2010–2019
తిరిగి రండి మరియు పొందుము
April 2017 General Conference


తిరిగిరండి మరియు పొందుము

దేవుని సన్నిధికి తిరిగి వెళ్లుటకు, నిబంధనలు చేయుట మరియు పాటించుట నుండి వచ్చు నిత్య దీవెనలు పొందుట మనము ఏర్పరచగల అతి ముఖ్యమైన లక్ష్యములు.

నా సహోదర, సహోదరులారా, ఇప్పుడు నేను మీతో మాట్లాడుటకు నియమించబడ్డాను, మరియు వినుట మీ కార్యము. మీది మీరు పూర్తి చేయకముందు నేను అప్పగించబడినది పూర్తిచేయుట నా లక్ష్యము. నా శాయశక్తులా చేస్తాను.

ఈ లోకములో అత్యధికమును సాధించినవారు, వారి జీవితాలకు ఒక దృష్టితో, వారి దృష్టిపై కేంద్రీకరించుటకు వారిని నిలిపియుంచు లక్ష్యములతో మరియు వాటిని ఎలా సాధించాలో సమర్ధమైన ప్రణాళికలతో ఉన్నవారిని నేను చాలా సంవత్సరాలుగా, గమనించాను. మీరు ఎక్కడికి వెళుతున్నారో తెలుసుకొని, అక్కడికి ఎలా వెళ్ళాలని మీరాశిస్తున్నారో తెలుసుకొనుట జీవితానికి అర్ధము, ఉద్దేశము, మరియు సాఫల్యతను తెచ్చును.

ఒక ప్రణాళిక మీరక్కడికి వెళ్ళుటకు మార్గము కాగా, ఒక లక్ష్యానికి ఒక గమ్యస్థానము లేక ముగింపు ఉ౦టు౦దని, కొందరు నేర్చుకొనేంతవరకు, వారికి ఒక లక్ష్యము మరియు ప్రణాళిక మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకొనుట కష్టముగా ఉన్నది. ఉదాహరణకు, మనకు తెలియని ప్రదేశానికి వెళ్ళడ౦ ఒక లక్ష్య౦గా పెట్టుకోవచ్చు, మా మగవారికి అక్కడికి ఎలా వెళ్ళాలో తెలుసని అనుకుంటాము---“నాకు తెలుసు---అది ఇక్కడే ఆ స౦దు చివర ఎక్కడో ఉ౦డాలి” అని అ౦టామని మన సోదరీమణులకు తెలుసు. నా భార్య నవ్వుతు౦డవచ్చు. లక్ష్యము స్పష్టమైనది, కాని గమ్యస్థానమును చేరుటకు అక్కడ మంచి ప్రణాళిక లేదు.

లక్ష్యము ఏర్పరచుట, ఆవశ్యకముగా మనస్సులో ముగింపుతో ప్రారంభమౌతుంది. ఆ ముగింపును చేరుటకు ఒక మార్గమును కనిపెట్టడమే ప్రణాళిక చేయటం. ఏ గమ్యములు నిజముగా ముఖ్యమైనవో గ్రహించుటలో సంతోషమునకు కీలకమైనది ఉన్నది---మరియు తరువాత అక్కడికి చేరుటకు నిశ్చయమైన మార్గమును ఏర్పరచే విషయాలపై మన సమయాన్ని, ప్రయత్నము, మరియు ఆసక్తిని గడుపుట.

దేవుడు, మన పరలోకపు త౦డ్రి మనము ఈ లక్ష్యమును ఏర్పరచుట మరియు ప్రణాళిక చేయుటకు ఒక పరిపూర్ణమైన మాదిరిని ఇచ్చారు. ఆయన లక్ష్యము, “పురుషుడు (మరియు స్త్రీ) యొక్క నిత్యజీవితము మరియు అమర్త్యత్వమును తెచ్చుట”1 మరియు దానిని సాధి౦చడానికి సాధనము “రక్షణ ప్రణాళిక.”

మన ప్రియమైన పరలోకపు త౦డ్రి యొక్క ప్రణాళిక, భౌతిక మర్త్య జీవితము ఎదుగుట, విశాలపరచబడుట, నేర్చుకొనుటను మనకు ఇచ్చుటను కలిపియున్నది, దానిద్వారా మనము ఆయన వలె ఎక్కువగా కాగలము. మన నిత్య ఆత్మలను భౌతిక శరీరాలందు ధరించి, ఆయన కుమారుడు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క‌ బోధనలు మరియు ఆజ్ఞల ద్వారా జీవిస్తూ, నిత్య కుటు౦బాలను ఏర్పరుస్తూ, రక్షకుని ప్రాయశ్చిత్తము ద్వారా, దేవుని యొక్క లక్ష్యమైన ఆయన సిలెస్టియల్ రాజ్యములో ఆయనతో ఆయన పిల్లల కొరకైన అమర్త్యత్వము మరియు నిత్యజీవము యొక్క దేవుని యొక్క లక్ష్యమును నెరవేర్చుటకు మనకు సాధ్యపరచును.

తెలివైన లక్ష్యము ఏర్పరచుట, దీర్ఘ-కాల లక్ష్యములను స్పష్టముగా గ్రహించుటకు అవి నడిపించిన యెడల మాత్రమే స్వల్పకాల లక్ష్యములు ప్రభావవంతమైనవని గ్రహించుటను కలిపియున్నవి. సంతోషమునకు ఒక ముఖ్యమైన మూలము మన స్వంత లక్ష్యములను ఎలా ఏర్పరచాలి మరియు మన పరలోక తండ్రి యొక్క ఏర్పాటులోపల మన స్వంత ప్రణాళికలను ఎలా స్థాపించాలో నేర్చుకొనుట అని నేను నమ్ముచున్నాను. ఈ నిత్య బాటపై మనము దృష్టిసారించిన యెడల, ఆయన సన్నిధికి తిరిగి వెళ్ళుటకు మనము అనివార్యముగా అర్హులవుతాము.

మన ఉద్యోగాలు, మన విద్య, మనము గోల్ఫ్ క్రీడ కొరకు కూడా లక్ష్యాలు మరియు ప్రణాళికలు ఉ౦డుట మ౦చిది. మన వివాహములు, మన కుటుంబాలు, మన సంఘ సలహాసభలు మరియు పిలుపుల కొరకు లక్ష్యాలను కలిగియుండుట కూడా ముఖ్యమైనది; ఇది ప్రత్యేకంగా మిషనరీలకు నిజమైనది. కాని మన మిక్కిలి గొప్పవి మరియు అత్యంత భర్తీ చేయు లక్ష్యములు పరలోక తండ్రి యొక్క నిత్య ప్రణాళికలో ఇమిడియుండాలి. “కాబట్టి మీరు దేవుని రాజ్యమును, ఆయన నీతిని మొదట వెదకుడి. అప్పుడవన్నియు మీకనుగ్రహి౦చబడును”2అని యేసు చెప్పెను.

ఒక లక్ష్యము సరళమైనది మరియు ఎక్కువ సూటియైనది అయితే, అది ఎక్కువ శక్తిని కలిగియుంటుందని, లక్ష్యమును ఏర్పరచు నిపుణులు మనకు చెప్పుచున్నారు. మనము ఒక లక్ష్యమును ఒక స్పష్టమైన రూపమునకు లేక రెండు శక్తివంతమైన, చిహ్నపూర్వకమైన మాటలకు తగ్గించినప్పుడు, ఆ లక్ష్యము మనలో భాగమగును మరియు మనము ఆలోచించి, చేయు సమస్తమును వాస్తవికంగా నడిపించును. ఈ స౦దర్భములో, మన కొరకు దేవుని లక్ష్యాలు మరియు మన కొరకైన మన అతి ముఖ్యమైన లక్ష్యములను పోలియున్నవని నేను నమ్ముచున్నాను. ఆ మాటలు తిరిగి రండి మరియు స్వీకరి౦చు.

ఆయన సన్నిధికి తిరిగి వెళ్ళుటకు మరియు నిబంధనలు చేసి, పాటించుట నుండి వచ్చు నిత్య దీవెనలను పొందుట మనము ఏర్పరచగల అత్యంత ముఖ్యమైన లక్ష్యములు.

“(ప్రభువు యేసు క్రీస్తు) య౦దుగల స్థిరమైన విశ్వాసముతో, ఆయన యోగ్యతలపైన పూర్తిగా ఆధారపడుచూ,” “క్రీస్తునందు ఒక నిలకడతో పరిపూర్ణమైన నిరీక్షణను కలిగియుండి మరియు దేవుని యొక్క మరియు మనుష్యులందరి (మరియు స్త్రీలు) . . . , యొక్క ప్రేమను కలిగి ముందుకు త్రోసుకు వెళ్ళవలెను, క్రీస్తు వాక్యమును విందారగించుచూ, ముందునకు త్రోసుకొనివెళ్ళిపోయి, అంతము వరకు స్థిరముగానుండుట ద్వారా మనము తిరిగి వెళ్ళి,పొందగలము.3

మనము ఆయన సన్నిధికి తిరిగి వెళ్ళి, ఆయన దీవెనలు పొందుటకు మనల్ని అనుమతించు మన తండ్రి యొక్క ప్రణాళికను లూసిఫర్ అంగీకరించలేదు. వాస్తవానికి, లూసిఫర్ తిరుగుబాటు చేసాడు మరియు తనకై తాను దేవుని యొక్క మహిమ, ఘనత, మరియు శక్తిని తీసుకొనుటకు కోరుచూ, మన తండ్రి యొక్క ప్రణాళికను పూర్తిగా మార్చుటకు ప్రయత్నించాడు. ఫలితంగా, అతడు తన అనుచరులతోసహా దేవుని సన్నిధినుండి త్రోసివేయబడ్డాడు మరియు “అవును, దయ్యము, సమస్త అబద్ధములకు తండ్రి, పురుషులు (మరియు స్త్రీల)కు, (ప్రభువు యొక్క) స్వరమును వినని వారందరిని కూడా మోసగించుటకు మరియు అంధులుగా చేయుటకు, అతడి చిత్తప్రకారము వారిని చెరలోనికి నడిపించుటకు సాతానుగా మారాడు.”4

తన మర్త్యత్వమునకు ముందు ఎంపికల వలన, సాతాను తిరిగి రాలేడుమరియుపొ౦దలేడు. . అతడికి మిగిలిన ఏకైక విషయము మనల్ని కృంగిదీయుటకు మరియు తనవలె దీనస్థితికి మనల్ని తెచ్చుటకు సాధ్యమైన ప్రతీ ప్రలోభ మరియు శోధనను ఉపయోగించుట ద్వారా తండ్రి యొక్క ప్రణాళికను వ్యతిరేకించుట. .5 సాతాను క్రూరమైన లక్ష్యమును నెరవేర్చుటకు అతడి యొక్క ప్రణాళిక, ప్రతీ వ్యక్తి, తరము, సంప్రదాయము, మరియు సమాజమునకు అన్వయించును. తిరిగి వెళ్ళుటకు మరియు పొందుటకు మనము చేయాల్సిన “విషయాలన్నిటిని”మనకు చూపు మెల్లని, నిమ్మళమైన పరిశుద్ధాత్మ యొక్క స్వరమును అణచివేయు స్వరములు---బిగ్గరయైన స్వరములను అతడు ఉపయోగించును.6

ఈ స్వరాలు సువార్త సత్యమును నిర్లక్ష్యము చేసిన వారికి, మరియు ఇంటర్నెట్, సామాజిక, ప్రచురణా మీడియా, రేడియో, టెలివిజను ఉపయోగించువారు మరియు నిత్యత్వము కొరకు మనము కలిగియున్న మన లక్ష్యములు మరియు ప్రణాళికల నుండి మనల్ని అంతరాయపరిచే విధానములో దుర్నీతి, దౌర్జన్యము, దుర్భాష, అసహ్యకరమైన, మలినమైనవి వశ్యపరచే విధానములో ప్రదర్శించు సినిమాలను ఉపయోగించు వారికి చెందినవి.

స్త్రీ, పురుషుల లౌకిక తత్వములచేత అంధులైన మంచి ఉద్దేశముగల వ్యక్తులు మరియు విశ్వాసమును నాశనము చేసి, దేవుని యొక్క సన్నిధికి తిరిగి వెళ్ళి, (మన) తండ్రికి కలిగిన సమస్తమును పొందుటకు7 కేవలము ప్రయత్నిస్తున్న వారి యొక్క నిత్య దృష్టిని మరల్చుటకు వెదకువారిని కూడ ఈ స్వరములు కలిగియున్నవి.

తిరిగి వెళ్ళుటకు, వాగ్దానము చేయబడిన దీవెనలను పొందుటపై దృష్టిని నిలుపుకొనుటకు, “నేనేవిధంగా చేస్తున్నాను?” అని నన్ను ప్రశ్నించుకొనుటకు నేను క్రమముగా సమయాన్ని తీసుకోవాల్సిన అవసరమున్నదని నేను కనుగొన్నాను.

ఇది మీతో మీకు వ్యక్తిగతమైన, ఏకా౦తమైన స౦భాషణను కలిగియుండుట వలె ఉన్నది. ఇది అసాధారణమైనదిగా అనిపించిన యెడల దాని గురించి ఆలోచించుము: మిమ్మల్ని మీరు ఎరిగిన దానికంటే ఈ లోకములో మిమ్మల్ని ఎరిగినవారు ఎవరుంటారు? మీ ఆలోచనలు, మీ రహస్య క్రియలు, మీ కోరికలు, మీ కలలు, లక్ష్యములు, మరియు ప్రణాళికలు మీకు తెలుసు. తిరిగి వెళ్ళు మరియు పొందు బాట వెంబడి మీరేవిధంగా అభివృద్ధి చెందుచున్నారో వేరోకరి కంటే మీకే బాగా తెలుసు.

ఈ వ్యక్తిగతమైన, ఏకా౦తమైన ఇంటర్వూలో నాకు మార్గదర్శిగా ఆల్మా ఐదవ అధ్యాయములోని ఆత్మ విమర్శచేయు మాటలను చదివి, ధ్యానించుటకు నేనిష్టపడతాను: “మీరు దేవుని ద్వారా ఆత్మీయముగా జన్మించియున్నారా? మీ ముఖములయందు ఆయన స్వరూపమును మీరు పొందియున్నారా? మీ హృదయముల యందు ఈ బలమైన మార్పు అనుభవించియున్నారా?” 8 మనము తిరిగి వెళ్ళి,పొ౦దుటకు బదులుగా, ఆల్మా యొక్క ప్రశ్నలు మనకు ఙ్నాపికను కలిగియున్నవి.

“ప్రయాసపడి భార౦ మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు ర౦డి; నేను మీకు విశ్రా౦తి కలుగ జేతును.

“నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చు కొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రా౦తి దొరుకును” అని పలికిన రక్షకుని ఆహ్వానము గుర్తుందా 9

పాపములను క్షమించుట, అపరిపూర్ణమైన అనుబంధాలను విడిపించుట, మరియు అభివృద్ధిని, బలపరచుటను మరియు క్రీస్తు యొక్క లక్షణాలను వృద్ధి చేయుటకు మనకు సాధ్యపరచు, బలపరచు మరియు అభివృద్ధిని అణచివేయు ఆత్మీయ గాయములను స్వస్థపరచుట ద్వారా మన ఆత్మలకు విశ్రాంతినిచ్చుటకు, ప్రభువైన యేసు క్రీస్తునందు మన విశ్వాసమును వృద్ధి చేసినప్పుడు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము యొక్క గొప్పతనమును మనము ఎక్కువ లోతుగా ప్రశంసిస్తాము. 10

రాబోయే వారాల్లో, మీ జీవితపు లక్ష్యములను మరియు ప్రణాళికలను పునర్వీక్షించుటకు సమయాన్ని కనుగొనుము మరియు మన సంతోషము కొరకు మన పరలోకపు తండ్రి యొక్క గొప్ప ప్రణాళికతో అవి విలీనపరచబడునని నిశ్చయపరచుకొనుము. మీరు పశ్చాత్తాపపడి, మారవలసిన అవసరమున్న యెడల, ఇప్పుడే ఆవిధంగా చేయుటకు ఆలోచించుము. “దేవుని యొక్క మహిమకు మీ ఏకాగ్రతను ”11 నిలుపుకొనుటకు మీకు సహాయపడుటకు ఏ సర్దుబాట్లు చేయుట అవసరమో ప్రార్థనాపూర్వకంగా ఆలోచించుటకు సమయాన్ని తీసుకొనుము.

యేసు క్రీస్తు యొక్క సువార్త మరియు సిద్ధాంతమును మనము మన ప్రణాళికలు మరియు లక్ష్యముల ప్రధానముగా చేసుకోవాలి. ఆయన లేకుండా, నిత్య లక్ష్యము ఏదీ సాధ్యము కాదు, మరియు మన నిత్య లక్ష్యములను సాధించుటకు మన ప్రణాళికలు నిశ్చయముగా విఫలమగును.

చిత్రం
“జీవముగల క్రీస్తు” పత్రము

ఒక అదనపు సహాయము “జీవముగల క్రీస్తు: అపోస్తులుల యొక్క సాక్ష్యము,”12 అది 2000, జనవరి  1న సంఘమునకు సమర్పించబడింది. మీరు దానిని చూడగల చోట ఒక ప్రతిని ఉంచుము, మరియు దానిని సంతకము చేసిన ఆయన ప్రత్యేక సాక్షుల చేత క్రీస్తు యొక్క ఈ ప్రేరేపించబడిన సాక్ష్యములో కనుగొనబడిన ప్రతీ వ్యాఖ్యానములను సమీక్షించుటకు సమయాన్ని తీసుకొనుము.

చిత్రం
“జీవముగల క్రీస్తు” మరియు కుటుంబ ప్రకటన

మీరు దానిని “కుటు౦బము: ప్రప౦చమునకు ఒక ప్రకటన” తోపాటు చదవమని నేను మిమ్నల్ని పురికొల్పుచున్నాను. మనము తరచుగా కుటుంబ ప్రకటన గురించి మాట్లాడతాము కానీ, జీవముగల క్రీస్తు యొక్క రక్షించే శక్తి యొక్క వెలుగులో దానిని చదువుటకు దయచేసి గుర్తుంచుకొనుము. జీవముగల క్రీస్తు లేకుండా, మన ప్రియమైన అంచనాలు నెరవేర్చబడవు. కుటుంబ ప్రకటన వివరించినట్లుగా: “సంతోషము యొక్క దైవిక ప్రణాళిక కుటుంబ అనుబంధాలు సమాధిని దాటి శాశ్వతం చేయబడుటను సాధ్యపరచును. పరిశుద్ధ దేవాలయములలో లభ్యమగు పరిశుద్ధ విధులు మరియు నిబంధనలు వ్యక్తులు దేవుని సన్నిధికి తిరిగి వెళ్ళుటకు మరియు కుటుంబాలు శాశ్వతంగా ఏకము చేయబడుటను సాధ్యపరచును. 13

జీవిస్తున్న క్రీస్తే లోకము యొక్క ప్రాయశ్చిత్తము చేసిన రక్షకుడు మరియు విమోచకుడు కనుక మాత్రమే ఇది జరుగును.

ఈ విషయములో, మీరు “జీవముగల క్రీస్తు” లో కనుగొనబడిన ప్రత్యేక సత్యములను గూర్చి మీ అవగాహనను విశదపరచుటకు లేఖనాలను పరిశోధించుటకు కూడా మీరు ఆలోచించవచ్చు.

“జీవముగల క్రీస్తు” ప్రార్థనాపూర్వకంగా చదవటం , మార్కు, లూకా, యోహానులు మరియు మోర్మను గ్ర౦ధములోని ప్రవక్తల సాక్ష్యముతో పోలియున్నది. అది రక్షకునియందు మీ విశ్వాసమును హెచ్చించును మరియు మీ నిత్య లక్ష్యములను చేరుకొనుటకు మీరు మీ ప్రణాళికలను వెంబడించినప్పుడు ఆయనపై మీరు దృష్టి నిలుపుటకు సహాయపడును.

మన తప్పులు, అపరాధములు, డొంక దారులు, మరియు పాపములు లక్ష్యపెట్టకుండా, యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము, పశ్చాత్తాపపడుటకు, తిరిగి వెళ్ళుటకు మరియు సిలెస్టియల్ రాజ్యములో ఉన్నతమైన క్రమములో తండ్రి మరియు కుమారునితో శాశ్వతంగా జీవించుటకు---దేవుడు వాగ్దానమిచ్చిని సాటిలేని దీవెనలు పొందుటకు సిద్ధపడుటకు మనల్ని అనుమతించును. 14

ఇప్పుడు మీ అందరికీ తెలిసినట్లుగా మృత్యువును ఎవరూ తప్పి౦చుకోలేరు; కనుక మన దీర్ఘ కాల లక్ష్యము మరియు ప్రణాళిక మన౦ తిరిగి మన పరలోకపు త౦డ్రి వద్దకు తిరిగివెళ్ళినప్పుడు, మనలో ప్రతిఒక్కరి కొరకు ఆయన ప్రణాళిక చేసిన సమస్తమును మనము పొందుతాము.15

మన పరలోకపు తల్లిద౦డ్రులతోను, మన ప్రియ రక్షుకుడైన ప్రభువు యేసు క్రీస్తుతో కలిసి జీవి౦చుటకంటె మర్త్యత్వములో గొప్ప లక్ష్యమేదీ లేదని నేను సాక్ష్యమిచ్చుచున్నాను. ఇది కేవలము మన లక్ష్యము కంటె అధికమైనది---అది వారి లక్ష్యము కూడా. మనము గ్రహించుట ప్రారంభించుట కంటె ఎక్కువ శక్తివంతమైన, పరిపూర్ణమైన ప్రేమను వారు కలిగియున్నారు. వారు అంతయు, సంపూర్ణముగా, శాశ్వతంగా మనతో విలీనమయ్యారు. మనము వారి కార్యము. మన మహిమ వారి మహిమ. దేనికన్నా ఎక్కువగా, వారి సన్నిధికి తిరిగి వెళ్లటానికి మరియు నిత్య సంతోషమును పొందుటకు---మనము ఇంటికి వెళ్లాలని వారు కోరుతున్నారు.

నా ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఒక వారములో, మనము క్రీస్తు యెరూషలేములోనికి విజయవంతమైన ప్రవేశము జ్ఞాపకార్ధముగా----మట్లాదివారము జరుపుకుంటాము. మరొక రె౦డు వారాల్లో, మృత్యువుపై రక్షకుని యొక్క విజయము జ్ఞాపకార్ధముగా---మనము ఈస్టరు ప౦డుగను జరుపుకు౦టాము.

ఈ ప్రత్యేకమైన‌ రె౦డు ఆదివారాలలో మనము రక్షకునిపై మన ఆసక్తిని కేంద్రీకరించినప్పుడు, మనము ఆయనను జ్ఞాపకముంచుకొందాం మరియు ఆయన ఆజ్ఞలను పాటించుటకు మన జీవితకాల ఒడంబడికను క్రొత్తదిగా చేసుకొందాం. మన స్వంత లక్ష్యములను ఏర్పరచి, చివరకు మన ప్రశస్తమైన ఆధిక్యత తిరిగి వెళ్ళుటకు మరియు పొందుట వైపు— మనల్ని నడిపించు మార్గములో దేవునితో విలీనమగుటకు మన ప్రణాళికలను దృష్టిసారిస్తూ, మన జీవితాలలోనికి లోతుగా చూద్దామా, ఇది నా వినయముగల ప్రార్థన, యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

ముద్రించు