లోకమును జయించుట
లోకమును జయించటం ఒక జీవిత కాలములో నిర్వచించు క్షణము కాదు, కానీ ఒక జీవిత కాలపు క్షణములు ఒక నిత్యత్వమును నిర్వచించును.
చాలా సంవత్సరముల క్రితం, అధ్యక్షులు డేవిడ్ ఓ. మెఖే సమోవా వైపు తెరచాప పడవలో ప్రయాణిస్తుండగా ఎదురైనా ఒక అందమైన అనుభూతి గురించి చెప్పారు. ఆయన నిద్రపోయిన తరువాత, “ఒక స్వప్నములో-- ఏదో అనంతమైన మహోత్కృష్టమైన దానిని చూసారు. దూరములో, ఆయన చెప్పారు,” “నేను ఒక అందమైన తెల్లటి నగరమును చూసాను. . . ప్రతీచోటా, తియ్యని పండ్లతో మరియు పరిపూర్ణంగా వికసించిన పువ్వులతో ఉండెను. . . . అక్కడ ఒక గొప్ప జన సమూహము నగరమును సమీపిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఒక తెల్లని పొడుగైన అంగీ ధరించారు. . . తక్షణమే నా ధ్యాస వారి నాయకుడి పైకి మళ్ళింది, మరియు ఆయన ముఖవైఖరి యొక్క రూపము మాత్రమే చూడగలిగినప్పటికిని, … ఆయనను నా రక్షకుడిగా నేను వెంటనే గుర్తించాను! ఆయన ముఖ కవళిక యొక్క ప్రకాశం ఎంతో మహిమకరమైనది. . . . ఆయనను గూర్చిన శాంతి . . . దైవ సంబంధమైనది!”
అధ్యక్షులు మెఖే ఇలా కొనసాగించారు, “ఆ నగరం . . . ఆయనది. . . . నిత్యమయిన నగరం; మరియు ఆయనను వెంబడిస్తున్న జనులు శాంతితో మరియు నిత్యమైన సంతోషముతో అక్కడ నివసించాలి.
అధ్యక్షులు మెఖే ఆశ్చర్యంతో ఇలా అన్నారు “వారు ఎవరు? [ఆ జనులు ఎవరు?]”
తరువాత జరిగిన దానిని ఆయన వివరించును:
“నా ఆలోచనలను రక్షకుడు చదివినట్టుగా, బంగారంతో వ్రాయబడి. . . ఒక అర్ధచంద్రాకారంలో ఉన్న (పదముల) వైపు చూపిస్తూ జవాబిచ్చారు. . . (జనుల) పైగా అగుపడ్డాయి … :
“‘వీరే లోకమును జయించిన వారు
“వీరు నిజముగా తిరిగి జన్మించారు!’”1
కొన్ని దశాబ్దాలు, నేను ఆ పదములను గుర్తుంచుకొన్నాను: “వీరే లోకమును జయించిన వారు.”
ప్రంపంచమును జయించిన వారికి ప్రభువు వాగ్దానము చేసిన దీవెనలు ఉత్కంఠభరితమైనవి. వారు “తెల్లని వస్త్రాలతో కప్పబడెదరు. . . మరియు జీవపు గ్రంధములో వారి పేర్లు (వ్రాయబడును).” ప్రభువు (వారి పేర్లను) తండ్రి ముందు మరియు దేవదూతల ముందు ఒప్పుకొనును. ”2 ప్రతిఒక్కరు “నిత్యజీవము పొందుటకు మొదటి పునరుత్థానములో,”3 పాల్గొనెదరు4 మరియు దేవుని యొక్క సమక్షంలోనుండి బయటకు వెళ్లకుండా”5 ఉండెదరు.
లోకమును జయించుటకు మరియు ఈ దీవెనలు పొందడం సాధ్యమేనా? అవును, సాధ్యమే.
రక్షకుని కొరకు ప్రేమ
లోకమును జయించువారు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పట్ల లోతైన ప్రేమ కలిగి ఉంటారు.
ఆయన యొక్క దైవిక జననం, ఆయన పరిపూర్ణమైన జీవితం, గెత్సేమనే మరియు గొల్గతాలో ఆయన యొక్క అంతులేని ప్రాయశ్చిత్తము ద్వారా మనకి పునరుత్థానము అభయమివ్వబడింది. మన నిజాయితీగల పశ్చాత్తాపము ద్వారా మన పాపములనుండి మనల్ని శుద్ధిచేయగలుగుటకు, దేవుని సమక్షమునకు తిరిగి వెళ్ళుటకు మనల్ని అనుమతించుటకు ఆయన ఒక్కడికే సాధ్యము. “మనము ఆయనని ప్రేమిస్తున్నాము ఎందుకంటే ఆయనే మనల్ని ముందుగా ప్రేమించారు”6
యేసు చెప్పేను, “ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను.” 7
తరువాత ఇలా చెప్పెను; “నావలె మీరు కూడా లోకమును జయించాలి.”8
లోకమును జయించటం ఒక జీవిత కాలములో నిర్వచించు క్షణము కాదు, కానీ ఒక జీవిత కాలపు క్షణములు ఒక నిత్యత్వమును నిర్వచించును.
అది ఒక బిడ్డ ప్రార్ధన చేయుట నేర్చుకొనినప్పుడు మరియు వినయముగా, “నేను యేసువలె ఉండుటకు ప్రయత్నిస్తున్నాను.”9 అనే పాటను పాడుతున్నప్పుడు మొదలు అవ్వచ్చు. అది ఒక మనిషి క్రొత్త నిబంధనలో రక్షకుని యొక్క జీవితమును చదివినప్పుడు మరియు మోర్మన్ గ్రంధములో రక్షకుని ప్రాయశ్చిత్తము యొక్క శక్తిని ధ్యానించటంతో అది కొనసాగుతుంది.
ప్రార్ధన చేయుట, పశ్చాత్తాప పడుట, రక్షకుని వెంబడించుట, మరియు ఆయన కృపను పొందుట మనము ఇక్కడ ఎందుకు ఉన్నాము, మనము ఎవరిలాగా మారాలా అనే ప్రశ్నలకు సరైన అవగాహనకు మనల్ని నడిపించును.
ఆల్మా ఈ విధముగా వివరించాడు: “వారి హృదయముల యందు కూడ ఒక బలమైన మార్పు వచ్చెను, మరియు వారు తమను తగ్గించుకొనిరి మరియు నిజమైన మరియు సజీవుడైన దేవుని యందు తమ విశ్వాసముంచిరి. . . అంతము వరకు విశ్వాసముగా (నిలిచియున్నారు).” 10
లోకమును జయించువారు తమ పరలోక తండ్రికి వారు జవాబుదారులని తెలుసు. హృదయపూర్వకముగా మార్పు చెందడం మరియు పాపముల కొరకు పశ్చాత్తాపపడడం, అనేది నిర్భందించేది కాదు కానీ “పాపములు రక్తమువలె యెఱ్ఱనివైనను.. అవి హిమమువలె తెల్లబడినప్పుడు,”11 విడుదల కలిగించును.
దేవునికి లెక్క చెప్పుట
లోకమునకు చెందిన వారికి, దేవునికి లెక్క అప్పగించుట కష్టముగా ఉన్నది----- ఎలాగంటే, ఒక బిడ్డ తన తండ్రుల ఇంటిలో విందు చేస్తూ, గొడవను ఆనందిస్తూ, 24 గంటల తరువాత అతని తల్లితండ్రులు తిరిగి వచ్చాక కలిగే పరిణామాల గురించి ఆలోచించుటకు తిరస్కరించుట వలె ఉన్నది.
లోకము ప్రకృతి సంబంధియైన మనుష్యుని జయించుటకు కంటే యధేచ్ఛగా నడుచుటకు ఎక్కువ ఆసక్తి కలిగియున్నది.
లోకమును జయించడం అనేది ఒక ప్రపంచ దండయాత్ర కాదు, కానీ అది ఒక సొంతమైన, వ్యక్తిగతమైన యుద్ధం, దానికి మన అంతర్గత శతృవులతో పోరాటం అవసరము.
లోకమును జయించుట అనగా మిక్కిలి గొప్ప ఆజ్ఞను విలువైనదిగా ఎంచుట: “నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, ప్రేమింపవలెను.”12
క్రైస్తవ రచయిత సి. ఎస్. లూయిస్ ఈ విధముగా వివరించారు: “క్రీస్తు ఇలా చెప్పును ’నాకు అన్ని ఇవ్వుము. నేను మీ ఎక్కువ సమయము, మీ ఎక్కువ డబ్బు మరియు మీ ఎక్కువ పనిని కోరటంలేదు, నాకు మీరు కావాలి.’”13
లోకమును జయించడం అనగా -- దేవునికి మనము చేసిన వాగ్దానములను పాటించుట, మన బాప్తీస్మపు మరియు దేవాలయ నిబంధనలు, మన నిత్య సహవాసులకు మన ప్రమాణము యొక్క విశ్వసనీయత. లోకమును జయించుట క్షమాపణ అడుగుతూ, ఆయన ఆత్మ మనతో ఉండునట్లు, ఆయనను జ్ఞాపకముంచుకొని, ఆయన ఆజ్ఞలను పాటించుటకు, ప్రతిజ్ఞ చేయుచూ ప్రతీవారము సంస్కార బల్ల వద్దకు సవినయముగా ప్రతిజ్ఞ చేయుటకు మనల్ని నడిపించును.”14
సబ్బాతు దినము కొరకు మన ప్రేమ సంఘపు తలుపులు మూయగానే ఆగిపోదు, కానీ బదులుగా, వాడుక ప్రకారమైన పనుల నుండి విశ్రాంతి, చదవటం, ప్రార్థించటం, మరియు కుటుంబానికి మరియు మన ఆసక్తి అవసరమైన ఇతరులకు చేరువుగా ఉండు అందమైన దినమునకు తలుపులు తెరచును. సంఘము ముగిసిన తరువాత ఉపశమనంగా నిట్టూర్చి, ఫుట్ బాల్ క్రీడ మొదలవక ముందు టెలివిజను పరిశోధించుటలో వెఱ్ఱిగా పరుగులెత్తుటకు బదులుగా, మన దృష్టి రక్షకునిపై మరియు ఆయన పరిశుద్ధ దినముపై నిలుపుకొందాము.
నయవంచన మరియు దుర్బుద్ధిని కలుగచేసే స్వరముల వరదతో నిరంతరం లోకము లాగబడుచున్నది. 15
లోకముని జయించడం అనగా, హెచ్చరించు, ఓదార్చు, జ్ఞానవృద్ది కలుగచేయు, మరియు “లోకము ఇచ్చునట్లుగా కాక”16 శాంతిని తెచ్చు ఒక స్వరమునందు నమ్మకముంచుట.
నిస్వార్ధము
లోకమును జయించడం అనగా మనల్ని సహజముగా మార్చుకుంటూ రెండవ ఆజ్ఞను గుర్తు తెచ్చుకోవడం17: “మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై యుండవలెను.”18 మన జీవిత భాగస్వామి యొక్క ఆనందం మన ఆనందముకంటే ఎక్కువ ముఖ్యమైనది. మన పిల్లలు దేవునిని ప్రేమించుటకు, ఆయన ఆజ్ఞలు పాటించుటకు సహాయపడుట మన ప్రధాన ప్రాధాన్యత. మన ఐహిక దీవెనలను దశమభాగము, ఉపవాస కానుకలు, మరియు అవసరతలో ఉన్న వారికి మనము ఇష్టపూర్వకంగా పంచుకుంటాము. మన ఆధ్యాత్మిక యాంటెన్నాలు పరలోకము వైపు సూచించినట్లుగా, మనము సహాయము చేయగల వారిని ప్రభువు మనకి నడిపించును.
లోకము తన చుట్టూ ఒక విశ్వమును కట్టుకొని, గర్వముగా ప్రకటించును: “నా పొరుగువారితో నన్ను పోల్చి చూడుము! నాకున్నది చూడుము! నేనేంత ముఖ్యమైనవాడినో చూడుము! ”
లోకమును జయించుట వినయము, సానుభూతి, సహనము, మరియు మీకంటే భిన్నంగా ఉన్నవారి పట్ల కనికరమును తెచ్చుచుండగా, లోకము త్వరగా చిరాకుపడుతుంది, ఆసక్తి చూపదు, దబాయించి అడుగును, జనముల యొక్క ప్రోత్సాహమును ప్రేమించును.
ప్రవక్తలందు క్షేమము
లోకమును జయించడం, ఎల్లప్పుడు మనము నమ్మకాలలో కొన్ని లోకము చేత హేళన చేయబడతాయి. రక్షకుడు ఇలా చెప్పెను:
“లోకము మిమ్మల్ని ద్వేషించినయెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు.
“మీరు లోకసంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును.”19
అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఈ ఉదయము చెప్పారు, “యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులు ధైర్యముగా నిలబడుటకు, మాట్లాడుటకు సమ్మతిస్తారు మరియు ప్రపంచములోని జనులనుండి భిన్నంగా ఉంటారు.”20
క్రీస్తు యొక్క శిష్యుడు తన నమ్మకాల గురించి ఫేస్ బుక్ పేజీ లో పడి వేలు లైక్స్ లేక కొన్ని ఎమోజీలు పొందకపోయిన అందోళన చెందరు.
లోకమును జయించుట మన ఆన్ లైన్ సంబంధాలతో తక్కువ చింత కలిగి, దేవునితో మన పరలోక సంబంధముతో ఎక్కువ చింత కలిగియుండుట.
ఆయన జీవించుచున్న ప్రవక్తలు మరియు అపొస్తలుల నుండి వచ్చిన నడింపింపును మనము లక్ష్యపెట్టినప్పుడు ప్రభువు మనకు క్షేమమును ఇచ్చును.
అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ ఇలా చెప్పారు: “లోకము . . . క్లిష్టమైనది కావచ్చును. . . (మనము దేవాలయమునకు వెళ్ళినప్పుడు), . . . మనము ప్రతీ శ్రమను ఎక్కువగా భరించగలుగుతాము మరియు ప్రతీ శోధనను ఎక్కువగా జయించగలుగుతాము. . . మనము క్రొత్తగా చేయబడతాము మరియు పటిష్టపరచబడతాము.”21
శోధనలు, అంతరాయములు, మరియు వికారములు హెచ్చగుటతో, లోకము ఒకరి గతములోని గొప్ప ఆత్మీయ అనుభవాలను అవివేకమైన మోసాలుగా వాటిని పునర్నిర్వచించి, త్రోసివేయుటకు విశ్వాసులను మభ్యపరచుటకు లోకము ప్రయత్నించును.
లోకమును జయించటమనగా, కొన్ని సమయాలలో మనము నిరాశను చెందిననప్పుడు కూడా మన రక్షకుని యొక్క ప్రేమ మరియు వెలుగును అనుభవించిన సమయాలను జ్ఞాపకము చేసుకొనుట. ఎల్డర్ నీల్ ఎ. మాక్సవెల్ ఈ అనుభవాలలో ఒకటి ఈవిధంగా వివరించారు: “నేను దీవింపబడ్డాను, నేను దీవించబడ్డానని నాకు తెలుసని దేవునికి తెలుసని నేను ఎరుగుదును.” 22 మనము తాత్కాలికంగా మరచిపోయినట్లు భావించినప్పటికిని, మనము మరచిపోము.
లోకమును జయించటమనగా మనము మర్త్యత్వము యొక్క కష్టాలను మరియు అన్యాయాలు నుంచి రక్షించుకుంటూ సన్యాసి జీవితం జీవించటం కాదు. బదులుగా, రక్షకుడు మరియు ఆయన వాగ్దానములకు మనల్ని దగ్గరగా చేస్తూ, అది విశ్వాసము యొక్క ఎక్కువ విస్తారమైన దృశ్యమునకు తెరచును.
పరిపూర్ణత అనేది ఈ జీవితంలో పూర్తికానప్పుడు, లోకమును జయించడం మనము ఒకరోజు “మనము ఆయన ముందు నిలబడి, (మన విమోచకుడు) ఆయన ముఖమును సంతోషముతో చూసి”23 మరియు ఆయన స్వరమును వినునట్లు, మన నిరీక్షణ వెలిగియుండునట్లు చేయును: “నా తండ్రి చేత ఆశీర్వదింపబడినవార లారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.”24
ఎల్డర్ బ్రూస్ డి. పోర్టర్ యొక్క మాదిరి.
గత సంవత్సరము డిశంబరు 28న, మా ప్రియమైన స్నేహితుడు మరియు ప్రియమైన ప్రధాన అధికారి ఎల్డర్ బ్రూస్ డి. పోర్టర్, తన మర్త్యత్వమును పూర్తి చేసారు. ఆయనకు 64 సంవత్సరాలు.
నేను బ్రూస్ ని మొదట బ్రిగమ్ యంగ్ విశ్వవిద్యాలము వద్ద కలిసాను, అతడు శ్రేష్టమైన మరియు మిక్కిలి తెలివైనవారిలో ఒకరు. హార్వార్డ్ విశ్వవిద్యాలయము నుండి డాక్టరేట్ పట్టభద్రతను పొందిన తరువాత, రష్యను వ్యవహారాలను నొక్కి చెప్పుతూ, బ్రూస్ యొక్క ఆలోచన మరియు రచన ప్రాముఖ్యతను తెచ్చెను, అది అతడిని దారి తప్పించియుండవచ్చు, కాని లోకము యొక్క ఐశ్వర్యము మరియు పొగడ్త అతడి దృక్పధమును ఎన్నడూ మసకబరచలేదు.25 అతడు, తన రక్షకుడైన యేసు క్రీస్తుకు; తన నిత్య సహవాసియైన సూసాన్ కు; తన పిల్లలు మరియు మనుమలకు విశ్వాసముగా ఉన్నాడు.
బ్రూస్ మూత్రపిండము లోపముతో జన్మించెను. అతడికి శస్త్ర చికిత్స జరిగింది, కాని కొంతకాలానికి అతడి మూత్రపిండాలు క్షీణించసాగాయి.
1995 లో, బ్రూస్ సాధారణ అధికారిగా పిలవబడిన స్వల్పకాలములోనే, మేము మా కుటుంబములతో కలిసి ఫ్రాంక్ ఫర్ట్ జర్మనీ లో సేవ చేసాము, అక్కడ అతడి కార్యము రష్యా మరియు తూర్పు యూరోపులో కేంద్రీకృతమైనది.
1997లో అతడి మూత్రపిండాలు పనితీరు మరియు ఆరోగ్యము విఫలమగుతున్నప్పుడు, ఎల్డర్ పోర్టర్ యొక్క జీవితం నాటకీయంగా మారింది. పోర్టర్ కుటుంబం సాల్ట్ లేక్ నగరమునకు తిరిగి వెళ్ళారు.
డెబ్బదిగా అతడు సేవ చేసిన 22 సంవత్సరాల సేవా కాలములో, 10 శస్త్రచికిత్సలు కలిపి బ్రూస్ చాలాసార్లు ఆసుపత్రిలో చేర్చబడ్డాడు. రెండు సందర్భాలలో రాత్రి గడవడం కష్టమని వైద్యులు సూసన్ కు చెప్పారు, కానీ అతడు బ్రతికాడు.
ప్రధాన అధికారిగా 12 సంవత్సరాలకు పైగా సేవ చేసాక, బ్రూస్ తన రక్తము శుద్ధి చేయుటకు డయాలిసిస్ పై ఉన్నాడు. ఆ సమయములో చాలావరకు, డయాలిసిస్ వారములో ఐదు సాయంత్రములు , ప్రతి సాయంత్రము నాలుగు గంటలు చికిత్సకు పట్టేది, ఆవిధంగా పగలంత తన పిలుపుకి సంబందించిన పనులు చేసి మరియు సర్వ సభ్య సమావేశము యొక్క పనులను వారాంతంలో అంగీకరించగలిగాడు. అనేక యాజకత్వము యొక్క దీవెనలు తరువాత కూడా అతడి ఆరోగ్యము మెరుగుపడనప్పుడు, బ్రూస్ తికమకపడ్డాడు, కానీ తాను ఎవరి యందు నమ్మికయుంచాడో అతడికి తెలుసు.26
2010 లో, బ్రూస్ తన కుమారుడైన డేవిడ్ యొక్క ఒక మూత్ర పిండాన్ని పొందారు, ఈసారి, అతడి శరీరము మార్పిడిని తిరస్కరించలేదు. అది ఒక అద్భుతము, అతనిలో కొత్త ఆరోగ్యమును తెస్తూ, చివరికి అతడు, సూసాన్ తో కలిసి వారికి ప్రియమైన రష్యాకు ప్రాంతీయ అధ్యక్షత్వములో సేవ చేయుటకు తిరిగి వెళ్ళుటకు అనుమతించింది.
గత సంవత్సరము, డిసెంబర్ 26న, సాల్ట్ లేక్ సిటీ లోని ఒక ఆసుపత్రిలో నిరంతర అంటువ్యాధులతో పోరాడిన తరువాత, అతడు వైద్యులను బయటకి వెళ్ళమని చెప్పెను. బ్రూస్ సూసాన్ తో, “తన ప్రాణమును కాపాడుటకు ఈ వైద్యులు చేయగలది ఏమీ లేదని తాను ఆత్మ ద్వారా యెరిగియున్నాను “ అని చెప్పెను. పరలోక తండ్రి తనను ఇంటికి తీసుకొని వెళతాడని తనకు తెలుసు. అతడు శాంతితో నింపబడును.”27
డిసెంబర్ 28న, బ్రూస్ తన కుటుంబమున్న ఇంటికి వెళ్లాడు. కొన్ని గంటల తరువాత, అతడు కుటుంబ సభ్యుల మధ్య, శాంతియుతంగా తన పరలోక నివాసమునకు తిరిగి వెళ్లాడు.
సంవత్సరాల క్రితం, బ్రూస్ పోర్టర్ తన పిల్లలకు ఈ మాటలను వ్రాసాడు:
“యేసు క్రీస్తు యొక్క ప్రేమ మరియు వాస్తవమును గూర్చి నేను కలిగియున్న సాక్ష్యమే, నా జీవితమునకు దిక్సూచి వలె ఉన్నది. అది ఆయన జీవిస్తున్నాడని, ఆయనే నా విమోచకుడని, మరియు అవసరతగల ప్రతీ సమయములో సహాయపడే స్నేహితుడు అని ఆత్మ యొక్క శుద్ధమైన, మండుచున్న సాక్ష్యము. ”28
“(రక్షకుడిని) తెలుసుకొనుట . . . మరియు ఆయన యందు విశ్వాసము ద్వారా ఈ లోకము యొక్క శ్రమలు మరియు శోధనలను జయించుట మనకు ఒక సవాలు.”29
“మనము విశ్వాసముగా, యధార్ధముగా ఉండి, ఆయన యందు నమ్మకముంచెదము.” 30
బ్రూస్ డగ్లస్ పోర్టర్ లోకమును జయించెను.
మనలో ప్రతిఒక్కరం లోకమును జయించుటలో మన ప్రయాసలందు కాస్త గట్టిగా ప్రయత్నించి, తీవ్రమైన నేరాలను తేలికగా తీసుకొనకుండా, చిన్న పొరపాటులందు సహనంతో ఉండి, ఆత్రంగా మన వేగమును హెచ్చించి మరియి ఉదారముగా ఇతరులకి సహాయపడదామా. మీరు రక్షకుడిని పూర్తిగా నమ్మిన యెడల, మీకు ఈ జీవితములో గొప్ప శాంతిని మరియు మీ నిత్య గమ్యము యొక్క గొప్ప అభయమును నేను మీకు వాగ్దానము చేస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.