సువార్త యొక్క భాష
మన కుటుంబాలలో సువార్తను కాపాడుటకు శక్తివంతమైన బోధన చాలా ముఖ్యమైనది, దానికి శ్రద్ధ మరియు ప్రయత్నము అవసరము.
ప్రధాన కార్యదర్శిగా పిలవబడిన తరువాత, నా మొదటి కార్యము కొరకు కాస్టారికా నుండి సాల్ట్ లేక్ సిటీకి నా కుటుంబంతో నేను మారాను. ఇక్కడ అమెరికాలో, వేర్వేరు జాతి నేపథ్యాలు మరియు సంస్కృతులు ఉన్న అద్భుతమైన జనులను చూచుటకు నేను ఆశీర్వదించబడ్డాను. అందులో చాలా మంది, నాలాగే, లాటిన్ అమెరికా దేశాలలో పుట్టారు.
హిస్పానిక్స్ మొదటి తరంలో అనేకమంది ఇక్కడ స్పానిష్ ప్రాధమిక భాషగా మాట్లాడుట నేను గమనించాను మరియు ఇతరులతో సంభాషిoచుటకు తగినంత ఇంగ్లీష్ మాట్లాడం నేను గమనించాను. రెండోవ తరం, అమెరికాలో జన్మించిన వారు లేదా చిన్న వయస్సులోనే వచ్చి, ఇక్కడ పాఠశాలకు వెళ్ళి, చాలా మంచి ఆంగ్లము మాట్లాడేవారు మరియు బహుశా స్వల్ప స్పానిష్ మాట్లాడతారు. మరియు తరచు మూడో తరంచేత, వారి పూర్వీకుల యొక్క స్వభాష కొల్పోబడింది.1
భాషాశాస్త్ర నిబంధనల్లో, ఇది కేవలం “భాష నష్టం అంటారు.” కుటుంబాలు విదేశీ స్థలానికి మారినప్పుడు, అక్కడ వారి స్థానిక భాష ప్రధానమైన కానప్పుడు భాష నష్టం అనేది ఏర్పడుతుంది. ఇది హిస్పానికన్ల మధ్య మాత్రమే జరగడం లేదు కాని ఎక్కడైతే స్థానిక భాష ఒక క్రొత్త దానికి అనుకూలపరచుటలో బదులుగా ఉంచబడినప్పుడు, ప్రపంచమంతటా జనాభాల మధ్య కూడా జరుగుతుంది. 2 మోర్మన్ గ్రంధంలోని ప్రవక్త నీఫై కూడా, వాగ్ధాన దేశమునకు మారాలని సిద్ధపడుతునప్పుడు, తన పితరుల స్వభాషను కోల్పోతారని చింతించాడు. నీఫై వ్రాసాడు, “మరియు ఇదిగో, మన పితరుల యొక్క భాషను మనము, మన సంతానము కొరకు భద్రపరచునట్లు, మనము ఈ వృతాంతములను సంపాదించుట, దేవుని యందు వివేకమైయున్నది.”3
కాని నీఫై మరొక విధమైన భాష కొల్పోవటం గురించి కూడా ఆందోళన చెందాడు. తరువాత వచనంలో, అతడు కొనసాగించెను, “మరియు లోకము ప్రారంభమైనది మొదలుకొని ఇప్పటివరకు ఆత్మ మరియు దేవుని యొక్క శక్తి ద్వారా పరిశుద్ధ ప్రవక్తలకు అప్పగించబడి, వారందరి నోటిద్వారా పలుకబడిన మాటలను కూడ, వారి కొరకు మనము భధ్రపరచవలెను.” 4
మాతృ భాష భద్రపరచడం మరియు మన జీవితాలలో యేసు క్రీస్తు యొక్క సువార్తను భద్రపరచడం మధ్య ఒక పోలికను నేను గమనించాను.
ఈరోజు నా సారూప్యతలో, నేను ఏదైనా భూలోక ప్రత్యేకమైన భాషను నొక్కి చెప్పాలనుకోవటం లేదు కాని మన కుటుంబాలలో శాశ్వత భాషగా భద్రపరచబడాలి మరియు ఎన్నటికి కోల్పోబడనిది. నేను యేసు క్రీస్తు సువార్త యొక్క భాష గురించి మాట్లాడతాను.5 “సువార్త యొక్క భాష,” ద్వారా అనగా నా ఉద్దేశము మన ప్రవక్తల యొక్క అన్ని బోధనలు, ఆ బోధనలకు మన విధేయత, మరియు మన నీతిగల ఆచారాలను అనుసరించటం.
ఈ భాషను భద్రపరచగల మూడు మార్గాలు నేను చర్చిస్తాను.
మొదటిది: ఇంటి వద్ద ఎక్కువ శ్రద్ధ మరియు చింత కలిగియుండుట
సిద్ధాంతము మరియు నిబంధనలలో, ప్రభువు న్యూవెల్ కే. విట్నీ కలిపి సంఘము యొక్క ప్రముఖ సభ్యులలో అనేకులను వారి గృహాలను క్రమపరచమని ఆహ్వానించాడు. ప్రభువు అన్నారు, “నా సేవకుడు న్యూవెల్ కే. విట్నీ … గద్దింపబడాల్సిన అవసరం కలిగింది, మరియు అతని కుటుంబమును క్రమంలో ఉంచాలి, మరియు వారు ఇంటి వద్ద ఎక్కువ శ్రద్ధ మరియు చింత కలిగియుండాలని,మరియు ఎల్లప్పుడూ ప్రార్ధిoచాలని చూడాలి, లేదా వారు ఉండు స్థానము నుండి తీసివేయబడతారు. ”6
భాష కోల్పోవుటను ప్రభావితం చేసే ఒక అంశం, తల్లిదండ్రులు తమ పిల్లలకు స్థానిక భాష బోధించడానికి సమయం గడపనప్పుడు కలుగుతుంది. ఇది కేవలం ఇంటిలో ఆ భాష మాట్లాడితేసరిపోదు. తల్లిదండ్రులు వారి భాషను కాపాడుకోవాలని ఆశిస్తే, అది తప్పక నేర్పించబడాలి. తల్లిదండ్రులు ఎవరైతే వారి స్థానిక భాషను కాపాడేందుకు ప్రయత్నిస్తారో ఆవిధంగా చేయటంలో వారు విజయము పొందుతారని పరిశోధనలో తేలింది.7 కాబట్టి సువార్త యొక్క భాష సంరక్షించడానికి తెలివిగల ప్రయత్నమేమిటి?
“ఇంటిలో బలహీన సువార్త బోధన మరియు మాదిరిగా ఉండుట అనేవి సంఘములో బహుళతర కుటుoబాల చక్రం విచ్ఛిన్నమయ్యే బలమైన కారణమౌతుందని పన్నెండు మంది అపోస్తులుల యొక్క కోరములో ఎల్దర్ డేవిడ్ ఏ. బెడ్నార్ హెచ్చరించారు.8
కనుక మన కుటుంబాలలో సువార్తను కాపాడుకోవటానికి, శక్తివంతమైన బోధన మన ఇళ్లలో చాలా ముఖ్యమైనదని అని మనం ముగించగలం.
మనము ప్రతీరోజూ కుటుంబ మరియు వ్యక్తిగత లేఖన అధ్యయన అభ్యాసము పొందాలని అనేకసార్లు ఆహ్వానించబడ్డాము.9 దీనిని చేసిన చాలా కుటుంబాలు ప్రభువుతో ప్రతీ రోజు గొప్ప ఐక్యత మరియు సన్నిహిత అనుబంధముతో ఆశీర్వదింపబడ్డారు.
అనుదిన లేఖన అధ్యయనం ఎప్పుడు జరుగుతుంది? తల్లిదండ్రులు లేఖనాలను చేతపట్టి మరియు ప్రేమతో, చదువుటకు కలిసి కూడుకోవాలని ప్రేమతో కుటుంబాన్ని ఆహ్వనించినపుడు ఇది జరుగుతుంది. మరొకవిధంగా ఈ అధ్యయనం జరగాలని చూడడం కష్టం.
తల్లులు మరియు తండ్రులు, ఈ గొప్ప దీవెనలను కోల్పోవద్దు. చాలా ఆలస్యం అయ్యేవరకు వేచియుండవద్దు!
రెండవది: ఇంటిలో బలమైన మాదిరి
ఒక భాషాశాస్త్రం నిపుణుడు ఒక స్థానిక భాష సంరక్షించడానికి వ్రాసాడు, “మీరు మీ పిల్లలకుభాషను సజీవంగా తీసుకురావాల్సిన అవసరమున్నది.”10 మన బోధన మరియు మాదిరి కలసి పని చేసినప్పుడు మనం “భాషను సజీవంగా తెస్తాము.”
నేను యౌవనునిగా ఉన్నప్పుడు, సెలవులందు నా తండ్రి కర్మాగారంలో పనిచేసాను. నేను జీతం తీసుకున్న తరువాత నా తండ్రి ఎప్పుడూ అడిగే ప్రశ్న “నీ డబ్బులతో ఏమి చేయ్యబోతున్నావ్?
నాకు జవాబు తెలుసు మరియు సమాధానమిచ్చాను, “నా దశమభాగం చెల్లించి మరియు నా మిషను కొరకు దాస్తాను.”
ఎనిమిది సంవత్సరాలు ఆయనతో పనిచేసి మరియు నిరంతరం ఆయనకు ఒకే ప్రశ్నకు సమాధానమిచ్చిన తరువాత, నా తండ్రి నాకు ధశమభాగం గురించి నేర్పారని కనుగొన్నారు. ఆయన తెలుసుకోలేనిది ఎమిటంటే నేను ఈ ముఖ్యమైన సూత్రం ఒక వారంతరం లోనే నేర్చుకున్నాను. నేను ఆ సూత్రం ఎలా నేర్చుకున్నానో నన్ను చెప్పనివ్వండి.
సెంట్రల్ అమెరికాలో పౌర యుద్ధానికి సంబంధించిన కొన్ని సంఘటనల తరువాత, నా తండ్రి వ్యాపారం దివాలా తీసింది. అతడు 200 పూర్తి కాలపు ఉద్యోగుల నుండి మా ఇంటి గారేజ్ లో అవసరమైనప్పుడు పనిచేసిన స్వల్పమైన ఐదుగురు కుట్టు కార్యకర్తలు వరకు వెళ్ళాడు. ఒకరోజు ఆ కష్ట సమయాలలో, నా తల్లిదండ్రులు తమ దశమభాగం చెల్లిద్దామా లేదా పిల్లలకు ఆహరం కొందామా అని చర్చించుకోవడం నేను విన్నాను.
ఒక ఆదివారం, నా తండ్రి ఏమి చేస్తాడో చూడాలని నేను వెంబడించాను. మా సంఘ సమావేశాల తరువాత, ఆయన ఒక కవరు తీసుకొని దానిలో తన దశమభాగం పెట్టడం నేను చూసాను. అది మాత్రమే ఆ పాఠం యొక్క భాగం. ఏమిటంటే మేము ఏమి తినబోతున్నాం అన్నది నాకు మిగిలిన ప్రశ్న.
సోమవారం ఉదయకాలమున, కొందరు మా తలుపును తట్టారు. నేను అది తెరచినప్పుడు, వారు నా తండ్రి కోసం అడిగారు. నేను ఆయనను పిలిచాను, మరియు ఆయన వచిన్నపుడు, ఆ సందర్శకులు వీలైనంత త్వరగా వారికి అవసరమైన తక్షణ కుట్టు ఆర్డర్ గురించి చెప్పారు. వారి ఆ ఆర్డర్ చాలా అత్యవసరము కనుక వారు ముందుగానే చెల్లిస్తామని చెప్పారు. ఆ రోజు దశమబాగము చెల్లించడం మరియు దానిని వెంబడించు దీవెనల యొక్క సూత్రములు నేను నేర్చుకున్నాను.
క్రొత్త నిబంధనలో, మాదిరి గురించి ప్రభువు మాట్లాడెను. “తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును,” 11 ఆయన చెప్పెను.
మన పిల్లలకు దేవాలయ వివాహము, ఉపవాసం మరియు సబ్బాతు రోజును పాటించడం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడితే సరిపోదు. మనకు సాధ్యమైనంత తరచుగా దేవాలయముకు వెళ్ళుటకు మనము సమయాన్ని కేటాయించటం వారు చూడాలి. మన పనులలో కూడా దేవాలయమునకు హాజరవ్వడానికి తరచు సమయాన్ని కేటాయించడం చూడాలి. వారు క్రమముగా ఉపవాసముండుట 12మరియు సబ్బాతు దినం పరిశుద్ధంగా ఆచరించడంలో మన నిబద్ధతను చూడాల్సిన అవసరం వుంది. మన యువత రెండు భోజనాలు ఉపవాసం ఉండలేకపోతే, లేఖనాలు క్రమంగా అభ్యాసం చెయ్యలేకపోతే , ఆదివారం పెద్ద క్రీడ సమయంలో టీవీ కట్టలేకపోతే, వారు నేటి సవాళ్ళుగల ప్రపంచంలోని, అశ్లీల చిత్రముల శోధన కలిపి, బలమైన శోధనలు ఎదిరించుటకు వారు ఆత్మీయ క్రమశిక్షణ కలిగియుంటారా?
మూడవది: ఆచారములు
ఇతర భాషలు మరియు ఆచారములు మాతృభాషతో కలిసినప్పుడు భాష మారడానికి లేదా కోల్పోవడానికి మరొక మార్గము.13
పునస్థాపించబడిన సంఘం యొక్క ఆరంభ సంవత్సరాలలో, ప్రభువు వారి గృహాలలో క్రమము ఏర్పరచమని సంఘం యొక్క అనేకమంది ప్రముఖ సభ్యులను ఆహ్వానించారు. మన గృహాల నుండి వెలుగు మరియు సత్యమును కోల్పోవడానికి రెండు విధాలను ప్రసంగించుట ద్వారా ఆయన తన ఆహ్వానాన్ని ప్రారంభిoచారు: “వారి తండ్రుల యొక్క ఆచారముల వలన, ఆ దుష్టుడు వచ్చును మరియునరుల యొక్క పిల్లల నుండి,అవిధేయత,ద్వారా వెలుగు మరియుసత్యమునుతీసివేయును.”14
కుటుంబాలుగా, మనము సబ్బాతు దినమును పరిశుద్ధముగా ఆచరించుట నుండి లేక ఇంటివద్ద అనుదిన లేఖన అధ్యయనము మరియు ప్రార్థన కలిగియుండుట నుండి మనల్ని ఆపివేయు ఆచారమేదైనా మనము దానిని మానివేయాలి. మనము అశ్లీల చిత్రములు మరియు ఇతర చెడు ప్రభావాలన్నిటికి మన ఇంటి యొక్క డిజిటల్ తలుపులు మూసివేయాల్సినవసరమున్నది. మన దినము యొక్క లోక ఆచారాలను అడ్డగించడానికి, మనము మన పిల్లల దైవిక గుర్తింపు, జీవితంలో వారి ఉద్దేశము గురించి, మరియు యేసు క్రీస్తు యొక్క దైవిక మిషను గురించి మన పిల్లలకు బోధించుటకు మనము లేఖనాలను మరియు మన ఆధునిక ప్రవక్తల స్వరమును ఉపయోగించాల్సినవసరమున్నది.
ముగింపు
లేఖనాలలో, మనము “భాష నష్టము”15 యొక్క అనేక ఉదాహరణలను చూస్తాము. ఉదాహరణకు:
“ఇప్పుడు ఇది జరిగెను. అతడు తన జనులతో మాట్లాడినప్పుడు చిన్న పిల్లలైయుండి, రాజైన బెంజిమెన్ యొక్క మాటలను గ్రహించలేక పోయిన యువతరమువారిలో, అనేకులు అక్కడ ఉండిరి మరియు వారు తమ పితరుల యొక్క సంప్రదాయములందు విశ్వసించలేదు. . . .
“మరియు ఇప్పుడు వారి అవిశ్వాసమును బట్టి వారు దేవుని వాక్యమును గ్రహించలేక పోయిరి, మరియు వారి హృదయములు కఠినపరచబడెను.”16
యువతరమునకు, సువార్త ఒక వింత భాష అయ్యింది. మరియు స్థానిక భాష కాపాడుకొనుటలో ప్రయోజనాలు కొన్నిసార్లు చర్చనీయాంశమే అవుతుండగా, రక్షణ ప్రణాళిక యొక్క సందర్భములో, మన గృహాలలో సువార్త యొక్క భాష కోల్పోవడం యొక్క శాశ్వతమైన పర్యవసానాల గురించి ఏ వాదనఉండదు.
దేవుని యొక్క బిడ్డలుగా, మనము ఒక పరిపూర్ణ భాష నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న అపరిపూర్ణులై జనులము.17 ఒక తల్లి ఆమె చిన్న పిల్లలతో కనికరముగా ఉన్నట్లుగా, మన పరలోక తండ్రి మన లోపాలు మరియు తప్పులుతో ఓపికగా ఉన్నారు. ఆయన మన దుర్బలమైన ఉచ్ఛారణలను, అవి మంచి కవిత్వంలా ఉన్నట్టు, నిజాయితీలో సణగటం, విలువైనదిగా చూచి, అర్ధం చేసుకుంటారు. మన మొదటి సువార్త మాటల యొక్క శబ్దమును బట్టి ఆయన సంతోషించును. ఆయన పరిపూర్ణమైన ప్రేమతో మనకు బోధించును.
ఈ జీవితంలో ఏ సాధన, ముఖ్యమైనది అయినప్పటికిని, మన కుటుంబాలలో సువార్త యొక్క భాష కోల్పోతే, సందర్భోచితమైనదవుతుంది.18 ఎల్లప్పుడు మన మాతృభాషగా ఉన్న, ఈ ఉన్నత స్థాయి సంభాషణలో అనర్గళంగా మారేవరకు కూడా, మనము ఆయన భాషను హత్తుకొనుటకు ప్రయాసపడినప్పుడు పరలోక తండ్రి మన ప్రయత్నాలందు దీవించునని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.