“ఆత్మను మీ మార్గదర్శిగా తీసుకొనండి,” యౌవనుల బలము కొరకు, 2023, అక్టో.
యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము, 2023 అక్టోబరు
ఆత్మను మీ మార్గదర్శిగా తీసుకొనండి
మర్త్యత్వములో మనము సవాళ్లు, కష్టము, మరియు అలజడిని ఎదుర్కొంటామని మన పరలోకమందున్న తండ్రికి తెలుసు; మనము ప్రశ్నలు, నిరాశలు, శోధనలు, మరియు బలహీనతలను ఎదుర్కొంటామని ఆయనకు తెలుసు. మనకు నైతిక బలము మరియు దైవిక నడిపింపును ఇవ్వడానికి, ఆయన పరిశుద్ధాత్మను అందించారు.
ప్రభువు యొక్క వెలుగులో నడవడానికి దైవిక నియామకము ద్వారా, ఆత్మ మనల్ని ప్రేరేపిస్తుంది, సాక్ష్యమిస్తుంది, మరియు ప్రోత్సహిస్తుంది. మన జీవితాలలో ఆయన ప్రభావాన్ని గుర్తించి, స్పందించడానికి మనము పరిశుద్ధమైన బాధ్యతను కలిగియున్నాము.
దానిని మనము ఎలా చేస్తాము?
మొదట, మనము ఆత్మకు యోగ్యులుగా జీవించడానికి ప్రయత్నిస్తాము.
రెండవది, ఆత్మను స్వీకరించడానికి మనము తప్పక సమ్మతించాలి.
మూడవది, ఆత్మ వచ్చినప్పుడు మనము దానిని గుర్తించాలి.
నాలగవది, మనము మొదటి ప్రేరేపణపై చర్య తీసుకోవాలి.
“సంతోషించుడి, నేను మిమ్ములను నడిపించెదను” (సిద్ధాంతము మరియు నిబంధనలు 78:18) అనిన ప్రభువు యొక్క పిలుపును మనము గంభీరంగా తీసుకొనెదము గాక. ఆయన మనల్ని పరిశుద్ధాత్మ ద్వారా నడిపిస్తారు. మన మొదటి ప్రేరేపణలను త్వరగా అమలు చేస్తూ, అవి దేవుని నుండి వస్తున్నాయని తెలుసుకొని మనము ఆత్మకు దగ్గరగా జీవిద్దాం. మనల్ని నడిపించడానికి, మనల్ని కావలి కాయడానికి, మరియు మనతో ఎప్పటికి ఉండగల పరిశుద్ధాత్మ యొక్క శక్తి గురించి నేను సాక్ష్యమిస్తున్నాను.
© 2023 by Intellectual Reserve, Inc. All rights reserved. అ.సం.రా.లో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly For the Strength of Youth Message, October 2023 యొక్క అనువాదము. Language. 19048, 421