2010–2019
చిన్న మరియు సాధారణమైన వస్తువులు
ఏప్రిల్ 2018


చిన్న మరియు సాధారణమైన వస్తువులు

మొత్తముగా మరియు ఒక ముఖ్యమైన కాలములో చిన్నవిగా కనబడే విషయాలు గొప్ప క్రియలను జరిగించునని మనము జ్ఞాపకము చేసుకోవాలి.

I.

నా ప్రియమైన సహోదర, సహోదరులారా, సందేశములు, సంగీతము మరియు కలిసి ఈ సమయపు భావనలచేత మీవలే, నేను లోతుగా తాకబడ్డాను, జ్ఞానవృద్ధి కలుగచేయబడ్డాను, మరియు ప్రేరేపించబడ్డాను. ప్రభువు యొక్క హస్తములలో, సాధనములుగా ఈ సమయములో కలిసి బలపరచే ప్రభావమును మనకిచ్చిన, మన సహోదర, సహోదరీలకు ధన్యవాదములు తెలుపుటలో మీ తరఫున నేను మాట్లాడుతున్నానని నా నిశ్చయము.

ఈస్టర్ ఆదివారమున ఈ ప్రేక్షకులతో మాట్లాడుటకు నేను కృతజ్ఞుడను. ఈరోజు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పునరుత్థానమును జరుపుటలో మిగిలిన క్రైస్తవులతో మనము చేరుతున్నాము. యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘ సభ్యులకు, యేసు క్రీస్తు యొక్క యథామూలమైన పునరుత్థానము మన విశ్వాసము యొక్క మూలస్తంభము.

యథామూలమైన పునరుత్థానము గురించి బైబిలు మరియు మోర్మన్ గ్రంథము రెండిటిలోని వృత్తాంతములు మనము నమ్ముతున్నాము కనుక, ఈ భూమి మీద ఎప్పటికీ జీవించిన మర్త్యులందరికి అదేవిధమైన పునరుత్థానము వచ్చుననే విస్తారమైన లేఖన బోధనలను కూడా మనము నమ్ముతాము. ఆ పునరుత్థానము అపొస్తులుడైన పౌలు పిలిచిన “జీవముతో కూడిన నిరీక్షణను” (1 Peter 1:3) మనకిచ్చును. ఆ జీవముతో కూడిన నిరీక్షణ ఏమనగా, మరణము మన గుర్తింపు యొక్క ముగింపు కాదని, కానీ కేవలము మన పరలోక తండ్రి ఆయన పిల్లల రక్షణ కొరకు ఆయన కనికరముగల ప్రణాళికలో ఆవశ్యకమైన మెట్టు అని మన నమ్మకము. ఆ ప్రణాళిక మర్త్యత్వమునుండి అమర్త్యత్వమునకు మార్పును కోరును. ఆ మార్పుకు ప్రధానమైనది మరణము యొక్క సూర్యాస్తమయము మరియు ఈ ఈస్టరు ఆదివారమున మనము జరుపుకునే మన ప్రభువును మరియు రక్షకుని యొక్క పునరుత్థానము చేత మహిమకరమైన ఉదయకాలము సాధ్యము చేయబడింది.

II.

ఒక గొప్ప కీర్తనలో ఎలైజా ఆర్. స్నో చేత వ్రాయబడిన మాటలను మనము పాడతాము:

ఎంత అద్భుతమైనది, ఎంత మహిమకరమైనది, ఎలా పరిపూర్ణమైనది.

విమోచన యొక్క గొప్ప ప్రణాళిక,

న్యాయము, ప్రేమ, మరియు కనికరము జతపరచబడిన చోట

దైవ సామరస్యములో!1

ఆ దైవిక ప్రణాళిక మరియు సామరస్యమును నెరవేర్చుటలో భాగముగా, మనము ఒకరినొకరం బోధించుటకు మరియు ప్రోత్సహించుటకు ఈ సమావేశముతో కలిపి సమావేశాలలో కూడుకుంటున్నాము.

ఈ ఉదయము మోర్మన్ గ్రంథములో వ్రాయబడిన ఆల్మా యొక్క కుమారునికి తన బోధనలను నా ప్రసంగానికి శీర్షికగా ఉపయోగించుటకు నేను ప్రేరేపించబడ్డాను: “చిన్న మరియు సాధారణమైన వస్తువులు ద్వారా గొప్ప క్రియలు జరిగించబడును” (ఆల్మా 37:6).

మనము యేసు క్రీస్తు యొక్క సువార్తలో అనేక చిన్న మరియు సాధారణమైన విషయాలు బోధించబడ్డాము. సుదీర్ఘకాలము కలపబడినప్పుడు చిన్నవిగా కనబడే విషయాలు గొప్ప క్రియలను జరిగించునని మనము జ్ఞాపకము చేయబడాలి. ప్రధాన అధికారులచేత మరియు మిగిలిన గౌరవనీయులైన బోధకులచేత ఈ విషయముపై అనేక ప్రసంగాలున్నాయి. ఆ విషయము చాలా ముఖ్యమైనది కనుక, దాని గురించి మరలా మాట్లాడాలని నేను భావించాను.

ఒక ఉదయకాలమున నడుస్తుండగా నేను చూసిన దానిచేత కాలక్రమేణా చిన్న మరియు సాధారణమైన విషయాల శక్తిని నేను గుర్తు చేయబడ్డాను. నేను తీసుకొన్న ఫోటో ఇక్కడున్నది. దళసరి మరియు బలమైన కాంక్రీటు కాలిబాట పగులుతున్నది. అది ఏదైన పెద్ద, బలమైన ఒత్తిడి యొక్క ఫలితమా? కాదు, ఆ పగులు ప్రక్కనున్న వృక్షమునుండి సమీపిస్తున్న వేర్లలో ఒకదాని యొక్క నెమ్మదియైన, చిన్న ఎదుగుదల. మరొక వీధిలో నేను చూసిన మరొక మాదిరి ఇక్కడున్నది.

చిత్రం
కాలిబాటలో పగులు
చిత్రం
కాలిబాటలో మరొక పగులు

ఈ బరువైన కాంక్రీటు కాలిబాటలను పగల గొట్టిన ఆ ఒత్తిడి చేయు శక్తి, రోజూ, లేక నెలవారి ప్రాతిపదికన లెక్కించుటకు చాలా చిన్నది, కానీ కాలక్రమేణా దాని ప్రభావము అసాధారణంగా శక్తివంతమైనది.

లేఖనాలందు మరియు జీవిస్తున్న ప్రవక్తలచేత మనము బోధించబడిన విషయాలు చిన్న మరియు సాధారణమైన విషయాల యొక్క శక్తివంతమైన ప్రభావము కాలక్రమేణా ఆవిధంగా ఉన్నది. మన అనుదిన జీవితాలలో పొందుపరచటానికి మనము బోధించబడిన లేఖన అధ్యయనమును పరిశీలించుము. లేక కడవరి దిన పరిశుద్ధులకు క్రమమైన అభ్యాసములుగా ఉన్న వ్యక్తిగత ప్రార్థనలు మరియు మోకరించి చేయు కుటుంబ ప్రార్థనలను ఆలోచించుము. యువత కోసం సెమినరీ లేక పెద్దవారికి ఇనిస్టిట్యూట్ వద్ద హాజరును పరిశీలించుము. ఈ అభ్యాసాలు చిన్నవి మరియు సాధారణమైనవిగా కనబడినప్పటికిని, కాలక్రమేణా అవి శక్తివంతమైన ఆత్మీయ పురోగతిని మరియు అభివృద్ధిని కలిగించును. అధ్యక్షులు ఐరింగ్ వివరించినట్లుగా, ఈ చిన్న మరియు సాధారణమైన విషయాలలో ప్రతీఒక్కటి మనకు జ్ఞానం కలిగించి మరియు సత్యములోనికి మనల్ని నడిపించు సాక్షి, పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ఆహ్వానించుట వలన ఇది జరుగును.

ఆత్మీయ పురోగతి మరియు అభివృద్ధికి మరొక ఆధారము, చిన్నవిగా కనబడే అతిక్రమములకు కూడా నిరంతరము పశ్చాత్తాపపడే అలవాటు. మన స్వంత ప్రేరేపించబడిన స్వీయ-అంచనాలు మనము ఎలా పడిపోయాము మరియు మనము సరిగా ఎలా చేయగలమో చూచుటకు మనకు సహాయపడగలవు. మనము వారానికి ఒకసారి సంస్కారములో పాల్గొనుటకు ముందు అటువంటి పశ్చాత్తాపముండాలి. ఈ పశ్చాత్తాపు ప్రక్రియలో ఆలోచించాల్సిన కొన్ని విషయాలు ఈ కీర్తనలో సూచించబడినవి, “Have I Done Any Good?” (“నేను ఏదైనా మేలు చేసానా?”)

నేడు లోకములో నేను ఏదైనా మేలు చేసానా?

అవసరతలో ఉన్న ఎవరికైనా నేను సహాయపడ్డానా?

విచారముగా ఉన్నవారిని సంతోషపరచి, ఎవరినైనా ఆనందముగా భావించునట్లు చేసానా?

లేనియెడల, నేను నిశ్చయముగా విఫలమయ్యాను.

ఈరోజు ఎవరి భారమైన తేలిక చేయబడిందా

ఎందుకనగా నేను నా సామర్ధ్యములను పంచుకొనుటకు సమ్మతిస్తున్నాను?

రోగులు మరియు అలసిన వారు తమ మార్గములో సహాయము చేయబడ్డారా?

వారికి నా సహాయము అవసరమైనప్పుడు, నేనక్కడ ఉన్నానా?2

నిశ్చయముగా ఇవి చిన్న విషయాలు, కాని నిశ్చయముగా ఆల్మా తన కుమారుడైన హీలమన్‌కు చెప్పిన మంచి మాదిరులు: “మరియు ప్రభువైన దేవుడు, ఆయన యొక్క గొప్ప మరియు నిత్యసంకల్పమును తెచ్చుటకు సాధనము ద్వార పనిచేయును . . . అతి చిన్న సాధనము ద్వారా ప్రభువు జ్ఞానులను బంగపరుచును” (ఆల్మా 37:7).

అధ్యక్షులు స్టీవెన్ సి. వీల్‌రైట్ హావాయి--బ్రిగమ్ యంగ్ విశ్వవిద్యాలయము వద్ద శ్రోతలకు ఆల్మా బోధన యొక్క ఈ ప్రేరేపించబడిన వర్ణనను ఇచ్చారు: “మనము ఆయనయందు విశ్వాసమును సాధన చేసి మరియు చిన్నవి, సాధారణమైన విషయాలందు ఆయన సలహాను వెంబడించినప్పుడు, ప్రభువు అనుసరించే మాదిరి, ఆయన మనల్ని అనుదినము స్వల్ప అద్భుతాలతో, మరియు కాలక్రమేణా, అద్భుతమైన కార్యములతో దీవించునని, ఆల్మా తన కుమారుని కొరకు నిర్ధారించును.”3

“లోకము తరచుగా గొప్పతనముతో సంబంధింప చేసే విషయాలతో పోల్చినప్పుడు, తరచుగా అనుదిన పనులు, ఇతరుల జీవితాలపై మిక్కిలి మంచి ప్రభావాన్ని కలిగియున్నవి”4 అని అధ్యక్షులు హోవార్డ్ డబ్ల్యు హంటర్ బోధించారు.

ఇదే సూత్రము యొక్క సమ్మతింప చేసే మతపరముకాని బోధన ఇండియానా మాజీ సెనెటరు డాన్ కోట్స్ నుండి వచ్చును, అతడిలా వ్రాసాడు: “ఒక లోతైన నిర్ణయము కొరకు ఏకైక సిద్ధపాటు, ఒక జీవితమును, లేక ఒక రాజ్యమును మార్చగలదు, అది వందల వేలమంది, తెలియక నిర్ణయాలు చేసేవారు, మనమెవరమో తీర్మానించే నిర్ణయాలు, ఏకాంతంగా చేయబడిన అతిస్వల్పముగా కనబడే నిర్ణయాలు.”5

ఆ “అతిస్వల్పముగా కనబడే” ఏకాంతముగా చేయబడే నిర్ణయాలు మన సమయమును ఎలా ఉపయోగించాలి, టెలివిజను మరియు ఇంటర్నెట్‌లో మనమేమి చూస్తామో, పని వద్ద మరియు ఇంటివద్ద మనల్ని చుట్టుముట్టే ఆర్ట్ మరియు సంగీతము, వినోదము కొరకు మనము వెదికేవి, మరియు నిజాయితీగా, యదార్ధముగా ఉండుటకు మన ఒడంబడికను ఎలా అన్వయించాకోవాలి వంటి వాటిని కలిగియుండును. చిన్నవి, సాధారణమైనవిగా కనబడే మరొక విషయాలు మన వ్యక్తిగత సంబంధాలందు మర్యాదగా మరియు ఆనందముగా ఉండుట.

అవి ఏకరీతిగా మరియు నిరంతరము అభ్యాసము చేయకపోతే చిన్నవి, సాధారణమైన విషయాలలో ఏవి మనల్ని పైకెత్తలేవు. అధ్యక్షులు బ్రిగమ్ యంగ్ ఇలా తెలియచేసారు “మన జీవితాలు చిన్నవి, సాధారణమైన పరిస్థితులతో చేయబడినవి అవి కలిసి చేర్చబడినప్పుడు, చాలా ముఖ్యమైనవి, మరియు స్త్రీ లేక పురుషుని జీవితము యొక్క సారాంశమును సంక్షిప్తపరచును.”6

మనము నిరంతరము ఎదిరించకపోతే, మనము మీడియా ప్రభావములచేత మరియు మన ప్రమాణములను తగ్గించునట్లు చేయు సంప్రదాయ క్షీణతలచేత చుట్టబడియున్నాము. నిత్యజీవము యొక్క లక్ష్యము వైపు పురోగతి చెందుటకు నిరంతరము ప్రయాసపడుటకు పడవలో ప్రవాహానికి ఎదురుగా తెడ్డు వేయాలి. పనిలో ఉన్న సిబ్బంది యొక్క చిత్రము ద్వారా రుజువు చేయబడినట్లుగా, కలిసి తెడ్డు వేస్తున్న జట్టులో మనము భాగమైతే సహాయపడును. ఇంకను ఆ రూపమును అన్వయించుటకు, మనము తెడ్డు వేయుట ఆపివేస్తే, సంప్రదాయ ప్రవాహములు చాలా బలముగా ఉండి, మనము వెదకని గమ్యము వైపుగా క్రిందకు మనము మోసుకొనిపోబడతాము, అయితే మనము నిరంతరము ముందుకు కదులుటకు ప్రయత్నించని యెడల అది అనివార్యమగును.

గొప్ప పర్యవసానాలు కలిగిన చిన్నవిగా కనబడే సంఘటనను వివరించిన తరువాత,“ఆవిధముగా ప్రభువు చిన్న సాధనము ద్వారా గొప్ప క్రియలను చేయగలడని మేము చూచితిమి” (1 నీఫై 16:29) అని నీఫై వ్రాసాడు. ఈ జ్ఞాపకార్ధమైన మాదిరిని పాతనిబంధన కలిగియున్నది. అక్కడ ఇశ్రాయేలీయులు సర్పముల చేత ఎలా బాధింపబడ్డారో మనము చదువుతాము. వాటి కాట్ల చేత అనేకమంది చనిపోయారు (సంఖ్యాకాండము 21:6 చూడుము). ఉపశమనము కోసం మోషే ప్రార్ధించినప్పుడు, అతడు “ఇత్తడి సర్పము ప్రతిమను చేయించి స్తంభముమీద పెట్టుటకు” ప్రేరేపించబడ్డాడు. తరువాత “సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ యిత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రదికెను” (వచనము 9). అటువంటి చిన్న విషయానికి అద్భుతమైన ఫలితము! అయినప్పటికినీ, నీఫై వివరించిట్లుగా, ప్రభువుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయువారికి ఈ మాదిరిని అతడు బోధించినప్పుడు, వారు స్వస్థపరచబడునట్లు ఒక సాధారణమైన మార్గమును ప్రభువు సిద్ధపరచినప్పుడు, “ఆ మార్గము యొక్క సరళతను బట్టి, దానియొక్క సుళువును బట్టి అనేకమంది నశించిపోయిరి” (1 నీ 17:41).

మన నీతిగల కోరికను సాధించుటకు మార్గము యొక్క సరళత లేక ఆజ్ఞాపించబడిన పని యొక్క సులభత ముఖ్యమైనది కాదని దాని అర్ధముకాదని ఆ మాదిరి మరియు బోధన మనకు జ్ఞాపకము చేయును.

అదేవిధంగా, అవిధేయత యొక్క స్వల్ప చర్యలు లేక నీతిగల ఆచారములను అనుసరించుటకు చిన్న వైఫల్యములు మానమని మనము హెచ్చరించబడిన ఫలితము వైపు మనల్ని నెట్టివేయగలవు. బుద్ధివాక్యము దీనికి మాదిరినిచ్చును. బహుశా శరీరముపై ఒక సిగరెట్టు లేక ఒక గ్లాసు మద్యము లేక ఒక మోతాదు మత్తుమందు యొక్క ప్రభావము లెక్కించబడలేదు. కానీ కాలక్రమేణా, ప్రభావము శక్తివంతమైనది మరియు త్రిప్పుటకు వీలుకాకపోవచ్చు. వృక్షము యొక్క వేరు క్రమంగా చిన్నగా ఎదుగుట ద్వారా కాలిబాటను పగులగొట్టుట గుర్తుందా. ఒక విషయము నిర్ధిష్టమైనది, మన శరీరాలను ముట్టడి చేయు మత్తుమందులు, లేక మన ఆలోచనలను హీనపరచు అశ్లీల చిత్రములు వ్యసనముగా మారగల దేనినైనా తీసుకొనుట యొక్క భయంకరమైన పర్యవసానాలు మనము మొదటిసారి---ఒకసారి కూడా ఎన్నడూ తీసుకోని యెడల పూర్తిగా మానవచ్చును.

అనేక సంవత్సరాల క్రితం, ఎల్డర్ రస్సెల్ ఎమ్. బాల్లార్డ్ సర్వసభ్య సమావేశ శ్రోతలకు “చిన్నవి, సాధారణమైన విషయాలు ఎలా ప్రతికూలంగా ఉండి, ఒక వ్యక్తి యొక్క రక్షణకు నాశనకరంగా ఉండగలవో వివరించారు.” ఆయన బోధించారు: “ఒక నూలు, తరువాత, పోగులాగా మారి, మరియు చివరకు తాడుగా రూపొందు బలహీనమైన నూలు పోగుల వలె, ఈ చిన్న విషయాలు కలిసి తెగలేనంత చాలా బలమైనవి కాగలవు. ఆత్మీయతను నిర్మించుటలో చిన్నవి మరియు సాధారణమైన విషయాలు కలిగియుండగల శక్తిని గూర్చి మనము ఎప్పుడూ గ్రహించాలి. అదేసమయములో, మనల్ని నిరాశ మరియు దుఃఖమునకు నడిపించుటకు సాతాను చిన్నవి మరియు సాధారణమైన విషయాలను ఉపయోగించునని మనము తప్పక గ్రహించాలి.” 7

అధ్యక్షులు వీలరైట్ తన బివైయు-హావాయి శ్రోతలకు అదేవిధమైన హెచ్చరికను ఇచ్చారు: “చిన్నవి మరియు సాధారణమైన విషయాలను చేయుట విఫలమగుటలో, విశ్వాసము సందేహించును, అద్భుతాలు నిలిపివేయబడును, మరియు ప్రభువు, ఆయన రాజ్యము వైపు అభివృద్ధి ఆపబడును మరియు దేవుని యొక్క రాజ్యమును వెదకుటకు బదులుగా ఎక్కువ లోకసంబంధమైనవి వెదకుట మరియు లోకసంబంధమైన కోరికలు ఉంచబడినప్పుడు క్షీణించుట ప్రారంభమగును.”8

మన ఆత్మీయ పురోగతికి నాశనకరమైన జతపరచబడిన ప్రతికూల ప్రభావాలకు వ్యతిరేకంగా కాపాడుకొనుటకు, చిన్నవి మరియు సాధారణమైన విషయాల యొక్క ఆత్మీయ మాదిరిని మనము అనుసరించాలి. బివైయు స్త్రీల సమావేశములో ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ వివరించారు: “మనము ఈ ఆత్మీయ నమూనా యొక్క స్వభావమును మరియు ప్రాముఖ్యత గురించి. . . అవసరములేని చోట ఎక్కువ విస్తారమైన పరిమాణంలో నీటిని చల్లుట లేక ముంచెత్తుటకు వ్యతిరేకంగా, చాలా తక్కువ మొత్తములో నీటిని చుక్కలుగా మట్టిలో వేయు సాంకేతిక ప్రక్రియనుండి ఎక్కువగా నేర్చుకొనగలము.

ఆయన వివరించారు: “స్థిరముగా పడే నీటి చుక్కలు నేలలో లోతుగా మునిగి, నేలకు ఎక్కువ తేమ స్థాయిని అందించును, అక్కడ మొక్కలు ఫలిస్తాయి. అదేవిధానములో, మీరు, నేను దృష్టిసారించి, ఆత్మీయ పోషణలో ఏకరీతిగా చుక్కలను పొందుటలో తరచుగా ఉన్నయెడల, అప్పుడు సువార్త వేర్లు మన ఆత్మలోనికి లోతుగా చొచ్చుకొనిపోయి, స్థిరముగా స్థాపించబడి, నాటబడతాయి, మరియు అసాధారణమైన, రుచికరమైన ఫలమును అందించగలవు.

కొనసాగిస్తూ, ఆయన చెప్పారు, “గొప్ప విషయాలను తెచ్చు చిన్నవి, సాధారణమైన విషయాల యొక్క ఆత్మీయమైన మాదిరి, దృఢత్వమును, మరియు స్థిరత్వమును, లోతైన సమర్పణను మరియు ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన సువార్తకు మరింత పరిపూర్ణమైన పరివర్తనను తెచ్చును.”9

సిద్ధాంతము మరియు నిబంధనలలో ఇప్పుడు చేర్చబడిన మాటలలో ఈ సూత్రమును ప్రవక్త జోసెఫ్ స్మిత్ బోధించాడు: “ఏ వ్యక్తి వాటిని చిన్న విషయాలుగా లెక్కించనియ్యకుము; ఏలయనగా . . . పరిశుద్ధులకు సంబంధించిన దానిలో అధికము, . . . ఈ విషయాలపై ఆధారపడియున్నది” ((సి & ని 123:15().

మిస్సోరిలో సంఘమును స్థాపించుటకు ముందు ప్రయత్నాలతో సంబంధించి, ప్రభువు సహనముగా ఉండుమని సలహా ఇచ్చాడు ఏలయనగా, “అన్ని విషయాలు వాటి కాలములో తప్పక జరుగుతాయి” (సి & ని 64:32). తరువాత ఆయన ఈ గొప్ప బోధన ఇచ్చాడు: “కాబట్టి, మేలు చేయుటలో అలసిపోవద్దు, ఏలయనగా మీరు గొప్ప కార్యము యొక్క పునాదిని వేయుచున్నారు. మరియు చిన్న విషయాలనుండి గొప్పవి సంభవించును” (సి & ని 64:33).

“నిబంధన బాటపై”10 ముందుకు సాగుటకు అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్‌ యొక్క సవాలును వెంబడించుటకు మనమందరము కోరతామని నేను నమ్ముచున్నాను. యేసు క్రీస్తు మరియు ఆయన సంఘ నాయకుల చేత మనము బోధించబడిన “చిన్న విషయాలను” ఏకరీతిగా అనుసరించుట ద్వారా ఆవిధంగా చేయుటకు మన ఒడంబడిక బలపరచబడును. నేను ఆయనను గూర్చి సాక్ష్యమిస్తున్నాను మరియు ఆయన నిబంధన బాటపై కొనసాగుటకు కోరు వారందరిపై ఆయన దీవెనలను అర్ధిస్తున్నాను, యేసుక్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. “How Great the Wisdom and the Love,” Hymns, no. 195.

  2. “Have I Done Any Good?” Hymns, no. 223.

  3. Steven C. Wheelwright, “The Power of Small and Simple Things” (Brigham Young University–Hawaii devotional, Aug. 31, 2007), 2, devotional.byuh.edu.

  4. Teachings of Presidents of the Church: Howard W. Hunter (2015), 165.

  5. Dan Coats, “America’s Youth: A Crisis of Character,” Imprimis, vol. 20, no. 9 (Sept. 1991), 4; see also Elder Wilford Andersen in his column in the Mesa Tribune, May 1996.

  6. Brigham Young, discourse in Ogden Tabernacle, July 19, 1877, as reported in “Discourse,” Deseret News, Oct. 17, 1877, 578.

  7. M. Russell Ballard, “Small and Simple Things,” Ensign, May 1990, 7, 8.

  8. Steven C. Wheelwright, “The Power of Small and Simple Things,” 3.

  9. David A. Bednar, “By Small and Simple Things Are Great Things Brought to Pass” (Brigham Young University Women’s Conference, Apr. 29, 2011), womensconference.byu.edu.

  10. Russell M. Nelson, “As We Go Forward Together,” Liahona, Apr. 2018, 7.

ముద్రించు