర్ణులైనప్పటికి, మనల్ని బాగా నడిపిస్తున్నారని? ఆయన వాగ్దానాలు ఖచ్చితమైనవని? పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు మనల్ని యెరిగియున్నారని, మనకు సహాయం చెయ్యాలనుకుంటున్నారని మనం నమ్ముచున్నామా? శ్రమలు, సవాళ్లు, కష్ట సమయాలలో కూడా మనం ఆయన్ని నమ్ముచున్నామా?
వెనుకకు తిరిగి చూస్తే, యువకునిగా ఉన్నప్పుడు, మిషనులో, క్రొత్త వృత్తిని ప్రారంభిస్తునప్పుడు, నా పిలుపును నెరవేర్చుటకు ప్రయాసపడుతున్నప్పుడు, పెద్ద కుటుంబమును పోషించుచున్నప్పుడు లేదా స్వయంసమృద్ధిగా ఉండుటకు కష్టపడుచున్నప్పుడు-నేను శ్రేష్టమైన పాఠాలలో కొన్ని మిక్కిలి కష్టమైన సమయాలలో నేర్చుకున్నాను. కష్టము మంచిదని స్పష్టముగా కనిపిస్తున్నది!
కష్టము మంచిది
కష్టము మనల్ని బలంగా చేస్తుంది, దీనమనస్సు కలిగిస్తుంది, మనల్ని మనం నిరూపించుకొనుటకు అవకాశమిస్తుంది. మన ప్రియమైన తోపుడుబండి అగ్రగాములు వారి క్లిష్టమైన పరిస్థితులలో దేవుని తెలుసుకున్నారు. నీఫై మరియు తన సహోదరులు ఇత్తడి పలకలు పొందడానికి రెండు అధ్యాయాలు పట్టింది కాని ఇష్మాయేలు కుటుంబము వారిని అరణ్యములో చేర్చుకొనుటకు కేవలం మూడు వచనములే పట్టింది? (1 నీఫై 3–4; 7:3–5 చూడుము). పలకలు పొందుటలో పడే కష్టము ద్వారా నీఫైని బలపరచాలని ప్రభువు సంకల్పించినట్లుగా కనిపిస్తుంది.
మన జీవితములో కష్టాలు విస్మయమును కలిగించేవిగా రాకూడదు. ప్రభువుతో చేసుకొను మొదటి నిబంధనలలో ఒకటి త్యాగ చట్టమును జీవించుట. త్యాగము అనేది నిర్వచన ప్రకారము కోరదగిన వాటిని వదులుకొనుట. తరువాత వచ్చే దీవెనలతో పోల్చితే చెల్లించవలసింది చాలా తక్కువ వెల అని అనుభవముతో మనం నేర్చుకుంటాము. జోసెఫ్ స్మిత్ నడిపింపు క్రింద, అది ఇలా చెప్పబడింది, “అన్నిసంగతుల యొక్క త్యాగమును కోరని మతము జీవితము మరియు రక్షణకు ఆవశ్యకమైన విశ్వాసమును ఎన్నటికి ఉత్పత్తి చెయ్యలేదు.”1
దైవ సమూహము యొక్క సభ్యులు కష్టమైనవాటికి అపరిచితులు కారు. తండ్రియైన దేవుడు ఆయన అద్వితీయ కుమారుని సిలువ మరణముతో పాటు ప్రాయశ్చిత్తఃము యొక్క భయంకరమైన బాధకు త్యాగము చేసెను. యేసు క్రీస్తు “ఆయన, కుమారుడైయుండియు తాను పొందిన శ్రమలవలన విధేయతను నేర్చుకొనెను” (హెబ్రీయులకు 5:8) అని లేఖనాలు చెప్పుచున్నాయి. ఆయన ప్రాయశ్చిత్తము యొక్క తీవ్రమైన వ్యధను స్వచ్ఛంధంగా అనుభవించాడు. పరిశుద్ధాత్మ మనకు గుర్తుచేయుటకు, హెచ్చరించుటకు, నడిపించుటకు దీర్ఘశాంతమును కలిగియున్నది, తరువాత కేవలము కొన్నిసార్లు నిర్ల్యక్షము చేయబడి, తప్పుగా అర్థము చెప్పబడి లేదా మరచిపోబడును.
ప్రణాళికలో భాగము
సువార్త ప్రణాళికలో భాగము కష్టమైనది. మనకు ఈ జీవితపు ఉద్దేశములలో ఒకటి నిరూపించబడటం (అబ్రాహాము 3:25 చూడండి). కొందరు ఆల్మా జనులకంటే ఎక్కువ అన్యాయముగా శ్రమను అనుభవించారు. లేమనీయులకు బానిసలగుటకు మాత్రమే, వారు దుష్టుడైన నోవాహు రాజు యొద్దనుండి పారిపోయారు! ఆయన తన జనులను గద్దించి, “వారి సహనమును మరియు వారి విశ్వాసమును” పరీక్షించునని, ఆ శ్రమల గుండా ప్రభువు వారికి బోధించాడు (మోషైయా 23:21().
లిబర్టి చెరశాల యొక్క భయంకరమైన దినాలలో, “బాగుగా సహించమని” (సి మరియు ని 121:8) ప్రభువు జోసెఫ్ స్మిత్‌కు బోధించెను మరియు అతడు ఆవిధంగా చేస్తే “ఈ విషయాలన్నీ నీకు అనుభవమును ఇచ్చును మరియు నీ మేలు కొరకేనని ” (సి మరియు ని 122:7) అని వాగ్దానము చేసెను.
“సులభమైన తప్పు కంటే కష్టమైన ఒప్పునే మనమెల్లప్పుడు ఎంచుకొందుము గాక”2 అని అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ మనల్ని వేడుకొన్నారు. “[దేవాలయ] దీవెనలు పొందుటకు ఏ త్యాగము చాలా గొప్పది కాదు, ఏ వెల చాలా అధికమైనది కాదు, ఏ శ్రమ కష్టమైనది కాదు”3 అని మన దేవాలయాల గురించి ఆయన చెప్పారు.
ప్రకృతిసంబంధమైన లోకములో, జీవితపు సహజమైన భాగము కష్టమైనది. గ్రుడ్డు యొక్క గట్టి పెంకును పగలుగొట్టుకొని బయటకు రావడం కోడిపిల్లకు కష్టము. కాని దానిని సులభము చేయుటకు ఎవరైనా ప్రయత్నిస్తే, జీవించడానికి కావలసిన బలాన్ని అది అభివృద్ధి చేసుకోదు. అదేవిధంగా, గూడు నుంచి బయటకు రావడానికి సీతాకోకచిలుక పడే కష్టము అది జీవించే జీవితానికి దానిని బలపరచును.
ఈ ఉదాహరణల ద్వారా, స్థిరమైనది కష్టమైనదని మనం చూస్తాము! మనందరికి సవాళ్లు కలవు. ఏది మారుతుందంటే కష్టమైనదానికి మన ప్రతిస్పందన.
మోర్మన్ గ్రంథములోని ప్రజలు “గొప్ప హింసలు” మరియు “అధిక శ్రమ” అనుభవించిరి (హీలమన్ 3:34). వారేవిధంగా స్పంధించారు? “సంతోషము మరియు ఓదార్పుతో వారి ఆత్మలు నింపబడు వరకు వారు తరచుగా ఉపవాసముండి ప్రార్థించిరి. వారి తగ్గింపునందు బలముగా మరింత బలముగా మరియు క్రీస్తు యొక్క విశ్వాసమందు ధృఢముగా మరింత దృఢముగా అయ్యిరి..” (హీలమన్ 3:35). అనేక సంవత్సరాలు యుద్ధము తరువాత మరొక ఉదాహరణ జరిగింది. “కానీ నీఫైయులు మరియు లేమనీయుల మధ్య సుదీర్ఘ కాలమున్న యుద్ధమును బట్టి, వారిలో అనేకులు కఠినపరచబడిరి. అనేకులు వారి బాధలను బట్టి మృదువుగా చేయబడిరి. ఎంతగానగా తగ్గింపు యొక్క లోతులకు కూడా వారు దేవుని యెదుట తమను తగ్గించుకొనిరి.”(ఆల్మా 62:41)
మనలో ప్రతిఒక్కరం కష్టమైనవాటికి మన స్పందనను ఎంచుకుంటాము.
సులభమైనవాటి యెడల జాగ్రత్తగా ఉండండి
ఈ పిలుపుకు ముందు టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో నేనొక ఆర్థిక సలహాదారుడను. నా పనిలో చాలావరకు కోటేశ్వరులతో ఉండేది వారు తమ స్వంత వ్యాపారాలను కలిగియున్నారు. వారిలో దాదాపు అందరు చాలా కష్టపడి పనిచేయడం ద్వారా ఏమిలేని స్థితినుండి విజయవంతమైన వ్యాపారాలను సృష్టించారు. విచారకరమైన విషయం ఏమిటంటే, వారిలో కొందరు తమ పిల్లలకు అది సులభముగా చెయ్యాలనుకుంటున్నారని చెప్పుచుండగా నేను వినడం. వారు కష్టపడినట్లుగా వారు తమ పిల్లలు కష్టపడకూడదని వారి కోరిక. ఇంకోవిధంగా చెప్పాలంటే, వారిని విజయవంతముగా చేసిన దానిని వారి పిల్లలకు అందకుండా చెయ్యడం.
దానికి భిన్నంగా, వేరొక విధానాన్ని ఎన్నుకున్న ఒక కుటుంబము మనకు తెలుసు. ఆ తల్లిదండ్రులు జే. సి. పెన్నీ యొక్క అనుభవముతో ప్రేరేపించబడ్డారు, ఆయనకు ఎనిమిదేండ్ల వయస్సు వచ్చినప్పుడు, ఆర్థికంగా తనకాళ్లపైన తాను నిలబడాలని ఆయన తండ్రి చెప్పారు. వారు తమ స్వంత విధానమును అవలంబించారు: ఉన్నత పాఠశాలను ప్రతి బిడ్డ పూర్తిచేసిన తరువాత, వారి తరువాత విద్యకొరకు (కళాశాల, విశ్వవిద్యాలయము మొదలైనవి) మరియు వారి ఆర్థిక అవసరాల కొరకు (నిజంగా స్వయంసమృద్ధి)గా వారు తమపై తాము ఆధారపడాలి (సి మరియు ని 83:4 చూడండి). సంతోషకరముగా, పిల్లలు తెలివిగా ప్రతిస్పందించారు. వారంతట వారే-వారందరు కళాశాల పూర్తిచేసారు, కొందరు ఉన్నత విద్యను అభ్యసించారు. అది సులభము కాదు, కాని దానిని వారు చేసారు. దానిని విశ్వాసముతో, కష్టపడి చేసారు.
ఆయనను నమ్ముటకు విశ్వాసము
ఆయనను మనం నమ్ముచున్నామా? అనే ప్రశ్న ఇంకా ఉత్తమంగా అడగవచ్చును, “ఆయనను నమ్ముటకు మనకు విశ్వాసముందా?” ఆయన మనల్ని లౌకికంగాను, ఆత్మీయముగాను దీవించునట్లు ఆయన ఆజ్ఞలను పాటించుటకు అవసరమైన విశ్వాసాన్ని మనం సాధన చేస్తామా? ఆయన తన సన్నిధిలో మనల్ని ఆహ్వానించునట్లు అంతము వరకు నమ్మకముగా ఉంటామా? (మోషైయ 2:41 చూడండి).
100 శాతం మన వార్షిక ఆదాయము కంటే 90 శాతం మన ఆదాయము మరియు ప్రభువు సహాయముతోనే మనం బాగా ఉంటామని దశమ భాగము గురించి ఆయన వాగ్దానమును నమ్ముటకు మనము తగినంత విశ్వాసమును కలిగియున్నామా?
ఆయన మన శ్రమలలో మనల్ని దర్శిస్తారని (మోషైయ 24:14 చూడండి), మనతో వ్యాజ్యమాడువారితో ఆయన వ్యాజ్యమాడునని (యెషయా 49:25; 2 నీఫై 2:2), మరియు దేవుడు మన బాధలను మన లాభము కొరకు ప్రతిష్ఠించునని (2 నీఫై 2:2చూడుము) నమ్ముటకు మనకు చాలినంత విశ్వాసమున్నదా?
ఆయన మనల్ని లౌకికంగాను, ఆత్మీయముగాను దీవించునట్లు ఆయన ఆజ్ఞలను పాటించుటకు అవసరమైన విశ్వాసాన్ని మనం సాధన చేస్తామా? ఆయన తన సన్నిధిలో మనల్ని ఆహ్వానించునట్లు అంతము వరకు నమ్మకముగా ఉంటామా? (మోషైయ 2:41 చూడండి).
సహోదరీ, సహోదరులారా, ఆయనను నమ్ముటకు మనం విశ్వాసాన్ని కలిగియుండగలము! (మోషే 1:39 చూడండి). ఆయన మన ప్రార్థనలకు జవాబిచ్చును (సి మరియు ని 112:10 చూడండి). ఆయన తన వాగ్దానమును నెరవేర్చును (సి మరియు ని 1:38). ఆ వాగ్దానాలను నెరవేర్చుటకు ఆయన శక్తిని కలిగియున్నారు (ఆల్మా 37:16 చూడండి). ఆయనకు సమస్తము తెలుసు! మరిముఖ్యముగా, ఏది శ్రేష్టమైనదో ఆయనకు తెలుసు (యెషయా 55:8–9 చూడండి).
భయంకరమైన ప్రపంచము
నేడు మన ప్రపంచము కష్టతరమైనది. ప్రతీ దేశములో విస్తరించిన చెడుతనము, అవినీతి, సురక్షితమైన స్థలాలకు కూడా తీవ్రవాదము చేరుకోవడం, ఆర్థిక పతనము, నిరుద్యోగము, వ్యాధి, ప్రకృతి వైపరిత్యాలు, ప్రజాయుద్ధము, నియంత నాయకులు మొదలైనవి. మనమేమి చెయ్యాలి? మనం పారిపోవాలా లేదా పోరాడాలా? ఏది సరైనది? ఏ ఎంపికయైనా ప్రమాదమే. పోరాడటం జార్జ్ వాషింగ్టన్ మరియు తన సైన్యాలకు ప్రమాదకరముగా ఉండెను కాని మన అగ్రగామి పూర్వికులకు పారిపోవడం కూడా ప్రమాదకరముగా ఉండెను. స్వాతంత్ర్యము కొరకు శ్రమపడటం నెల్సన్ మండేలాకు ప్రమాదకరముగా ఉండెను. చెడు ప్రబలమగుటకు కేవలం మంచివారు ఏమీ చెయ్యకుండా ఉండటం అవసరమని చెప్పబడింది. 4
భయపడవద్దు !
మనమేది చేసినను, భయపడు ఆత్మతో మనం చెయ్యకూడదు, లేక నిర్ణయించుకూడదు. యదార్థంగా, “దేవుడు మనకు పిరికితనము గల ఆత్మ నియ్యలేదు” (2 తిమోతి 1:7). (“భయపడకుడి” అనే ఆలోచన లేఖనములన్నిటిలో నొక్కిచెప్పబడినదని మీరు గమనించారా?) నిరుత్సాహము మరియు భయము అపవాది యొక్క సాధనాలని ప్రభువు నాకు నేర్పారు. కష్టమైన సమయాలకు ప్రభువు యొక్క సమాధానము విశ్వాసముతో ముందుకు సాగిపోవడం.
ఏది కష్టము?
మనలో ప్రతి ఒక్కరు ఏది కష్టమైనది అనేదానికి వేర్వేరు అభిప్రాయాలను కలిగియుండవచ్చును. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు దశమ భాగము చెల్లించుట కష్టమని కొందరు పరిగణించవచ్చును. పేదలు దశమ భాగమును చెల్లించాలని ఆశించడం కొన్నిసార్లు నాయకులకు కష్టముగా అనిపించవచ్చును. వివాహము చేసుకొనుట లేదా కుటుంబాన్ని కలిగియుండుటకు విశ్వాసముతో ముందుకు సాగడం మనలో కొందరికి కష్టముగా ఉండవచ్చును. “ప్రభువు [వారికి] అప్పగించిన వాటితో సంతృప్తిపడుట” కష్టముగా భావించేవారు ఉన్నారు. (ఆల్మా 29:3) మన ప్రస్తుత పిలుపుతో సంతృప్తిపడటం కష్టముగా ఉండవచ్చును (ఆల్మా 29:6 చూడుము). సంఘ క్రమశిక్షణ చాలా కష్టముగా ఉండవచ్చును, కాని కొంతమందికి అది నిజమైన పశ్చాత్తాప విధానమునకు ఆరంభము కావచ్చును.
సమస్య ఏదైనప్పటికి, విశ్వాసముతో ముందుకు సాగి, ప్రభువును, ఆయన ప్రణాళికను నమ్మేవారికి కష్టము మంచిగా ఉండవచ్చును.
నా సాక్ష్యము
నా సహోదరీ, సహోదరులారా, నా వెనుక కుర్చొని ఉన్న ఈ నాయకులు దేవునిచేత పిలవబడ్డారని నేను సాక్ష్యమిస్తున్నాను. వారి కోరిక ప్రభువుకు భాగా సేవ చెయ్యడం మరియు మన హృదయాలలో సువార్తను నెలకొల్పుటకు మనకు సహాయం చెయ్యడం. నేను వారిని ప్రేమించి, ఆమోదిస్తున్నాను.
మన రక్షకుడైన యేసు క్రీస్తును నేను ప్రేమిస్తున్నాను. మన రక్షకుడు మరియు విమోచకుడు అగుటకు ఆయన తండ్రిని, మనల్ని తగినంత ప్రేమించారని, ఆవిధంగా చెయ్యడం ద్వారా ఆయన శ్రమపడ్డారని, ఆయన “బాధతో వణికి, ప్రతి రంధ్రమునుండి రక్తము కారి, శరీరమందును, ఆత్మనందును శ్రమపడ్డారని” (సి మరియు ని 19:18) నేను ఆశ్చర్యపోయాను. ఈ బాధాకరమైన సందర్భాన్ని ఎదుర్కొని మరియు అది ఆవశ్యకమైనది కాబట్టి, ఆయన తండ్రితో, “నా చిత్తము కాదు, నీ చిత్తమే నెరవేరును” ( లూకా 22:42) అని చెప్పారు. దూత మాటలందు నేను ఆనందిస్తున్నాను: “ఆయన ఇక్కడలేడు: ఆయన లేచియున్నాడు”( మత్తయి 28:6).
ఆయన మాదిరి నిజంగా “మార్గము, సత్యము మరియు జీవము” (యోహాను 14:6). ఆ మాదిరిని అనుసరించడం ద్వారా మాత్రమే “ఈ లోకములో శాంతిని, రాబోవు లోకముల నిత్యజీవమును” (సి మరియు ని 59:23) మనం పొందగలము. ఆయన మాదిరిని నేను అనుసరించి మరియు ఆయన బోధనలు అన్వయించినప్పుడు, ఆయన “అమూల్యములును మరియు అత్యధికములునైన వాగ్దానములలో” (2 పేతురు1:4) ప్రతీదీ సత్యమని నేను నేర్చుకున్నాను.
నా కోరికలలో గొప్పవి యేసు యొక్క నిజమైన శిష్యునిగా మోర్మన్‌తో నిలబడుట (3 నీఫై 5:13) మరియు ఒకరోజు ఆయన పెదవులనుండి ఈ మాటలు వినడం, “భళా, నమ్మకమైన మంచి దాసుడా” (మత్తయి 25:21). యేసు క్రీస్తు నామములో, ఆమేన్.