2010–2019
హెచ్చరించు స్వరము
April 2017 General Conference


హెచ్చరించు స్వరము

హెచ్చరించు బాధ్యత ప్రత్యేకంగా ప్రవక్తలచేత భావించబడుచుండగా, అదేవిధంగా అది ఇతరులచేత పంచుకొనబడిన బాధ్యత.

లీహై మరియు అతడి కుటుంబము యెరూషలేము విడచి వెళ్ళుటకు రెండు దశాబ్ధాలకు ముందు, యెహెజ్కేలు ప్రవక్త జన్మించాడు. క్రీ. పూ. 597లో, 25 సంవత్సరాల వయస్సులో, యెహెజ్కేలు నెబుకద్నేజరు చేత బానిసలుగా తీసుకోబడిన వారిలో ఒకడు, మనము బాగా చెప్పాలంటే, అతడు తన జీవితములో మిగిలిన భాగము అక్కడే గడిపాడు. 1 అతడు అహరోను యాజకత్వ వంశమునకు చెందిన వాడు, మరియు 30 సంవత్సరాలప్పుడు, అతడు ప్రవక్త అయ్యాడు. 2

యెహెజ్కేలును నియమించినప్పుడు, యెహోవా కావలివాని ఉపమానమును ఉపయోగించాడు.

“అతడు దేశము మీదకు ఖడ్గము వచ్చుట చూచి, బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున;

“ఎవడైనను బాకానాదము వినియును జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి ప్రాణము తీసిన యెడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది.”3

మరొకవైపు, “అయితే కావలివాడు, ఖడ్గము వచ్చుట చూచియు, బాకా ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు, ఖడ్గము వచ్చి వారిలో ఒకరి ప్రాణము తీయుటయు, తటస్థించిన యెడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను, నేను కావలివాని యొద్ద వాని ప్రాణమును గూర్చి విచారణ చేయుదును.”4

యెహెజ్కేలుతో నేరుగా మాట్లాడుతూ, యెహోవా ప్రకటించాడు, “నరపుత్రుడా నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించియున్నాను, గనుక నీవు నా నోటిమాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను.”5 ఆ హెచ్చరిక ఏమనగా, పాపము నుండి మరలిపోవుట.

“దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదువు; అని దుర్మార్గునికి నా మాట తెలియజేయని యెడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణమునొందును; గాని అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణను చేయుదును.

“అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువవలెనని, నీవు అతనిని హెచ్చరిక చేయగా; అతడు తన దుర్మార్గతను విడువని యెడల అతడు తన దోషముబట్టి మరణము నొందును; గాని నీవు నీ ప్రాణము దక్కించుకొందువు. . . .

“మరియు నిజముగా మరణము నొందుదువని దుర్మార్గునికి సెలవియ్యగా అతడు తన పాపము విడిచి, నీతి న్యాయములను అనుసరించిన యెడల అతడు మరణము నొందక ఆవశ్యముగా బ్రదుకును; . . . .

“అతడు చేసిన పాపములో ఏదియు అతని విషయమై జ్ఞాపకమునకు తేబడదు, అతడు నీతిన్యాయములను అనుసరించెను గనుక నిశ్చయముగా అతడు బ్రదుకును.”6

ఆసక్తికరంగా, ఈ హెచ్చరిక నీతిమంతులకు కూడా అన్వయిస్తుంది. “నీతిమంతుడు నిజముగా బ్రదుకునని నేను చెప్పినందున; అతడు తన నీతిని ఆధారము చేసికొని పాపము చేసిన యెడల అతని నీతి క్రియలన్నిటిలో ఏదియు జ్ఞాపకమునకు తేబడదు, తాను చేసిన పాపమును బట్టి మరణము నొందును.”7

తన బిడ్డలతో వేడుకొంటూ, దేవుడు యెహెజ్కేలుతో చెప్పును, “కాగా వారితో ఇట్లనుము, నా జీవముతోడు దుర్మార్గుడు మరణమునొందుట వలన నాకు సంతోషము లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గతనుండి మరలి బ్రదుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనస్సు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణము నొందుదురు?”8

నిందించుటకు త్వరపడుట కంటె, మన పరలోక తండ్రి మరియు రక్షకుడు మన సంతోషమును కోరుతున్నారు మరియు “దుష్టత్వము ఎన్నటికి (ఎప్పుడూ) సంతోషము కాదని బాగా ఎరిగి,”9 పశ్చాత్తాపపడమని మనల్ని వేడుకొంటున్నారు. కనుక యెహెజ్కేలుకు ముందు మరియు అప్పటినుండి, ప్రతీ ప్రవక్త దేవుని యొక్క వాక్యమును హృదయపూర్వకంగా మాట్లాడుతూ, వారి ఆత్మల యొక్క శత్రువైన సాతాను నుండి మరలమని, “నరులందరి యొక్క గొప్ప మధ్యవర్తి ద్వారా స్వేచ్ఛను మరియు నిత్య జీవమును కోరుకొను” 10 మని అందరిని హెచ్చరించారు.

హెచ్చరించు బాధ్యత ప్రవక్తల చేత ప్రత్యేకంగా తీక్షణంగా భావించబడగా, అదేవిధంగా అది అనేకమంది ఇతరులతో పంచుకొనబడిన బాధ్యత. వాస్తవానికి, “హెచ్చరించబడిన ప్రతీ మనుష్యుడు తన పొరుగువానిని హెచ్చరించుటకు తగియున్నది.” 11 సంతోషము యొక్క గొప్ప ప్రణాళికను గూర్చి జ్ఞానమును పొందిన మనము—మరియు దాని అమలు చేయు ఆజ్ఞలు—ఇక్కడ మరియు నిత్యత్వము జీవితములో, ప్రత్యేకతను కలిగియున్న ఆ జ్ఞానమును పంచుకోవాలనే కోరికను భావించాలి. నేను హెచ్చరించాల్సిన నా పొరుగువాడెవడని? మనము అడిగిన యెడల, “ఒక మనుష్యుడు యెరూషలేమునుండి యెరికోపట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగలచేతిలో చిక్కెను,”12 అని ప్రారంభమగు ఉపమానములో నిశ్చయముగా జవాబు కనుగొనబడును.

ఈ సందర్భములో మంచి సమరయుని యొక్క ఉపమానమును పరిశీలిస్తూ, నా పొరుగువాడెవడు? అను ప్రశ్న రెండు ఆజ్ఞలకు జతపరచబడిందని మనకు గుర్తు చేస్తుంది. “నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణమనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను.”13 హెచ్చరించు స్వరమును పైకి లేపుటకు ప్రేరణ ప్రేమ, దేవుని పట్ల, పొరుగువాని పట్ల ప్రేమ. హెచ్చరించుట శ్రద్ధ కలిగియుండుట. అది “శాంతము మరియు సాత్వీకమునందు” 14 “ అనునయము చేత, దీర్ఘశాంతము చేత, మంచితనము చేత , . . . కపటములేని ప్రేమతో చేయబడాలని“15 ప్రభువు సూచిస్తున్నారు. ఒక బిడ్డ తన చేతిని మంటలో పెట్టవద్దని మనము హెచ్చరించినప్పుడు, అది అత్యవసరమైనది. అది తప్పనిసరిగా స్పష్టముగా మరియు కొన్నిసార్లు స్థిరమైనదిగా ఉండాలి. ఈ సందర్భముగా, హెచ్చరిక “పరిశుద్ధాత్మ చేత కదిలించబడినప్పుడు,” 16 గద్దింపు రూపములో ఉండవచ్చు, కాని అది ఎల్లప్పుడు ప్రేమయందు నాటబడాలి. ఉదాహరణకు, మన మిషనరీల సేవ మరియు త్యాగములను ప్రేరేపించే ప్రేమను ప్రత్యక్షంగా చూడుము.

నిశ్చయముగా, తల్లిదండ్రులు వారి దగ్గరి “పొరుగువారైన,“ వారి స్వంత పిల్లలను హెచ్చరించుటకు ప్రేమ వారిని బలవంతం చేస్తుంది. సువార్త యొక్క సత్యములను బోధించుట మరియు సువార్త సత్యములను గూర్చి సాక్ష్యమిచ్చుట అని దాని అర్ధము. క్రీస్తు యొక్క సిద్ధాంతమును పిల్లలకు బోధించుట అని దాని అర్ధము విశ్వాసము, పశ్చాత్తాపము, బాప్తీస్మము, మరియు పరిశుద్ధాత్మ వరము. 17 “వెలుగు మరియు సత్యములో మీ పిల్లలను పెంచాలని నేను మీకు ఆజ్ఞాపిస్తున్నానని”18 ప్రభువు తల్లిదండ్రులకు గుర్తు చేస్తున్నాడు.

తల్లిదండ్రుల బాధ్యతలో కీలకమైన అంశము పాపము యొక్క హాని చేయు పరిణామాలను మాత్రమే కాదు కానీ ఆజ్ఞలకు విధేయతలో నడుచుట వలన కలిగే సంతోషమును కూడా వర్ణించాలి. దేవుని వెదకుటకు, పాపముల క్షమాపణను పొందుటకు, మరియు పరివర్తన చెందుటకు అతడిని నడిపించిన ఈనస్ మాటలను గుర్తుచేసుకొనుము:

“నేను అడవులలో మృగములను వేటాడుటకు వెళ్ళితిని మరియు తరచుగా నా తండ్రి నిత్యజీవము, మరియు పరిశుద్ధుల యొక్క సంతోషమును, గూర్చి పలుకగా వినిన మాటలు నా హృదయములో లోతుగా నాటుకున్నవి.

“మరియు నా ఆత్మ ఆకలిగొనెను, మరియు నేను నా సృష్టికర్త యెదుట మోకాళ్ళూనితిని, మరియు నా స్వంత ఆత్మ నిమిత్తము బలమైన ప్రార్ధన మరియు యాచనయందు, నేను ఆయనకు మొరపెట్టితిని.”19

ఇతరులు మరియు వారి సంతోషము కొరకు ఆయన అసాధారణమైన ప్రేమ మరియు ఆలోచన వలన, యేసు హెచ్చరించుటకు సందేహించలేదు. ఆయన పరిచర్య ప్రారంభములో, “అప్పటినుండి యేసు పరలోకరాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని; చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను.”20 ఏ మార్గమైన పరలోకమునకు నడిపించదని ఆయన ఎరుగును కనుక, ఆయన ఆజ్ఞాపించాడు:

“ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దానిద్వారా ప్రవేశించువారు అనేకులు:

“జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే.”21

“మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని,”22 చెప్పుచు ఆయన సమయమును పాపులకు అంకితమిచ్చెను. 22

శాస్త్రులు, పరిసయ్యులు, మరియు సద్దూకయ్యులకు, యేసు వారి వేషధారితనమును నిందించుటలో రాజీపడలేదు. ఆయన హెచ్చరికలు మరియు ఆజ్ఞలు నేరుగా ఉన్నవి: “అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకఱ్ఱలోను పదియవ వంతు చెల్లించి, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసియుండెను.”23 ఈ శాస్త్రులు, పరిసయ్యులను ప్రేమించనందుకు ఎవరూ రక్షకుని నిందించరు---ఏది-ఏమైనా ఆయన వారిని రక్షించుటకు కూడా బాధపడ్డాడు మరియు చనిపోయాడు. కాని వారిని ప్రేమిస్తూ, ఆయన వారిని సరిదిద్దకుండా, పాపములో కొనసాగనివ్వలేదు, ఈ సందర్భములో, చాలా శక్తివంతంగా, ఏ విధంగానైనా గెలవటానికి, ఏకైక విధానము కావచ్చు. ఒక పరిశీలకుడు గమనించాడు, “యేసు తాను చేసినట్లుగా చేయమని తన అనుచరులకు బోధించాడు: వారిని గాయపరిచే దానిగురించి జనులను హెచ్చరించమని ప్రేమ డిమాండు చేస్తుంది కనుక ప్రతీఒక్కరిని స్వాగతించాలి కాని పాపము గురించి కూడ బోధించాలి.” 24

కొన్నిసార్లు ధైర్యముగా హెచ్చరిక స్వరమును పైకెత్తువారు, విమర్శనాత్మకంగా ఉన్నారని త్రోసివేయబడతారు. అయినను, దీనికి విరుద్ధంగా, సత్యము సాపేక్షమైనది మరియు నైతిక ప్రమాణములు వ్యక్తిగత ఎంపికలపై ఆధారపడి యుండునని చెప్పువారు “సరియైన ఆలోచన” యొక్క ప్రస్తుత ప్రమాణమును అంగీకరించని వారిని అతి కఠినంగా విమర్శించే వారిగా ఉన్నారు. ఒక రచయత దీనిని “అవమానించే సంస్కృతిగా” పేర్కొన్నాడు

“అపరాధ భావాల సంస్కృతిలో మీ మనస్సాక్షి భావించే దాని ద్వారా మీరు మంచివారో కాదో మీకు తెలుసు. అవమానించే సంస్కృతిలో, మీ సమాజము మీగురించి చెప్పేదానిని బట్టి అది మిమ్మల్ని గౌరవిస్తుందో లేక మినహాయిస్తుందో దానిబట్టి, మీరు మంచివారో కాదో మీకు తెలుసు. . . (అవమానించే సంస్కృతిలో), నైతిక జీవితము మంచి, చెడుల అవిచ్ఛిన్నతపై కట్టబడలేదు, అది నిరంతర చేరిక మరియు మినాహాయింపులపై కట్టబడింది. . . .

“చేరిక మరియు మినాహాయింపులపై ఆధారపడి ప్రతిఒక్కరు నైతిక వ్యవస్థలో ఎల్లప్పుడు అభద్రతగా ఉన్నారు. గుంపు యొక్క మారుతున్న అభిప్రాయాల వలె శాశ్వతమైన ప్రమాణములేవి లేవు. అది అతి సున్నితత్వము, అతి ప్రతిఘటన మరియు తరచైన నైతిక భయాందోళనలు గల సంస్కృతి, ఈ సందర్భంగా ప్రతిఒక్కరు కలసి వెళ్ళటానికి ఒత్తిడి భావిస్తారు. . . . 

“అపరాధ భావాల సంస్కృతి కష్టమైనది కావచ్చు, కాని కనీసము మీరు పాపమును ఆసహ్యించుకుంటారు, ఇంకను పాపిని ప్రేమిస్తారు. ఆధునిక అవమానించే సంస్కృతి, చేరిక మరియు సహనములకు విలువిస్తున్నట్లు ఆరోపించును, కాని అది సమ్మతించని మరియు ఇమడని వారి పట్ల విచిత్రంగా నిర్దయగా ఉండగలదు.”25

దీనికి వ్యతిరేకమైనది, “మన విమోచకుని యొక్క బండ, ” 26 న్యాయము మరియు సుగుణము యొక్క స్థిరమైన, శాశ్వతమైన పునాది. అనూహ్యమైన చట్టములు మరియు సామాజిక మీడియా అల్లరిమూక యొక్క ఉగ్రతకు నిర్భందించబడుట కంటె మన గమ్యమును ఎన్నుకొని మరియు నియత్రించబడునట్లు దేవుని యొక్క మారని చట్టములను కలిగియుండుట ఎంత మేలైనది. “సిద్ధాంతము యొక్క ప్రతీ పవనముతో అటు ఇటు విసరివేయబడి మరియు మోసుకొనిపోబడుట కంటె, సత్యమును తెలుసుకొనుట ఎంత మేలైనది.” 27 మంచి చెడులు లేవని నటిస్తూ, పాపములో కృశించిపోవుట కంటే పశ్చాత్తాపపడి మరియు సువార్త ప్రమాణమునకు లేచుట ఎంత మేలైనది.

“సమస్త జనులకు, హెచ్చరించు స్వరము, ఈ కడవరి దినాలలో నేను ఎన్నుకొనిన, నా శిష్యుల స్వరము చేత,.”28 అని ప్రభువు ప్రకటించాడు. కావలివారిగా మరియు శిష్యులుగా, మనము “సర్వోత్తమమైన మార్గము,”29 గురించి తటస్థంగా ఉండలేము. యెహేజ్కేలు వలె, ఖడ్గము దేశముపై వచ్చుట చూడలేము మరియు “బాకా ఊదలేము.” 30 మన పొరుగువారి తలుపు కొట్టి లేక బహిరంగంగా “పశ్చాత్తాపపడండి!” అని కేకలు వేయుట కాదు. నిజముగా, దాని గురించి మీరు ఆలోచించినప్పుడు, జనులు లోలోపల నిజంగా కావాలని కోరుకునే దానిని పునస్థాపించబడిన సువార్తయందు మనము కలిగియున్నాము. కనుక హెచ్చరించు స్వరము సాధారణంగా, నాగరికమైనది మాత్రమే కాదు కానీ, కీర్తనాకారుని వాక్యము వలె, అది “సంతోష గీతము.”31

డిసర్ట్ వార్తలు అభిప్రాయ ఎడిటర్ హాల్ బాయిడ్ నిశ్శబ్దంగా ఉండుటలో అంతర్లీనమైన అపకారము యొక్క ఉదాహరణను వివరించాడు. వివాహము యొక్క ఆలోచన అమెరికాలోని ఉన్నత వర్గము మధ్య ఇంకా “మేధో చర్చ” అయినప్పటికిని, వివాహము దానికదే, ఆచరణలో వారికి చర్చనీయాంశము కాదు. “ఉన్నత వర్గమువారు వివాహము చేసుకొని నిలుపుకుంటారు మరియు వారి పిల్లలు స్థిరమైన వివాహము యొక్క ప్రయోజనాలను ఆనందించునట్లు చేస్తారు. . . . అయినను, సమస్య ఏమంటే, (వారు) ఆచరించే దానిని బోధించరు.” వారి నాయకత్వమును మరియు విలువలను బాగా ఉపయోగించగల వారిపై “విధించుటకు” వీరిష్టపడరు, కానీ “విద్య, బలమైన కుటుంబాలు గల వారు కపటమైన తటస్థ వైఖరిని ఆపాలి, వివాహము మరియు తల్లిదండ్రుల సంరక్షణకు సంబంధించి వారు ఆచరించే దానిని బోధించుటను ప్రారంభించుటకు . . . ఇది సమయము. ప్రయాసపడుతున్న అనేకమంది అమెరికన్ల కోసం, సమాజములోని మేధావులు దానిని అంగీకరించటమే కాదు కాని వారి సహ అమెరికన్లు దానిని హత్తుకొనుటకు కూడ సహాయపడుట మనకవసరం.”32

ప్రత్యేకంగా ఉదయిస్తున్న తరమైన మీకు, భవిష్యత్ సంవత్సరాలలో ఆయన కార్యము యొక్క విజయము కొరకు ప్రభువు ఆధారపడు యువత, యుక్తవయస్సువారు, బహిరంగంగా మరియు రహస్యంగా సువార్త యొక్క బోధనలను మరియు సంఘ ప్రమాణాలను ఆమోదిస్తారని మేము నమ్ముతున్నాము. సహనము లేక భయము—అసౌకర్యము, అసమ్మతి వలన భయము, లేక బాధ, భయము యొక్క తప్పుడు భావాలకు తలొగ్గవద్దు. రక్షకుని యొక్క వాగ్దానమును గుర్తుంచుకొనుము:

“నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.

“సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.” 33

చివరకు, మన ఎంపికలు మరియు మన జీవితాలను మనము జీవించు విధానము కొరకు దేవునికి మనమందరము వ్యక్తిగతంగా జవాబుదారులము. రక్షకుడు ప్రకటించాడు “నేను సిలువపైన పైకెత్తబడునట్లు నా తండ్రి నన్ను పంపియున్నాడు మరియు నేను మనుష్యులందరినీ నా వైపు ఆకర్షించుకొనునట్లు, నేను సిలువపైన పైకెత్తబడిన తరువాత మనుష్యుల చేత నేను పైకెత్తబడినట్టుగానే, అది మంచివేగానీ, లేక చెడ్డవేగానీ వారి క్రియలను బట్టి, తీర్పు తీర్చబడుటకు నా యెదుట నిలువబడుటకు, మనుష్యులు తండ్రి చేత పైకెత్తబడవలెను.” 34

ప్రభువు యొక్క ఆధిక్యత గుర్తిస్తూ, ఆల్మా యొక్క మాటలందు నేను వేడుకుంటున్నాను:

“మరియు ఇప్పుడు నా సహోదరులారా, మీరు నా మాటలను ఆలకించవలెనని మరియు మీ పాపములను విడిచి వేయవలెనని … మరియు మీ పశ్చాత్తాపము యొక్క దినమును ఆలస్యము చేయరాదని నేను, నా హృదయము యొక్క లోతులలో నుండి అంతేకాకుండా బాధ కలుగునంతగా కూడ, అధిక ఆసక్తితో కోరుచున్నాను;

“కానీ మీరు సహించ గలిగిన దాని కంటే అధికముగా మీరు శోధింపబడకుండునట్లు, దేవుని ఎదుట మిమ్ములను మీరు తగ్గించుకొని ప్రార్థన చేసి మరియు కనిపెట్టి మరియు నిరంతరము ప్రార్థించుదురని, మరియు ఆ విధముగా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడవలెనని కోరుచున్నాను. . . . ;

“మీరు అంత్య దినమున పైకి లేపబడి మరియు ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశించునట్లు, ప్రభువునందు విశ్వాసము కలిగి, మీరు నిత్య జీవమును పొందుదురను నిరీక్షణను కలిగి మీ యొక్క హృదయముల యందు ఎల్లప్పుడు దేవుని యొక్క ప్రేమను కలిగియుండవలెను.” 35

మనలో ప్రతిఒక్కరు, దావీదుతోపాటు ప్రభువుకు చెప్పెదము గాక: “నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడిచేసి యున్నాను: నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగుచేయలేదు. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు.”36 యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

ముద్రించు