త్రియేక దేవుడు మరియు రక్షణ ప్రణాళిక
త్రియేక దేవుని గురించి మరియు వారితో మన అనుబంధము గురించి మనము సత్యమును కలిగియున్నాము కనుక, మర్త్యత్వము గుండా మన ప్రయాణము కొరకు మనము అంతిమ రోడ్ మ్యాప్ కలిగియున్నాము.
మన మొదటి విశ్వాస ప్రమాణము ఇలా ప్రకటించును: “మనము నిత్య తండ్రియైన దేవునియందు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తునందు, మరియు పరిశుద్ధాత్మయందు విశ్వసించుచున్నాము.” తండ్రి, కుమారుడు, మరియు పరిశుద్ధాత్మయందు ఈ నమ్మకములో మిగిలిన క్రైస్తవులతో మనము చేరుతున్నాము, కాని వారి గురించి మనము విశ్వసించేది, ఇతరుల నమ్మకాల నుండి విభిన్నమైనది. పరిశుద్ధ త్రిత్వ సిద్ధాంతము అని క్రైస్తవ లోకము పిలిచే దానిని మనము విశ్వసించము. తన మొదటి దర్శనములో, జోసఫ్ స్మిత్ ఇద్దరు ప్రత్యేక వ్యక్తులను, ఇద్దరు ప్రాణులను చూసెను, ఆవిధంగా దేవుడు మరియు త్రియేక దేవుని గురించి ప్రబలియున్న నమ్మకాలు సత్యము కాదని స్పష్టపరిచెను.
దేవుడు అసంభవము మరియు తెలియని మర్మము అనే నమ్మకానికి వ్యతిరేకంగా, దేవుని యొక్క స్వభావము గురించి సత్యము మరియు ఆయనతో మన అనుబంధము తెలిసికొనదగినదని, మరియు మన సిద్ధాంతములో, మిగిలిన ప్రతీదానికి ముఖ్యమైనది. బైబిలు యేసు యొక్క గొప్ప మధ్వవర్తిత్వ ప్రార్థన లిఖించెను, అక్కడ ఆయన “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము” (యోహాను 17:3)) అని ప్రకటించెను.
దేవునిని, ఆయన కార్యమును తెలుసుకొను ప్రయత్నము మర్త్యత్వము ముందే ప్రారంభమైంది మరియు ఇక్కడ ముగింపబడదు. “మీరు తెర దాటిన తరువాత (మహోన్నత స్థితి యొక్క సూత్రములన్నీ) నేర్చుకొనుట చాలా దీర్ఘకాలము కొనసాగును,” 1 అని జోసెఫ్ స్మిత్ బోధించాడు. పూర్వ మర్త్యత్వపు ఆత్మ లోకములో మనము సంపాదించిన జ్ఞానముపై మనము ఆధారపడతాము. కనుక, దేవుని యొక్క స్వభావమును మరియు తన బిడ్డలతో ఆయన అనుబంధమును బోధించుటకు ప్రయత్నించుటలో, బైబిలులో వ్రాయబడినట్లుగా, ప్రవక్త యెషయా ప్రకటించాడు:
“కావున మీరు దేవునితో పోల్చుదురు? లేక ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? …
“మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరును మీతో చెప్పలేదా? భూమిని స్థాపించుటను బట్టి మీరు దాని గ్రహించలేదా?” (యెషయా 40:18, 21)
త్రియేక దేవుని యొక్క సభ్యులలో ముగ్గురూ వేర్వేరు, ప్రత్యేకమైన వ్యక్తులని మనకు తెలుసు. ప్రవక్త జోసెఫ్ స్మిత్ చేత ఇవ్వబడిన సూచన నుండి దీనిని మనము తెలుసుకున్నాము: “తండ్రి మనుష్యుని వలె స్పర్శనీయమైన మాంసము, ఎముకలు గల శరీరమును కలిగియున్నాడు, కుమారుడు కూడా అలా ఉన్నాడు, కానీ పరిశుద్ధాత్మ మాంసము, ఎముకలు గల శరీరమును కలిగిలేడు, కాని ఆయన ఆత్మ స్వరూపి. ఆవిధంగా కాని యెడల, పరిశుద్ధాత్మ మన మధ్య నివసించదు” (సి మరియు ని 130:22).
త్రియేక దేవునిలో తండ్రియైన దేవుని యొక్క మహోన్నతమైన స్థానము గురించి, అదేవిధంగా ప్రతీ వ్యక్తి నెరవేర్చు ఆయా పాత్రలను గురించి ప్రవక్తయైన జోసెఫ్ వివరించెను:
“పరలోకములు తెరవబడుటను చూచిన వ్యక్తి ఎవరైనా పరలోకములలో, అధికారము యొక్క తాళపు చెవులు కలిగిన ముగ్గురు ఉన్నారని మరియు ఒకరు అందరిపైగా అధ్యక్షత వహించును. … అని ఎరుగును.
“. . . ఈ వ్యక్తులు . . . మొదటి దేవుడు, సృష్టికర్త, రెండవ దేవుడు, విమోచకుడు, మరియు మూడవ దేవుడు, సాక్షి లేక మరణశాసన కర్త.
“తండ్రి ప్రధానిగా లేక అధ్యక్షునిగా, యేసు మధ్యవర్తిగా, పరిశుద్ధాత్మ సాక్షి లేక మరణశాసన కర్తగా అధ్యక్షత వహించుట తండ్రి యొక్క పరిధిలో ఉన్నది.” 2
II. ప్రణాళిక
రక్షణ ప్రణాళిక గురించి బయల్పరచబడిన దాని నుండి త్రియేక దేవుని యొక్క సభ్యులతో మన అనుబంధము గురించి మనము గ్రహించాము.
మనము ఎక్కడ నుండి వచ్చాము? ” “మనమిక్కడ ఎందుకున్నాము? ” “మనము ఎక్కడకు వెళతాము?” వంటి ప్రశ్నలు “రక్షణ ప్రణాళిక,” “సంతోషము యొక్క గొప్ప ప్రణాళిక,” లేక “విమోచన ప్రణాళిక” (ఆల్మా 42:5, 8,11) అని లేఖనాలు పిలుచు దానిలో జవాబివ్వబడును. యేసు క్రీస్తు యొక్క సువార్త ఈ ప్రణాళికకు ప్రధానమైనది.
దేవుని యొక్క ఆత్మ బిడ్డలుగా, మర్త్యత్వమునకు ముందు ఉనికిలో, మనము నిత్య జీవము యొక్క గమ్యమును కోరాము, కాని ఒక భౌతిక శరీరములో మర్త్య అనుభవము లేకుండా వీలైనంత అభివృద్ధి చెందాము. ఆ అవకాశమిచ్చుటకు, మన పరలోకపు తండ్రి ఈ లోకము యొక్క సృష్టిపై అధ్యక్షత వహించెను, అక్కడ, మన మర్త్య జననముకు ముందు మన జ్ఞాపకము తీసివేయబడి, ఆయన ఆజ్ఞలు పాటించుటకు మన సమ్మతిని, మర్త్య జీవితంలో మిగిలిన సవాళ్ళ ద్వారా తెలుసుకొనుటకు మరియు ఎదుగుటకు మన సమ్మతిని రుజువు చేయగలము. కాని ఆ మర్త్య అనుభవము యొక్క ప్రక్రియలో, మన మొదటి తల్లిదండ్రుల పతనము ఫలితంగా, పాపము చేత మురికిగా చేయబడి, దేవుని యొక్క సన్నిధి నుండి తీసివేయబడుట ద్వారా మనము ఆత్మీయ మరణమునకు లోబడుచున్నాము. తండ్రి యొక్క ప్రణాళిక ఊహించబడింది మరియు ఈ ఆటంకాలను జయించుటకు విధానాలనిచ్చును.
త్రియేక దేవుడు
దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఉద్దేశమును తెలుసుకొని, ఇప్పుడు మనము ఆ ప్రణాళికలో త్రియేక దేవుని యొక్క ముగ్గురు సభ్యుల పాత్రలను ఆలోచిద్దాము.
బైబిలు నుండి బోధనలతో మనము ప్రారంభిద్దాము. కొరింథీయులకు తన రెండవ లేఖను ముగించుటలో, అపోస్తులుడైన పౌలు తండ్రి, కుమారుడు, మరియు పరిశుద్ధాత్మ యొక్క త్రియేక దేవుని అలవోకగా సూచిస్తూ చెప్పాడు, “ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును”3 (2 కొరింథీయులకు 13:14).
ఈ బైబిలు లేఖనము దైవసమూహమును సూచించును మరియు తండ్రియైన దేవుని యొక్క నిర్వచించు మరియు ప్రేరేపించు ప్రేమ, యేసు క్రీస్తు యొక్క కనికరము మరియు రక్షించు మిషను, పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును సూచించును.
తండ్రియైన దేవుడు
ఇదంతా తండ్రియైన దేవునితో ప్రారంభమగును. ఆయన గురించి మనము సాపేక్షంగా తక్కువగా తెలిసికొనియుండగా, ఆయన మహోన్నతమైన స్థానము, ఆయనతో మన అనుబంధము, రక్షణ ప్రణాళిక, సృష్టి, మరియు దానిని అనుసరించిన సర్వములో ఆయన పర్యవేక్షించు పాత్రను గ్రహించుటలో మనకు తెలిసినది కీలకమైనది.
తన మరణానికి ముందు ఎల్డర్ బ్రూస్ ఆర్. మెఖాంకీ వ్రాసారు: “మాట యొక్క అంతిమ మరియు తుది భావనలో, కేవలము ఒకే నిజమైన మరియు సజీవుడైన దేవుడున్నాడు. ఆయనే తండ్రి, సర్వశక్తిమంతుడైన ఎలోహిము, సర్వోన్నతుడు, విశ్వము యొక్క సృష్టికర్త మరియు పరిపాలకుడు.” 4 ఆయనే దేవుడు మరియు యేసు క్రీస్తు యొక్కయు, అదేవిధంగా మనందరి యొక్క తండ్రి. “యేసు క్రీస్తుచేత వాదించబడిన మొదటి ప్రధాన సత్యము, అన్నటికి పైగా, క్రిందుగా, తండ్రియైన దేవుడు, పరలోకము మరియు భూమి యొక్క ప్రభువు,” 5 అని అధ్యక్షులు డేవిడ్ ఓ. మెఖే ఆర్. మెఖాంకీ బోధించారు.
తండ్రియైన దేవుని స్వభావము గురించి మనకు తెలిసింది ఎక్కువగా ఆయన అద్వితీయ కుమారుడైన, యేసు క్రీస్తు యొక్క బోధనలు మరియు పరిచర్య నుండి మనము నేర్చుకోగలిగినది. ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ బోధించినట్లుగా, యేసు యొక్క పరిచర్య సర్వోన్నతమైన ఉద్దేశ్యాలలో ఒకటి మర్త్యులకు “మన నిత్య తండ్రి ఎలా ఉంటారో బయల్పరచుటకు, . . . ఆయన తండ్రి, మన పరలోకమందున్న తండ్రి యొక్క నిజమైన స్వభావమును బయల్పరచి, వ్యక్తిగతంగా చేయుటకు.” .”6 యేసు తన తండ్రి “తత్వము యొక్క మూర్తిమంతమునై యున్నాడు” (హెబ్రియులకు 1:3), అనే అపోస్తలత్వ సాక్ష్యమును బైబిలు కలిగియున్నది, అది కేవలము యేసు యొక్క స్వంత బోధనను విపులీకరించును, “నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు” (యోహాను 14:9).
తండ్రియైన దేవుడు మన ఆత్మల యొక్క తండ్రి. మనము ఆయన బిడ్డలము. ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు, మరియు ఆయన మన నిత్య ప్రయోజనము కొరకు సమస్తమును చేస్తున్నారు. ఆయన రక్షణ ప్రణాళిక యొక్క కర్త, మరియు ఆయన శక్తి ద్వారా ఆయన ప్రణాళిక ఆయన బిడ్డల యొక్క అంతిమ మహిమ కొరకు దాని ఉద్దేశమును సాధించును.
కుమారుడు
మర్త్యులకు, దైవసమూహములో అతి సాధారణంగా కనిపించే సభ్యుడు యేసు క్రీస్తు. 1909లో ప్రథమ అధ్యక్షత్వము ద్వారా గొప్ప సిద్ధాంత వాఖ్యానము ఆయన “దేవుని కుమారులందరి మధ్య ---ఆత్మయందు ప్రథముడు, మరియు శరీరమందు అద్వితీయుడు,” 7 అని ప్రకటించును. అందరికంటె గొప్పవాడైన కుమారుడు, తండ్రి యొక్క ప్రణాళికను వహించుటకు---లెక్కలేనన్ని లోకములు సృష్టించుటకు (మోషే 1:33 చూడుము) మరియు ఆయన ప్రాయశ్చిత్తము ద్వారా పాపమునుండి మరియు ఆయన పునరుత్థానము ద్వారా మరణము నుండి దేవుని పిల్లలను రక్షించుటకు తండ్రిచేత ఎన్నుకోబడ్డాడు. ఈ “మానవాతీతమైన త్యాగము” నిజముగా “సమస్త మానవ చరిత్ర యొక్క ప్రధాన చర్య” 8 అని పిలవబడింది.
తండ్రియైన దేవుడు వ్యక్తిగతంగా కుమారుని పరిచయము చేసిన ఆ ప్రత్యేకమైన మరియు పరిశుద్ధమైన సందర్భాలలో, తండ్రి చెప్పారు, (మార్కు 9:7; లూకా 9:35; 3 నీఫై 11:7; జోసఫ్ స్మిత్ చరిత్ర 1:17 కూడా చూడుము). కనుక, యేసు క్రీస్తే యెహోవా, ప్రవక్తలతో, ప్రవక్తలద్వారా మాట్లాడిన ఇశ్రాయేలు యొక్క దేవుడైన ప్రభువు.9 కనుక యేసు పునరుత్థానము తరువాత నీఫైయులకు ప్రత్యక్షమైన తరువాత, “సమస్త భూమి యొక్క దేవుడని,” (3 నీఫై 11:14) తనను తాను ఆయన పరిచయము చేసుకున్నాడు. దాదాపు 100 సంవత్సరాల క్రితం ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపోస్తులుల కోరము యొక్క ప్రేరేపించబడిన సిద్ధాంతపరమైన వివరణలో “తండ్రి మరియు కుమారుని,” గా ఆ యేసే మోర్మన్ గ్రంథము మరియు కడవరి దిన ప్రవక్తలతో తరచుగా మాట్లాడాడు.10
పరిశుద్ధాత్మ
త్రియేక దేవుని యొక్క సభ్యుడు పరిశుద్ధాత్మ, ప్రభువు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ, మరియు ఆదరణకర్తగా కూడా సూచించబడ్డాడు. ఆయన త్రియేక దేవుని యొక్క సభ్యుడు, వ్యక్తిగత బయల్పాటు యొక్క కర్తగా ఉన్నాడు. ఆత్మ యొక్క వ్యక్తిగా (సి మరియు 130:22 చూడుము), ఆయన మనలో నివసించును, తండ్రి మరియు కుమారుని మధ్య, భూమిమీద దేవుని పిల్లల మధ్య సంభాషించు ముఖ్యమైన పాత్రను నెరవేర్చగలడు. ఆయన మిషను తండ్రి మరియు కుమారుని గురించి సాక్ష్యమిచ్చుట అని అనేక లేఖనాలు బోధిస్తున్నాయి (యోహాను 15:26; 3 నీఫై 28:11; సి మరియు ని 42:17 చూడుము). ఆదరణకర్త సమస్తమును బోధించి, సంగతులన్నటిని జ్ఞాపకము చేస్తుందని, మరియు సర్వ సత్యములోనికి మనల్ని నడిపిస్తుందని రక్షకుడు వాగ్ధానమిచ్చాడు (యోహాను 14:26; 16:13). కనుక, పరిశుద్ధాత్మ సత్యము మరియు అసత్యము మధ్య గ్రహించుటకు మనకు సహాయపడును, మన ముఖ్యమైన నిర్ణయాలందు నడిపించును, మరియు మర్త్యత్వ సవాళ్ళ గుండా మనకు సహాయపడును. 11 మనము పాపము నుండి శుద్ధి చేయబడి మరియు పవిత్ర పరచబడుటకు పరిశుద్ధపరచబడుటకు కూడా ఆయనే ఆధారము (2 నీఫై 31:17; 3 నీఫై 27:20; మొరోనై 6:4 చూడుము).
కనుక, త్రియేక దేవుని మరియు రక్షణ ప్రణాళిక గురించి ఈ పరలోకపు బయల్పరచబడిన సిద్ధాంతము గురించి గ్రహించుట నేటి మన సవాళ్ళతో మనకేవిధంగా సహాయపడును?
త్రియేక దేవుడు మరియు వారితో మన అనుబంధము, జీవితపు ఉద్దేశమును, మరియు మన నిత్య గమ్యము యొక్క స్వభావము గురించి మనము సత్యమును కలిగియున్నాము కనుక, అంతిమ రోడ్ మ్యాప్ మరియు మర్త్యత్వము గుండా మన ప్రయాణము కొరకు అభయమును కలిగియున్నాము. మనము ఎవరిని ఆరాధిస్తున్నాము మరియు ఎందుకు ఆరాధిస్తున్నామో మనకు తెలుసు. మనము ఎవరము మరియు మనము ఎవరివలే కాగలము మనకు తెలుసు (సి మరియు 93:19 చూడుము ). దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ద్వారా రాగల అంతిమ దీవెనలు ఆనందించుటకు మనము తప్పక చేయవలసిన దానిని మరియు ఎవరు సర్వమును సాధ్యపరుస్తారో మనము ఎరుగుదుము. ఇవన్నీ మనకు ఎలా తెలుసు? ఆయన ప్రవక్తలతో మరియు మనలో ప్రతీ ఒక్కరితో వ్యక్తిగతంగా దేవుని యొక్క బయల్పాటు ద్వారా మనకు తెలుసు.
“క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత,” (ఎఫెసీయులకు 4:13), గా అపొస్తలుడైన పౌలు వివరించిన దానిని సంపాదించుటకు జ్ఞానము సంపాదించుట కంటె ఎక్కువ అవసరము. మనము సువార్త గురించి ఒప్పించబడుట సరిపోదు, మనము చెయ్యాలి, ఆలోచించాలి, ఆవిధంగా దాని చేత మనము మార్చబడతాము. ఏదైనా తెలుసుకోవాలని బోధించు, లోకము యొక్క సంస్థలకు వ్యతిరేకంగా, రక్షణ ప్రణాళిక మరియు యేసు క్రీస్తు యొక్క సువార్త ఏదైనా తప్పనిసరిగా కావాలని మనకు సవాలు చేయును.
మన గత సర్వసభ్య సమావేశములో అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ బోధించినట్లుగా:
“(రక్షణ) ప్రణాళికకు ముఖ్యమైనవాడు యేసు క్రీస్తు. ఆయన ప్రాయశ్చిత్త త్యాగము లేకుండా, అందరూ తప్పిపోతారు. అయినప్పటికిని, కేవలము ఆయనయందు మరియు ఆయన మిషను యందు విశ్వసించుట సరిపోదు. మనము పని చేయాలి, నేర్చుకోవాలి, పరిశోధించాలి, ప్రార్థించాలి, పశ్చాత్తాపపడాలి, మరియు మెరుగుపరచుకోవాలి. మనము దేవుని శాసనములు తెలుసుకోవాలి మరియు వాటిని జీవించాలి. మనము ఆయన రక్షించే విధులను పొందాలి. ఆవిధంగా చేయటం ద్వారా మాత్రమే మనము నిజమైన, శాశ్వత సంతోషమును పొందుతాము. . . .
“నా ఆత్మ యొక్క లోతులనుండి మరియు సమస్త వినయముతో, మన కొరకు మన తండ్రి యొక్క ప్రణాళిక అత్యంత గొప్ప వరమని నేను సాక్ష్యమిస్తున్నాను. అది ఇక్కడ మరియు రాబోయే లోకములో శాంతిని మరియు సంతోషమునకు ఒకే పరిపూర్ణమైన బాట,” 12 అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ ప్రకటించారు.
మన ప్రియమైన ప్రవక్త, అధ్యక్షుని యొక్క సాక్ష్యముతో నాది చేరుస్తున్నాను. మనల్ని ప్రేమించే పరలోక తండ్రిని మనము కలిగియున్నామని, మనల్ని నడిపించే పరిశుద్ధాత్మను మనము కలిగియున్నామని నేను సాక్ష్యమిస్తున్నాను. సమస్తమును సాధ్యపరచు, మన రక్షకుడైన యేసు క్రీస్తును గూర్చి, యేసు క్రీస్తు నామములో నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.