మన మంచి కాపరి
మన మంచి కాపరి, యేసు క్రీస్తు తన వ్యాధిగ్రస్తమైన గొఱ్ఱె స్వస్థత పొందుటలో పురోగతి చెందుటను చూచుటలో సంతోషమును కనుగొనును.
పాపుల కొరకు ఆయనకు ఉన్నఅపారమైన కనికరమును గుర్తించినట్లయితే మన పరలోక తండ్రి యొక్క స్వభావము యొక్క క్షణదర్శనము మనకు దొరుకుతుంది, పాపము మరియు పాపము చేసిన వారి మధ్య ఉన్న వత్యాసాన్ని అభినందిస్తాము. ఆ క్షణదర్శనము “ఆయన స్వభావాన్ని, పరిపూర్ణతలను, మరియు గుణాలను, సరిగ్గా అర్ధం చేసుకోవడంలో, ”1 ఆయనయందు మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యందు విశ్వాసమును అభ్యసించడంలో మనకి సహాయపడుతుంది. మన రక్షకుని యొక్క కనికరము మన అసంపూర్ణతల నుంచి అయన వద్దకు మనల్ని నడిపిస్తుంది. రక్షకుని యొక్క కనికరము పశ్చాత్తాపపడుటలో మరియు ఆయనను అనుకరించుటలో మనము పలుమార్లు చేసే పోరాటములలో ఆయన వైపు మనల్ని ఆకర్షించును మరియు మనల్ని ప్రేరేపించును. మనము ఆయనవలె అవుతుండగా మనము ఇతరుల యొక్క బహిరంగిక లక్షణములను మరియు ప్రవర్తన ఎలాఉన్నప్పటికీ అయన ఆదరించిన విధముగానే మనము ఆదరించుట నేర్చుకుంటాము.
ఒక వ్యక్తి యొక్క బాహ్య లక్షణాలు మరియు వ్యక్తిగా అతడి మధ్య ప్రత్యేక ప్రభావము ఫ్రెంచ్ రచయిత విక్టర్ హ్యుగో2 రచించిన les miserables అనే నవలకి మూల కారణము. ఆ నవల ఆరంభములో వ్యాఖ్యాత డిగ్ని యొక్క బిషప్పు అయిన బైన్విన్యు మిరియల్ ని పరిచయము చేస్తాడు మరియు బిషప్పు ఎదుర్కొను గందరగోళమును చర్చించును. ఆ నాస్తికుడైన ఒక మనుష్యుని మరియు ఫ్రెంచ్ విప్లవంలో అతని గత ప్రవర్తన వలన సమాజము నుంచి తృణీకరించబడ్డ వాడిని అతడు సందర్సించాలా వద్దా?3
ఆ బిషప్పు సహజంగానే ఆ వ్యక్తి మీద లోతైన విముఖతని కలిగి ఉన్నాడని ఆ వ్యాఖ్యాత వివరించాడు. అప్పుడు, ఆ వ్యాఖ్యాత ఒక సాధారణ ప్రశ్నను ముందుంచారు: “అన్ని ఒకే మాదిరి అయినప్పుడు, గొర్రెల యొక్క చర్మము మీద ఉన్న పొక్కులు గొర్రెలకాపరిని వెనుకంజ వేసేలా చేస్తుందా? ”4 బిషప్పు తరపున ఆ వ్యాఖ్యాత ఖచ్చితమైన సమాధానము ఇచ్చును, “లేదు” తరువాత ఆ వ్యాఖ్యాత హాస్యభరితమైన వ్యాఖ్యనమును చేర్చాడు “కానీ ఎటువంటి గొర్రె! ”5
ఈ భాగంలో, హ్యుగో ఆ వ్యక్తి యొక్క “దుష్టత్వమును” గొర్రెలో చర్మవ్యాధితో పోల్చును మరియు బిషప్పు అనారోగ్యంతో ఉన్న గొర్రెను వదలని గొర్రెల కాపరితో పోల్చాడు. బిషప్పు దయగలవాడు మరియు తదుపరి నవలలో అటువంటి కనికరమును మరొక మనిషి పట్ల చూపించారు, ఈ నవలలో ప్రధాన నాయకుడు, ఒక దిగజారిన మాజీ ఖైదీ జీన్ వెల్జీన్. బిషప్పు యొక్క కరుణ మరియు సానుభూతి జీన్ వెల్జీన్ తన జీవితం యొక్క గమ్యమును మార్చుకునేలాగా ప్రేరేపించింది.
దేవుడు, లేఖనములంతటా పాపమును వ్యాధి యొక్క రూపకంగా పోల్చాడు కనుక, ఇలా అడగడం సబబుగానే ఉంటుంది, “ మన పాపాలు---మన రూపకాలంకారములైన వ్యాధుల్ని ఎదుర్కొన్నప్పుడు యేసు క్రీస్తు ఎలాగు స్పందిస్తారు? ” రక్షకుడు ఇలా చెప్పెను, నేను “పాపమును స్వల్ప అంగీకారముతో చూడను”;6 కనుక అపరిపూర్ణులమైన మనము, భయము మరియు ఆసహ్యముతో వెనుకంజ వేయకుండా మనవైపు ఆయన ఎలా చూడగలడు?
ఆ ప్రశ్నకు సమాధానము సాధారణమైనది మరియు స్పష్టమైనది. మంచి గొర్రెలకాపరిలాగా,7 యేసు క్రీస్తు గొఱ్ఱెలలో ఉన్న వ్యాధిని ఒక చికిత్స, సంరక్షణ, మరియు కనికరము అవసరమున్న పరిస్థితిలాగా చూస్తాడు. ఈ గొర్రెలకాపరి, మన మంచి గొర్రెల కాపరి, తన గొర్రెలు వ్యాధి నుంచి బయటపడి స్వస్థపడు మార్గమువైపు వెళ్లడంలో ఆనందమును కనుగొంటాడు.
యేసు క్రీస్తు ఇలా ప్రవచించారు, ఆయన “గొఱ్ఱెల కాపరివలె ఆయన తన మందను మేపును, ”8 “తప్పిపోయిన దానిని నేను వెదకుదును …తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చెదను, … గాయపడిన దానిని కట్టుదును, … దుర్భలముగా ఉన్నదానిని బలపరచుదును.”9 తన గొఱ్ఱెలమందను ఒక గొఱ్ఱెలకాపరిలాగ పోషిస్తాడు, తప్పిపోయిన దానిని నేను వెదుకుదును. విశ్వాస భ్రష్టులైన ఇశ్రాయేలు పాపపు “గాయాలతో మరియు దెబ్బలతో మరియు పుళ్లతో ఉన్నట్టు,”10 చిత్రీకరించబడినప్పటికీ, రక్షకుడు ప్రోత్సహించారు, బుద్ధి చెప్పారు, మరియు స్వస్థతను వాగ్దానము చేసారు. 11
రక్షకుని యొక్క మర్త్య పరిచర్య వాస్తవానికి ప్రేమతో, కరుణతో, మరియు సానుభూతితో కూడినదిగా వర్ణించబడింది. ఆయన అలక్ష్యముగా గలిలయ మరియు యూదా నగరపు దుమ్ము రోడ్లపై ఎక్కడ పాపులు కనిపిస్తారో అని సంకోచముతో నడవలేదు. ఆయన వారిని తృణీకారమైన భయాందోళనలతో తప్పించుకోలేదు. లేదు, అయన వారితో కలిసి భోజనము చేసారు. 12 ఆయన సహాయము చేసారు, దీవించారు, లేవనెత్తారు మరియు బలపరిచారు, భయము, నిరాశను నిరీక్షణ మరియు ఆనందముతో భర్తీ చేసెను. నిజమయిన గొఱ్ఱెలకాపరి వలె, ఆయన మనల్ని వెదుకును, మనకి ఉపశమనం మరియు నిరీక్షణను ఇచ్చుటకు మనల్ని కనుగొనును.13 ఆయన కనికరము మరియు ప్రేమను అర్ధం చేసుకొనుట, ఆయనయందు విశ్వాసమును సాధన చేయుటకు, పశ్చాత్తాపపడుటకు మరియు స్వస్థత పరచబడుటకు మనకి సహాయపడుతుంది.
ఒక పాపిపై రక్షకుని యొక్క సానుభూతి ప్రభావము యోహాను సువార్తలో వ్రాయబడినది. శాస్త్రులును పరిసయ్యులును వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొనివచ్చి ఆమెను రక్షకుని ముందు నిలబెట్టారు. నిందమోపినవారు మోషే ధర్మశాస్త్ర ప్రకారము రాళ్లతో కొట్టబడవలెను అని ఉద్దేశించారు. యేసు వారి పట్టువిడువని ప్రశ్నలకు జవాబుగా, చివరికి వారికి చెప్పును, “మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పెను.”
నిందమోపిన వారు అక్కడినుంచి వెళ్లిపోయారు, మరియు “యేసు ఒక్కడే మిగిలెను మరియు ఆ స్త్రీ మధ్యన నిలువబడియుండెను.
“యేసు … ఆమెని చూసి ఇలా చెప్పెను, అమ్మా వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు,
“ఆమె లేదు ప్రభువా అనెను, అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను: నీవు వెళ్లి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను.”14
నిశ్చయముగా, రక్షుకుడు వ్యభిచారాన్ని క్షమించలేదు. కానీ ఆయన ఆ స్త్రీని కూడా శిక్షించలేదు. ఆమె తన జీవితాన్ని సంస్కరించుకోమని ప్రోత్సహించారు. ఆయన కనికరము మరియు కరుణ వలన ఆమె మారటానికి ప్రేరేపించబడింది. జోసెఫ్ స్మిత్ యొక్క బైబిల్ అనువాదంలో ఆమె మార్పు యొక్క ఫలితంగా వచ్చిన శిష్యరికం గురించి ధృవీకరించును: “ ఆ స్త్రీ ఆ గడియ నుండి దేవునిని మహిమపరచింది, మరియు ఆయన నామమును విశ్వసించింది.”15
దేవుడు సానుభూతి చూపుతుండగా, ఆయన పాపమును అంగీకరించును మరియు ఆమోదిస్తాడు, అని మనము తప్పుగా నమ్మకూడదు, అయన అంగీకరించడు. రక్షకుడు మన పాపాల నుండి మనల్ని రక్షించుటకు ఈ భూమి మీదకి వచ్చారు, మరి ముఖ్యముగా మన పాపములందు మనల్ని రక్షించడు.16 ఒక నైపుణ్యం కలిగిన ప్రశ్నకుడు, జీజ్రొమ్ అమ్యులెక్ ని పట్టుకొనుటకు ఒకసారి ప్రయత్నించాడు: “ (రాబోయే మెస్సయా) తన జనులను వారి పాపములలోనే రక్షించునా? మరియు అమ్యులెక్ సమాధానమిచ్చాడు ఆయన రక్షించడని నీతో చెప్పుచున్నాను. ఆయన వాక్యమును తిరస్కరించుట ఆయనకు ఆసాధ్యము... ఆయన వారి యొక్క పాపములలో రక్షించడు. ”17 అమ్యులెక్ మన పాపములనుండి రక్షణ పొందుటకు ఒక ప్రాథమిక సత్యమును గురించి మాట్లాడాడు, మనము “పశ్చాత్తాపము యొక్క షరతులకు,” కట్టుబడియుండాలి, అది మన ఆత్మలను రక్షించుటకు విమోచకుని యొక్క శక్తిని విడిపించును.18
రక్షకుని యొక్క కనికరము, ప్రేమ, మరియు దయ ఆయన వద్దకు మనల్ని నడిపిస్తాయి.19 ఆయన యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా, మనము మన పాపపు స్థితితో తృప్తి చెందము. 20 దేవుడు ఏది సరియైనదో మరియు ఆయనకు ఏది అంగీకరమైనదో మరియు ఏది పాపము లేక తప్పో స్పష్టముగా ఉన్నారు. ఇది బుద్ధిలేని, విధేయుడిగా వెంబండించేవారిగా ఉండాలి అని ఆయన కోరుతున్నారు కనుకా. లేదు, మన పరలోక తండ్రి తన బిడ్డలు బుద్ధిపూర్వకముగా, మరియు ఇష్టపూర్వకంగా ఆయన లాగా అయ్యేందుకు ఎన్నుకోవాలి అని అయన కోరుతున్నారు21 మరియు ఆయన ఆనందించే జీవితమును మనము జీవించేందుకు అర్హులు కావాలని అయన కోరుకుంటారు. 22 ఆవిధంగా చేయడం వలన, ఆయన బిడ్డలు వారి దైవ సంబంధమైన గమ్యమును నెరవేర్చెదరు మరియు ఆయనకు కలిగిన సమస్తమునకు వారసులుగా అవుతారు. 23 ఈ కారణము వలన, సంఘ నాయకులు సౌకర్యం లేక జన సమ్మతి కొరకు దేవుని ఆజ్ఞలను లేక సిద్దాంతములను ఆయన చిత్తమునకు వ్యతిరేకముగా మార్చలేరు.
అయినప్పటికీ, యేసు క్రీస్తుని వెంబడించుటకు మన జీవితకాల తపనలో, ఆయన పాపము చేసినవారి పట్ల చూపించే దయ యొక్క మాదిరి నిర్దేశికమైనది. పాపులము అయిన మనము, రక్షుకుడి వలె ఇతరుల వద్దకు కనికరము మరియు ప్రేమతో చేరుకోవాలి. సహాయము చేసి మరియు దీవించడం, పైకి లేవనెత్తి, జ్ఞానవృద్ధిచేయడం, భయం, నిరాశను నిరీక్షణ మరియు ఆనందముతో భర్తీ చేయడం కూడా మన పాత్ర.
ఇతరులను అపరిశుభ్రమైన వారిగా చూసి వెనుకంజ వేయు వ్యక్తులు మరియు వారి స్వనీతితో ఇతరులను వారి కంటే ఎక్కువ పాపము చేసిన వారిగా తీర్పుతీర్చు వారిని రక్షకుడు గద్దించాడు. 24 “వారు నీతిగలవారని తమయందు విశ్వసించే వారు, మరియు ఇతరులను తృణీకరించు వారివైపు రక్షకుడు ప్రత్యేకమైన పాఠమును సూచించారు. ” ఆయన ఈ ఉపమానమును చెప్పారు:
ప్రార్ధన చేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్లిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు ఒకడు సుంకరి.
“పరిసయ్యుడు నిలువబడి---దేవా, నేను చోరులను, అన్యాయస్థులను, వ్యభిచారులైన ఇతర మనుష్యులవలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
“వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నాను.
“అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశమువైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకునుచు—దేవా, పాపినైనా నన్ను కరుణించమని పలికెను.”
అప్పుడు యేసు క్రీస్తు ఇలా ముగించెను “అతనికంటే (పరిసయ్యుడు) ఇతడు (సుంకరి) నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నాను, తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును.”25
మనకు సందేశం చాల స్పష్టంగా ఉన్నది, పాపిని ఖండించే స్వనీతిగల వ్యక్తి మనిషి కంటే పశ్చాత్తాపము పడే పాపి దేవునికి దగ్గరవును.
స్వనీతి మరియు విమర్శనాత్మకంగా ఉండు మానవ ధోరణి ఆల్మా యొక్క దినములో కూడా ఉన్నది. జనులు, “అధిక సంపూర్ణముగా సంఘమును స్థాపించుటకు మొదలు పెట్టిరి … సంఘము గర్వించసాగారు . . . సంఘము యొక్క జనులు వారు తమ నేత్రముల యొక్క గర్వమందు ఎత్తబడుట ప్రారంబించిరి … తమ స్వంత ఇష్టము మరియు సంతోషమును బట్టి, విశ్వసించు వారిని హింసించుటకు వారు మొదలుపెట్టిరి. ”26
ఈ హింస ప్రత్యేకంగా నిషేధించబడింది: “ఇప్పుడు సంఘము యొక్క జనుల మధ్య ఒక ఖచ్చితమైన న్యాయముండెను. సంఘమునకు చెందిన ఏ మనుష్యుడూ లేచి మరియు సంఘమునకు చెందని వారిని హింసించరాదు మరియు వారి మధ్య ఎట్టి హింస ఉండరాదు. ”27 కడవరి దిన పరిశుద్ధుల కొరకు మార్గదర్శక సూత్రము ఒకేవిధంగా ఉన్నది. సంఘము లోపలి వారిని లేక బయట వారిని హింసించే నేరాన్ని చేయకూడదు.
ఏ కారణముచేతనైన హింసింపబడిన వారికి మతద్వేషము మరియు అన్యాయము ఎలా ఉంటాయో తెలుసు. 1960 ఐరోపాలో నేను యౌవనునిగా నివసిస్తున్నప్పుడు నేను ఒక అమెరికన్ ను గనుక, నేను సంఘము యొక్క సభ్యుడిని గనుక నన్ను పలుమార్లు ఎంచుకుని బెదిరించేవారు అని నేను భావించాను. అప్రసిద్దమైన యు. స్. విదేశీ విధానాలకు నేను వ్యక్తిగతముగా కారణము అన్నట్టు నా తోటి విద్యార్థులు నన్ను చూసేవారు. నేను నివసించిన దేశములలో నా మతమును అమర్యాదగా చూసారు ఎందుకనగా రాష్ట్ర స్పాన్సరు చేసిన మతము కన్నా నాది వేరే మతము. తరువాత, ప్రపంచములోని వేర్వేరు దేశములలో, వారి వర్గం లేక జాతి వలన గురి పెట్టబడిన వారిచేత పక్షపాతం మరియు వివక్షత యొక్క వికృతరూపమును అనుభవించిన వారి యొక్క స్వల్ప క్షణ దర్శనములను నేను చూసాను.
మతద్వేషము అనేక రూపాలలో వచ్చును: హేళన, వేధింపులు, బెదిరింపులు, బహిష్కారము మరియు విడిగా వుంచుట లేక ఇతరుల పట్ల ద్వేషము. వేర్వేరు అభిప్రాయాలు ఉన్నవారి పట్ల తన వికృత స్వరమును లేపు మతద్వేషమునకు వ్యతిరేకంగా మనల్ని కాపాడుకోవాలి. అది అందరికి సమానంగా భావవ్యక్తీకరణ స్వేచ్ఛను ఇచ్చేందుకు సమ్మతించకపోవటంలో ఒక భాగముగా మతద్వేషము దానికదే ప్రత్యక్షపరచబడును. 28 ప్రతిఒక్కరు, మతము యొక్క ప్రజలు కలిపి, అందరికి వారి వారి అభిప్రాయాలూ బహిరంగా వ్యక్తపరచే హక్కు ఉంది. కానీ అభిప్రాయాలు వ్యక్తపరచిన వారి పట్ల ద్వేషము చూపించేందుకు ఎవరికీ అనుమతి లేదు.
మన సంఘ సభ్యులు ద్వేషముతో, మరియు మత దురభిమానంతో చూడబడినట్లు పుష్కలమయిన సాక్ష్యాలను సంఘ చరిత్ర ఇచ్చును. మనల్ని ఎలా చూసారో ఆవిధంగా ఇతరులను మనము చూసిన యెడల, ఎంత విమర్శనాత్మకంగా విచారకరమైనది. రక్షకుడు ఇలా బోధించారు “మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదారో ఆలాగునే మీరును వారికి చేయుడి. ” 29 మనము గౌరవము కావాలని అడుగుటకు ముందు, మనము గౌరవప్రదముగా ఉండాలి. ఇంకా, మన నిజమైన మార్పు “హృదయము యొక్క సాత్వీకమును మరియు దీనత్వమును” తెచ్చును, అది, “పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తుంది మరియు ఇతరుల కొరకు పరిపూర్ణ ప్రేమ,” 30 “కపటం లేని ప్రేమతో”31 (మనల్ని నింపుతుంది).
మన మంచి గొఱ్ఱెల కాపరి మారనివాడు, పాపము మరియు పాపము చేసిన వారిని గురించి ఆయన భూమి మీద నడచినప్పుడు ఎలాగు భావించారో అదే విధముగా ఈ రోజు భావిస్తారు. మనము పాపము చేసాము కాబట్టి ఆయన మన నుండి వెనుకంజ వేయరు, కానీ కొన్ని సందర్భాలలో “ఇది ఎటువంటి గొర్రె! ” అని మాత్రం ఆలోచిస్తారు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు అందుచేత, మనము పశ్చాత్తాపపడి మరియు శుద్ధిగా అగుటకు మార్గమును ఏర్పాటు చేసారు, ఆవిధంగా మనము ఆయన యొద్దకు మరియు పరలోక తండ్రి వద్దకు తిరిగి వెళ్ళవచ్చు.32 ఆవిధంగా చేయుటలో, అందరికి గౌరమును చూపి, ఎవరిపట్ల ద్వేషము చూపకుండా ఉండేందుకు మనకి ఒక మాదిరిని ఇచ్చారు.
ఆయన శిష్యులుగా, ఆయన ప్రేమని పూర్తిగా అద్దంపట్టి మరియు ఇతరులను బాహ్యముగా మరియు సంపూర్ణముగా ప్రేమిద్దాము, ఆవిధంగా ఎవరు విడువబడినవారిగా, ఒంటరిగా, లేక నిరాశగా భావించరు. యేసు క్రీస్తు మన మంచి కాపరి, మనల్ని ప్రేమించి, మరియు సంరక్షిస్తారు అని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన మనల్ని ఎరుగును మరియు తన గొఱ్ఱెల కొరకు తన ప్రాణమును ఇచ్చారు. 33 ఆయన మన కొరకు కూడ జీవిస్తున్నారు మరియు మనము ఆయనను తెలుసుకోవాలని మరియు ఆయనయందు విశ్వాసమును అభ్యాసము చేయాలని కోరుతున్నారు. నేను ఆయనను ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తున్నాను మరియు ఆయన కొరకు లోతైన కృతజ్ఞత కలిగియున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్ !