2010–2019
సంఘము యొక్క స్నేహితులు మరియు పరిశోధకులకు
April 2017 General Conference


సంఘము యొక్క స్నేహితులు మరియు పరిశోధకులకు

మీరు బయల్పాటుకు వెలను చెల్లించిన యెడల, మిమ్మల్ని మీరు తగ్గించుకొని, చదవి, ప్రార్థించి, మరియు పశ్చాత్తాపపడిన యెడల, పరలోకములు తెరవబడును, మరియు యేసే క్రీస్తని మీరు తెలుసుకుంటారు.

1988, సెప్టెంబరు 16న, ఒక శుక్రవార సాయంత్రమున, అర్జంటైనా, బ్యునస్ ఎయిర్స్ లోని విసింటి లోపేజ్ వార్డు సమావేశ గృహములో, నేను యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ సభ్యునిగా బాప్తీస్మము పొందాను. ఆ రోజు ఒక మంచి స్నేహితుడు ఆలిన్ స్పాన్నస్ నాకు బాప్తీస్మమిచ్చాడు, మరియు నేను చాలా సంతోషంగా, తేలికగా, ఎక్కువగా నేర్చుకోవటానికి ఆత్రుతను అనుభూతి చెందాను.

చిత్రం
ఎల్డర్ కస్టా యొక్క బాప్తీస్మము

బాప్తీస్మమునకు నా బాటపై నేను నేర్చుకొన్న కొన్ని పాఠాలను---ఇంకా సంఘ సభ్యులు కాని వినుచున్న మీకు సహాయపడతాయని ఆశిస్తున్న పాఠాలను పంచుకోవాలని నేను కోరుతున్నాను. నేను తాకబడినట్లుగా ఆత్మచే మీ హృదయము తాకబడాలని నేను ప్రార్థిస్తున్నాను.

మొదట, మిషనరీలను కలుసుకొనుట

ఒక వ్యక్తి నిర్భందించు సవాళ్ళు, అవసరాలు, లేక ప్రశ్నలు లేకుండా మిషనరీలను కలుసుకొనుటకు మరియు వినుటకు ఎందుకు ఆసక్తి చూపిస్తాడు? నా విషయములో అది ప్రేమ---ఒక అమ్మాయి కొరకు ప్రేమ, రినీ అనే పేరు గల అమ్మాయి. నేను ఆమెను ప్రేమించాను, మరియు ఆమెను పెళ్ళి చేసుకోవాలని కోరాను. ఆమె భిన్నంగా ఉన్నది మరియు నాకు తెలిసిన అనేకమంది యువతుల నుండి ప్రత్యేకమైన ప్రమాణాలను కలిగియున్నది. కాని నేను ఆమె కోసం పడిపోయాను, నన్ను పెళ్ళి చేసుకోమని అడిగాను---ఆమె కాదన్నది!

చిత్రం
ఎల్డర్ మరియు సహోదరి కస్టా

నేను తికమక పడ్డాను. నేను మనస్సును ఆకర్షించగలనని అనుకున్నాను! నేను అందమైన 24 సంవత్సరాల వాడిని, మరియు మంచి ఉద్యోగముతో కళాశాల పట్టభద్రుడను. ఆమె తనను దేవాలయమునకు తీసుకొనివెళ్ళగల వారిని మాత్రమే వివాహము చేసుకోవాలని, ఒక నిత్య కుటుంబాలను కలిగియుండాలనే--- తన లక్ష్యములను గూర్చి చెప్పింది---మరియు నేను అడిగిన దానిని ఆమె తృణీకరించింది. అనుబంధమును కొనసాగించాలని నేను కోరాను, కనుక నేను మిషనరీలను వినటానికి అంగీకరించుటకు సమ్మతించాను. మిషనరీలను కలవటానికి ఇది మంచి కారణమా? అది నాకు మంచిది.

నేను మిషనరీలను మొదట కలిసినప్పుడు, వాళ్ళు చెప్పింది నేను ఎక్కువగా గ్రహించలేదు, నిజం చెప్పాలంటే, నేను వారికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఒక క్రొత్త మతమునకు నా హృదయము మూసి ఉన్నది. వాళ్ళు తప్పని రుజువు చేయాలని మరియు ఏ విధంగానైనా నన్ను పెళ్ళి చేసుకోమని రినీని ఒప్పించటానికి సమయాన్ని పొందటానికి మాత్రమే నేను కోరాను.

ఈరోజు నా పిల్లలు మిషను సేవ చేసారు మరియు చేస్తున్నారు, యేసు క్రీస్తు యొక్క సువార్తను బోధించుటకు ఈ యువతీ, యువకులు చేసే త్యాగమును నేను గ్రహించాను. నాకు బోధించిన అద్భుతమైన మిషనరీలు ఎల్డర్ రిచర్డ్ సన్, మరియు ఎల్డర్ హైలాండ్ కు నేను ఎక్కువ ఆసక్తిని చూపించి ఉండాల్సిందని నేను కోరుతున్నాను.

నా మొదటి పాఠము నుండి, సంఘము యొక్క స్నేహితులు మరియు పరిశోధకులైన మీతో నేను చెప్పుచున్నాను, ఒకసారి మిషనరీలతో మీరు కలుసుకొన్నాక, మీరు వారికి ప్రాముఖ్యతనివ్వండి, కేవలము మీ కోసం వారు తమ జీవితాలలో ముఖ్యమైన సంవత్సరాలను ఇచ్చివేస్తున్నారు.

రెండవది, సంఘానికి వెళ్ళుట

నేను సంఘ సమావేశానికి హాజరైన మొదటిసారి, నేను విన్న కొన్ని మాటలు నాకేమి అర్థములేవు. బీహైవ్ ఎవరు? అహరోను యాజకత్వము అనగా ఏమిటి? ఉపశమన సమాజము?

ఒక సంఘ సమావేశమునకు మీరు హాజరైన మొదటిసారి మరియు మీకు అర్థము కాని దేనిచేతనైనా మీరు తికమకపడిన యెడల, తొందరపడవద్దు! నేను కూడ అర్థము చేసుకోలేదు. కాని నేను అనుభవించిన భావనలు, శాంతి, సంతోషముగల క్రొత్త భావనలు నాకింకా గుర్తున్నాయి. అప్పుడు నాకు తెలియదు, కాని పరిశుద్ధాత్మ “ఇది సరియైనది” అని నా చెవులకు గుసగుసలాడింది.

కనుక ఈ పాఠమును ఒక్క మాటలో నన్ను చెప్పనియ్యండి: మీరు తికమకపడితే, కంగారుపడవద్దు; మీరు అనుభూతిచెందిన భావనలను గుర్తుంచుకొనుము; అవి దేవుని నుండి వచ్చినవి.

మూడవది మోర్మన్ గ్రంథమును చదువుట

మిషనరీలతో కొన్ని సమావేశాల తరువాత, నేను అంత ముందుకు వెళ్ళలేదు. సువార్త యొక్క సత్యమును గూర్చి నేను ఒక నిర్ధారణను పొందలేదని భావించాను.

ఒకరోజు, “మోర్మన్ గ్రంథమును చదువుతున్నావా?” రినీ నన్ను అడిగింది.

“లేదు,” నేను మిషనరీ లు చెప్పినది వింటున్నాను, అది సరిపోదా? నేను జవాబిచ్చాను.

తన కళ్ళలో కన్నీళ్ళతో, మోర్మన్ గ్రంథము సత్యమని తాను ఎరుగుదునని నాకు అభయమిచ్చింది, మరియు అది సత్యము అని తెలుసుకోవాలంటే, ఏకైక విధానము---ఏమిటో ఊహించు---దానిని చదవాలి! తరువాత అడగాలి!

చదివి, మీ హృదయాలలో ధ్యానించి, మరియు మోర్మన్ గ్రంథము నిజమైనదా, ఈ సంఘము సత్యమైనదా అని “యధార్ధమైన హృదయముతో, నిజమైన ఉద్దేశముతో, . . . క్రీస్తునందు విశ్వాసము కలిగి నిత్యడగు తండ్రియైన దేవునిని, క్రీస్తు యొక్క నామమందు అడుగుము”(మొరోనై 10:4)

కనుక, ఒక్క వాక్యములో మూడవ పాఠము:వీటిని మీరు పొందినప్పుడు--- మోర్మన్ గ్రంథము---చదివి అది సత్యమా కాదా అడగమని ప్రోత్సహించబడినప్పుడు, దయచేసి దానిని చెయ్యండి!

చివరిది, పశ్చాత్తాపపడుట

నేను పంచుకోవాలని కోరుకొనే చివరి అనుభవము పశ్చాత్తాపము గూర్చినది. నేను మిషనరీ పాఠములన్నీ తీసుకోవటం పూర్తి చేసిన తరువాత, నా జీవితంలో ఏదైనా మార్చాల్సిన అవసరమున్నదని నేనింకా ఒప్పించబడలేదు. ఒకరోజు నమ్మకం గల మిషనరీ ఎల్డర్ కట్లర్, స్వల్ప స్పానిష్ లో చెప్పాడు, “వాక్వీన్, ఆల్మా 42, మనం కలసి చదువుదాం, మరియు దానిని చదివినప్పుడు మేము నీ పేరును చేరుస్తాము.”

అది హాస్యాస్పదము గా నాకు అనిపించింది, కాని ఎల్డర్ కట్లర్ అడిగినట్లుగా నేను చేసాను మరియు 1 వచనము 1 చదివాను: “మరియు ఇప్పుడు నా కుమారుడా (వాక్వీన్), నీ మనస్సును కలత పరచుచున్నది, మరికొంత ఉన్నదని నేను చూచుచున్నాను. అది నీవు గ్రహించలేక యున్నావు.” ఓ! ఆ పుస్తకం నాతో మాట్లాడుతున్నది.

మనము  2 వచనములో చదువుచున్నాము: “ఇప్పుడు ఇదిగో, నా కుమారుడా (వాక్వీన్), నేను ఈ సంగతిని నీకు తెలియజేసెదను,” మరియు తరువాత ఆదాము యొక్క పతనము వివరించబడ్డాయి.

తరువాత  4 వచనములో : “మరియు ఆ విధముగ పశ్చాత్తాపము పొందుటకు (వాక్వీన్) అనుగ్రహించబడిన ఒక సమయమున్నది.”

మేము చివరి మూడు వచనాలు చేరే వరకు, వచనము తరువాత వచనము, నెమ్మదిగా చదవటం మేము కొనసాగించాము. అప్పుడు నేను ఒక బలమైన శక్తిచేత కొట్టబడ్డాను. ఆ పుస్తకము నేరుగా నాతో మాట్లాడింది, మరియు వచనము 29, “ఇప్పుడు నా కుమారుడా (వాక్వీన్), ఈ సంగతులు నిన్ను ఇక ఏ మాత్రము కష్టపెట్టనియ్యకుమని నేను కోరుచున్నాను, మరియు మిమ్ములను పశ్చాత్తాపమునకు తెచ్చు ఆ కష్టముతో, నీ పాపములు మాత్రము నిన్ను కష్టపెట్టనిమ్ము” ( 29 వచనము) అని చదివినప్పుడు, నేను ఏడవటం ప్రారంభించాను.

వెల చెల్లించకుండా, బయల్పాటును పొందటానికి నేను ఆశించానని ఇప్పుడు గ్రహించాను. అప్పటివరకు నేను ఎన్నడూ దేవునితో నిజముగా మాట్లాడలేదు, మరియు ఎదురుగా లేని ఎవరితోనైనా మాట్లాడటం అనే ఆలోచన అవివేకంగా కనిపించింది. నా లోక సంబంధమైన మనస్సులో, అది అవివేకంగా అనిపించినప్పటికిని, అడిగినది చేయటానికి, నన్ను నేను తగ్గించుకొన్నాను.

ఆ రోజు ఆ ఆత్మకు నా హృదయమును తెరిచాను, పశ్చాత్తాపపడాలని కోరాను, మరియ బాప్తీస్మము పొందాలని కోరాను! ఆ క్షణమునకు ముందు, నేను పశ్చాత్తాపమనేది ఏదైనా, చెడ్డదని, పాపముతో మరియు తప్పు చేయుటతో మాత్రమే సంబంధించిందని అనుకున్నాను, కాని హఠాత్తుగా నేను దానిని వేరొక వెలుగులో---అభివృద్ది మరియు సంతోషమునకు దారిని సరళము చేయు ఒక మంచిదానిగా చూసాను.

ఈరోజు ఎల్డర్ కట్లర్ ఇక్కడున్నాడు, మరియు, నా కళ్ళు తెరిపించినందుకు అతనికి ధన్యవాదాలు తెలపాలని నేను కోరుతున్నాను. అప్పటినుండి నేను చేసిన ప్రతీ నిర్ణయము, నన్ను నేను తగ్గించుకొని క్షమాపణ కొరకు ప్రార్థన చేసిన క్షణము చేత ప్రభావితం చేయబడింది, మరియు నా తరఫున యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము నా జీవితంలో భాగమైంది.

ఒక వాఖ్యానములో చివరి పాఠము: పశ్చాత్తాపమును అనుభవించుము; మారాలనే కోరిక కంటె ఏదీ ప్రభువైన యేసు క్రీస్తుకు దగ్గరగా చేయదు.

నా ప్రియమైన పరిశోధకుడా, సంఘ స్నేహితుడా, ఈరోజు మీరు వినుచున్న యెడల, మిక్కిలి గొప్ప సంతోషమును చేరుకొనుటకు మీరు చాలా దగ్గరగా ఉన్నారు. మీరు దగ్గరగా ఉన్నారు!

నా హృదయము యొక్క సమస్త శక్తితో, నా ఆత్మ యొక్క లోతుల నుండి, వెళ్ళి బాప్తీస్మము పొందమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను! అది మీ జీవితాన్ని మార్చటమే కాదు కాని మీ పిల్లలు, మనుమల జీవితాలను మార్చును.

చిత్రం
ఎల్డర్ మరియు సహోదరి కస్టా యొక్క వివాహా దినము

ప్రభువు నన్ను ఒక కుటుంబముతో దీవించాడు. నేను రినీని వివాహము చేసుకున్నాను, మరియు మాకు నలుగురు అందమైన పిల్లలు కలిగారు. నా బాప్తీస్మము వలన నేను, పాత లీహై ప్రవక్త వలె, జీవవృక్ష ఫలము యొక్క ఫలమును తినుటకు వారిని ఆహ్వానిస్తున్నాను, అది దేవుని యొక్క ప్రేమ (1 నీఫై 8:15;11:25 చూడుము). క్రీస్తు నొద్దకు వచ్చుటకు నేను వారికి సహాయపడగలను.

కనుక దయచేసి నా అనుభవాలను పరిశీలించుము, మరియు (1)  మిషనరీలను చాలా గంభీరంగా తీసుకొనుము, (2) సంఘానికి వెళ్ళుము మరియు ఆత్మీయ భావనలు గుర్తుంచుకొనుము, (3) మోర్మన్ గ్రంథము చదివి మరియు ఇది నిజమా అని ప్రభువును అడుగుము, మరియు (4)  పశ్చాత్తాపమును అనుభవించి, బాప్తీన్మము పొందుము.

మీరు బయల్పాటుకు వెలను చెల్లించిన యెడల, మిమ్మల్ని మీరు తగ్గించుకొని, చదవి, ప్రార్థించి, మరియు పశ్చాత్తాపపడిన యెడల, పరలోకములు తెరవబడును, యేసే క్రీస్తని, ఆయన మీ, నా రక్షకుడని నేను తెలుసుకొన్నట్లుగా మీరు తెలుసుకుంటారని నేను మీకు సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

ముద్రించు