2010–2019
సందేహించకుండా దేవునియందు విశ్వసించుము
April 2017 General Conference


11:9

సందేహించకుండా దేవునియందు విశ్వసించుము

మనము మన విశ్వాసమునందు స్థిరముగా ఉండి మరియు సందేహించకుండా ఉన్నయెడల, జీవితపు సవాళ్ళకు పైగా మనకై మనము లేచుటకు ప్రభువు మన సామర్ధ్యమును హెచ్చించును.

ప్రియమైన సహోదరి సహోదరులారా, మన కాలములో అధ్యక్షుడు థామస్ ఎస్. మాన్సన్ దేవుని యొక్క ప్రవక్త అని నేను ఎరుగుదునని సాక్ష్యమిచ్చుట ద్వారా నా సందేశమును ప్రారంభించాలని నేను కోరుతున్నాను. ప్రథమ అధ్యక్షత్వములో ఆయన సలహాదారులు మరియు పన్నెండుమంది అపోస్తులులు కూడా వాస్తవానికి, ప్రవక్తలు, దీర్ఘదర్శులు. వారు ప్రభువైన యేసు క్రీస్తుకు ప్రతినిధులుగా ఉన్నారు మరియు వారికి బయల్పరచబడినట్లుగా ఆయన మనస్సు మరియు తలంపు ప్రకటించే హక్కు కలిగియున్నారు. వారి సలహా పాటించడంలో భద్రత వుందని నేను సాక్షమిస్తున్నాను. మన పరలోక తండ్రి యందు, ఆయన కుమారుడైన, యేసు క్రీస్తు యందు మరియు ఆయన ప్రాయశ్చిత్తము యందు మన విశ్వాసము బలపరచుకొనుటకు మనకి ప్రత్యేకించి చెప్పుటకు ప్రభువు వారిని ప్రేరేపించును, ఆవిధంగా మన కాలము యొక్క సవాళ్లను ఎదుర్కొనేందుకు సందేహించము.

మోర్మన్ గ్రంధములో తన సహోదరులను గూర్చి విచారించడానికి జారహేమ్ల నుండి లీహై-నీఫై యొక్క ప్రదేశమునకు పంపబడిన అమ్మోన్ అన్న పేరు గల వ్యక్తి గురించి మనము చదివాము. అక్కడ రాజైన లీంహైని మరియు లేమనీయులకు బందీగా ఉన్న అతడి ప్రజలను అతడు కనుగొన్నాడు. రాజైన లీంహై జారహేమ్లలో ఉన్న తన ప్రజల గురించి అమ్మోన్ చెప్పిన విషయాల చేత ప్రోత్సహింపబడ్డాడు. అతడి హృదయము ఎంత గొప్ప నిరీక్షణ మరియు సంతోషముతో నిండియున్నదనగా అతడు తన జనులను దేవాలయము వద్ద సమావేశపరచి ఇలా చెప్పాడు:

“కాబట్టి మీ తలలు పైకెత్తుడి , మరియు ఆనందించుడి , మరియు దేవునియందు నమ్మిక యుంచుడి …

“...మీరు హృదయము యొక్క సంపూర్ణ సంకల్పముతో ప్రభువు తట్టు తిరిగి , … మరియు మనస్సు యొక్క సమస్త శ్రద్ధతో ఆయనను సేవిoచిన యడల, … ఆయన తన స్వంత చిత్తము మరియు ఇష్టము చొప్పున మిమ్ములను దాస్యము నుండి బయటికి విడిపిoచును.”1

అమ్మోన్ యొక్క మాటల చేత రాజైన లీంహై జనుల యొక్క విశ్వాసము చాలా లోతుగా ప్రభావితం చేయబడింది, ఆలాగున వారు దేవుని ఆజ్ఞలు పాటించి మరియు ఆయనకు సేవ చేస్తామని ఆయనతో వాగ్ధానం చేసారు. వారి విశ్వాసం కారణంగా, లేమనీయ హస్తములనుండి తప్పించుకొనుటకు వారు ఒక ప్రణాళిక యోచించగలిగారు.2

సహోదర, సహోదరిలారా, రాజైన లీంహై తన జనులకిచ్చిన ఆహ్వానము యొక్క ప్రాముఖ్యతను దయచేసి ఆలోచించుము. అతడు చెప్పెను: “మీ తలలు పైకెత్తుడి , మరియు ఆనందించుడి , మరియు దేవుని యందు నమ్మిక యుంచుడి.” ఈ మాటల ద్వారా, లీంహై తన జనులను విశ్వాసపు నేత్రముల ద్వారా భవిష్యత్తును చూడమని, వారి భయాలకు బదులుగా, విశ్వాసము వలన కలిగిన నిరీక్షణగల ఆశావాదముతో తిరిగియుంచమని, పరిస్థితులను లక్ష్యపెట్టకుండా దేవునియందు వారి నమ్మకముంచుటలో సందేహించవద్దని ఆహ్వానించాడు.

మర్త్య జీవితము దేవుడైన ప్రభువు మనకాజ్ఞాపించు విషయాలన్నీ మనము చేయగలమా లేదా అని చూచుటకు మనము పరీక్షంచబడే కాలము. 3 గొప్ప కష్ట సమయాలలో కూడా క్రీస్తు యందు స్థిరమైన విశ్వాసం దీనికి అవసరం. మనము, క్రీస్తు నందు ఒక నిలకడగల విశ్వాసముతో, ఆత్మ చేత నడిపించబడుతూ, మరియు మన అవసరతల కొరకు దేవుడు సమకూరుస్తాడనే నమ్ముతూ ముందుకు సాగుట దీనికి అవసరము. 4

ఆయన భూలోక పరిచర్య ముగింపులో, చెరపట్టబడకముందు, రక్షకుడు తన శిష్యులకు బోధించెను: “లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను.” 5

ఒక క్షణం నాతో ధ్యానించండి__తండ్రి యొక్క అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు, పాపరహితమైన జేవితాన్ని జీవించాడు మరియు అన్ని శోధనలు, నొప్పులు, సవాళ్లు, మరియు ప్రపంచంలోని బాధలన్నీ జయించాడు. ఆయన గెత్సేమనేలో రక్త బిందువులు చిందించెను; ఆయన వర్ణనకతీతమైన భయంకరమైన బాధను అనుభవించాడు.ఆయన మన భాదలు మరియు రోగములు అన్ని తనపై వేసుకున్నాడు. ప్రతీ భారముతో---మనలో ప్రతీఒక్కరికి సహాయపడటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన జీవితం, శ్రమ, మరణం మరియు పునరుత్థానము ద్వారా, మన సంతోషానికి మరియు ఈ భూమి మీద శాంతిని వెదకడానికి ప్రతీ అవరోధాన్ని ఆయన తీసివేసాడు. ఆయనను అంగీకరించి, తమని తాము నిరాకరించుకొని, ఆయన సిలువ ఎత్తుకొని వారికి మరియు ఆయన నిజమైన శిష్యులుగా ఆయనను వెంబడించు వారందరికి ఆయన ప్రాయశ్చిత్త త్యాగము ఇవ్వబడింది. 6 కాబట్టి, యేసు క్రీస్తునందు మరియు ఆయన ప్రాయశ్చిత్తమునందు విశ్వాసమును అభ్యాసము చేసినప్పుడు, మనము బలపరచబడతాము, మన భారములు తేలిక చేయబడతాయి, మరియు ఆయన ద్వారా మనము లోకమును జయిస్తాము.

సహోదర సహోదరీలారా, రక్షకుని నుండి మనం పొందగలిగే బలం మరియు నిరీక్షణ గూర్చి ధ్యానించినప్పుడు, మన తలలు పైకెత్తి మరియు సంతోషించడానికి, సందేహించకుండా విశ్వాసమునందు ముందుకు త్రోసుకొనివెళతాము. “సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును.... అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, తన సమస్త మార్గములందు అస్థిరుడు.”7

రాజైన లీంహై అదేవిధంగా కోరాడు, “హృదయము యొక్క సంపూర్ణ సంకల్పముతో ప్రభువు తట్టు తిరుగుము. . . . మనస్సు యొక్క సమస్త శ్రద్ధతో ఆయనను సేవించిన యెడల, ఆయన తన స్వంత చిత్తము మరియు ఇష్టము చొప్పున మిమ్ములను దాస్యమునుండి బయటికి విడిపించును. ”8

ఆయన మనలను వేడుకొన్నప్పుడు, రక్షకుని యొక్క స్వంత మాటలలో వినుము:

“మీ హృదయమును కలవరపడనియ్యకుడి; దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నాయందును విశ్వాస ముంచుడి.  …

“మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు …

“నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును; నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచుకొందునని చెప్పెను.”9

మన విశ్వాసము బట్టి దేవుడు మనల్ని దీవించును.10 విశ్వాసం అనేది దైవిక ఉద్దేశము మరియు నిత్య అవలోకనము యొక్క ఆధారము. విశ్వాసము, శ్రద్ధని ప్రేరేపించే ఒక ఆచరణాత్మక సూత్రం. అది మన సానుకూల స్వభావము, దేవుని మరియు యేసు క్రీస్తు మనల్ని అడుగు ప్రతీదానిని ఇష్టపూర్వకంగా చేయుటకు కోరికయందు ప్రత్యక్షపరచబడు కీలకమైన, జీవించియున్న శక్తి. నడిపింపు కొరకు ప్రభువును వేడుకొనుటకు మరియు ఆయన చిత్తముతో ఏకరీతిగల విషయాలను సాధించుటకు విశ్వాసముతో లేచి, పనిచేయుటకు మనము మోకరించునట్లు చేయును.

సంవత్సరాల క్రితం మిషను అధ్యక్షునిగా సేవ చేస్తున్నప్పుడు, నేను మా ప్రియమైన మిషనరీలలో ఒకరి తల్లిదండ్రుల నుండి ఫోన్ కాల్ ద్వారా అతడి సహోదరి మరణము గురించి నాకు తెలియజేస్తూ, అందుకున్న సమాచారం నాకు గుర్తున్నది. ఆ సున్నితమైన క్షణంలో, నేను, ఆ మిషనరీ ఆయన బిడ్డల కొరకైన దేవుని యొక్క అద్భుతమైన రక్షణ ప్రణాళిక మరియు ఈ జ్ఞానం అతనికి ఎలా ఓదార్పునిస్తుంది అని చర్చించాము.

అతడు ఆ ఆకస్మిక దుర్గటన చేత విభ్రాంతి చెంది, దిగులు చెందినప్పటికిని, ఈ మిషనరీ---అతడి కన్నీళ్ళు ద్వారా మరియు దేవునియందు విశ్వాసముతో తన సహోదరి యొక్క జీవితమును బట్టి ఆనందించాడు. ప్రభువు యొక్క మృదు కనికరములందు సందేహించని విశ్వాసాన్ని అతడు కనపరిచాడు. దృఢ సంకల్పముతో, అతడు తనకు, తన కుటుంబము కొరకు దేవుడు కలిగియున్న వాగ్దానములకు యోగ్యతగా ఉండుటకు బదులుగా పూర్ణ విశ్వాసము మరియు శ్రద్ధతో తన మిషను కొనసాగిస్తానని నాతో చెప్పాడు. ఈ అవసరమైన సమయములో, ఆ విశ్వాసముగల మిషనరీ తన హృదయాన్ని దేవుని వైపు మరల్చాడు, ఆయనయందు తన పూర్ణ నమ్మకాన్ని ఉంచాడు, మరియు పూర్ణ విశ్వాసము మరియు శ్రద్ధతో సేవ చేయుటకు తన నిబద్దతను క్రొత్తదిగా చేసుకున్నాడు.

సహోదర, సహోదరిలారా, దేవుని యందు స్థిరమైన నమ్మకము మరియు ఆయనను సేవ చేయుటకు కోరిక చేత మనము వేరుపారని యెడల, మర్త్యత్వము యొక్క బాధాకరమైన అనుభవాలు భారమైన కాడిచేత మోపబడినట్లుగా మనము భావించుటకు నడిపించును; మరియు సువార్తను సంపూర్ణంగా జీవించుటకు ప్రేరణను మనము కోల్పోతాము. విశ్వాసము లేకుండా, మన జీవితంలో తరువాత జరుగు విషయాలను గూర్చి మన దేవుని యొక్క ప్రణాళికలను ప్రశంసించుటకు సామర్ధ్యమును కొల్పోవటంతో మనము ముగిస్తాము.11

ఈ పరీక్షా క్షణాలలో, ఎల్లప్పుడు వెదకుచున్న అపవాది---మన తర్కము మరియు యుక్తిని మనకు వ్యతిరేకంగా ఉపయోగించుటకు ప్రయత్నించును. సువార్త యొక్క సూత్రాలు జీవించటానికి పనికిరానివని మనలను ఒప్పించేందుకు ప్రయత్నిస్తాడు. “ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి,”12 అన్న తర్కమును దయచేసి గుర్తుంచుకొనండి. సాతాను “దేవుని [యొక్క] శత్రువు, మరియు [అతడు]ఆయనకు వ్యతిరేకముగా పోరాడును, మరియు పాపమునకు మరియు ఎల్లప్పుడు చెడ్డయైన దానిని చేయుటకు ఆహ్వానించును మరియు చిక్కించుకొనును. ”13 మనల్ని, మోసగించుటకు మనము అతడిని అనుమతించరాదు, ఏలయనగా మనము చేసినప్పుడు, మనము మన విశ్వాసమునందు తడబడతాము మరియు దేవుని యొక్క దీవెనలు పొందుటకు శక్తిని కొల్పోతాము.

మనం నిలకడగా ఉండి మరియు మన విశ్వాసమునందు సందేహించని యెడల, జీవితపు సవాళ్ళకు పైగా మనల్ని పైకి లేపుటకు మన సామర్ధ్యమును ప్రభువు హెచ్చించును. ప్రతికూల ప్రేరణలను ఓడించటానికి అధికారమివ్వబడతాము, అఖండమైన అడ్డంకులుగా కనబడిన వాటిని కూడా, జయించుటకు సామర్ధ్యమును మనము వృద్ధి చేస్తాము. వారి లేమనీయ దాస్యము నుండి అద్భుతంగా తప్పించుకోవటానికి రాజైన లీంహై యొక్క జనులకు ఇదే సాధ్యపరచింది.

సహోదర, సహోదరిలారా, మీ పూర్ణ నమ్మకాన్ని దేవునియందు మరియు ఆయన ప్రవక్తల బోధనలందు ఉంచమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. జీవితం యొక్క క్లిష్టమైన పరిస్థితులతో సంబంధం లేకుండా, మీ పూర్ణ హృదయముతో ఆయనకు సేవ చేయుటకు, దేవునితో మీ నిబంధనలను క్రొత్తవిగా చేసుకోమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునందు మీ సందేహించని విశ్వాసము యొక్క శక్తిచేత, మీరు పాపము, అనుమానము, అపనమ్మకము, విచారము, బాధ యొక్క చెర నుండి మీరు స్వతంత్రులవుతారని నేను సాక్షమిస్తున్నాను; మరియు మన ప్రేమగల పరలోక తండ్రి నుండి వాగ్దానమివ్వబడిన దీవెనలన్నిటిని మీరు పొందుతారు.

దేవుడు నిజమని నేను సాక్షమిస్తున్నాను. ఆయన జీవిస్తున్నారు. మనలను ప్రేమిస్తున్నారు. ఆయన మన సంతోషకరమైన సమయాలలో మరియు నిరాశ, బాధ, అనుమానామైన సమయాలలోను మన ప్రార్ధనలు వింటారు. యేసు క్రీస్తు లోక రక్షకుడని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయనే విమోచకుడు.

“Not Now but in the Coming Years, పోర్చుగీసు పాటల పుస్తకములో కనగొనబడిన పాట యొక్క సాహిత్యంతో ఈరోజు నా మాటలు ముగిస్తాను:

సూర్యుడికి బదులుగా మేఘాలు యొక్క నీడ మన హృదయాన్ని మించి వ్యాపిస్తే

నొప్పి మనలను బాధిస్తే; ఫరవాలేదు, త్వరలో మీరు ఎవరో మాకు తెలుస్తుంది.

యేసు మనలను ఆయన చేతితో నడిపిస్తాడు, ఎందుకో ఆయన మనకు చెప్తాడు;

మనము ఆయన స్వరమును వినినట్లైతే, దేని ద్వారనో ఆయన మనకి చెప్పును.

దేవునిలో స్థిరంగా నమ్మకముంచి, మరియు ఆయన మనలను ఆదుకోనిద్దాము;

ఆయన మహిమను ఆనంతముగా పాడుడి, తరువాత ఆయన వివరించును. 14

ఈ మాటలు యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో చెప్పుచున్నాను, ఆమెన్.