2010–2019
పరిపూర్ణమైన దినము వరకు కాంతివంతముగా ప్రకాశించును
April 2017 General Conference


పరిపూర్ణమైన దినము వరకు కాంతివంతముగా ప్రకాశించును

అతి కష్టమైన మరియు అంధకారమైన సమయములలో కూడా, మన చుట్టూ వెలుగు మరియు మంచితనము వుంటుంది.

పౌలు కొరింథియన్లతో నిరీక్షణ యొక్క ఒక అద్భుతమైన సందేశమును పంచుకొన్నాడు:

“ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము, పడద్రోయబడినను నశించువారము కాము.

“తరమబడుచున్నను దిక్కులేనివారము కాము, పడద్రోయబడినను నశించువారము కాము.” 1

పౌలు నిరీక్షణ యొక్క మూలము ఏమిటి? అతడి వివరణను వినండి: “అంధకారములోనుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములో ప్రకాశించెను.” 2

అతి కష్టమైన మరియు అంధకారమైన సమయములలో కూడా, మన చుట్టూ వెలుగు మరియు మంచితనము వుంటుంది. “వెలుగు మరియు నిజము యొక్క అద్భుతమైన ఐశ్వర్యము . . . చేత మనము చుట్టబడియున్నాము మరియు మనము కలిగియున్న దానిని మనము నిజముగా ప్రశంసిస్తున్నామా అని నేను ఆశ్చర్యపడుతున్నాను,” 3 అని అధ్యక్షులు డీటర్ ఎఫ్. ఉక్డార్ఫ్ మనకి గత అక్టోబర్లో గుర్తు చేసారు.

ఏమైనప్పటికి, “కళ్ళను గుడ్డి చేయు, హృదయములను గట్టిపరచు . . .  , మరియు తప్పుదారిపై నడిపించే అంధకారపు పొగమంచులపై” 4 మనము కేంద్రీకరించేటట్లు సాతాను చేయును.

అయినప్పటికిని, మన కాలము యొక్క సవాళ్ళను గూర్చి సంపూర్ణ అవగాహనతో, ప్రభువు వాగ్దానమిచ్చును, “దేవుని నుండి వచ్చేది వెలుగు; మరియు వెలుగును తీసుకొని, దేవునియందు కొనసాగించువాడు, ఎక్కువ వెలుగును తీసుకొంటాడు; మరియు ఆ వెలుగు పరిపూర్ణ దినము వరకు, ఎక్కువ ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది.”5

మనము దేవునియొక్క పిల్లలము. వెలుగును తీసుకొంటూ, దేవునియందు కొనసాగించుట మరియు ఎక్కువ వెలుగును తీసుకొనుటకు మనము సృష్టించబడి ఉన్నాము. ఆరంభంనుండి, మనము వెలుగును అనుసరించాము; మనము పరలోకతండ్రిని మరియు ఆయన ప్రణాళికను అనుసరించాము. వెలుగును వెదకుట మన ఆత్మీయ డి ఎన్ ఎ లో వున్నది.

ఈ నిత్యమైన సత్యము, ఒక ఆకస్మికమైన స్థలములో చక్కగా బోధింపబడుట నేను విన్నాను. నేను ఒక పెద్ద బ్యాంక్ లో పనిచేస్తున్నప్పుడు, మిచిగాన్ విశ్వవిద్యాలయములో ఒక కార్యనిర్వాహక కార్యక్రమమునకు హాజరగుటకు నేను ఆహ్వానింపబడ్డాను. ఆ కార్యక్రమములో ఉపాధ్యాయుడు కిమ్ కామారన్, సానుకూలమైన నాయకత్వము యొక్క భావనను మరియు దాని ప్రకాశానువర్తి ప్రభావమును బోధించారు. ఆయన ఇలా వివరించాడు: ”(వెలుగు) సానుకూలమైన శక్తి వైపు, మరియు అంధకారమునుండి దూరముగా వెళ్ళు, సమస్తమైన జీవ వ్యవస్థల యొక్క వైఖరిని, ఇది సూచించును. ఒక--జీవకణం జీవినుండి క్లిష్టమైన మానవ వ్యవస్థల వరకు, జీవిస్తున్న సమస్తము సానుకూలమైన దానివైపు మరియు వ్యతిరేకమైన దానికి దూరముగా ఉండుటకు అంతర్లీనమైన ఇష్టమును కలిగియున్నది.” 6

అధికమైన అధ్యయనాల మద్ధతు ద్వారా, జయప్రదమైన కార్యాలయపు సంస్కృతి యొక్క మూడు ముఖ్యమైన భాగములపై కూడా ఆయన కేంద్రీకరించారు: కనికరము, క్షమాపణ, మరియు కృతజ్ఞత. 7 జనులు, సానుకూలమైన (వెలుగు) వైపు తిరిగినప్పుడు, లోకమునకు వెలుగైన యేసు క్రీస్తు ద్వారా, పరిపూర్ణముగా ఉదహరించబడిన లక్షణాలు ఉన్నాయనుట ఖచ్చితంగా అర్ధవంతమైనది!

సహోదర సహోదరిలారా, మనకి వెలుగు అందుబాటులో ఉందని దయచేసి ఓదార్పు తీసుకొనుడి. మనము ఎల్లప్పుడువెలుగును కనుగొను మూడు స్థలములను నన్ను సూచించనియ్యండి:

1. సంఘము యొక్క వెలుగు

అంధకారమవుతున్న లోకమునకు సంఘము ఒక వెలుగు యొక్క దీపం. యేసుక్రీస్తు యొక్క కడవరిదిన పరిశుద్ధుల యొక్క సంఘ సభ్యుడగుటకు ఇది అద్భుతమైన సమయము! క్రొత్త సభ్యులు మనతో చేరుట వలన, క్రొత్త సమాజములు సృస్టించబడుట వలన, క్రొత్త మిషనరీలు పిలవబడుట వలన, మరియు సువార్తకు క్రొత్త ప్రదేశములు తెరవబడినందు వలన, ఇదివరకటి కంటే సంఘము చాలా బలముగా ఉన్నది8 మరియు ప్రతీరోజు చాలా బలముగా పెరుగుతోంది. కొంతకాలము సంఘములో చైతన్యము నుండి తొలగిపోయి తిరిగివచ్చు వారిని అధ్యక్షుడు థామస్ ఎస్. మాన్సన్ చేత ఊహించబడినట్లుగా కాపాడబడు వారిని మనము చూసేది అనుదిన అద్భుతాలను తీసుకువచ్చును.

ఈమధ్య, వారి యౌవనుల బలము కొరకు సమావేశములు జరుగుతున్నప్పుడు, నేను పెరగ్వే, యురుగ్వే, చిలీ, మరియు అర్జంటైనాలో వున్న యువతీ యువకులను దర్శించాను. వారికి రక్షకునిపై ఉన్న ప్రేమను బలపరచుకొంటూ, వేలకువేలు యువతీ యువకులు ఒక వారము గడిపారు, తరువాత వెలుగు మరియు క్రీస్తు యొక్క ప్రేమను ప్రకాశిస్తూ, వారి కుటుంబములు మరియు స్నేహితుల వద్దకు ఇంటికి తిరిగి వెళ్ళారు.

చూడండి, సంఘములో తప్పులు పట్టే వ్యక్తులు ఎల్లప్పుడు వుంటారు. అది మొదటినుండి ఆ విధంగానే ఉంది మరియు అంతము వరకు కొనసాగుతుంది. కాని అటువంటి విమర్శ, మనకి అందుబాటులో వున్న వెలుగుకు వున్న మన సున్నితత్వమును మసకబరచుటకు మనము అనుమతించలేము. ఆ వెలుగును గుర్తిస్తూ మరియు దానికొరకు వెదికితే అది మరింత వెలుగు కొరకు మనల్ని యోగ్యులుగా చేయును.

అంధకారమవుతున్న లోకములో, పరిపూర్ణ దినము వరకు సంఘము యొక్క వెలుగు మరింత ఎక్కువగా కాంతివంతంగా ప్రకాశిస్తుంది.

2. సువార్త యొక్క వెలుగు

సువార్త యొక్క వెలుగు “పరిపూర్ణ దినము వరకు ఎక్కువగా ప్రకాశించు,” 9 దారి, మరియు మన కుటుంబాలలోను మరియు ప్రపంచమంతటా వున్న దేవాలయములలో చాలా ఎక్కువగా ప్రకాశిస్తుంది.

నా సువార్తను ప్రకటించుడి ఇలా వివరిస్తుంది: “సువార్త యొక్క వెలుగు ద్వారా, కుటుంబాలు ఆపార్ధములు, వివాదములు మరియు సవాళ్ళను పరిష్కరించుకోగలవు. పశ్చాత్తాపము, క్షమాపణ, మరియు యేసుక్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం యొక్క శక్తి యందు విశ్వాసము ద్వారా, విరోధము వల్ల తెగిన కుటుంబములు స్వస్థపరచుకోగలరు.”10 ఎప్పటికంటే ఎక్కువగా మన చుట్టూ వున్న ప్రతివారికి గొప్ప వెలుగు యొక్క మూలములుగా మన కుటుంబములు ఉండాలి. ప్రేమ మరియు కనికరమునందు వారు వృద్ధి చెందినప్పుడు, కుటుంబాలు వెలుగునందు వృద్ధిచెందుతాయి. “విశ్వాసము, . . . పశ్చాత్తాపము, క్షమాపణ, మర్యాద, ప్రేమ, మరియు కనికరము”11 గల కుటుంబములను స్థాపించినప్పుడు, రక్షకునిపట్ల మరియు ఇతరులపట్ల ప్రేమ ఎక్కువగుటను మనము భావిస్తాము. కుటుంబము బలపరచబడుతుంది, మరియు మనందరిలోవున్న వెలుగు ప్రకాశవంతంగా పెరుగును.

బైబిలు నిఘంటువులో మనము ఇలా చదువుతాము, “పవిత్రతలో గృహము మాత్రమే దేవాలయముతో పోల్చబడుతుంది.”12 ఇప్పుడు మనకి 155 పనిచేస్తున్న దేవాలయములు ఉన్నాయి మరియు ఎక్కువ త్వరలో రాబోతున్నాయి. మిక్కిలి అధికంగా కుటుంబములు, కాలము మరియు నిత్యము కొరకు బంధింపబడుతున్నాయి. వారి రక్షించు విధులను నెరవేర్చుటకు, సంఘసభ్యులు వారి పూర్వీకుల పేర్లు మరి ఎక్కువగా దేవాలయమునకు సమర్పిస్తున్నారు. తెర యొక్క రెండు వైపుల మనము గొప్ప ఆనందము మరియు వేడుకను నిజముగా అనుభవిస్తున్నాము.

అంధకారమవుతున్న లోకములో, పరిపూర్ణ దినము వరకు సువార్త యొక్క వెలుగు మరింత ఎక్కువగా ప్రకాశిస్తుంది.

3. సువార్త యొక్క వెలుగు

లోకము యొక్క వెలుగయిన యేసుక్రీస్తు లేకుండా లోకములోని వెలుగును గురించి మీరు మాట్లాడలేరు. ప్రేమగల పరలోక తండ్రి ప్రత్యక్షత ఏమనగా, ఈ భూమి మీదకు వచ్చు ప్రతిఒక్కరికి, తిరిగి ఇంటికి వెళ్ళుటకు సహాయపడుటకు, క్రీస్తు యొక్క వెలుగుతో వారు దీవింపబడ్డారు. అధ్యక్షుడు బాయిడ్ కె. పాకర్ ఇలా బోధించారు: ”క్రీస్తు యొక్క ఆత్మ ఎల్లప్పుడూ ఉన్నది.....సూర్యకాంతి వలె క్రీస్తు యొక్క వెలుగు విశ్వవ్యాప్తమైనది. ఎక్కడైతే మానవ జీవితం ఉంటుందో, అక్కడ క్రీస్తు యొక్క ఆత్మ ఉంటుంది.” 13 క్రీస్తు యొక్క వెలుగు “ఆహ్వానిస్తుంది మరియు నిరంతరము మంచి చేయుటకు ఆకర్షిస్తుంది” 14 మరియు మంచితనము మరియు నిజమును వెదికే వారందరిని, పరిశుద్ధాత్మను పొందుటకు సిద్ధపరుచును.

ఆయన “మీ నేత్రములకు జ్ఞానవృద్ధి కలుగచేయు,” “మీ గ్రహణశక్తులను త్వరపరచు” మరియు “సమస్తమైన వాటికి జీవమిచ్చు”15 వెలుగని, రక్షకుడు బోధిస్తున్నారు. మనము ఇతరులను, రక్షకుని కళ్ళతో చూచుటకు, క్రీస్తు యొక్క వెలుగు మనకు సహాయపడును. మనము ఎక్కువ ప్రేమ కలిగి, ఇతరుల ప్రయాసలను అర్ధము చేసుకొంటాము. అది, మనవలె ఆరాధించని లేక సేవ చేయని వారితో ఓర్పు కలిగి ఉండుటకు మనకు సహాయము చేయును. మనము సంతోష ప్రణాళికను పూర్తిగా అర్ధము చేసికొనుటకు మరియు ఏవిధంగా మనమంతా ఆ గొప్ప ప్రేమగల ప్రణాళికలో సరిపోతామో చూచుటకు, అది మనకు సహాయము చేయును. అది, మనము చేయు వాటన్నిటికి జీవము, అర్ధము, మరియు ఉద్దేశమును ఇచ్చును. ఇప్పుడు, క్రీస్తు యొక్క వెలుగు మనము పూర్తిగా అర్ధము చేసుకొనుట ద్వారా వచ్చే సమస్త సంతోషము, మన కుటుంబము, స్నేహితులు, మరియు పూర్తిగా క్రొత్తవారైన---ఇతరులలో క్రీస్తు యొక్క వెలుగు పనిచేయుట మనము చూసినప్పుడు వచ్చు సంతోషముతో సమానము కాదు.

చిత్రం
సమావేశ గృహ మంటను ఆపుట

2015 లో దక్షిణ కాలిఫోర్నియాలో కాలిపోతున్న స్టేకు కేంద్రమును రక్షించుటకు ఒక అగ్నిమాపక సిబ్బంది చేసిన ప్రయత్నములను నేను విన్నప్పుడు నేను ఆ సంతోషాన్ని అనుభవించాను. ఆ మంట తీవ్రమవుతున్నప్పుడు, పవిత్రమైన జ్ఞాపకములు మరియు సంస్కారపు గిన్నెలను రక్షించుటకు అవి ఎక్కడ ఉన్నాయి అని ఒక ఎల్ డి ఎస్ స్నేహితుని ఒక దళ కమాండరు అడిగేడు. అతడి స్నేహితుడు పరిశుద్ధ జ్ఞాపకములేమి లేవని భరోసా ఇచ్చాడు మరియు వాస్తవానికి సంస్కారపు కప్పులు తిరిగి ఉంచబడవచ్చని చెప్పాడు. కాని ఆ నాయకుడు ఇంకా ఎక్కువ చెయ్యాలని భావించాడు, కనుక, క్రీస్తు యొక్క చిత్రలేఖనములు కాపాడుటకు గోడలనుండి వాటిని తీసివేయుటకు అగ్నిమాపక సిబ్బందిని తిరిగి, మండుచున్న భవనములోనికి పంపించాడు. అగ్నిమాపక సిబ్బంది కాపాడబడతారనే ఆశతో ఫైర్ ట్రక్కులో ఒక చిత్రలేఖనమును ఉంచారు. అటువంటి అపాయమైన మరియు కష్టమైన సమయములో, ఆ నాయకుని యొక్క దయ, మంచితనము మరియు వెలుగుకు సున్నితత్వము ద్వారా నేను నిజముగా తాకబడ్డాను

చిత్రం
మంట నుండి రక్షకుని చిత్రలేఖనాలను కాపాడుట
చిత్రం
రక్షకుని యొక్క చిత్రలేఖనముతో అగ్నిమాపకదళ సభ్యుడు

అంధకారమవుతున్న లోకములో, పరిపూర్ణదినము వరకు క్రీస్తు యొక్క వెలుగు ఎక్కువ కాంతివంతంగా ప్రకాశిస్తుంది.

నేను పౌలు యొక్క మాటలను మరలా ప్రతిధ్వనిస్తాను: “తేజస్సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందము.”16 నేను క్రీస్తును గూర్చి సాక్ష్యమిస్తున్నాను. ఆయన లోకము యొక్క వెలుగు. సంఘములో ఎక్కువగా పాల్గొనుట మరియు మన కుటుంబాలలో సువార్త సూత్రములను ఎక్కువగా అన్వయించుట ద్వారా, మనకి అందుబాటులో ఉన్న వెలుగుతో మనము బలపరచబడెదముగాక. క్రీస్తు యొక్క వెలుగును మనము ఇతరులలో ఎల్లప్పుడు చూసి మరియు వారికైవారు ఆ వెలుగును చూచుటకు మనము సహాయము చేయుదుము గాక. మనము ఆ వెలుగును పొందినప్పుడు, “వెలుగుల యొక్క తండ్రైన”17 మన పరలోక తండ్రిని మళ్ళీ చూచుటకు, పరిపూర్ణమైన దినము వరకు, మనము ఎక్కువ వెలుగుతో దీవింపబడతాము. లోకము యొక్క వెలుగైన యేసుక్రీస్తు పవిత్రమైన నామములో ఇలా సాక్ష్యమిస్తున్నాను, ఆమెన్.

ముద్రించు