2023
మృతులైనవారందరు దేవుని ఎదుట నిలువబడియుందురు
2023 డిసెంబరు


“మృతులైనవారందరు దేవుని ఎదుట నిలువబడియుందురు,” యౌవనుల బలము కొరకు 2023 డిసెంబరు.

యౌవనుల బలము కొరకు, నెలవారీ సందేశము 2023 డిసెంబరు

మృతులైనవారందరు దేవుని ఎదుట నిలువబడియుందురు

ఆయన తన బయల్పాటులో యోహాను అంతిమ తీర్పును చూచెను.

యేసు క్రీస్తు

He Comes Again to Rule and Reign [శాసించుటకును మరియు పరిపాలించుటకును, ఆయన మరలా వచ్చును], మేరీ సవర్ చేత.

గొప్పవారేమి, కొద్దివారేమి మృతులైనవారందరు దేవునిఎదుట నిలువబడి యుందురు

యేసు క్రీస్తు యొక్క పునరుత్థాన శక్తి అందరు జనులను దేవుని సన్నిధికి తీర్పు నిమిత్తము చేర్చును (ఆల్మా 11: 42–44; 33:22; 40:21; హీలమన్ 14:15–17; మోర్మన్ 9:13–14).

ఆ గ్రంధములు తెరువబడెను

నిబంధన మార్గమును అనుసరించుటకు భూమిపై జనులు ఏ కార్యములు చేసిరో ఈ గ్రంధములు సూచించుచున్నవి. (సిద్ధాంతము మరియు నిబంధనలు 128:7 చూడుము).

జీవగ్రంధము

“ఒక విధంగా జీవ గ్రంధము ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు మరియు ఆచరణల యొక్క సారాంశమై యున్నది—ఆయన జీవిత వృత్తాంతము. అయినప్పటికీ, లేఖనములు కూడా సూచించే దేమనగా, విశ్వాసుల యొక్క పేరుతో సహా వారి నీతి కార్యముల వృత్తాంతము పరలోకమున ఉంచబడును.” (Guide to the Scriptures, “Book of Life,” scriptures.ChurchofJesusChrist.org).

తీర్పు తీర్చబడెను

జనులు పునరుథానము చెందిన తరువాత అంతిమ తీర్పు వచ్చును. యేసు క్రీస్తు ప్రతి ఒక్కరికి న్యాయాధిపతి. ఒక్కొక్క వ్యక్తి పొందు నిత్యమహిమను ఈ తీర్పు నిర్ణయించును. (Guide to the Scriptures, “Judgment, the Last,” scriptures.ChurchofJesusChrist.org; ఆల్మా 41:3–5 ; సిద్ధాంతము మరియు నిబంధనలు 88:26–32చూడుము.)

వారి క్రియల చొప్పున

ఒక్కొక్క వ్యక్తి ఏమి చేసెనో మరియు ఏమి కోరుకొనెనో అను దానిని బట్టి తీర్పు తీర్చబడును (సిద్ధాంతము మరియు నిబంధనలు 137:9 చూడుము). వారు దేవుని ఆజ్ఞలకు విధేయులై జీవించారా, మరియు జీవితంలో వారు పొందిన వెలుగు మరియు సత్యములతో సామరస్యముగా ప్రవర్తించారా, అను అంశములను బట్టి తీర్పుతీర్చ బడుదురు.