2023
గెత్సేమనే
2023 జూన్


“గెత్సేమనే,” యౌవనుల బలము కొరకు, ఏప్రి. 2023.

లేఖనాల నుండి స్థలములు

గెత్సేమనే

మన తరఫున రక్షకుని బాధలు ప్రారంభమైన స్థలము గురించి ఎక్కువగా తెలుసుకోండి.

ఒలీవల తోట

అది ఎక్కడున్నది?

యెరూషలేముకు తూర్పున ఒలీవల కొండ యొక్క వాలుపై (దృష్టాంతంలో కుడివైపు, భారీ చెట్టుతో గుర్తించబడింది).

ప్రాచీన యెరూషలేము యొక్క పటము

జిమ్ మాడ్సన్ చేత యెరూషలేము పటము దృష్టాంతము

అక్కడ ఏమి ఉన్నది?

ఒలీవ చెట్ల తోట మరియు బహుశా ఒలీవల నుండి నూనెను తీయడానికి వాడే గానుగ.

ఒలీవ నూనె తీసే గానుగ

అక్కడ ఏమి జరిగింది?

చివరి భోజనము తరువాత, యేసు క్రీస్తు తన పదకొండుమంది అపొస్తులులతో పాటు గెత్సేమనేకు వెళ్ళారు. అప్పుడు ఆయన ప్రార్థించడానికి పక్కకు వెళ్ళారు మరియు, పేతురు, యాకోబు, యోహానులను వెంటబెట్టుకొని వెళ్ళారు.

ఆయన “మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను.” ఆయన “నా ప్రాణము మరణమగు నంతగా దుఃఖములో మునిగియున్నది” (మార్కు 14:33–34) అని అన్నారు.

ఆయన ఇలా ప్రార్థించారు: “తండ్రీ, యీ గిన్నె నా యొద్దనుండి (తొలగించుటకు) నీ చిత్తమైతే తొలగించుము: అయినను నా యిష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక.

“అప్పుడు పరలోకమునుండి ఒక దూత ఆయనకు కనబడి, ఆయనను బలపరిచెను.

“తండ్రీ, యీ గిన్నె నా యొద్దనుండి (తొలగించుటకు) నీ చిత్తమైతే తొలగించుము; అయినను నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను” (లూకా 22:42–43).

రక్షకుని చేత ఈ తీవ్రమైన బాధ తరువాత, ఆయన యూదా చేత అప్పగించబడతాడు మరియు యూదయ అధికారులు, రోమా సైనికుల చేత అరెస్టు చేయబడతాడు.

గెత్సేమనేలో యేసు క్రీస్తు

మైఖేల్ టి. మామ్ చేత గెత్సేమనే

వివరణలు

  1. Guide to the Scriptures, “Gethsemane.”

  2. డి. టాడ్ క్రిస్టాఫర్సన్, Oct. 2016 general conference (Ensign or లియహోనా, 2016 నవంబరు, 50) చూడండి.