“జ్ఞానమును వెదకండి,” యౌవనుల బలము కొరకు, ఆగ. 2023.
యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము, 2023 ఆగష్టు
జ్ఞానమును వెదకండి.
2019 ఏప్రిల్ సర్వసభ్య సమావేశ ప్రసంగము నుండి పొందుపరచబడింది.
మనము యేసు క్రీస్తు యొక్క సువార్తను గ్రహించినప్పుడు మన ఉద్దేశమేమనగా దేవునియందు, ఆయన దివ్యమైన సంతోషకర ప్రణాళికయందు, యేసు క్రీస్తునందు, ఆయన ప్రాయశ్చిత్త త్యాగమునందు విశ్వాసమును వృద్ధిచేయుట మరియు శాశ్వతమైన పరివర్తన సాధించుట. అటువంటి వృద్ధిచెందిన విశ్వాసము, పరివర్తన దేవునితో నిబంధనలు చేసుకొని, గైకొనుటలో మనకు సహాయపడుతుంది, తద్వారా యేసును అనుసరించుటకు మన కోరికను బలపరచి, నిష్కపటమైన ఆత్మీయ రూపాంతరమును మనలో తీసుకొనివస్తుంది. ఈ రూపాంతరము మనకు మరింత సంతోషకరమైన, ఫలవంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇస్తుంది, ఒక నిత్య దృక్పథమును కొనసాగించడానికి మనకు సహాయపడుతుంది.
దీనిని సాధించడానికి, రక్షకునియందు మనం నిలిచియుండి, లేఖనాలలో మనల్ని మనం నిమగ్నము చేసుకొని, వాటియందు ఆనందించి, ఆయన సిద్ధాంతమును నేర్చుకొని, ఆయన జీవించిన విధముగా జీవించడానికి శ్రమపడాలి. అప్పుడు మాత్రమే ఆయనను మనం తెలుసుకుని, ఆయన స్వరమును గుర్తిస్తాము, మనం ఆయన యొద్దకు వచ్చి, మరియు ఆయన యందు నమ్మికయుంచినప్పుడు, మనం ఎప్పటికి ఆకలిగొనక, దప్పికలేక ఉంటామని తెలుసుకుంటాము (యోహాను 6:35 చూడండి).
అది యాదృచ్ఛికంగా జరగదు. దైవత్వము యొక్క అత్యున్నత ప్రభావమునకు మనల్ని మనం మలుచుకొనుట సాధారణమైన విషయం కాదు; దానికి దేవునికి ప్రార్థన చేయుట, యేసు క్రీస్తు సువార్తను మన జీవితాలలో కేంద్రముగా ఎలా చేసుకోవాలో నేర్చుకొనుట అవసరము.
యేసు క్రీస్తు యొక్క సువార్తను మనం మనఃపూర్వకముగాను, హృదయపూర్వకముగాను, స్థిరముగాను మరియు నిజాయితీగా గ్రహించడానికి వెదకినప్పుడు, నిజమైన ఉద్దేశముతో, ఆత్మ యొక్క ప్రభావములో బోధించినప్పుడు, ఈ బోధనలు హృదయాలను మార్చగలవని, దేవుని యొక్క సత్యాల ప్రకారం జీవించాలనే కోరికను ప్రేరేపించగలని నేను మీకు సాక్ష్యమిస్తున్నాను.
© 2023 by Intellectual Reserve, Inc. All rights reserved. అ.సం.రా.లో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly For the Strength of Youth Message, August 2023 యొక్క అనువాదము. Language. 19046, 421