అన్ని విషయాలందు వ్యతిరేకత
మన పరలోక తండ్రి మనము ఏవిధంగా మారాలనుకుంటున్నారో దానివైపు ఎదగడానికి వ్యతిరేకత మనల్ని అనుమతిస్తుంది.
యేసు క్రీస్తు యొక్క సువార్తకు ప్రధానమైనది ఆయన పిల్లల యొక్క శాశ్వతమైన పురోగతి కొరకైన తండ్రి యొక్క రక్షణ ప్రణాళిక. ఆధునిక బయల్పాటులో వివరించబడిన ఆ ప్రణాళిక, మర్త్య జీవితమందు మనము అనుభవించే అనేక విషయాలను గ్రహించడానికి మనకు సహాయపడుతుంది. ఆ ప్రణాళికలో వ్యతిరేకత యొక్క కీలకమైన పాత్రపై నా సందేశము దృష్టిసారిస్తుంది.
I.
దేవుని పిల్లల కొరకు మర్త్య జీవితము యొక్క ఉద్దేశ్యమేదనగా, “పరిపూర్ణతవైపు వృద్ధి చెంది, నిత్య జీవము యొక్క వారసులుగా వారి దైవిక గమ్యమును చివరికి గ్రహించడానికి”1 అవసరమైన అనుభవాలను అందించుట. ఈ ఉదయము, అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ మనకు ఎంతో శక్తివంతంగా బోధించినట్లుగా, ఎంపికలు చేయడం ద్వారా మనము ఎదుగుతాము, మనము దేవుని ఆజ్ఞలు పాటిస్తామో లేదో చూపడానికి దాని ద్వారా మనము పరీక్షించబడతాము (అబ్రాహాము 3:25 చూడండి). పరీక్షించబడాలంటే మనము ప్రత్యమ్నాయాల మధ్య ఎంపిక చేయడానికి కర్తృత్వాన్ని కలిగియుండాలి. మన కర్తృత్వాన్ని అమలు చేయడానికి ప్రత్యమ్నాయాలు అందించడానికి, మనము వ్యతిరేకత కలిగియుండాలి.
మిగిలిన ప్రణాళిక కూడా కీలకమైనది. మనము తప్పుడు ఎంపికలు చేసినప్పుడు—మనము అనివార్యముగా చేస్తాము గనుక—మనము పాపము చేత మలినము చేయబడతాము మరియు మన నిత్య గమనము వైపు ముందుకు సాగడానికి శుద్ధి చేయబడాలి. దీనిని చేయడానికి తండ్రి యొక్క ప్రణాళిక మార్గమును అందిస్తుంది, న్యాయపు నిత్య అక్కరలను తీర్చడానికి గల మార్గము: మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి రక్షకుడు వెల చెల్లిస్తున్నారు. ఆ రక్షకుడే ప్రభువైన యేసు క్రీస్తు , నిత్య తండ్రియైన దేవుని యొక్క అద్వితీయ కుమారుడు, ఆయన ప్రాయశ్చిత్త త్యాగము—ఆయన బాధ—మనము మన పాపముల కొరకు పశ్చాత్తాపపడిన యెడల వాటి కొరకు వెల చెల్లించును.
వ్యతిరేకత యొక్క ప్రణాళిక చేయబడిన పాత్ర గురించి శ్రేష్ఠమైన వివరణలలో ఒకటి, మోర్మన్ గ్రంథములో లీహై తన కుమారుడైన జేకబ్‌కు చేసిన బోధనలలో ఉన్నది.
“అన్ని విషయములలో వ్యతిరేకత ఉండుట అవసరము. అట్లు కానియెడల, … నీతి లేదా దుష్టత్వము, పరిశుద్ధత లేదా దుర్దశ, మంచి లేదా చెడు సంభవించవు. ” (2 నీఫై 2:11; 15 వచనము కూడా చూడండి).
లీహై ఇలా కొనసాగించారు, ఫలితంగా “ప్రభువైన దేవుడు నరునికి తననుతాను నిర్వహించుకొను సామర్థ్యమునిచ్చెను. నరుడు దేనిచేతనైనా ఆకర్షించబడితే తప్ప అతడు తననుతాను నిర్వహించుకొనలేడు.” (16 వచనము). అదేవిధంగా, ఆధునిక బయల్పాటులో ప్రభువు ఇలా ప్రకటించారు, “అపవాది నరుల సంతానమును శోధించుట ఆవశ్యకమైయున్నది, లేనియెడల వారికి వారే ప్రతినిధులు కాలేరు” (సి మరియు ని 29:39).
ఏదేను వనములో వ్యతిరేకత ఆవశ్యమైనది. మర్త్యత్వమును ప్రవేశపెట్టిన ఆ ఎంపికను ఆదాము హవ్వలు చేసియుండని యెడల, “వారు అమాయకపు స్థితిలో ఉండేవారు; … వారు పాపమునెరుగనందున మంచిని చేయకయుందురు” (2 నీఫై 2:23) అని లీహై బోధించారు.
ఆది నుండి, కర్తృత్వము మరియు వ్యతిరేకత తండ్రి యొక్క ప్రణాళికకు మరియు దానిని వ్యతిరేకించే సాతాను యొక్క తిరుగుబాటుకు ప్రధానమైనవి. ప్రభువు మోషేకు బయల్పరచినట్లుగా, పరలోకము యొక్క సలహాసభలో సాతాను, “నరునికిచ్చిన స్వాతంత్య్రమును నాశనము చేయుటకు చూచెను” (మోషే 4:3). ఆ నాశనము సాతాను పెట్టె షరతులలో అంతర్లీనంగా ఉన్నది. అతడు తండ్రి యొద్దకు వచ్చి, “చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము, నేను నీ కుమారుడనై యుందును, ఒక్క ఆత్మయు నశింపకుండ సమస్త మానవాళిని నేను విమోచించెదను, నేను దానిని తప్పక చేయుదును; అయితే నీ ఘనతను నాకిమ్ము” (మోషే 4:1 చూడండి).
ఆవిధంగా, సాతాను తండ్రి యొక్క ఉద్దేశ్యమును నెరవేర్చుటను నివారించి మరియు ఆయన మహిమను సాతానుకు ఇచ్చే విధంగా తండ్రి యొక్క ప్రణాళికను అమలుపరచడానికి అతడు ప్రతిపాదించాడు.
సాతాను ప్రతిపాదన సంపూర్ణ సమానత్వాన్ని నిర్ధారించియుండవచ్చు: ఒక్క ఆత్మ కూడా నశింపబడకుండునట్లు అది “సమస్త మానవజాతిని విమోచించును.” ఏ కర్తృత్వముండదు లేక ఎవరిచేత ఎంపిక చేయబడదు, కాబట్టి, వ్యతిరేకత కొరకు ఏ అవసరత లేదు. ఏ పరీక్ష, ఏ వైఫల్యము మరియు ఏ విజయముండదు. తండ్రి తన పిల్లల కొరకు కోరిన ఉద్దేశ్యమును సంపాదించడానికి ఏ అభివృద్ధి ఉండదు. సాతాను యొక్క వ్యతిరేకత “పరలోకములో యుద్ధము” కలిగించిందని లేఖనాలు నివేదించాయి (ప్రకటన 12:7), దానిలో దేవుని పిల్లలలో మూడింట రెండు వంతుల మంది తండ్రి యొక్క ప్రణాళికను ఎంపిక చేసి మరియు సాతాను తిరుగుబాటును తిరస్కరించడం ద్వారా మర్త్య జీవితాన్ని అనుభవించే హక్కును పొందారు.
సాతాను యొక్క ఉద్దేశ్యము ఏమిటంటే, తండ్రి యొక్క ఘనతను మరియు అధికారమును తాను పొందాలనుకున్నాడు (యెషయా 14:12–15; మోషే 4:1, 3 చూడండి). “సాతాను నా యెడల తిరుగుబాటు చేసెను గనుక” అతడిని అనుసరించడానికి వారి కర్తృత్వమును ఉపయోగపరచుకొన్న ఆత్మలన్నింటితో పాటు, …“అతడు పడద్రోయబడునట్లు నేను చేసితిని” (మోషే 4:3) (యూదా 1:6; ప్రకటన 12:8–9; సి మరియు ని 29:36–37 చూడండి) అని తండ్రి చెప్పారు. మర్త్యత్వములో మూర్తీభవించని ఆత్మలుగా పడద్రోయబడి, సాతాను మరియు అతడి అనుచరులు దేవుని పిల్లలను శోదించి, మోసగించుటకు మరియు బంధీలుగా చేయడానికి వెదకుతారు (మోషై 4:4). కాబట్టి తండ్రి యొక్క ప్రణాళికను వ్యతిరేకించి, నాశనము చేయాలని కోరిన దుష్టుడు వాస్తవానికి, దానిని సులభతరం చేసాడు, ఎందుకనగా వ్యతిరేకత ఎంపికను సాధ్యము చేస్తుంది మరియు సరైన ఎంపికలు చేసే అవకాశము వృద్ధికి దారి తీస్తుంది, అది తండ్రి ప్రణాళిక యొక్క ఉద్దేశ్యము.
II.
ముఖ్యంగా, పాపము చేయమని మనకు కలిగే శోధన మర్త్యత్వములో ఉన్న ఒకేవిధమైన వ్యతిరేకత కాదు. పతనము సంభవించని యెడల, ఆదాము హవ్వలు “వారు దుస్థితినెరుగనందున ఆనందము లేకుండా అమాయకపు స్థితిలో ఉండేవారు” (2 నీఫై 2:23) అని తండ్రియైన లీహై బోధించారు. మర్త్యత్వములో వ్యతిరేకత యొక్క అనుభవము లేకుండా “అన్ని విషయములు ఒక దానిలో మిశ్రమముగా ఉండుట అవసరము,” దానిలో ఏ ఆనందము లేక దుస్థితి ఉండదు (11 వచనము). తండ్రియైన లీహై ఇలా కొనసాగించారు, కాబట్టి దేవుడు అన్నింటిని సృష్టించిన తరువాత, “మానవుల కొరకు తన నిత్య సంకల్పములను నెరవేర్చుటకు … ఒక వ్యతిరేకత ఉండుట అవసరమాయెను; జీవ వృక్షమునకు వ్యతిరేకముగా నిషేధించబడిన ఫలము ఉండెను; మొదటిది మధురముగాను రెండవది చేదుగాను ఉండెను” (15, వచనము).2 రక్షణ ప్రణాళికలో ఈ భాగముపై అతడి బోధన ఈ మాటలతో ముగించబడుతుంది:
“కానీ, సమస్తమును ఎరిగిన ఆయన వివేకమందు అన్నియు చేయబడినవి.
“మనుష్యులు ఉనికిలోనికి వచ్చునట్లు, వారు సంతోషమును కలిగియుండునట్లు ఆదాము పతనమాయెను” (24–25 వచనాలు).
వ్యతిరేకత మర్త్యత్వములో మనము ఎదుర్కొనే కష్టమైన పరిస్థితుల రూపములో ఉన్నది, అది మర్త్యత్వములో మన అభివృద్ధిని ముందుకు నడిపే ప్రణాళికలో భాగము.
III.
మనల్ని పరీక్షించే వ్యతిరేకత యొక్క వేర్వేరు విధాలను మనమందరం అనుభవిస్తాము. ఈ పరీక్షలలో కొన్ని ఏవనగా పాపము చేయమని మనల్ని ప్రేరేపించే శోధనలు. మరికొన్ని ఏవనగా వ్యక్తిగత పాపముతో పాటు మనకు కలిగే మర్త్య సవాళ్ళు. కొన్ని చాలా గొప్పవి. కొన్ని చిన్నవి. కొన్ని కొనసాగేవి మరియు కొన్ని కేవలము భాగాలు. మనలో ఎవరూ మినహాయింపు కాదు. మన పరలోక తండ్రి మనము ఏవిధంగా మారాలనుకుంటున్నారో దానివైపు ఎదగడానికి వ్యతిరేకత మనల్ని అనుమతిస్తుంది.
జోసెఫ్ స్మిత్ మోర్మన్ గ్రంథాన్ని అనువదించడం పూర్తి చేసిన తరువాత, అతడు ఒక ప్రచురణకర్తను కనుగొనవలసి ఉండెను. ఇది సులభము కాదు. ఈ సుదీర్ఘ వ్రాతప్రతి యొక్క సంక్లిష్టత మరియు వేలకొద్ది ప్రతులను ముద్రించడానికి మరియు బైండింగ్ చేయడానికి అయ్యే ఖర్చు భయపెట్టేదిగా ఉన్నది. మొదట జోసెఫ్ పాల్మైరా ప్రచురణకర్తయైన ఈ. బి. గ్రాండిన్‌ను సమీపించాడు, అతడు తిరస్కరించాడు. తరువాత అతడు పాల్మైరాలో మరొక ప్రచురణకర్తను కోరాడు, అతడు కూడా తిరస్కరించాడు. అతడు 25 మైళ్లు (40 కి.మీ) రోచెస్టర్ ప్రయాణించాడు మరియు పశ్చిమార్ధ న్యూయార్క్‌లో అత్యంత ప్రముఖ ప్రచురణకర్తను కలిసాడు, అతడు కూడా తిరస్కరించాడు. మరొక రోచెస్టర్ ప్రచురణకర్త సుముఖంగా ఉన్నాడు, కానీ పరిస్థితులు ఈ ప్రత్యమ్నాయాన్ని అమోదయోగ్యంగా చేయలేదు.
వారములు గడిచాయి మరియు జోసెప్ తన దైవిక బాధ్యతను నెరవేర్చడానికి వ్యతిరేకతను బట్టి దిగ్భ్రాంతి చెందియుండవచ్చు. ప్రభువు దానిని సులువుగా చేయలేదు, కానీ ఆయన దానిని సాధ్యము చేసాడు. జోసెఫ్ యొక్క ఐదవ ప్రయత్నము, పాల్మైరా ప్రచురణకర్తయైన గ్రాండిన్‌ను రెండవసారి కలవడం, విజయవంతమయ్యింది.3
సంవత్సరాల తరువాత, జోసెప్ అనేక నెలలుగా లిబర్టీ జైలులో బాధాకరంగా ఖైదు చేయబడ్డాడు. ఉపశమనము కోసం ప్రార్థన చేసినప్పుడు, ప్రభువు అతడితో “ఇవన్నియు నీకు అనుభవమునిచ్చుటకు నీ మేలుకొరకే” (సి మరియు ని 122:7) అని చెప్పారు.
మరణముతో కలిపి వ్యాధి, వైకల్యము మరియు మన వ్యక్తిగత పాపముల చేత కలుగజేయబడిన మిగిలిన విధాలైన మర్త్య వ్యతిరేకత గురించి మనమందరం తెలుసుకుంటాము. అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ వివరించారు:
“మీలో కొందరు కొన్నిసార్లు మీరు ఎదుర్కొంటున్న శ్రమలు ఏవైనను వాటిని అనుభవించడానికి మన పరలోక తండ్రి మిమ్మల్ని ఎలా అనుమతించారని, మీరు మీ బాధయందు ఎలుగెత్తి ఏడ్చియుండవచ్చు. … ”
“అయినప్పటికీ, మన మర్త్య జీవితము ఎప్పటికీ సులభమైనది లేక ఏకరీతిగా సంతోషంగా ఉండటానికి ఉద్దేశించబడలేదు.” మన పరలోక తండ్రి … కష్టమైన సవాళ్ళు, గుండెను ముక్కలు చేసే విచారాలు మరియు కష్టమైన ఎంపికల గుండా మనము నేర్చుకొని, ఎదిగి మరియు శుద్ధి చేయబడతామని ఎరుగును. మనలో ప్రతిఒక్కరు మన ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు, మన ఆరోగ్యాన్ని కోల్పోయినప్పుడు, మనము ప్రేమించిన వారు మనల్ని విడిచిపెట్టినప్పుడు విడిచిపెట్టబడిన భావాలను చీకటి దినాలను అనుభవిస్తాము. ఇవి మరియు మిగిలిన శ్రమలు సహించడానికి మన సామర్ధ్యమును నిజమైన పరీక్షను మనకు ఇస్తాయి.
విశ్రాంతిదినమును ఆచరించడానికి మెరుగుపరచడానికి మనము చేసే ప్రయత్నాలు వ్యతిరేకతకు తక్కువ ఒత్తిడితో కూడిన మాదిరిగా నిలుస్తాయి. విశ్రాంతిదినమును ఆచరించాలని మనము ప్రభువు యొక్క ఆజ్ఞను కలిగియున్నాము. మన ఎంపికలలో కొన్ని ఆ ఆజ్ఞను ఉల్లంఘించవచ్చు, కానీ విశ్రాంతిదినమును ఎలా గడపాలో మిగిలిన ఎంపికలు కేవలము మనము మంచిది లేక ఉత్తమమైనది లేక శ్రేష్ఠమైన దానిని చేస్తామా అనేది కేవలము ఒక ప్రశ్న.5
శోధన యొక్క వ్యతిరేకతను ఉదహరించడానికి, మోర్మన్ గ్రంథము కడవరి దినాలలో అపవాది ఉపయోగించే మూడు విధానాలను వివరిస్తుంది. మొదటిది, అతడు “నరుల సంతానము యొక్క హృదయములలో విజృంబించును మరియు వారిని మంచిదైన దానికి వ్యతిరేకముగా కోపమును పురికొల్పును” (2 నీఫై 28:20). రెండవది, అతడు “సీయోను వర్ధిల్లును అంతయూ క్షేమమే,” అని చెప్పుచూ, “శరీర సంబంధమైన భద్రతలోనికి వారిని మోసపుచ్చును” (21 వచనము). మూడవది, అతడు “నరకము లేదని, మరియు … నేను అపవాదిని కాదు, ఏలయనగా అతడు లేదు” (22 వచనము), మరియు కాబట్టి సరైనది, తప్పు ఏదీ లేదని మనతో చెప్పును. ఈ వ్యతిరేకత వలన మనము, “సీయోనులో అలక్ష్యముగా!” (24 వచనము) ఉండరాదని హెచ్చరించబడ్డాము.
సంఘము దాని దైవిక మిషను మరియు మన వ్యక్తిగత జీవితాలలో మనము నేడు హెచ్చవుతున్న వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాము. బహుశా, బలమందు సంఘము ఎదిగినప్పుడు సభ్యులు విశ్వాసము మరియు విధేయతయందు ఎదిగినప్పుప్పుడు, సాతాను తన వ్యతిరేకతను హెచ్చిస్తాడు, ఆవిధంగా మనము “అన్ని విషయాలందు వ్యతిరేకత” కలిగియుండుటను కొనసాగిస్తాము.
ఈ వ్యతిరేకతలో కొంత సంఘ సభ్యుల నుండి కూడా వస్తుంది. ప్రవక్తల చేత ఇవ్వబడిన నడిపింపును ఎదిరించడానికి వ్యక్తిగత తర్కాన్ని లేక తెలివిని ఉపయోగించే కొందరు ఎన్నుకోబడిన సంస్థల నుండి తెచ్చుకొన్న లేబుల్‌ను తమకు తాముగా ఇచ్చే—“విశ్వసనీయ వ్యతిరేకత.” అయినప్పటికీ, ప్రజాసామ్యానికి తగినది, దేవుని రాజ్యములో ప్రభుత్వములో ఈ భావనకు సమర్ధింపు లేదు, అక్కడ ప్రశ్నలు గౌరవించబడతాయి కానీ వ్యతిరేకత కాదు (మత్తయి 26:24 చూడండి).
మరొక ఉదాహరణగా, మన ప్రారంభ సంఘ చరిత్రలో చాలా విషయాలు ఉన్నాయి, అవి ప్రతి పరిస్థితిలో జోసెఫ్ స్మిత్ చేసినవి లేక చేయని వాటిని, కొందరు వ్యతిరేకతను సమర్ధించడానికి ఉపయోగిస్తారు. అందరికీ చెప్పేదేమిటంటే, విశ్వాసము సాధన చెయ్యండి మరియు రక్షకుని యొక్క బోధనపై ఆధారపడండి, ఆవిధంగా మనము “వారి ఫలము వలన వారిని తెలుసుకుంటాము” (మత్తయి 7:16). మనము కలిగియున్న నివేదికలతో పారదర్శకంగా ఉండటానికి సంఘము గొప్ప ప్రయత్నాలను చేస్తుంది, కానీ మనము అన్నీ ప్రచురించిన తరువాత, మన సభ్యులు కొన్నిసార్లు ముఖ్యమైన ప్రశ్నలతో విడవబడతారు అవి అధ్యయనము ద్వారా పరిష్కరించబడవు. అది “అన్ని విషయములలో వ్యతిరేకత” యొక్క సంఘ చరిత్ర సంస్కరణ. కొన్ని విషయాలు విశ్వాసము ద్వారా మాత్రమే నేర్చుకొనబడతాయి (సి మరియు ని 88:118 చూడండి). పరిశుద్ధాత్మ నుండి మనము పొందిన సాక్ష్యమందు మన విశ్వాసముపై అతి మిక్కిలిగా ఆధారపడాలి.
ఇతరుల ఉపశమనం కోసం కొందరికి వ్యతిరేకంగా జోక్యం చేసుకోవడం ద్వారా దేవుడు తన పిల్లలలో ఎవరి కర్తృత్వమునైనా చాలా అరుదుగా ఉల్లంఘిస్తారు. కానీ ఆయన మన బాధల భారమును తగ్గిస్తారు మరియు హీలమ్ దేశములోని ఆల్మా యొక్క జనులకు ఆయన చేసినట్లుగా, వాటిని భరించడానికి మనల్ని బలపరుస్తారు (మోషైయ 24:13–15 చూడండి). ఆయన అన్ని విపత్తులను నిరోధించడు, కానీ ఫిజీ దేవాలయ సమర్పణను ఆపడానికి భయపెట్టిన ప్రత్యేకంగా బలమైన తుఫానుతో ఆయన చేసినట్లుగా వాటిని ప్రక్కన పెట్టడానికి ఆయన మన ప్రార్థనలకు జవాబిస్తారు, 6 లేక బ్రస్సెల్ విమానాశ్రయంలో అనేకమంది ప్రాణాలను తీసివేసింది కానీ కేవలము మన నలుగురు సువార్తికులను గాయపరచిన ఉగ్రవాద బాంబులతో చేసినట్లుగా ఆయన వాటి ప్రభావాలను మొద్దుబారిస్తారు.
మన సమస్త మర్త్య వ్యతిరేకత ద్వారా, మనము ఆయన “[మన] బాధలను [మన] లాభము కొరకు ప్రతిష్ఠించును” (2 నీఫై 2:2) అనే దేవుని అభయాన్ని కలిగియున్నాము. ఆయన గొప్ప ప్రణాళిక యొక్క భావనలో మనము మన మర్త్య అనుభవాలను మరియు ఆయన ఆజ్ఞలను గ్రహించడానికి కూడా బోధించబడ్డాము, అది మనకు జీవితము యొక్క ఉద్దేశమును చెప్పును మరియు నేను ఎవరి నామములో ఈ సత్యమును గూర్చి సాక్ష్యమిస్తున్నానో, ఆ రక్షకుని అభయాన్ని మనకిచ్చును. యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.