2010–2019
యేసు అతని చూచి అతని ప్రేమించెను
April 2017 General Conference


10:43

యేసు అతనిని చూచి అతని ప్రేమించెను

ఏదైన కష్టమైనది చేయుటకు అడగబడినట్లు మీరు భావించినప్పుడు---ప్రభువు మిమ్మల్ని చూచుట, మిమ్మల్ని ప్రేమించుట, ఆయనను వెంబడించమని మిమ్మల్ని ఆహ్వానించుటను ఆలోచించుము.

కొన్ని సంవత్సరాల క్రితం, వాషింగ్టన్ స్పొకెన్ మిషనుకు అధ్యక్షత్వము వహించుటకు నేను, నా భార్య పిలవబడ్డాము. అనేకమంది అసాధారణమైన యువ మిషనరీలతో పనిచేసే బాధ్యతను బట్టి ఉత్సాహాము మరియు భయము మిశ్రమంగా, మిషను ప్రాంతమును మేము చేరాము. వాళ్ళు అనేక నేపథ్యముల నుండి వచ్చారు మరియు త్వరగా మా స్వంత కొడుకులు మరియు కూతుర్లుగా మారారు.

అనేకమంది అద్భుతంగా బాగా చేస్తున్నప్పటికిని, కొందరు తమ పిలుపు గురించి అత్యధిక అంచనాలతో ప్రయాసపడుతున్నారు. “అధ్యక్షా, ఈ జనులు నాకసలు నచ్చలేదు.” కొందరు కఠినమైన మిషనరీ నియమాలను పాటించుటకు ఇష్టములేదని నాతో చెప్పారు. విధేయత కలిగియుండుట వలన కలిగే సంతోషమును ఇంకా నేర్చుకొనని కొందరు మిషనరీల హృదయాలను మార్చుటకు మేమేమి చేయగలము అని నేను ఆందోళన చెందాను మరియు ఆశ్చర్యపడ్డాను.

ఒకరోజు వాషింగ్టన్-ఐడహో సరిహద్దున అందముగా, సమముగా ఉన్న గోధుమ పొలముల గుండా నేను ప్రయాణిస్తుండగా, నేను క్రొత్త నిబంధన రికార్డింగ్ వింటున్నాను. నిత్య జీవమును పొందుటకు తాను ఏమి చేయాలని అడుగుటకు రక్షకుని వద్దకు వచ్చిన ధనికుడైన యువకుని పరిచయమైన వృత్తాంతమును నేను విన్నప్పుడు, ఊహించనిది కానీ లోతైన వ్యక్తిగత బయల్పాటును పొందాను, ఇప్పుడది ఒక పరిశుద్ధమైన జ్ఞాపకంగా అయ్యింది.

యేసు ఆజ్ఞలు చెప్పుటను మరియు తన బాల్యము నుండి వీటిని ఆచరిస్తున్నానని చెప్పిన ఆ యువకుని జవాబును వినిన తరువాత, రక్షకుని మృదువైన దిద్దుబాటును నేను విన్నాను: “నీకు ఒకటి కొదువుగా నున్నది; నీవు వెళ్ళి నీకు కలిగినవన్నియు అమ్మి బీదలకిమ్ము. . . వచ్చి నన్ను వెంబడించుము.” 1 కాని నా ఆశ్చర్యమునకు, ఆ మాటలకు ముందు ఆరు మాటలు ఇంతకుముందెన్నడు విననట్లుగా లేక చదవనట్లుగా కనబడినవి. అవి లేఖనాలకు చేర్చబడినట్లుగా కనబడినవి. తరువాత విశదపరచబడి ఆ ప్రేరేపించబడిన జ్ఞానమును బట్టి నేను ఆశ్చర్యపడ్డాను.

అటువంటి లోతైన ప్రభావము కలిగిన ఆరు మాటలేవి? మిగిలిన సువార్త వృత్తాంతములలో కనగొనబడకుండా, కేవలం మార్కు సువార్తలో మాత్రమే కనుగొనబడిన ఈ సాధారణమైనవిగా కనబడిన మాటలను మీరు గుర్తించగలరేమో తెలుసుకొనుటకు వినండి:

“ఒకడు పరుగెత్తికొని వచ్చి . . . సద్భోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయన నడిగెను?

“యేసు—నన్ను సత్పురుషుడని యేల చెప్పుచున్నావు? . . .

“నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుక వద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియును గదా అని అతనితో చెప్పెను.

“ ,బోధకుడా, బాల్యమునుండి ఇవన్నియు అనుసరించుచునే యుంటిని అని అతడు చెప్పెను.

యేసు అతని చూచి అతని ప్రేమించి ---నీకు ఒకటి కొదువుగా నున్నది; నీవు వెళ్ళి నీకు కలిగినవన్నియు అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను.”2

“యేసు అతని చూచిఅతని ప్రేమించెను.

ఈ మాటలు నేను విన్న తరువాత, మన ప్రభువు నిదానించి ఈ యువకుని చూస్తున్న స్పష్టమైన చిత్రము నా మనస్సును నింపింది. చూచుట---లోతుగా చూచుట మరియు అతడి ఆత్మలోనికి చొచ్చుకొనిపోయి, అతడి మంచితనమును గుర్తిస్తూ, అతడి సాధ్యతను, అదేవిధంగా అతడి గొప్ప అవసరతను గ్రహించెను.

తరువాత సాధారణమైన మాటలు—యేసు అతడిని ప్రేమించెను. ఆయన ఈ మంచి యువకుని కొరకు ఆమోఘమైన ప్రేమను మరియు కనికరమును భావించెను, మరియు ఈ ప్రేమవలన, ఈ ప్రేమతో, యేసు అతడి నుండి ఇంకా ఎక్కువ అడిగాడు. అతడికి కలిగినదంతా అమ్మివేసి బీదలకిచ్చుట ఎంతో కఠినమైనదానిని అడగబడినప్పటికిని, అటువంటి ప్రేమ చేత చుట్టబడుట ఈ యువకుడు ఎలా భావించియుండవచ్చని నేను చిత్రీకరించుకున్నాను.

ఆ క్షణమందు, మారాల్సిన అవసరమున్నది మా మిషనరీలలో కొందరి హృదయాలు మాత్రమే కాదని నాకు తెలుసు. అది నా హృదయము కూడా. “విసుగు చెందిన మిషను అధ్యక్షుడు ప్రయాసపడుతున్న ఒక మిషనరీ మంచిగా ప్రవర్తించుటకు ఎలా సహాయపడగలడు? అన్నది ప్రశ్న కాదు. “ఒక మిషనరీ దేవుని ప్రేమను నా ద్వారా అనుభూతి చెంది, మరియు మారటానికి కోరునట్లుగా, నేను క్రీస్తు వంటి ప్రేమతో ఏవిధంగా నింపబడగలను? వారు ఏమి చేస్తున్నారు, లేక చేయటం లేదు వారు నిజముగా ఎవరు, వారేమి కాగలరు, ధనికుడైన యువకుడిని ప్రభువు చూసినట్లుగా నేను అతడిని లేక ఆమెను ఎలా చూడగలను? నేను రక్షకుని వలె ఎలా కాగలను?

“యేసు అతని చూచి అతని ప్రేమించెను.”

ఆ సమయమునుండి, విధేయత చూపుటలో ప్రయాసపడుచున్న యువ మిషనరీలతో దగ్గరగా నేను కూర్చోన్నప్పుడు, నా హృదయములో నేనిప్పుడు, మిషనుపై రావాలనే కోరికపై పనిచేసిన విశ్వాసుడైన యువకుడు మరియు యువతిని నేను చూసాను. అప్పుడు నేను సున్నితమైన తల్లితండ్రి వంటి సంపూర్ణ భావనతో నేను చెప్పగలిగాను: 3 “ఎల్డర్, లేక సహోదరి, నేను మిమ్మల్ని ప్రేమించని యెడల, మీ మిషనుపై జరిగిన దాని గురించి నేను పట్టించుకోను. కాని నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మరియు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక, మీరేమి కావాలో దానిగురించి నేను శ్రద్ధ కలిగియున్నాను. కనుక మీకు కష్టమైన విషయాలను మార్చుకొని మరియు ప్రభువు మీరు కావాలని కోరినట్లు కావాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.”

నేను మిషనరీలను ఇంటర్యూ చేసిన ప్రతీసారి, దాతృత్వము వరము కొరకు మరియు ప్రభువు అతడు లేక ఆమెను చూసినట్లుగా ప్రతీ ఎల్డర్ మరియు సహోదరిని చూడగలుగునట్లు మొదట నేను ప్రార్థించాను.

జోన్ సమావేశాలకు ముందు, నేనూ, సహోదరి పామర్ ప్రతీ మిషనరీని ఒకరి తరువాత ఒకరిని పలకరించినప్పుడు, నేను ఆగి, వారి కళ్ళలోనికి లోతుగా చూసి,---మాటలు లేని ఇంటర్యూ, వారిని చూస్తాను---మరియు విఫలము కాకుండా, నేను ఈ ప్రశస్తమైన దేవుని కుమారులు మరియు కుమార్తెల కొరకు గొప్ప ప్రేమతో నింపబడ్డాను.

మార్కు 10 అధ్యాయముతో ఈ లోతైన అనుభవము నుండి నేను జీవితమును మార్చు పాఠములను నేర్చుకున్నాను. మనలో ప్రతిఒక్కరికి సహాయపడతాయని నేను నమ్మిన పాఠాలలో నాలుగు ఇక్కడున్నాయి:

  1. మన స్వంత కళ్ళతో కంటె మేలుగా ప్రభువు చూసినట్లుగా ఇతరులను చూచుట మనము నేర్చుకున్నప్పుడు, వారి కొరకు మన ప్రేమ, అదేవిధంగా వారికి సహాయపడాలనే మన కోరిక ఎదుగును. బహుశా వారికై వారు చూడలేని దానిని ఇతరులలోని సాధ్యతను మనము చూస్తాము. క్రీస్తు వంటి ప్రేమతో మనము ధైర్యముగా మాట్లాడుటకు మనము భయపడము, ఏలయనగా, “పరిపూర్ణ ప్రేమ భయము వెళ్లగొట్టును.”4 ప్రేమించుటకు కష్టమైన వారికే ఎక్కువ ప్రేమించాల్సిన అవసరమున్నదని గుర్తుంచుకొంటూ, మనము ఎన్నడూ విడిచిపెట్టము.

  2. చిరాకు లేక కోపములో చేయబడినప్పుడు, ఏ బోధన లేక శిక్షణ ఎప్పటికి జరగదు, మరియు ప్రేమ లేనిచోట హృదయాలు మారవు. తల్లిదండ్రులుగా, బోధకులుగా, లేక నాయకులుగా మనము చేసినప్పటికిని, నిందించే వాతావరణము కంటె నమ్మకముగల వాతావరణములో మాత్రమే నిజమైన బోధన జరుగుతుంది. మన గృహాలు ఎల్లప్పుడు మన పిల్లలకు సురక్షితమైన ఆశ్రయాలుగా ఉండాలి---ప్రతికూలమైన వాతావరణములో కాదు.

  3. ఒక బిడ్డ, స్నేహితుడు, లేక కుటుంబ సభ్యుడు మన ఆశలను చేరుకొనుటకు విఫలమైనప్పుడు ప్రేమ ఎన్నడూ తీసివేయబడరాదు. ధనికుడైన యువకుడు విచారిస్తూ వెళ్ళిపోయిన తరువాత అతడికి ఏమి జరిగిందో మనకు తెలియదు, కాని అతడు సులభమైన బాటను ఎన్నుకొన్నప్పటికిని యేసు అతడిని ఇంకా ప్రేమించియుండవచ్చని నా నమ్మకము. బహుశా జీవితంలో తరువాత, అతడు తన గొప్ప ఆస్తులు శూన్యమని కనుగొన్నప్పుడు, అతడు తన ప్రభువు తనను చూచి, తనను ప్రేమించి మరియు తనను వెంబడించమని అతడిని ఆహ్వానించు ప్రత్యేక అనుభవమును అతడు గుర్తు చేసుకొని మరియు చేసియుండవచ్చు.

  4. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక, ప్రభువు మన నుండి అధికంగా ఆశిస్తున్నారు. మనము వినయము కలిగియున్న యెడల, పశ్చాత్తాపపడుటకు, త్యాగము చేయుటకు, మరియు సేవ చేయుటకు ప్రభువు యొక్క ఆహ్వానమును మన కొరకు ఆయన పరిపూర్ణమైన ప్రేమ యొక్క ఆధారముగా స్వాగతిస్తాము. అన్నటికిపైగా, పశ్చాత్తాపపడుటకు, ఆహ్వానము క్షమాపణ మరియు శాంతి యొక్క అద్భుతమైన వరమును పొందుటకు కూడా ఆహ్వానము. కాబట్టి, “ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. . . ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును.”5

నా సహోదర, సహోదరిలారా, ఒక బలహీనమైన అలవాటు లేక ఒక వ్యసనము వదలివేయుటకు---లోక సంబంధమైన అన్వేషణలు ప్రక్కన పెట్టుటకు, అది సబ్బాతు కనుక ఒక ప్రియమైన కార్యక్రమమును త్యాగము చేయుటకు---మీపట్ల తప్పు చేసిన ఎవరినైనా క్షమించుటకు, ఏదైన కష్టమైనది చేయుటకు అడగబడినట్లు మీరు భావించినప్పుడు---ప్రభువు మిమ్మల్ని చూచుట, మిమ్మల్ని ప్రేమించుట, గతాన్ని మరిచిపోయి, మరియు ఆయనను వెంబడించుటకు మిమ్మల్ని ఆహ్వానించుట గుర్తుంచుకొనుము. ఎక్కువగా చేయుటకు మిమ్మల్ని ఆహ్వానించుటకు తగినంతగా మిమ్మల్ని ప్రేమించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుము.

మన రక్షకుడైన యేసు క్రీస్తు గురించి నేను సాక్ష్యమిస్తున్నాను, మరియు ఆయన మనలో ప్రతీఒక్కరి చుట్టూ తన చేతులు వేసి, మనల్ని చూచుచు, తన పరిపూర్ణమైన ప్రేమతో మనల్ని చుట్టువేయు దినము కొరకు ఎదురుచూస్తున్నాము. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.