దేవుని యొక్క శక్తి మరియు అధికారముతో పరిచర్య చేయుట
ఆయన నామమునందు, ఆయన శక్తి, అధికారముతో, మరియు ఆయన ప్రేమగల దయతో మనము పరిచర్య చేద్దాము.
నా ప్రియమైన సహోదరులారా, ప్రభువుకు మరియు ఆయన పరిశుద్ధ కార్యమునకు మీ సమర్పణ కొరకు మీకు ధన్యవాదములు. మీతో ఉండుట నిజముగా సంతోషకరమైనది. క్రొత్త ప్రథమ అధ్యక్షత్వముగా, మీ ప్రార్థనల కొరకు మరియు మీ ఆమోదించు ప్రయత్నముల కొరకు మీకు మా ధన్యవాదములు. మీ జీవితాల కొరకు మరియు ప్రభువుకు మీ సేవ కొరకు మేము కృతజ్ఞత కలిగియున్నాము. బాధ్యతకు మీ సమర్పణ మరియు మీ నిస్వార్ధమైన సేవ మా పిలుపులందు మాకున్నట్లుగా, మీ పిలుపులందు అంతే ముఖ్యమైనవి. ఈ సంఘములో జీవితకాల సేవ ద్వారా, ఒకరు ఎక్కడ సేవ చేసారన్నది ముఖ్యము కాదని నేను నేర్చుకున్నాను. మనము ఏవిధంగా సేవ చేస్తామో దానిని ప్రభువు లక్ష్యపెట్టును.
50 సంవత్సరాలకు పైగా, నాకు మాదిరిగా ఉన్న అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ కొరకు నేను లోతైన కృతజ్ఞతను వ్యక్తపరచుచున్నాను. మరియు ఆయన సలహాదారులైన అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ మరియు అధ్యక్షులు డీటర్ ఎఫ్. ఉక్‌డార్ఫ్ కొరకు నేను లోతైన ప్రశంసను తెలియజేస్తున్నాను. ప్రభువుకు మరియు ఆయన ప్రవక్తలకు వారి సేవ కొరకు నేను వారిని మెచ్చుకుంటున్నాను. ఈ సమర్పించబడిన ఇరువురు సేవకులు, క్రొత్త నియామకాలను పొందారు. వారు శక్తి మరియు నిబద్ధతతో సేవ చేయుటను కొనసాగిస్తారు. నేను వారిరువురిని గౌరవిస్తున్నాను మరియు ప్రేమిస్తున్నాను.
ప్రభువు యొక్క అధికారము మరియు శక్తితో ఆయన నిజమైన, జీవిస్తున్న సంఘములో సేవ చేయుట అసాధారణమైన దీవెన. యాజకత్వపు తాళపు చెవులతో కలిపి, దేవుని యొక్క యాజకత్వము పునఃస్థాపించబడుట, యోగ్యతగల కడవరి-దిన పరిశుద్ధులకు అన్ని ఆత్మీయ దీవెనలు తెరవబడినవి. ప్రపంచమంతటా, స్త్రీలు, పురుషులు మరియు పిల్లలకు ఆ దీవెనలు ప్రవహించబడుటను మనము చూస్తున్నాము.
వారి పిలుపులందు ఎండోమెంట్‌లో మరియు మిగిలిన దేవాలయ విధులందు అంతర్గతంగా ఉన్న శక్తిని గ్రహించు విశ్వాసులైన స్త్రీలను మనము చూస్తున్నాము. ఈ స్త్రీలు తమ భర్తలను, తమ పిల్లలను, మరియు వారు ప్రేమించు ఇతరులను కాపాడుకొనుటకు మరియు బలపరచుటకు పరలోకపు శక్తులను ఎలా పిలవాలో ఎరుగుదురు. దేవుని యొక్క శక్తి మరియు అధికారముతో వారి పిలుపులందు నిర్భయముగా పరిచర్య చేస్తూ, నడిపిస్తూ, మరియు బోధించు వీరు ఆత్మీయంగా బలమైన స్త్రీలు!1 నేను వారి కొరకు ఎంత కృతజ్ఞత కలిగియున్నాను!
అదేవిధంగా, యాజకత్వము వహించువారిగా వారి విశేషావకాశములకు పైగా జీవించు విశ్వాసులైన పురుషులను మనము చూస్తున్నాము. వారు ప్రేమ, దయ, మరియు ఓపికతో ప్రభువు యొక్క విధానములో త్యాగము ద్వారా సేవ చేస్తున్నారు మరియు నడిపిస్తున్నారు. వారు కలిగియున్న యాజకత్వము యొక్క శక్తి ద్వారా ఇతరులను దీవిస్తున్నారు, నడిపిస్తున్నారు, కాపాడుతున్నారు మరియు బలపరుస్తున్నారు. వారు తమ స్వంత వివాహములను మరియు కుటుంబాలను సురక్షితంగా కాపాడుకుంటూ, వారు సేవ చేస్తున్న వారికి వారు అద్భుతాలను తెస్తున్నారు. వారు చెడును తృణీకరిస్తారు మరియు ఇశ్రాయేలులో బలవంతులు.2 నేను వారికి చాలా కృతజ్ఞుడను!
ఇప్పుడు, నేను ఒక ఆందోళనను తెలియజేయనా? అది: మన సహోదర, సహోదరీలలో అనేకమంది యాజకత్వము యొక్క శక్తి మరియు అధికారము యొక్క భావనను పూర్తిగా గ్రహించుట లేదు. ఆయన పిల్లలను దీవించుటకు దేవుని యొక్క శక్తిని ఉపయోగించుట కంటే వారు తమ స్వంత కోరికలను మరియు ఆకలి దప్పికలను తృప్తిపరచుకొనుటకు ఎక్కువ ఇష్టపడునట్లు ప్రవర్తిస్తారు.
మన సహోదర, సహోదరీలలో అనేకమంది వారివి కాగల విశేషావకాశాలను అందుకొనరని నేను భయపడుతున్నాను.3 ఉదాహరణకు మన సహోదరులలో కొందరు, యాజకత్వము అనగా ఏమిటి మరియు అది వారేమి చేయుటకు సాధ్యపరచునో గ్రహించనట్లుగా ప్రవర్తిస్తారు. కొన్ని ప్రత్యేక మాదిరులను నన్ను మీకివ్వనియ్యుము.
కొంతకాలం క్రితం, నేను ఒక సంస్కార సమావేశమునకు హాజరయ్యాను, దానిలో ఒక క్రొత్త బిడ్డకు పేరు పెట్టబడి, మరియు తండ్రి దీవెన ఇవ్వబడాలి. యౌవన తండ్రి తన ప్రశస్తమైన పసిబిడ్డను తన చేతులలో ఎత్తుకున్నాడు, మరియు ఒక అందమైన ప్రార్థనను చేసాడు. కానీ ఆ బిడ్డకు అతడు ఒక దీవెన ఇవ్వలేదు. ఆ ప్రియమైన పాపకు ఒక పేరు పెట్టబడింది కాని దీవెన లేదు! ఆ ప్రియమైన ఎల్డరుకు ఒక ప్రార్థనకు మరియు యాజకత్వ దీవెనకు మధ్య తేడా తెలియలేదు. అతడి యాజకత్వ అధికారము మరియు శక్తితో, అతడు తన పసిబిడ్డను దీవించగలడు, కానీ అతడు చేయలేదు. “ఎలాంటి కోల్పోబడిన అవకాశము!” అని నేను అనుకున్నాను.
కొన్ని ఇతర మాదిరులను నన్ను ఉదహరించనియ్యుము. ప్రాథమిక, యువతులు, లేక ఉపశమన సమాజ నాయకులు మరియు బోధకులుగా సహోదరీలను నియమించారు కానీ వారి పిలుపులను నెరవేర్చుటకు శక్తితో వారిని దీవించుటకు విఫలమమైన సహోదరులను మేము ఎరుగుదుము. వారు హితబోధలు మరియు సూచనలను మాత్రమే ఇస్తారు. యోగ్యుడైన తండ్రి తన భార్యకు మరియు తన పిల్లలకు వారికి ఖచ్చితంగా అవసరమైనప్పుడు దీవెన ఇచ్చుటకు విఫలమగుచున్నారు. యాజకత్వపు శక్తి ఈ భూమి మీద పునఃస్థాపించబడింది, మరియు అయినప్పటికినీ, అనేకమంది సహోదర, సహోదరీలు నిజమైన యాజకత్వ దీవెనను ఎప్పటికీ పొందకుండా జీవితంలో భయంకరమైన శ్రమలను ఎదుర్కొంటున్నారు. ఎటువంటి విషాదము! అది మనము తీసివేయగల విషాదము.
సహోదరులారా, మనము దేవుని యొక్క పరిశుద్ధ యాజకత్వమును కలిగియున్నాము! ఆయన జనులను దీవించుటకు మనము ఆయన అధికారమును కలిగియున్నాము. “మీరు దీవించువారిని నేను దీవించెదను,”4 అని చెప్పినప్పుడు ప్రభువు మనకిచ్చిన అసాధారణమైన అభయమును గూర్చి ఆలోచించుము. వారి కొరకు ఆయన చిత్తము ప్రకారము దేవుని యొక్క పిల్లలను దీవించుటకు యేసు క్రీస్తు నామములో పని చేయుట మన విశేషావకాశము. స్టేకు అధ్యక్షులు మరియు బిషప్పులారా, మీ నాయకత్వములోని కోరముల ప్రతీ సభ్యుడు---దేవుని యొక్క శక్తిని సంపూర్ణముగా పిలచుటకు అవసరమైన వ్యక్తిగత యోగ్యత మరియు ఆత్మీయ సిద్ధపాటు కలిపి--- ఒక యాజకత్వ దీవెన ఎలా ఇవ్వాలో గ్రహించునట్లు దయచేసి నిశ్చయపరచుము.5
యాజకత్వము గల సహోదరులందరికి, సభ్యులు తమ నిబంధనలను పాటించుటకు, ఉపవాసముండి ప్రార్థించుటకు, లేఖనాలను అధ్యయనము చేయుటకు, దేవాలయములో ఆరాధించుటకు, మరియు దేవుని యొక్క స్త్రీ, పురుషులుగా విశ్వాసముతో సేవ చేయుటకు ప్రేరేపించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. విధేయత మరియు నీతి వారిని యేసు క్రీస్తుకు దగ్గరగా చేస్తుందనే విశ్వాసము యొక్క నేత్రముతో చూచుటకు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ఆనందించుటకు వారిని అనుమతించునని, మరియు జీవితములో సంతోషమును అనుభవించుటకు మనము అందరికి సహాయపడగలము!
ప్రభువు యొక్క నిజమైన మరియు జీవిస్తున్న సంఘము యొక్క ప్రమాణ చిహ్నము దేవుని యొక్క పిల్లలు మరియు వారి కుటుంబాలకు పరిచర్య చేయుటకు ఏర్పాటు చేయబడి, నడిపించబడేదిగా ఎల్లప్పుడు ఉండును.6 ఇది ఆయన సంఘము కనుక, ఆయన సేవకులుగా మనము, ఆయన చేసినట్లుగా, ఒకరికి చేస్తున్నాము.7 మనము ఆయన నామములో, ఆయన శక్తి, అధికారముతో, మరియు ఆయన ప్రేమగల దయతో పరిచర్య చేస్తాము.
60 సంవత్సరాల క్రితం, బోస్టన్‌లో నాకు కలిగిన అనుభవము ఒక్కొక్కరి పరిచర్య చేయు విశేషావకాశము ఎంత శక్తివంతమైనదో నాకు నేర్పింది. అప్పుడు నేను మస్సాచుసెట్స్ వద్ద జనరల్ హాస్పిటలో రెసిడెంట్ సర్జన్‌గా ----ప్రతీరోజు, రోజు విడిచి ప్రతీ రాత్రి, మరియు రెండు వారాలు ఒకసారి వారాంతము పనిమీద ఉన్నాను. నా భార్య, మా నలుగురు పిల్లలతో మరియు సంఘ కార్యక్రమముతో నాకు పరిమితమైన సమయమున్నది. అయినప్పటికినీ, మా బ్రాంచి అధ్యక్షుడు నన్ను సహోదరుడు కాక్స్ తిరిగి సంఘములో వచ్చి చురుకుగా ఉంటాడనే ఆశతో విల్‌బర్ మరియు లియోనొరా కాక్స్ యొక్క గృహమును దర్శించుటకు నన్ను నియమించాడు. అతడు మరియు లియోనొరా దేవాలయములో బంధింపబడ్డారు.8 అయినప్పటికిని, అనేక సంవత్సరాలుగా విల్‌బర్ పాల్గొనలేదు.
నేను నా సహవాసి వారి ఇంటికి వెళ్ళాము. మేము ప్రవేశించినప్పుడు, సహోదరి కాక్స్ మమ్మల్ని అప్యాయంగా స్వాగతించింది,9 కానీ సహోదరుడు కాక్స్ హఠాత్తుగా మరొక గదిలోనికి నడిచి తలుపు వేసుకున్నాడు.
మూయబడిన తలుపు వద్దకు వెళ్ళి నేను తలుపు తట్టాను. ఒక క్షణము తరువాత, మూసుకొని “లోపలికి రా,” అని నేను విన్నాను. నేను తలుపు తెరవగా, సహోదరుడు కాక్స్ ఔత్సాహిక రేడియో పరికరాల శ్రేణి ప్రక్కన కూర్చోనియుండుట కనుగొన్నాను. ఆ చిన్నగదిలో, అతడు సిగరెట్ వెలిగించాడు. స్పష్టముగా, నేను వచ్చినందుకు అంత సంతోషముగా లేడు.
ఆశ్చర్యముతో నేను గదంతా తేరి చూసాను మరియు “సహోదరుడు కాక్స్, నేను ఎల్లప్పుడు ఔత్సాహిక రేడియో పరికరాల గురించి ఎక్కువగా నేర్చుకోవాలని కోరాను. దాని గురించి నేర్పటానికి మీరిష్టపడతారా? క్షమించండి, ఈ రాత్రి నేను ఎక్కువసేపు ఉండలేను, కానీ నేను మరొక సమయములో తిరిగి రానా?”
అతడు కాసేపు సందేహించాడు, తరువాత అవునని చెప్పాడు. అద్భుతమైన స్నేహముగా మారిన దానికి అది ఆరంభము. నేను తిరిగి వెళ్ళాను మరియు అతడు నాకు నేర్పాడు. నేను అతడిని ప్రేమించి, గౌరవించసాగాను. తదుపరి సందర్శనాల ద్వారా, ఈ వ్యక్తి యొక్క గొప్పతనము ఉద్భవించింది. మా నిత్య సహవాసుల వలే, మేము చాలా మంచి స్నేహితులము అయ్యాము. తరువాత, కాలము గడిచాక, మా కుటుంబము దూరముగా మారింది. స్థానిక నాయకులు కాక్స్ కుటుంబమును పోషించుట కొనసాగించారు.10
దాదాపు ఎనిమిది సంవత్సరాల తరువాత, బోస్టన్ స్టేకు ఏర్పాటు చేయబడింది.11 మొదటి స్టేకు అధ్యక్షుడు ఎవరో మీరూహిస్తారా? అవును! సహోదరుడు కాక్స్! తరువాతి సంవత్సరాలలో, అతడు మిషను అధ్యక్షునిగా మరియు దేవాలయ అధ్యక్షునిగా కూడా సేవ చేసాడు.
సంవత్సరాల తరువాత, పన్నెండుమంది అపొస్తులుల కోరము యొక్క సభ్యునిగా, నేను యూటా, సాంపిటి జిల్లాలో ఒక క్రొత్త స్టేకును ఏర్పాటు చేయుటకు నియమించబడ్డాను. మామూలు మౌఖిక సంభాషణలందు, మరొకసారి నా ప్రియమైన స్నేహితుడు సహోదరుడు కాక్స్‌ను ఎదుర్కొనుటకు నేను సంతోషంగా ఆశ్చర్యపడ్డాను! అతడిని క్రొత్త స్టేకు గోత్రజనకునిగా పిలుచుటకు పరిశుద్ధాత్మ చేత నేను ప్రేరేపించబడ్డాను. నేను అతడిని నియమించిన తరువాత, మేము ఒకరినొకరం హత్తుకొని ఏడ్చాము. గదిలోని జనులు ఈ ఇద్దరు పెద్ద వ్యక్తులు ఎందుకు ఏడుస్తున్నారని ఆశ్చర్యపడ్డారు. కానీ మాకు తెలుసు. సహోదరి కాక్స్ ఎరుగును. మావి సంతోషముతో నిండిన కన్నీళ్ళు! 30 సంవత్సరాల క్రితం, వారి ఇంటిలో ఒకరాత్రి ప్రారంభమైన ప్రేమ మరియు పశ్చాత్తాపము యొక్క అ అపురూపమైన ప్రయాణమును మేము మౌనముగా గుర్తుంచుకున్నాము.
వృత్తాంతము అక్కడితో ముగియలేదు. సహోదరుడు మరియు సహోదరి కాక్స్ కుటుంబము 3 పిల్లలు, 20 మంది మనుమలు, మరియు 54 మంది ముని మనుమలు కలిపి ఎదిగింది. దానికి చేర్చబడేది, వందలాది మిషనరీలు, దేవాలయములో వేలమందిపై, మరియు విల్‌బర్ కాక్స్ యొక్క చేతుల మీదుగా గోత్రజనకుని దీవెనలను పొందిన వందలమందిపై వారి ప్రభావము. అతడి, మరియు లియోనొరా యొక్క ప్రభావము ప్రపంచమంతటా అనేక తరముల గుండా ప్రభావితం చేయుట కొనసాగును.
ఈ సంఘములోపల---ప్రతీవారము, ఆశాజనకంగా, ప్రతీరోజు విల్‌బర్ మరియు లియోనొరో కాక్స్‌తో ఇటువంటి అనుభవాలు సంభవిస్తాయి. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సమర్పించబడిన సేవకులు, ఆయన శక్తి మరియు అధికారముతో ఆయన కార్యమును వహిస్తారు.
సహోదరులారా, మనము తెరవగల తలుపులున్నాయి, మనమివ్వగల యాజకత్వపు దీవెనలున్నాయి, మనము స్వస్థపరచగల హృదయాలు, మనము పైకెత్తగల భారములు, మనము బలపరచగల సాక్ష్యములు, మనము రక్షించగల జీవితాలున్నాయి--- కడవరి దిన పరిశుద్ధుల గృహాలలోనికి మనము తేగల ఆనందమున్నది---అన్నియు ఎందుకనగా మనము దేవుని యాజకత్వమును కలిగియున్నాము. మనము ఈ కార్యమును చేయుటకు “(మన) అధిక విశ్వాసమును బట్టి, దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానమును బట్టి, లోకము యొక్క పునాది వేయబడినప్పటి నుండి పిలవబడి మరియు సిద్ధపరచబడియున్నాము.”12
మన గొప్ప నిత్య సహోదరత్వమునందు నాతోపాటు లేచి నిలబడమని ఈరాత్రి నేను మిమ్మల్ని అక్షరాలా ఆహ్వానిస్తున్నాను. నేను మీ యాజకత్వ కార్యాలయమును పేరు పెట్టినప్పుడు, దయచేసి నిలబడుము మరియు నిలిచియుండుము. పరిచారకులారా, దయచేసి నిలబడుము! బోధకులారా, నిలబడుము! యాజకులారా! బిషప్పులారా! ఎల్డర్లులారా! ప్రధాన యాజకులారా! గోత్రజనకులారా! డెబ్బదులు! అపోస్తులులారా!
ఇప్పుడు, సహోదరులారా, దయచేసి మీరు నిలబడియుండి, “Rise Up, O Men of God”13 యొక్క మూడు వచనములను పాడుటలో మా పల్లవితో చేరి పాడతారా? మీరు పాడుచుండగా, ప్రభువు యొక్క రెండవ రాకడ కొరకు ప్రపంచమును సిద్ధపరచుటకు సహాయపడుటకు దేవుని యొక్క బలమైన సైన్యముగా మీ బాధ్యత గురించి ఆలోచించుము. ఇది మన ఆజ్ఞ. ఇది మన విశేషావకాశము. ఈవిధంగా యేసు క్రీస్తు నామములో నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.