2010–2019
పరిచయ వ్యాఖ్యలు
ఏప్రిల్ 2018


పరిచయ వ్యాఖ్యలు

ప్రభువు యొక్క కార్యమును ఎక్కువ శక్తివంతముగా నెరవేర్చుటకు మన మెల్కీసెదకు యాజకత్వము కోరముల యొక్క ముఖ్యమైన పునర్నిర్మాణమును మేము ప్రకటించాము.

సహోదరుడు హాల్‌మ్స్, మీ ముఖ్యమైన సందేశము కొరకు మీకు ధన్యవాదములు.

ప్రియమైన సహోదరులారా, అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ మరియు ఎల్డర్ రాబర్ట్ డి. హేల్స్‌ను మేము లోతుగా గుర్తుచేసుకుంటున్నాము. అయినప్పటికిని ప్రభువు యొక్క కార్యములో మనము “అందరం ప్రభువు యొక్క కార్యములో ముందుకు త్రోసుకొనివెళదాం.”1

పరిశుద్ధ యాజకత్వమును కలిగియున్న ప్రతీ వ్యక్తి కొరకు నేను చాలా కృతజ్ఞుడను. ఆయన “ప్రతీ వ్యక్తి లోక రక్షకుడును, ప్రభువైన దేవుని నామములో మాట్లాడాలని”2 కోరుచున్న మన విమోదకుని యొక్క నిరీక్షణ మీరు. ఆయన నియమించిన కుమారులు అందరు ఆయనకు ప్రతినిధులుగా ఉండాలని, ఆయన కొరకు మాట్లాడాలని, ఆయన కొరకు పని చేయాలని, మరియు ప్రపంచమంతటా దేవుని యొక్క పిల్లల జీవితాలను దీవించాలని ఆయన కోరుచున్నాడు, చివరకు “(సమస్త) భూమి మీద విశ్వాసము కూడ వృద్ధి చెందునట్లు.”3

మీలో కొందరు తరములుగా సంఘము స్థాపించబడిన చోట సేవ చేసారు. మిగిలిన వారు సంఘము సాపేక్షంగా క్రొత్తగా ఉన్నచోట సేవ చేసారు. కొందరికి, మీ వార్డులు పెద్దవి. మిగిలిన వారికి, మీ బ్రాంచీలు చిన్నవి మరియు దూరములు చాలా ఎక్కువ కావచ్చు. మీ వ్యక్తిగత పరిస్థితులను లక్ష్యపెట్టకుండా, మీలో ప్రతిఒక్కరు నేర్చుకొనుటకు మరియు బోధించుటకు, ప్రేమించుటకు మరియు ఇతరులకు సేవ చేయుటకు దైవిక బాధ్యత కలిగిన యాజకత్వపు కోరము యొక్క సభ్యులు.

ప్రభువు యొక్క కార్యమును ఎక్కువ ప్రభావవంతంగా నెరవేర్చుటకు మన మెల్కీసెదకు యాజకత్వము యొక్క ప్రాముఖ్యమైన పునః వ్యవస్థీకరణను నేటిరాత్రి మేము ప్రకటించాము. ప్రతీ వార్డులో, ప్రధాన యాజకులు మరియు ఎల్డర్లు, ఇప్పుడు ఒక ఎల్డర్ల కోరముగా జతపరచబడతారు. ఈ సవరింపు యాజకత్వము కలిగి, ఇతరులకు సేవ చేయు సమర్ధత మరియు సామర్ధ్యమును బహుగా హెచ్చించును. కాబోయే ఎల్డర్లు ఆ కోరముచేత స్వాగతించబడతారు మరియు స్నేహము చేయబడతారు. ప్రతీ స్టేకులో, స్టేకు అధ్యక్షత్వము స్టేకు ప్రధాన యాజకుల కోరముపై అధ్యక్షత్వము వహించుట కొనసాగును. కానీ కోరము యొక్క మిశ్రమము ప్రస్తుతపు యాజకత్వ పిలుపులపై ఆధారపడును, అది తరువాత వివరించబడును.

పన్నెండుమంది అపొస్తులుల కోరము యొక్క ఎల్డర్ డి. టాడ్ క్రిస్టాఫర్సన్ మరియు ఎల్డర్ రోనాల్డ్ ఎ. రాస్‌బాండ్ ఇప్పుడు ఈ ముఖ్యమైన సవరింపులను గూర్చి మనకు ఎక్కువగా బోధిస్తారు.

ఈ సవరణలు అనేక నెలలుగా అధ్యయనములో ఉన్నాయి. మన సభ్యుల కొరకు మనము శ్రద్ధ తీసుకొను విధానము మరియు వారితో మన సంప్రదింపులను వివరించుటను మెరుగుపరచాల్సిన బలమైన అవసరతను మనము భావించాము. దానిని సరిగా చేయుటకు, ప్రభువు తన పరిశుద్ధుల కొరకు ఉద్దేశించిన ప్రేమ మరియు సహకారమునకు గొప్ప నడిపింపును ఇచ్చుటకు మన యాజకత్వ కోరములను మనము బలపరచాల్సియున్నది.

ఈ సవరింపులు ప్రభువు చేత ప్రేరేపించబడినవి. మనము వాటిని అమలు చేసినప్పుడు, మనము ఇంతకు ముందు ఎప్పటికీ ఉన్నదానికంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటాము.

మనము సర్వశక్తిమంతుడైన దేవుని కార్యములో పూనికొనియున్నాము. యేసే క్రీస్తు! మనము ఆయన వినయముగల సేవకులము! సహోదరులారా, మన బాధ్యతను గూర్చి మనము నేర్చుకొని చేసినప్పుడు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక, యేసు క్రీస్తు నామములో నేను ప్రార్థిస్తున్నాను, ఆమేన్.

ముద్రించు