“గెత్సేమనే,” యౌవనుల బలము కొరకు, ఏప్రి. 2023.
లేఖనాల నుండి స్థలములు
గెత్సేమనే
మన తరఫున రక్షకుని బాధలు ప్రారంభమైన స్థలము గురించి ఎక్కువగా తెలుసుకోండి.
అది ఎక్కడున్నది?
యెరూషలేముకు తూర్పున ఒలీవల కొండ యొక్క వాలుపై (దృష్టాంతంలో కుడివైపు, భారీ చెట్టుతో గుర్తించబడింది).
అక్కడ ఏమి ఉన్నది?
ఒలీవ చెట్ల తోట మరియు బహుశా ఒలీవల నుండి నూనెను తీయడానికి వాడే గానుగ.
అక్కడ ఏమి జరిగింది?
చివరి భోజనము తరువాత, యేసు క్రీస్తు తన పదకొండుమంది అపొస్తులులతో పాటు గెత్సేమనేకు వెళ్ళారు. అప్పుడు ఆయన ప్రార్థించడానికి పక్కకు వెళ్ళారు మరియు, పేతురు, యాకోబు, యోహానులను వెంటబెట్టుకొని వెళ్ళారు.
ఆయన “మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను.” ఆయన “నా ప్రాణము మరణమగు నంతగా దుఃఖములో మునిగియున్నది” (మార్కు 14:33–34) అని అన్నారు.
ఆయన ఇలా ప్రార్థించారు: “తండ్రీ, యీ గిన్నె నా యొద్దనుండి (తొలగించుటకు) నీ చిత్తమైతే తొలగించుము: అయినను నా యిష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక.
“అప్పుడు పరలోకమునుండి ఒక దూత ఆయనకు కనబడి, ఆయనను బలపరిచెను.
“తండ్రీ, యీ గిన్నె నా యొద్దనుండి (తొలగించుటకు) నీ చిత్తమైతే తొలగించుము; అయినను నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను” (లూకా 22:42–43).
రక్షకుని చేత ఈ తీవ్రమైన బాధ తరువాత, ఆయన యూదా చేత అప్పగించబడతాడు మరియు యూదయ అధికారులు, రోమా సైనికుల చేత అరెస్టు చేయబడతాడు.
© 2023 by Intellectual Reserve, Inc. All rights reserved. అ.సం.రా.లో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly For the Strength of Youth Message, June 2023 యొక్క అనువాదము. Language. 19026, 421