మన తండ్రి యొక్క మహిమకరమైన ప్రణాళిక
దేవుని యొక్క పరిశుద్ధ ప్రణాళిక వలన, పుట్టుక మరియు మరణము మన పరలోక తండ్రితో నిత్య జీవమునకు మన ప్రయాణములో వాస్తవానికి మైలురాళ్ళు మాత్రమేనని మనకు తెలుసు.
నా వైద్య శిక్షణ ఆరంభంలో, ఒక యౌవన తల్లికి మొదటి బిడ్డను ప్రసవించుటలో సహాయపడే విశేషావకాశము నాకు కలిగింది. ఆమె ప్రశాంతంగా, దృష్టిసారించింది, మరియు సంతోషముగా ఉన్నది. బిడ్డ ప్రసవించబడిన తరువాత, అప్పుడే ప్రశస్తమైన క్రొత్తగా జన్మించిన బిడ్డను నేను ఆమెకిచ్చాను. ఆమె ముఖంపై ఆనందబాష్పలు కారుచుండగా, ఆమె క్రొత్త బిడ్డను తన చేతులలోనికి తీసుకొని, తలనుండి కాలి వేళ్ళ వరకు పరిశీలించింది. తల్లి మాత్రమే చేయగలిగినట్లు, అతడిని దగ్గరగా పట్టుకొని ప్రేమించింది. ఆ గదిలో ఆమెతో ఉండుట ఒక ఆధిక్యత.
మనలో ప్రతివారికి జీవితం యొక్క ప్రారంభం ఆవిధంగా ఉన్నది. కాని మన జననము నిజముగా ఆరంభమా? ఈ లోకము పుట్టుకను మరియు చావును ప్రారంభము మరియు ముగింపుగా చూస్తుంది. కాని దేవుని యొక్క పవిత్రమైన ప్రణాళిక ప్రకారం, మన పరలోక తండ్రితో నిత్య జీవితమునకు మన ప్రయాణములో, పుట్టుక మరియు చావు కేవలము మైలురాళ్ళని మనకి తెలుసు.1 మన తండ్రి యొక్క ప్రణాళికలో అవి ముఖ్యమైన భాగములు-----మర్త్యత్వము మరియు పరలోకము కలుసుకొనే పరిశుద్ధమైన క్షణాలు. ఈరోజు, నా అనేక సంవత్సరాల వైద్య అభ్యాసం మరియు సంఘ సేవ ద్వారా పుట్టుక మరియు చావును గమనించుట నుండి నేను నేర్చుకొన్న దాని గురించి ఆలోచించి, మన తండ్రి యొక్క మహిమకరమైన ప్రణాళికను గూర్చి సాక్ష్యమిచ్చుటకు కోరుతాను.
“మనము పుట్టకముందు, మన ఆత్మల యొక్క తండ్రియైన, దేవునితో జీవించాము. భూమిపైన (మనమందరం) ఆయన కుటుంబములో, అక్షరాలా సహోదర, సహోదరీలము,2 మరియు మనలో ప్రతిఒక్కరం ఆయనకు ప్రశస్తమైన వారము. మన మర్త్య జననమునకు ముందు--- నేర్చుకుంటూ, ఎంపిక చేస్తూ, మరియు సిద్ధపడుతూ, మనము ఆయనతో సుదీర్ఘ కాలము జీవించాము.
పరలోక తండ్రి మనల్ని ప్రేమిస్తున్నారు కనుక, ఆయన ఇవ్వగలిగిన గొప్ప బహుమానమైన నిత్య జీవితము మనకి కలిగియుండాలని ఆయన కోరుతున్నారు.3 ఆయన మనకి ఈ వరము మామూలుగా ఇవ్వలేరు; ఆయనను మరియు ఆయన మార్గములను ఎంపికచేయుట ద్వారా మనము తీసుకొనవలెను. దీనికి మనము ఆయన సన్నిధిని విడిచివెళ్ళుట అవసరము, విశ్వాసము, అభివృద్ధి, మరియు మార్పు యొక్క అద్భుతమైన సవాలుగల ప్రయాణమును ప్రారంభించాలి. మన తండ్రి మనకి సిద్ధపరచిన ప్రయాణము, రక్షణ యొక్క ప్రణాళిక లేక సంతోషము యొక్క ప్రణాళిక అని పిలువబడింది.4
దివ్యమైన మర్త్యత్వమునకు ముందు సభలో ఆయన ప్రణాళిక గురించి మన తండ్రి మనతో చెప్పారు.5 మనము దానిని అర్ధము చేసుకొన్నప్పుడు, సంతోషముతో మనము కేకలు వేసాము, మరియు “ఉదయ నక్షత్రములు కలిసి పాడినవి.”6
ఆ ప్రణాళిక మూడు దివ్యమైన స్తంభములపై నిర్మించబడినది: నిత్యము యొక్క స్తంభములు.7
మొదటి స్తంభము భూమి యొక్క సృష్టి, మన మర్త్యత్వ ప్రయాణము కొరకు సందర్భము.8
రెండవ స్తంభము మన మొదటి భూలోక తల్లితండ్రులైన ఆదాము మరియు హవ్వల యొక్క పతనము. వలన, కొన్ని అద్భుతమైన విషయములు మనకి ఇవ్వబడినవి. మనము పుట్టగలిగి మరియు భౌతికమైన శరీరమును పొందగలిగాము.9 నా సహోదరులను మరియు నన్ను ఈ లోకములో తీసుకువచ్చి, దేవుని గురించి బోధించినందుకు, మా అమ్మకు నేను ఎల్లప్పుడు కృతజ్ఞతతో వుంటాను.
దేవుడు మనకి నైతిక స్వతంత్రత కూడా ఇచ్చాడు---అది మనకై మనము ఎంపికచేసి, పనిచేయుటకు సామర్ధ్యము మరియు ఆధిక్యత.10 మనము మంచిగా ఎంపిక చేయుటకు సహాయపడుటకు పరలోక తండ్రి మనకు ఆజ్ఞలు ఇచ్చారు. ప్రతి రోజు, ఆయన ఆజ్ఞలను మనము పాటించినప్పుడు, మనము ఆయనను ప్రేమిస్తున్నామని దేవునికి చూపిస్తాము, మరియు ఆయన మన జీవితములను దీవిస్తారు.10
మనము ఎల్లప్పుడు మంచివి ఎంపిక చేయమని,---మరొక మాటలలో--- పాపం చేస్తామని తెలుసుకొని, తండ్రి మనకు మూడవ స్థంభమును ఇచ్చారు---రక్షకుడైన యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తము. ఆయన బాధ ద్వారా, బౌతిక మరణమునకు మరియు పాపమునకు క్రీస్తు వెల చెల్లించాడు.12 ఆయన ఇలా బోధించాడు: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ”13
ఎల్లప్పుడు ఆయన తండ్రి యొక్క ఆజ్ఞలను పాటిస్తూ, యేసుక్రీస్తు పరిపూర్ణమైన జీవితమును జీవించాడు. నిత్యత్వము యొక్క సత్యములను బోధిస్తూ, “రోగులను స్వస్థపరచుచు, గ్రుడ్డివారికి చూపును ఇస్తూ, మరియు మృతులను లేపుచు, ఆయన పాలస్తీన రోడ్లపై నడిచాడు.”14 ఆయన “మేలు చేయుచు సంచరించుచుండెను” 15 మరియు “ఆయన మాదిరిని అనుసరించమమని అందరిని వేడుకొన్నాడు.”16
ఆయన మర్త్య జీవితము ముగింపులో, ఆయన మోకరించి ఇలా ప్రార్ధించారు:
తండ్రీ, యీ గిన్నె నా యొద్దనుండి (తొలగించుటకు), నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా యిష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక. . . .
“ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట, నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయెను. ”17
ఆయన ప్రవక్త జోసెఫ్ స్మిత్ కు చెప్పినప్పుడు తన బాధ యొక్క పరిమాణమును మనము బాగా అర్ధము చేసుకొనుటకు క్రీస్తు మనకు సహాయపడ్డాడు:
“దేవుడైన నేను, అందరి కొరకు వీటన్నిటిని భరించాను, కాని వారు పశ్చాత్తాపపడిన యెడల, వారు బాధ పడనవసరంలేదు;
“కాని వారు పశ్చాత్తాపపడకపోతే, వారు కూడా నావలె తప్పక బాధపడాలి;
“ఆ బాధ, అందరికన్నా గొప్పవాడను, దేవుడనైన నన్నుకూడా వణికించి, ప్రతి రంధ్రమునుండి రక్తము కార్చి, శరీరమునకు మరియు ఆత్మకు బాధపడునట్లు చేసింది.”18
గెత్సేమనే తోటలో, మన పాపములకు, మన వ్యాధులకు, మన బాధలకు మరియు బలహీనతలకు వెలను చెల్లించుట ఆయన మొదలు పెట్టాడు.19 ఆయన చేసారు కనుక, ఆయనను అనుసరించుటకు మనము ఎంచుకొంటే ఆ బలహీనతలలో మనము ఎన్నడూ ఒంటరిగా ఉండము. “కపటమైన నేరములతో ఆయన ఆరెస్టు చేయబడ్డాడు మరియు శిక్షించబడ్డాడు, అల్లరిమూకను తృప్తి పరచుటకు దోషిగా గుర్తించబడ్డాడు, కల్వరి శిలువపై మరణించుటకు తీర్పు తీర్చబడ్డాడు. సిలువపై “సమస్త మానవాళి యొక్క పాపముల కొరకు ఒక గొప్ప ప్రత్యామ్నాయమైన వరముగా, ప్రాయశ్చిత్తము చేయుటకు, ఆయన తన ప్రాణమును ఇచ్చివేసారు.”20
ఆయన ఇలా ప్రకటించారు:
“ఇదిగో, లోకములోనికి వచ్చునని ప్రవక్తలు సాక్ష్యమిచ్చిన యేసుక్రీస్తును నేనే.”
“మరియు ఇదిగో, నేను లోకము యొక్క వెలుగును మరియు జీవమునై యున్నాను మరియు తండ్రి నాకు ఇచ్చిన ఆ చేదు పాత్రనుండి నేను త్రాగియున్నాను, మరియు లోకము యొక్క పాపములను నాపైన తీసుకోనుటలో తండ్రిని మహిమ పరచియున్నాను.”21
తరువాత, ఆ వారము యొక్క మొదటి రోజున, 22 మరలా ఎన్నడూ మరణించకుండా, ఒక పరిపూర్ణమైన పునరుత్థానము చెందిన శరీరముతో సమాధి నుండి ఆయన పైకి లేచాడు. మరియు ఆయన చేసాడు కనుక, మనము కూడా పునరుత్థానము చెందుతాము.
క్రీస్తు సమాధి నుండి నిజముగా పైకి లేచాడని నేను సాక్ష్యమిస్తున్నాను. కాని ఆ సమాధి నుండి పైకి లేచుటకు, ఆయన మొదట మరణించవలసియున్నది. మరియు మనము కూడా మరణించాలి.
నా జీవితములో గొప్ప దీవెనలలో మరొకటి, జనులు చనిపోతున్నప్పుడు వారి మంచము ప్రక్క కూర్చున్న క్షణములలో పరలోకము యొక్క సమీపమును అనుభవించుట. కొన్నేళ్ళక్రితం ఒక రోజు ఉదయమున, కాన్సరుతో వున్న ఒక విశ్వాసురాలైన కడవరి దిన పరిశుద్ధ విధవరాలి యొక్క ఆసుపత్రి గదిలో నేను ప్రవేశించాను. ఆమె కుమార్తెలలో ఇద్దరు ఆమెతో కూర్చోన్నారు. నేను ఆమె మంచము ప్రక్కకి వెళ్లినప్పుడు, ఆమె చనిపోయిందని మరియు ఆమె ఇక బాధపడుట లేదని నేను వెంటనే కనుగొన్నాను.
ఆ మరణము యొక్క క్షణమున, ఆ గది శాంతితో నిండియున్నది. ఆమె కుమార్తెలు మధురమైన విచారమును కలిగి యున్నారు, కాని వారి హృదయములు విశ్వాసముతో నిండియున్నవి. వారి తల్లి వెళ్ళిపోలేదని కాని ఇంటికి తిరిగి వెళ్లిందని వారికి తెలుసు. 23 మన లోతైన విచారము యొక్క క్షణములలో, కాలము ఆగిపోయి, మరియు జీవితము అన్యాయముగా కనిపించిన క్షణాలలో కూడా, మన రక్షకునిలో మనము ఓదార్పును కనుగొనగలము ఎందుకనగా ఆయన కూడా బాధ పడ్డారు. 24 ఆ గదిలో ఉండుట నా ఆధిక్యత.
మనము మరణించినప్పుడు, మన ఆత్మలు మన శరీరాలను వదిలివేస్తాయి, మరియు మనము మన ప్రయాణము యొక్క తర్వాతి దశ, ఆత్మ లోకమునకు వెళ్తాము. అది నేర్చుకొనుట, పశ్చాత్తాపము, క్షమాపణ, మరియు మార్పు యొక్క, స్థలము25 -----అక్కడ మనము పునరుత్థానం కోసం ఎదురుచూస్తాము.26
ఒక రాబోయే గొప్ప భవిష్యత్ దినమున, పుట్టిన వారందరూ సమాధి నుండి లేపబడతారు. మన ఆత్మలు మరియు మన భౌతిక శరీరాలు వారి పరిపూర్ణ రూపములో తిరిగి జతపరచబడతాయి. ప్రతిఒక్కరు పునరుత్థానము చెందుతారు, “వృద్ధులు, మరియు యౌవనులు, ఇరువురు . . . పురుషులు మరియు స్త్రీలు ఇరువురు,. . . దుష్టులు మరియు నీతిమంతులు ఇరువురు; ” మరియు “ప్రతి వస్తువు దాని పరిపూర్ణ ఆకారమునకు పునస్థాపించబడును.”27
పునరుత్థానం తరువాత మన రక్షకుని చేత తీర్పు తీర్చబడు అత్యంత గొప్ప దీవెనను కలిగియుంటాము, ఆయన ఇలా అన్నాడు:
“వారి క్రియలను బట్టి, వారికి తీర్పు తీర్చబడునట్లు, నేను మనుష్యలందరిని నా వైపు ఆకర్షించుకొందును.
“మరియు ఇది జరుగును, పశ్చాత్తాపము పొంది మరియు నా నామమున బాప్తీస్మము పొందువాడు నింపబడి, మరియు అతడు అంతము వరకు స్థిరముగానున్న యెడల, ఇదిగో నేను లొకమునకు తీర్పు తీర్చుటకు నిలబడు దినమున, అతనిని నా తండ్రి యెదుట నేను నిర్దోషిగా యెంచెదను.”28
మరియు తరువాత, క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా, విశ్వాసము, పశ్చాత్తాపము, బాప్తీస్మము, పరిశుద్దాత్మను పొందుట, మరియు అంతము వరకు స్థిరముగా ఉండుట ద్వారా 29 ఆయనను అనుసరించుటకు ఎన్నుకొను వారందరూ, వారి ప్రయాణము యొక్క అంతమున “నిత్య జీవితము యొక్క వారసులు వలె వారి దైవిక గమ్యమును పొందుట అని కనుగొంటారు.”30 ఆయనతో శాశ్వతంగా జీవించుటకు తండ్రి యొక్క సన్నిధికి వారు తిరిగి వెళతారు. మనము బాగా ఎంపిక చేసెదముగాక.
జననము మరియు మరణము మధ్య జరిగేదాని కన్న మన ఉనికికి చాలా ఎక్కువ ఉన్నది. మీరు వచ్చి క్రీస్తుని అనుసరించమని నేను ఆహ్వానిస్తున్నాను.31
ప్రతి రోజు, “క్రీస్తు నొద్దకు రమ్ము, మరియు ఆయనలో పరిపూర్ణుడవు కమ్ము, మరియు సమస్త భక్తిహీనత నుండి మిమ్మను నిరాకరించుకొనుడి, మరియు క్రీస్తు యొక్క రక్తమును చిందించుట ద్వారా, . . . మీరు పరిశుద్ధులు, మచ్చ లేనివారగునట్లు,” యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ సభ్యులందరిని నేను ఆహ్వానిస్తున్నాను.”32
రండి, మోర్మన్ యొక్క గ్రంధమును చదవండి, మరియు మిషనరీలను వినమని ఈ సంఘ సభ్యులు కాని వారందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. రండి, విశ్వాసము కలిగి మీ పాపములకు పశ్చాత్తాపపడండి. రండి మరియు బాప్తీస్మము పొంది పరిశుద్ధాత్మను పొందండి. రండి మరియు సంతోషకరమైన క్రీస్తు-నిండిన జీవితమును జీవించండి. మీరు ఆయన వద్దకు వచ్చి, ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడు, తరచు కష్టమైన మర్త్య అనుభవములో శాంతి మరియు ఉద్దేశ్యమును, రాబోయే లోకములో నిత్య జీవితమును మీరు కనుగొంటారని నేను వాగ్దానమిస్తున్నాను.”33
ఈ సత్యములను అనుభవించి మరియు ఏదైనా కారణము వలన సంఘమును విడిచి వెళ్లిన వారిని, తిరిగి రమ్మని నేను ఆహ్వానిస్తున్నాను. ఈరోజు తిరిగి రండి. మన తండ్రి మరియు రక్షకుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీ ప్రశ్నలకు జవాబిచ్చుటకు, మీ బాధలు మరియు విచారములను స్వస్థపరచుటకు, మరియు మీ పాపములను క్షమించుటకు క్రీస్తుకి శక్తి ఉన్నదని నేను సాక్ష్యమిస్తున్నాను. ఇది సత్యమని నాకు తెలుసు. ఈ విషయములన్నీ సత్యమని నాకు తెలుసు. క్రీస్తు జీవిస్తున్నారు! ఇది ఆయన సంఘము. యేసుక్రీస్తు నామములో ఆమేన్.