2010–2019
నేను దేవుని యొక్క బిడ్డనా?
ఏప్రిల్ 2018


నేను దేవుని యొక్క బిడ్డనా?

మన దైవిక గుర్తింపును గ్రహించే శక్తిని మనలో ప్రతిఒక్కరు ఎలా అనుభవించగలము? అది మన తండ్రియైన దేవునిని తెలుసుకొనుట ద్వారా ప్రారంభమగును.

ఇటీవల నేను నా ప్రియమైన తల్లితోపాటు మా పాత రాతి సంఘ భవనానికి వెళ్లాను. దశబ్దాల క్రితం నేను హాజరైన అదే ప్రాథమిక గది నుండి చిన్నపిల్లల స్వరములకు ఆకర్షించబడి, నేను వెనుకవైపుకు వెళ్ళి, శ్రద్ధగల నాయకులు ఈ సంవత్సరము యొక్క విషయము “నేను దేవుని యొక్క బిడ్డను”1 బోధించుటను గమనించాను. అప్పడు మా పాటపాడే సమయమందు, ఓపిక మరియు ప్రేమగల బోధకులు, తరచుగా నావైపు చూసి---బెంచీ చివర కూర్చొన్న ఆ అతి చురుకైన బాలుడు, “నిజముగా అతడు దేవుని యొక్క బిడ్డా? మరియు అతడిని ఇక్కడకు ఎవరు పంపారు?”2 అన్నట్లు నావైపు చూచుట నేను గుర్తు చేసుకున్నప్పుడు నేను చిరునవ్వు నవ్వాను.

“మనము దేవుని యొక్క పిల్లలమని, ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చు.”3 పరిశుద్ధాత్మకు మన హృదయాలను తెరవాలని మనలో ప్రతి ఒక్కరిని నేను ఆహ్వానిస్తున్నాను.

అధ్యక్షులు బాయిడ్ కె. పాకర్ యొక్క మాటలు స్పష్టమైనవి మరియు ప్రశస్తమైనవి: “మీరు దేవుని యొక్క బిడ్డ. ఆయన మీ ఆత్మ యొక్క తండ్రి. ఆత్మ రూపములో మీరు ఘనమైన జననము కలిగి, పరలోకపు రాజు యొక్క సంతతి. ఆ సత్యమును మీ మనస్సులో నిలుపుకొనుము మరియు దానిని పట్టుకొనుము. మీ మర్త్య సంతతిలో అనేక తరములున్నప్పటికిని, మీరు ఏ జాతి లేక జనులకు ప్రతినిధిగా ఉన్నప్పటికిని, మీ ఆత్మ యొక్క వంశావళి ఒక్క వరసలో వ్రాయబడవచ్చును. మీరు దేవుని యొక్క బిడ్డ!”4

“మన తండ్రిని . . . మీరు చూసినప్పుడు,” “మీరు చాలాకాలము పరిచయమున్న వ్యక్తిని చూస్తారు, మరియు ఆయన తన బాహువులలో మిమ్మల్ని చేర్చుకుంటాడు, మరియు ఆయనను హత్తుకొని, ఆయనను ముద్దు పెట్టుకొనుటకు మీరు సిద్ధపడియుంటారు . . . .”5 అని బ్రిగమ్ యంగ్ వర్ణించారు.

మన దైవిక గుర్తింపు పై గొప్ప యుద్ధము

ప్రభువుతో ముఖాముఖిగా మాట్లాడుతూ, మోషే తన దైవిక వారసత్వమును గూర్చి నేర్చుకున్నాడు. ఆ అనుభవము తరువాత, మోషే యొక్క గుర్తింపును వక్రీకరించుటకు, కపటముతో, ఇంకా దుష్టమైన ఉద్దేశ్యముతో “సాతాను శోధిస్తూ వచ్చి, ” “అన్నది: మోషే, మనుష్య కుమారుడా, నన్ను ఆరాధించుము. మరియు . . . మోషే సాతానును తేరి చూచి అడిగాడు: మీరెవరు? ఇదిగో, నేను దేవుని యొక్క కుమారుడను.6

దేవునితో మన అనుబంధమునందు మన నమ్మకము మరియు జ్ఞానమును నాశనము చేసే ఉద్దేశముతో సాతాను మోసగించుటకు విధానములను నిరంతరము హెచ్చించినప్పుడు, దైవిక గుర్తింపు పై ఈ గొప్ప యుద్ధము తీవ్రముగా రేగుచున్నది. కృతజ్ఞతపూర్వకంగా, మనము ఆదినుండి, మన నిజమైన గుర్తింపును గూర్చి స్పష్టమైన దృష్టి మరియు దర్శనము అవగాహనతో దీవించబడ్డాము: “స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, ”7 అని దేవుడు చెప్పెను, మరియు ఆయన జీవిస్తున్న ప్రవక్తలు ప్రకటిస్తున్నారు, “ప్రతిఒక్కరు పరలోక తల్లిదండ్రుల యొక్క ప్రియమైన ఆత్మ కుమారుడు మరియు కుమార్తె, మరియు అందువలన, ప్రతిఒక్కరు దైవిక స్వభావము మరియు గమ్యమును కలిగియున్నారు.”8

ఈ సత్యములను నిశ్చయముగా 9 తెలుసుకొనగలుగుట, ప్రతీరకమైన శ్రమలు, ఇబ్బందులు, మరియు బాధలను జయించుటకు మనకు సహాయపడును.10 “(వ్యక్తిగత సమస్యతో) ప్రయాసపడుచున్న వారికి మనము ఎలా సహాయపడగలము]?” అని అడగబడినప్పుడు, ప్రభువు యొక్క అపొస్తలుడు ఉపదేశించాడు, “వారికి తమ గుర్తింపును మరియు వారి ఉద్దేశమును బోధించుము.”11

“నేను కలిగియున్న అత్యంత శక్తివంతమైన జ్ఞానము”

ఈ శక్తివంతమైన సత్యములు, నా స్నేహితురాలైన జెన్‌కు జీవితమును మార్చివేసేవి,12 టీనేజరుగా ఆమె ఒక తీవ్రమైన కారు ప్రమాదాన్ని చేసింది. ఆమె శారీరక బాధ తీవ్రమైనది అయినప్పటికిని, మిగిలిన డ్రైవరు తన ప్రాణమును కోల్పోయింది కనుక ఆమె తీవ్రమైన భాధను భావించింది. “ఎవరో తమ తల్లిని కోల్పోయారు, మరియు ఇది నా పొరపాటు,” ఆమె చెప్పును. కేవలము రోజుల క్రితము “మేము మా పరలోక తండ్రి యొక్క కుమార్తెలము, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు,”13 అని చెప్పిన జెన్ ఇప్పుడిలా ప్రశ్నించును, “ఆయన నన్ను ఎలా ప్రేమించగలడు ?”

“శారీరక బాధ గతించింది,” “కానీ నేను భావావేశ మరియు ఆత్మీయ గాయములనుండి నేను ఎప్పటికైనా బాగుపడతానని నేను అనుకోలేదు.”

బ్రతికియుండుటకు బదులుగా, జెన్ తన భావాలను లోతుగా దాచేసి, ఒంటరిగా మరియు స్తబ్ధుగా మారింది. ఒక సంవత్సరము తరువాత, చివరకు ఆమె ప్రమాదము గురించి మరలా మాట్లాడగలిగినప్పుడు, ప్రేరేపించబడిన సలహాదారులొకరు ఒకరు ఆమెను “నేను దేవుని యొక్క బిడ్డ” వాక్యమును వ్రాసి, ప్రతీరోజు దానిని 10 సార్లు చెప్పమని ఆహ్వానించింది.

“మాటలను వ్రాయుట సులువైనది,” “కాని, నేను వాటిని చెప్పలేకపోయాను. . . . అది దానిని నిజముగా చేసింది, మరియు ఆయన బిడ్డగా దేవుడు నన్ను కోరుతున్నాడని నేను నిజంగా నమ్మలేదు. నేను ముడుచుకొని ఏడ్చేదాన్ని,” ఆమె గుర్తు చేసుకొనును.

కొన్ని నెలల తరువాత, చివరకు జెన్ ప్రతీరోజు పనిని పూర్తి చేయగలిగింది. “నా పూర్ణ హృదయమును నేను క్రుమ్మరించాను,” “దేవునితో వేడుకున్నాను . . . తరువాత ఆ మాటలను నేను నమ్మసాగాను.” ఈ నమ్మకము, రక్షకుడు ఆమె గాయపడిన ఆత్మను బాగు చేయుట ప్రారంభించుటను సాధ్యపరచింది. మోర్మన్ గ్రంథము ఆయన ప్రాయశ్చిత్తమునందు ఆదరణను మరియు ధైర్యమును తెచ్చెను.14

“క్రీస్తు నా బాధలు, నా విచారములు, నా నేరభావనను అనుభవించాడు,” జెన్ ముగించును. “నేను దేవుని యొక్క శుద్ధమైన ప్రేమను అనుభూతి చెందాను మరియు అంత శక్తివంతమైనది ఎన్నడూ అనుభవించలేదు! నేను దేవుని యొక్క బిడ్డను అని తెలుసుకొనుట నేను కలిగియున్న అత్యంత శక్తివంతమైన జ్ఞానము!”

మన తండ్రియైన దేవుని తెలుసుకొనుటకు కోరుట

సహోదర, సహోదరిలారా, మన గుర్తింపును గ్రహించే శక్తిని మనలో ప్రతిఒక్కరూ ఎలా అనుభవించగలరు? మన తండ్రియైన దేవుని తెలుసుకొనుటకు వెదకుట ద్వారా అది ప్రారంభమగును.15“ఒక దేవుని యొక్క బిడ్డ ఆయనను మరియు ఆయన ప్రియమైన కుమారుని గురించి ఎక్కువగా తెలుసుకొనుటకు కోరినప్పుడు ఎదైనా శక్తివంతమైనది జరుగును,” 16 అని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ సాక్ష్యమిచ్చారు.

రక్షకుని గూర్చి నేర్చుకొనుట మరియు అనుసరించుట తండ్రిని తెలుసుకోగలుగుటకు మనకు సహాయపడును. “తన (తండ్రి) తత్వము యొక్క మూర్తిమంతమునైయుండి,”17యేసు బోధించాడు, “తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు.”18 క్రీస్తు యొక్క ప్రతీ మాట మరియు క్రియ---దేవుని యొక్క నిజమైన స్వభావమును మరియు ఆయనతో మన అనుబంధమును బయల్పరచును.19 ఎల్డర్ జెఫ్రీ  ఆర్. హాలండ్ ఇలా బోధించారు, “ప్రతీ రంథ్రమునుడి రక్తము కారుతూ, ఆయన పెదవులపై క్షోభించే ఆర్తనాదముతో, క్రీస్తు ఎల్లపుడు ఎవరిని వెదికాడో ఆయనను---తన తండ్రిని క్రీస్తు వెదికాడు. ‘అబ్బా,’ ‘పాపా,’ ఆయన కేకలు వేసాడు.”20

గెత్సేమనే వనములో యేసు తన తండ్రిని మనఃపూర్వకంగా వెదకినట్లుగా, 1820లో, చాలా చిన్నవాడైన జోసెప్ స్మిత్, పరిశుద్ధ వనములో ప్రార్థనాపూర్వకంగా దేవునిని వెదికాడు. “మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను,”21 అని చదివిన తరువాత జోసెఫ్ ప్రార్థించుటకు వెళ్ళాడు.

తరువాత అతడు వ్రాసాడు, “నేను మోకరించాను,” “మరియు దేవునికి నా హృదయపు కోరికలను అర్పించసాగాను. . ..

“. . . నేను కాంతి స్తంభమును ఖచ్చితంగా నా తలపై చూసాను. . .

“ . . . నేను ఇద్దరు వ్యక్తులను చూసాను, వారి ప్రకాశము మరియు మహిమ సమస్త వర్ణనను ధిక్కరించును, నాపైగా గాలిలో నిలబడ్డారు. వారిలో ఒకరు, నా పేరుతో నన్ను పిలిచి, మరొకరిని సూచిస్తూ, నాతో మాట్లాడారు----(జోసెఫ్,) ఈయన నా ప్రియమైన కుమారుడు.ఆయనను ఆలకించుము!22

రక్షకుని యొక్క మాదిరిని మరియు ప్రవక్త జోసెఫ్ స్మిత్ మాదిరిలను మనము అనుసరించి, దేవునిని మనఃపూర్వకంగా వెదకినప్పుడు, మన తండ్రి మనల్ని ఎరుగునని మరియు ఆయన పిల్లలమని, మన పేరుతో మన తండ్రి ఎరుగునని జెన్ గ్రహించినట్లుగా, చాలా నిజమైన విధానములో మనము గ్రహించగలుగుతాము.

“పాపమును నిరోధించు తరమును”23 పెంచుటకు ప్రయాసపడుటలో తరచుగా అణచి వేయబడినట్లు నీటి అడుగున ఉన్నట్లు భావించే యౌవన తల్లులకు, దేవుని యొక్క ప్రణాళికలో మీ ప్రధాన పాత్రను తక్కువగా అంచనా వేయకుము. ఒత్తిడి కలిగించే క్షణాలలో---బహుశా మీరు పసివారి వెనుక పరుగెత్తినప్పుడు, వంటగది నుండి వచ్చే మాడిన వాసన మీరు ప్రేమతో తయారు చేసిన రాత్రి భోజనము ఇప్పడు దహనబలి అయ్యిందని మీకు సూచించినప్పుడు---మీ మిక్కిలి కష్టమైన దినాలను దేవుడు పరిశుద్ధపరచును.24 “భయపడకుము, నీకు తోడైయున్నాను”25 ఆయన శాంతికరంగా భరోసా ఇస్తున్నాడు. ఇలా వివరించిన సహోదరి జాయ్ డి. జోన్స్ యొక్క నిరీక్షణను మీరు నెరవేర్చినప్పుడు మేము మిమ్మల్ని ఘనపరచుచున్నాము, “వారి దైవిక గుర్తింపును గ్రహించుటకు మన పిల్లలు అర్హులుగా ఉన్నారు.”26

దేవుడు మరియు ఆయన ప్రియమైన కుమారుని వెదకమని మనలో ప్రతీ ఒక్కరిని నేను ఆహ్వానిస్తున్నాను. “మోర్మన్ గ్రంథము కంటే ఎక్కువ స్పష్టముగా మరియు శక్తివంతముగా ఆ సత్యములు,” “ఎక్కడా బోధింపబడలేదు,”27 అని అధ్యక్షులు నెల్సన్ సూచించారు. వాటి పేజీలను తెరువుము, మరియు దేవుడు “(మన) క్షేమము మరియు సంతోషము నిమిత్తము సమస్త క్రియలు”28 చేయునని, ఆయన “కనికరము మరియు కృపగలవాడు, కోపపడుటకు నిదానించి, దీర్ఘశాంతము మరియు మంచితనముతో నిండియున్నాడని”;29 మనము నేర్చుకున్నాము. “అందరూ (ఆయనకు) ఒకేరీతిగా ఉన్నారు.”30 మీరు గాయపడి, తప్పిపోయి, భయపడి, నిరాశ చెంది, విచారించి, ఆకలిగొని, లేక జీవితపు మిక్కిలి కష్టములందు ఆశాజనకంగా విడిచిపెట్టబడినట్లు భావించినప్పడు 31—--- మోర్మన్ గ్రంథమును తెరవుము, మరియు మరియు “దేవుడు మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు, ఆయన ఎన్నడూ విడువడు, మరియు ఆయన ఎప్పుడు విడువలేదు. ఆయన దానిని చేయలేడు. (ఆవిధంగా) చేయుట ఆయన స్వభావము కాదు,”32అని మీరు తెలుసుకుంటారు.

తండ్రిని తెలుసుకొనుట ఆయన మృదువైన ఆత్మ మన నిజమైన గుర్తింపు మరియు ఆయన దృష్టిలో గొప్ప విలువను నిర్ధారించినట్లుగా, ప్రత్యేకంగా మన హృదయాలు, సమస్తమును మార్చును.33ప్రార్థనాపూర్వకమైన మనవులు, లేఖన పరిశోధన, మరియు విధేయతగల ప్రయత్నాల ద్వారా మనము వెదకినప్పుడు, నిబంధన బాట వెంబడి మనతో దేవుడు నడుచును.

దేవుని యొక్క శ్రేష్టమైన స్వభావము---నా సాక్ష్యము

నా తండ్రుల యొక్క దేవునిని,34 “సర్వశక్తిమంతుడైన ప్రభువైన దేవునిని,”35 నేను ప్రేమిస్తున్నాను, ఆయన మన విచారములందు మనతో దుఃఖించును, మన అవినీతిని ఓపికగా గద్దించును, మరియు “(ఆయనను) తెలుసుకొనుటకు (మన) పాపములన్నిటిని వదలి వేయుటకు” 36 మనము కోరినప్పుడు ఆనందించును. నేను ఆయనను ఆరాధిస్తున్నాను, ఆయన ఎప్పటికీ “తండ్రి లేనివారికి తండ్రియు,” ”37 మరియు సహవాసిలేని వారికి సహవాసిగా ఉండును. కృతజ్ఞతపూర్వకంగా, నేను దేవునిని, నా తండ్రిని తెలుసుకొన్నానని, “(ఆయన) స్వభావము యొక్క శ్రేష్టత,” 38 మరియు పరిపూర్ణతలు, లక్షణాలు తెలుసుకోగలిగానని నేను సాక్ష్యమిస్తున్నాను.

“అద్వితీయ సత్య దేవుడను, (ఆయన) పంపిన యేసు క్రీస్తును”39 తెలుసుకొనుటలో దేవుని యొక్క బిడ్డగా మన “దివ్యమైన జన్మహక్కు” 40 అని మనలో ప్రతిఒక్కరు నిజముగా గ్రహించి మరియు ఆనందిస్తారని నా గంభీరమైన ప్రార్థన. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

ముద్రించు