మోర్మన్ యొక్క గ్రంథము యొక్క శక్తి
ప్రతీరోజు మోర్మన్ యొక్క గ్రంథమును ప్రార్థనాపూర్వకంగా చదివి, ధ్యానించాలని మనలో ప్రతిఒక్కరిని వేడుకొంటున్నాను.
యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము యొక్క గొప్ప సర్వసభ్య సమావేశములో మనము మరలా కలుసుకున్నప్పుడు మిక్కిలి మనపూర్వకమైన శుభాకాంక్షలను నేను మీకు తెలియచేస్తున్నాను. ఈ రోజు నా సందేశమును ప్రారంభించకముందు, క్రింది ప్రదేశాలలో కట్టబడే ఐదు క్రొత్త దేవాలయాలను ప్రకటించాలని నేను కోరుచున్నాను: బ్రసిలియా, బ్రెజిల్; గ్రేటర్ మనీలా, ఫిలిప్ఫైన్స్ ప్రాంతము; నైరోబి, కెన్యా; పొకటెల్లా, ఐడాహో, అమెరికా; మరియు సారాగొటా స్ప్రింగ్స్, యూటా, అమెరికా.
ఈ ఉదయమున, మోర్మన్ గ్రంథము యొక్క శక్తి గురించి మరియు ఈ సంఘ సభ్యులుగా మనము కలిగియున్న క్లిష్టమైన అవసరత గురించి నేను మాట్లాడతాను. మోర్మన్ గ్రంథము యొక్క స్థిరమైన మరియు నిశ్చయమైన సాక్ష్యమును కలిగియుండుట యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా చెప్పబడుట సాధ్యము కాదు.
మనము గొప్ప కష్టము మరియు దుష్టత్వముగల కాలములో జీవిస్తున్నాము. నేటి లోకములో చాలా ప్రబలియున్న పాపము మరియు చెడు నుండి మనల్ని కాపాడేదేమిటి? మన రక్షకుడైన, యేసు క్రీస్తు మరియు ఆయన సువార్తను గూర్చి బలమైన సాక్ష్యము భద్రత ద్వారా చూచుటకు మనకు సహాయపడును. ప్రతీరోజు మీరు మోర్మన్ యొక్క గ్రంథమును చదవని యెడల, దయచేసి చదవండి. దానిని మీరు ప్రార్థనాపూర్వకంగా చదివి మరియు సత్యమును తెలుసుకొనుటకు నిజాయితీగల కోరికతో అడిగిన యెడల, పరిశుద్ధాత్మ దాని సత్యమును మీకు ప్రత్యక్షపరచును. అది సత్యమైతే ---అప్పుడు జోసఫ్ స్మిత్ తండ్రియైన దేవునిని మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తుని చూచిన ఒక ప్రవక్త---అది సత్యమని— నేను గంభీరముగా సాక్ష్యమిస్తున్నాను.
మోర్మన్ యొక్క గ్రంథము సత్యము కనుక, యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము భూమి మీద ప్రభువు యొక్క సంఘము, మరియు దేవుని యొక్క పరిశుద్ధ యాజకత్వము ఆయన బిడ్డల ప్రయోజనము కొరకు దీవెన కొరకు పునస్థాపించబడింది.
ఈ విషయాలను గూర్చి మీరు బలమైన సాక్ష్యమును కలిగియుండని యెడల, ఒకటి పొందటానకి అవసరమైన దానిని చేయుము. ఈ కష్ట సమయాలలో మీ స్వంత సాక్ష్యమును కలిగియుండుట మీకు అనివార్యమైనది, ఏలయనగా ఇతరుల యొక్క సాక్ష్యములు కొంతవరకు మాత్రమే మిమ్మల్ని తీసుకొనివెళతాయి. అయినప్పటికిని, ఒకసారి పొందాక, దేవును ఆజ్ఞలకు నిరంతర విధేయత, ప్రతీరోజు ప్రార్థన మరియు లేఖన అధ్యయనము ద్వారా ఒక సాక్ష్యము ఉత్సాహవంతంగా మరియు సజీవంగా ఉంచబడాల్సిన అవసరమున్నది.
ప్రభువు యొక్క కార్యములో నా ప్రియమైన సహవాసులారా, ప్రతీరోజు మోర్మన్ యొక్క గ్రంథమును ప్రార్థనాపూర్వకంగా చదివి మరియు ధ్యానించమని మనలో ప్రతిఒక్కరిని వేడుకొనుచున్నాను. మనము ఆవిధంగా చేసినప్పుడు, ఆత్మ యొక్క స్వరమును వినుటకు, శోధనను ఎదిరించుటకు, సందేహము, భయమును జయించుటకు, మరియు మన జీవితాలలో పరలోకము సహాయమును పొందు స్థానములో మనముంటాము. ఆలాగున నేను నా పూర్ణ హృదయముతో యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.