స౦ఘ౦ యొక్క ఆడిటింగ్ విభాగ నివేదిక, 2016
యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల స౦ఘము యొక్క ప్రధమ అధ్యక్షత్వమునకు
ప్రియమైన సహోదరులారా: సిద్ధా౦తములు మరియు నిబంధనలు 120వ విభాగములో బయల్పాటు చేత నిర్దేశి౦చబడిన విధ౦గా, దశమ భాగముల వినియోగముపై --ప్రథమ అధ్యక్షత్వము, పన్నె౦డుమ౦ది అపోస్తలుల కోరము, మరియు అధ్యక్షత్వము వహించు బిషప్రిక్కు కలిగియున్న సలహాసభ---సంఘ నిధుల వ్యయమును అనుమతించును. సంఘ సంస్థలు ఆమోదించబడిన బడ్జెట్లు, నియమములు, మరియు పద్ధతులకు అనుగుణముగా వినియోగించును.
స౦ఘ ఆడిటి౦గ్ విభాగము, అధికార పత్రములుగల నిపుణులను కలిగియుండి, మిగిలిన సంఘ విభాగములనుండి స్వతంత్రముగా ఉండి, పొందిన విరాళములు, చేయబడిన ఖర్చులు, మరియు సంఘ ఆస్తులను కాపాడుటలో న్యాయమైన హామీని ఇచ్చే ఉద్దేశము కొరకు ఆడిటిట్లను చేయుటకు బాధ్యతను కలిగియున్నది.
జరిగిన తనిఖీలపై ఆధారపడి, సంఘ ఆడిటింగ్ విభాగ అభిప్రాయము ప్రకారము, అన్ని వస్తువులకు సంబంధించి, పొందిన విరాళములు, చేయబడిన ఖర్చులు, మరియు 2016 సంవత్సరము కొరకు సంఘ ఆస్తులు వ్రాయబడినవి మరియు ఆమోదించబడిన సంఘ బడ్జెట్లు, నియమములు, మరియు లెక్కల అభ్యాసాలతో అనుగుణంగా నిర్వహించబడినది. సంఘము దాని సభ్యులకు బోధించిన బడ్జెట్ లోపల జీవించుట, అప్పును మానివేయుట, మరియు అవసర కాలమునకు వ్యతిరేకంగా పొదుపుచేయు ఆచరణలను అనుసరించును.
మర్యాదపూర్వకంగా సమర్పించబడినవి,
సంఘ ఆడిటింగ్ విభాగము
కెవిన్ ఆర్. జర్గెన్ సన్
మేనేజింగ్ డైరక్టరు