2010–2019
పరిశుద్ధాత్మను నడిపించనిమ్ము
April 2017 General Conference


పరిశుద్ధాత్మను నడిపించనిమ్ము

దైవికంగా నియమించబడి, పరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపించును, సాక్ష్యమిచ్చును, బోధించును మరియు ప్రభువు యొక్క వెలుగులో నడుచుటకు ప్రేరేపించును.

సహోదరీ, సహోదరులారా, అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ మరియు ఈ ఉదయము ఆయన ఇచ్చిన సందేశము ద్వారా ప్రభువు యొక్క కార్యము వేగవంతము కావడాన్ని మనం చూస్తున్నామని మీ అందరివలె నేనూ గ్రహించాను. అధ్యక్షులు మాన్సన్, మేము మిమ్ములను ప్రేమిస్తున్నాము, మిమ్మల్ని బలపరుస్తున్నాము, మరియు “మా ప్రియమైన ప్రవక్తయైన” 1 మీ కొరకు ఎల్లప్పుడు ప్రార్థిసున్నాము.

ఈ వారాంతములో ఆత్మ యొక్క క్రుమ్మరింపును మనం అనుభూతిచెందాము. మీరు ఇక్కడ ఈ గొప్ప హాలులో ఉన్నను లేదా గృహాలలో చూస్తున్నా లేదా ప్రపంచములో సుదూరపు ప్రాంతాలలో ఉన్న సమావేశ మందిరాలలో సమకూడినా, ప్రభువు ఆత్మను అనుభూతిచెందుటకు మీకు అవకాశము కలదు. ఆ ఆత్మ మీ హృదయాలలో, మీ మనస్సులలో ఈ సమావేశములో బోధించబడిన సత్యాలను నిర్ధారించును.

పరిచయముగల ఈ కీర్తనలో పదాలను పరిగణించండి:

పరిశుద్ధాత్మను నడిపించనిమ్ము;

సత్యమైనదానిని మనకు బోధించనిమ్ము.

ఆయన క్రీస్తు గురించి సాక్ష్యమిచ్చును,

మన మనస్సులను పరలోక దృశ్యముతో వెలిగించును.2

కడవరి దిన బయల్పాటు నుండి త్రియేక దేవుడు ముగ్గురు నిర్ధిష్టమైన, వేర్వేరు వ్యక్తులను కలిగియుందని మనకు తెలుసు: మన పరలోక మందున్న తండ్రి; ఆయన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు; మరియు పరిశుద్ధాత్మ. “మనుష్య శరీరము తాకగలిగినట్లే మాంసము, ఎముకలు గల శరీరమును తండ్రి కలిగియుండెను; కుమారుడు కూడా కలిగియుండెను; కాని పరిశుద్ధాత్మ మాంసము, ఎముకలు గల శరీరమును కలిగిలేదు, కాని అతడు ఆత్మశరీరుడు. అట్లు కానియెడల, పరిశుద్ధాత్మ మనయందు నివసించలేడు.” 3

మన జీవితాలలో పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యతపైన నా సందేశము దృష్టిసారిస్తుంది. మర్త్యత్వములో మనం సవాళ్లను, ఇబ్బందులను, గందరగోళమును ఎదుర్కొంటామని మన పరలోక తండ్రికి తెలుసు; మనం ప్రశ్నలు, నిరాశలు, శోధనలు మరియు బలహీనతలతో పెనుగులాడుతామని ఆయనకు తెలుసు. మనకు మర్త్య బలాన్ని, దైవిక నడిపింపును ఇచ్చుటకు ఆయన మనకు పవిత్ర ఆత్మను ఇచ్చెను, అది పరిశుద్ధాత్మకు మరియొక పేరు.

పరిశుద్ధాత్మ మనలను ప్రభువుతో బంధించి ఉంచును. దైవికంగా నియమించబడి ఆయన మనల్ని ప్రేరేపించును, సాక్ష్యమిచ్చును, బోధించును, ప్రభువు వెలుగులో నడవమని మనకు గుర్తుచేయును. మన జీవితాలలో ఆయన ప్రభావమును గుర్తించుటను నేర్చుకొని, స్పందించు పరిశుద్ధ బాధ్యతను మనము కలిగియున్నాము.

ప్రభువు వాగ్దానమును జ్ఞాపకము చేసుకొనండి: “నా ఆత్మను నీకిచ్చెదను, అది నీ మనస్సును వెలిగించును, నీ ఆత్మను సంతోషముతో నింపును.”4 ఆ అభయము నాకిష్టము. అనుదిన జీవితమునకు భిన్నముగా మన ఆత్మలను నింపే సంతోషము దానితో నిత్య దృక్పధమును తీసుకొనివస్తుంది. కష్టము లేదా హృదయవేదన మధ్య, అటువంటి సంతోషము శాంతివలె వచ్చును. అది ఆదరణను, ధైర్యాన్ని ఇచ్చి, సువార్త సత్యాలను విశదపరచి, ప్రభువు మరియు దేవుని పిల్లలందరి కొరకు మన ప్రేమను విస్తరింపజేస్తుంది. అటువంటి దీవెనల కొరకు గొప్ప అవసరత ఉన్నప్పటికి, లోకము అనేక విధాలలో వాటిని మరచిపోయి, విడిచిపెట్టింది.

మనం ప్రతివారము పరిశుద్ధ సంస్కారములో పాలుపంచుకొన్నప్పుడు, ప్రభువైన యేసు క్రీస్తును, ఆయన ప్రాయశ్చిత్త త్యాగమును “ఎల్లప్పుడు జ్ఞాపకము చేసుకొందుము” అని మనం నిబంధన చేస్తాము. ఈ పరిశుద్ధ నిబంధనను మనము జ్ఞాపకముంచుకొన్నప్పుడు, మనము “ఆయన ఆత్మ ఎల్లప్పుడు [మనతో] కలిగియుంటామని”5 వాగ్దానము ఇవ్వబడ్డాము.

దానిని మనం ఏవిధంగా చేస్తాము?

మొదట,మనము ఆత్మకు యోగ్యతగా ఉండుటకు ప్రయత్నిస్తాము.

ఎవరైతే “దినదినము వారి దేవుడైన ప్రభువును జ్ఞాపకము చేసుకొనుటకు వారు ఖచ్ఛితముగా” 6 ఉంటారో, వారికి పరిశుద్ధాత్మ తోడుగా ఉండును. ప్రభువు ఉపదేశించినట్లుగా, మనం “ఈ లోకసంబంధమైన విషయములను ప్రక్కన పెట్టి, ఉత్తమమైన సంగతులను వెదకవలెనను”7 ఎందుకంటే “ప్రభువు యొక్క ఆత్మ, అపవిత్రమైన ఆలయములలో నివసించదు.”8 మనం ఎల్లప్పుడు దేవుని యొక్క శాసనములకు విధేయులమై, లేఖనములను పఠించి, ప్రార్థన చేస్తూ, దేవాలయమునకు హాజరై, “నిజాయితీగా, యథార్థముగా, పవిత్రముగా, ధర్మముగా, సుగుణము కలిగియుండుటను, సర్వ మానవాళికి మేలు చెయ్యాలి” అనే పదమూడవ విశ్వాస ప్రమాణమునకు యధార్థముగా జీవించాలి.

రెండవది, ఆత్మను పొందుటకు మనము సమ్మతించాలి.

“నేను నీ మనస్సులోను నీ హృదయములోను పరిశుద్ధాత్మ ద్వారా చెప్పెదను, అది నీ మీదికి వచ్చి, నీ హృదయమందు నివసించును” 9 అని ప్రభువు వాగ్దానము చేసెను. న్యూ జెర్సీ, స్కాచ్ మైదానములలో యౌవన మిషనరీగా దీనిని నేను అర్థము చేసుకొనుటకు మొదలుపెట్టాను. జూలైలో వేడిగా ఉన్న ఒక ఉదయమున నేను, నా సహచరుడు టెంపుల్ స్కేర్ సిఫార్సు చేసిన ఒకరిని చూడాలని ప్రేరేపించబడ్డాము. ఎల్‌ఉడ్ షాఫర్ ఇంటి తలుపు తట్టాము. శ్రీమతి షాఫర్ మర్యాదగా మమ్మల్ని పంపివేసింది.

ఆమె తలుపును వేయుచుండగా, నేను అంతకు ముందు, ఆ తరువాత ఎన్నడూ చెయ్యని ఒక పని చెయ్యాలని భావించాను! నా కాలును తలుపు మధ్యలో పెట్టి, “మా సందేశమును వినుటకు ఆసక్తి గలవారు ఎవరైనా ఉన్నారా?” అని అడిగాను. ఆమె 16 యేండ్ల కుమార్తె, మార్టి, ఆసక్తి కలిగియున్నది, ఆమె నడిపింపు కొరకు మనఃపూర్వకముగా ఆ ముందు రోజే ప్రార్థన చేసింది. మార్టి మమ్మల్ని కలిసింది మరియు త్వరలోనే ఆమె తల్లికూడా చర్చలలో పాల్గొంది. వారిద్దరు సంఘములో చేరారు.

చిత్రం
ఒక మిషనరీగా ఎల్డర్ రాస్బాండ్

మార్టి యొక్క బాప్తీస్మము ఫలితంగా, ఆమె స్వంత కుటుంబములో అనేకులతో కలిపి 136 మంది బాప్తీస్మము పొంది, సువార్త నిబంధనలు చేసారు. నేను ఆత్మను ఆలకించి, వేడిగా ఉన్న ఆ జూలై దినమున నా కాలును తలుపు మధ్యలో పెట్టినందుకు నేనెంతో కృతజ్ఞత కలిగియున్నాను. మార్టి మరియు ఆమె ప్రియమైన కుటుంబ సభ్యులలో అనేకులు నేడు ఇక్కడున్నారు.

మూడవది,ఆత్మ వచ్చినప్పుడు మనం దానిని గుర్తించాలి.

ఆత్మ చాలా తరుచుగా ఒక భావనగా సంభాషించుట నా అనుభవముగా ఉన్నది. మీకు పరిచయమున్న, మీకు అర్ధమయ్యే, “మిమ్మల్ని ప్రేరేపించే” మాటలలో దానిని మీరు భావిస్తారు. ప్రభువు వారికొరకు ప్రార్థించగా విన్న నీఫైయుల స్పందనను పరిగణించండి: “మరియు సమూహము విని, సాక్ష్యమిచ్చెను. వారి హృదయములు తెరువబడెను మరియు ఆయన ప్రార్థన చేసిన మాటలను వారి హృదయముల యందు వారు గ్రహించిరి.” 10 ఆయన ప్రార్థన యొక్క మాటలను వారు తమ హృదయాలలో భావించారు. పరిశుద్ధాత్మ యొక్క స్వరము మిక్కిలి నిమ్మళమైనది.

పాత నిబంధనలో, ఏలీయా బయలు యాజకులతో తర్కించాడు. ఆ యాజకులు బయలు “స్వరము” ఉరుము, మెరుపువలె వచ్చి వారి బలిని అగ్నితో దహించివెయ్యాలని ఆశించారు. కాని అక్కడ ఏ స్వరము గాని, ఏ అగ్నిగాని రాలేదు. 11

తరువాత సంఘటనలో, ఏలీయా ప్రార్థన చేసెను. “అంతట యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను, యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను; శిలలు ఛిన్నా భిన్నములాయెను గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపము కలిగెను గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు:

“ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు, మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము వినబడెను.” 12

ఆ స్వరము మీకు తెలుసా?

అధ్యక్షులు మాన్సన్ ఇలా బోధించారు, “మనం జీవితపు ప్రయాణమును కొనసాగించినప్పుడు, ఆత్మ యొక్క భాషను మనకు నేర్చుకొందాము.” 13 మనం “భావించే” మాటలను ఆత్మ మాట్లాడును. ఈ భావాలు సున్నితమైనవి, అవి చర్య తీసుకొనుటకు, ఏదైనా చేయుటకు, ఏదైనా చెప్పుటకు, ఒక నిర్ధిష్టమైన విధానములో స్పందించుటకు మెల్లగా ముందుకు త్రోయును. మన ఆరాధనలో మనం తేలిక స్వభావమును లేదా సంతృప్తి భావమును కలిగియుండి, ఐహిక అన్వేషణల వలన ప్రక్కకు తొలగి, సున్నితత్వమును కొల్పోతే, భావించుటకు మనకు గల సామర్థ్యము క్షీణించిందని మనం కనుగొంటాము. నీఫై లేమన్ మరియు లెమ్యుల్ లకు ఈవిధంగా చెప్పెను, “సమయము నుండి సమయమునకు మీరు అతని స్వరమును వినియుంటిరి. అతడు, మీతో ఒక నిశ్చలమైన చిన్న స్వరముతో మాట్లాడియుండెను. కానీ, మీరు మందబుద్ధి కలిగియున్నారు, కాబట్టి అతని మాటలను గ్రహించలేకపోతిరి.”14

గత జూన్‌లో, నేనొక నియమితకార్యముపై దక్షిణ అమెరికా వెళ్లాను. కొలంబియా, పెరూ, ఈక్వేడార్‌లను సందర్శించుటకు 10 రోజుల తీరికలేని షెడ్యూలుతో మేమున్నాము. ఒక తీవ్రమైన భూకంపము వందలమంది ప్రాణాలు తీసి, పదుల వేల సంఖ్యలో గాయపరచి, ఈక్వేడార్ నగరాలైన పోర్టోవీజో, మాన్టాలోని ఇండ్లను, సమాజాలను నష్టపరిచి, నాశనము చేసెను. ఆ పట్టణాలలో నివసిస్తున్న సభ్యులను దర్శించుటకు మా కార్యక్రమములో చేర్చాలని నేను ప్రేరేపించబడ్డాను. పాడైన రహదారులలో అక్కడికి వెళ్లగలమో లేదో మాకు ఖచ్చితంగా తెలియదు. నిజానికి, మేమక్కడికి వెళ్లలేమని చెప్పబడ్డాము కాని ప్రేరణలు విడిచి వెళ్లలేదు—చివరకు, మేము దీవించబడ్డాము, మరియు ఆ రెండు నగరాలను దర్శించగలిగాము.

తక్కువ సమయంలో చేసిన అటువంటి స్వల్ప నోటీసుతో, వేగవంతముగా ఏర్పాటు చేయబడిన కూడికలకు కొంతమంది ప్రాంతీయ యాజకత్వ నాయకులే వస్తారని నేను ఊహించాను. ఐనప్పటికి, మేము ప్రతి స్టేకు కేంద్రమునకు చేరుకున్నప్పుడు, సమాజమందిరాలు వెనుక స్టేజు వరకు నిండి ఉండటం మేము కనుగొన్నాము. హాజరైనవారిలో కొందరు ఆ ప్రాంతములో పరాక్రమవంతులు, వారు సంఘములో ఉండి, ఇతరులను వారితో ఆరాధనలో చేరమని, వారి జీవితాలలో ఆత్మను భావించమని ప్రోత్సహించిన అగ్రగాములు. మొదటి వరుసలలో కూర్చొన్నవారిలో భూకంపములో తమ ప్రియమైన వారిని, పొరుగువారిని కోల్పోయిన సభ్యులున్నారు. అక్కడ హాజరైన వారందరిపైన అపొస్తలుని దీవెన ఇవ్వాలని నేను ప్రేరేపించబడ్డాను, అది నేను ఇచ్చిన వాటిలో మొట్టమొదటిది. ఆ గదిలో ముందు భాగములో నేను నిలబడియునప్పటికి, నా చేతులు వారిలో ప్రతి ఒక్కరిపైన ఉంచబడినట్లు ఉండెను మరియు ప్రభువు మాటలు క్రుమ్మరించబడినట్లుగా నేను భావించాను.

చిత్రం
దక్షిణ అమెరికాలో ఎల్డర్ మరియు సహోదరి రాస్బాండ్

అది అక్కడితో ఆగిపోలేదు. అమెరికాలో ప్రజలను దర్శిస్తున్నప్పుడు, యేసు క్రీస్తు మాట్లాడిన విధముగానే మాట్లాడాలని నేను ప్రేరేపించబడ్డాను. “ఆయన చిన్న పిల్లలను . . . తీసుకొని, వారిని ఆశీర్వదించి వారి కొరకు తండ్రికి ప్రార్థన చేసెను.” 15 మేము ఈక్వేడార్‌లో ఉన్నాము, మేము తండ్రి కార్యముపై ఉన్నాము, మరియు వీళ్ళు ఆయన పిల్లలు.

నాల్గవది, మనం మొదటి ప్రేరణకుస్పందించాలి.

నీఫై యొక్క మాటలు జ్ఞాపకము చేసుకొనండి: “నేను చేయవలసిన క్రియలను ముందుగా ఎరుగక, ఆత్మ చేత నడిపింపబడితిని.” “అయినప్పటికి నేను ముందుకు సాగాను,” అని అతడు చెప్పాడు. 16

మనం కూడా అలా చెయ్యాలి. మన మొదటి ప్రేరేపణలపట్ల నమ్మకాన్ని కలిగి ఉండాలి. కొన్నిసార్లు మనం సాకులను వెదకుతాము, మనం ఆత్మీయ ప్రేరణను భావిస్తున్నామా లేదా అవి కేవలం మన ఆలోచనలా అని ఆలోచిస్తాము. మనందరం కలిగియున్న – మన భావాలను రెండవ అభిప్రాయము, ఇంకా మూడవ అభిప్రాయము కొరకు ఆలోచించడం మొదలుపెడితే, మనం ఆత్మను పంపివేస్తున్నాము; దైవోపదేశమును మనం ప్రశ్నిస్తున్నాము. “మీరు మొదటి ప్రేరేపణలను ఆలకించినప్పుడు, పదికి తొమ్మిది సార్లు మీరు సరిగ్గా పొందుతారు,”17 అని ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ బోధించాడు.

ఇప్పుడొక హెచ్చరిక: మీరు పరిశుద్ధాత్మకు స్పందించారు కాబట్టి బాణాసంచా ఆశించవద్దు. “ఆ మిక్కిలి నిమ్మళమైన స్వరము” యొక్క పని మీద మీరున్నారు.

న్యూయార్క్ పట్టణములో నేను మిషను అధ్యక్షునిగా సేవ చేస్తున్నప్పుడు, బ్రోన్‌క్స్ లో మా మిషనరీలలో కొందరితో ఒక రెస్టారెంటులో ఉన్నాను. ఒక యౌవన కుటుంబము లోపలికి వచ్చి మాకు సమీపములో కూర్చున్నారు. సువార్త చెప్పుటకు వారు శ్రేష్టముగా అనిపించారు. మా మిషనరీలు నాతో మాట్లాడుటను కొనసాగించగా నేను వారిని గమనించాను, తరువాత ఆ కుటుంబము వారి భోజనమును ముగించి, బయటకు వెళ్లిపోయారు. తరువాత నేను “ఎల్డర్స్, ఈరోజు మనము నేర్చుకొనుటకు ఒక పాఠమున్నది. ఒక అందమైన కుటుంబము ఈ రెస్టారెంటుకు వచ్చుటను మీరు చూసారు. మనం ఏమి చేసి ఉండాల్సింది?”

ఎల్డర్లలో ఒకరు వెంటనే మాట్లాడాడు. “నేను లేచి వారి యొద్దకు వెళ్లి మాట్లాడాలని అనుకున్నాను. నేను మృదువుగా ముందుకు త్రోయబడుటను భావించాను, కాని నేను స్పందించలేదు.”

“ఎల్డర్స్, మనం ఎల్లప్పుడు మన మొదటి ప్రేరణపై స్పందించాలి. ముందుకు త్రోయబడినట్లు నీవు భావించినది పరిశుద్ధాత్మ!” అని నేను చెప్పాను.

మొదటి ప్రేరణలు పరలోకమునుండి వచ్చు స్వచ్ఛమైన ప్రేరేపణ. అవి మనకు నిర్ధారించి లేదా సాక్ష్యము చెప్పినప్పుడు, అవి ఎమిటో మనం గుర్తించాలి మరియు అవి మరచిపోకూడదు. చాలా తరుచుగా అవసరతలో ఉన్నవారిని ముఖ్యముగా కుటుంబము మరియు స్నేహితులను చేరుకోమని ఆత్మ మనలను ప్రేరేపించును. “కాబట్టి, మిక్కిలి నిమ్మళమైన స్వరము . . . అది అన్నిసంగతులను గుసగుసలాడును, చొచ్చుకొనిపోవును,” 18 సువార్తను బోధించుటకు అవకాశాలను చూపించుటకు, పునఃస్థాపన మరియు యేసు క్రీస్తు గురించి సాక్ష్యము చెప్పుటకు, సహకారమందించి, అక్కర చూపించుటకు, దేవుని ప్రశస్తమైన పిల్లలలో ఒకరిని రక్షించుటకు మనలను నడిపించును.

“మొదటి స్పందనకారుడు” అని పిలవబడినట్లుగా దానిని మీరు భావించండి. చాలా ఎక్కువ సమాజాలలో, ఒక విషాదము, దుర్ఘటన, లేదా విపత్తుకు మొదటి స్పందనకారులెవరనగా అగ్నిమాపక సిబ్బంది, రక్షకభటులు, పారామెడికల్ సిబ్బంది. వారు లైట్లు వెలిగిస్తూ వస్తారు, వారి కొరకు మనం చాలా ఎక్కువ కృతజ్ఞతను కలిగియున్నామని, నేను చేర్చనా. ప్రభువు మార్గము తక్కువ స్పష్టమైనది-- కాని తక్షణ స్పందన అవసరము. తన పిల్లలందరి అవసరతలను ప్రభువు ఎరుగును-మరియు సహాయపడుటకు ఎవరు సిద్ధంగా ఉన్నారో ఆయనకు తెలుసు. మనం సిద్ధముగా ఉన్నామని మన ఉదయకాల ప్రార్థనలో ప్రభువుకు తెలిపితే, స్పందించమని ఆయన మనలను పిలుస్తాడు. మనం స్పందిస్తే, ఆయన అప్పుడప్పుడు, మనల్ని పిలుస్తారు మరియు అధ్యక్షులు మాన్సన్ పేరుపెట్టిన “ప్రభువు కార్యము” 19 లో ఉన్నట్లు మనల్ని మనం కనుగొంటాము. ఉన్నతమునుండి సహాయమును తీసుకొనివస్తున్న మొదటి అత్మీయ స్పందనకారులుగా మనం అవుతాము.

మనకు వచ్చే ప్రేరణలవైపు మనం ఆసక్తి చూపితే, ఆత్మీయ బయల్పాటులో అభివృద్ధి చెంది, ఆత్మచేత నడిపించబడు జ్ఞానమును, నడిపింపును మరి ఎక్కువగా పొందుతాము. “మేలు చేయుటకు నడిపించు ఆత్మయందు మీ నమ్మకముంచుము” 20 అని ప్రభువు సెలవిచ్చారు.

“సంతోషించుడి, నేను మిమ్ములను మార్గము వెంబడి నడిపించెదను” 21 అని ప్రభువు ఇచ్చిన పిలుపును గంభీరమైనదిగా తీసుకొందుము గాక. ఆయన పరిశుద్ధాత్మ చేత మనల్ని నడిపించును. , , అవి దేవునినుండి వచ్చాయని ఎరిగి మన మొదటి ప్రేరణలు త్వరగా అనుసరిస్తూ ఆత్మకు దగ్గరగా జీవించెదముగాక. మనల్ని నడిపించుటకు, రక్షించుటకు, నిరంతరము మనతో ఉండుటకు పరిశుద్ధాత్మ యొక్క శక్తి గురించి నేను సాక్ష్యము చెప్పుచున్నాను, యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

ముద్రించు