2019
చేర్చుకునే సంస్కృతిని సంఘములో ఏ విధంగా మనము సృష్టించగలము?
2019 జూలై


చిత్రం
ministering

పరిచర్య సూత్రములు, 2019 జూలై

చేర్చుకునే సంస్కృతిని సంఘములో ఏ విధంగా మనము సృష్టించగలము?

మన వార్డులను మరియు శాఖలను చుట్టూరా చూచినపుడు, కొందరు సులభముగా ఇమిడిపోయే వారివలే అగుపించడం మనము చూస్తాము మనము గుర్తించని విషయమేమంటే, ఆ విధంగా ఇమిడిపోయినట్లు అగుపించే వారిలో కూడా విడిచిపెట్టబడినట్లు భావించువారు అనేకులు ఉంటారు. ఉదాహరణకు, ఒక అధ్యయనంలో, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో పెద్దవారిలో దాదాపు సగం మంది ఒంటరితనం, విడిచిపెట్టబడిన, లేక ఇతరులనుండి వేరుచేయబడిన భావనను కలిగియున్నట్లు ఇటీవల కనుగొన్నది. 1

చేర్చబడినట్లు భావించుట ముఖ్యమైనది. అది మానవ ప్రాధమిక అవసరం, కనుక బహిష్కరించబడినట్లు మనము భావించినప్పుడు, అది గాయపరుస్తుంది. విడిచిపెట్టబడుట విచారము, కోపముగల భావనలను కలిగించగలదు.2 మనము చేర్చబడ్డామని మనము భావించనప్పుడు, ఎక్కువ సౌఖర్యముగా ఉండే ప్రదేశము కొరకు వెదకుతాము. సంఘము వద్ద వారు చేర్చబడ్డారని ప్రతీ ఒక్కరూ భావించుటకు మనము సహాయపడాల్సినవసరమున్నది. మనది అను భావన కలుగునట్లు ప్రతిఒక్కరికి సహాయము చేయవలసిన అవసరం మనకున్నది.

రక్షకుని వలే చేర్చుట

ఇతరుల విలువను లెక్కించి, చేర్చుటకు, రక్షకుడు పరిపూర్ణమైన ఉదాహరణము. ఆయన తన శిష్యులను ఎంపిక చేసినప్పుడు, ఆయన వారి అంతస్తు, ఐశ్వర్యము, లేక ఉన్నతమైన ఉద్యోగమునకు ఆసక్తి చూపలేదు. యూదులు సమరయులను ఎంత చిన్నచూపు చూచినప్పటికినీ, ఆయన బావివద్ద సమరయ స్త్రీని గౌరవించి ఆమెకు తన దైవత్వమును గూర్చి సాక్ష్యమిచ్చెను (యోహాను 4 చూడుము). ఆయన హృదయమును లక్ష్యపెట్టును మరియు మనుష్యులను లక్ష్యపెట్టడు (1 సమూయేలు 16:7; సిద్ధాంతము మరియు నిబంధనలు 38:16, 26 చూడుము).

రక్షకుడు చెప్పెను:

“మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను. నేను మిమ్మును ప్రేమించిన విధముగా, మీరును ఒకని నొకరు ప్రేమించవలెనను క్రొత్త ఆజ్ఞను మీకిచ్చుచున్నాను.

“మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైన యెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను” (యోహాను 13:34–35).

మనము ఏమి చేయగలము?

ఎవరైనా ఒకరు తాము వెలుపల ఉన్నామని భావిస్తున్న యెడల, కొన్ని సమయాలలో అది చెప్పగలగడం కష్టతరం. కనీసం అంత స్పష్టంగా కాకపోయినా దానిని ఎక్కువమంది చెప్పరు. ప్రేమగల హృదయముతో, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా, మరియు తెలుసుకోవాలనే ప్రయత్నముతో, ఎవరైనా సంఘ సమావేశాలలోను, కార్యక్రమాలలో చేర్చబడినట్లు భావించనప్పుడు మనము గుర్తించగలము.

ఎవరైనా ఒకరు చేర్చబడనట్లు భావిస్తే సాధ్యమయ్యే సూచనలు:

  • చేతులు గట్టిగా కట్టుకోవటం లేక నేలచూపులు చూడడం వంటి బిగుసుకుపోయిన శారీరక హావభావాలు.

  • గదిలో వెనుకగా కూర్చోవటం లేక ఒంటరిగా కూర్చోవటం.

  • చర్చికి హాజరుకాకపోవడం లేక సక్రమంగా హాజరుకాకపోవడం.

  • సమావేశాలను లేక కార్యక్రమాల నుండి త్వరగా వెళ్ళిపోవడం.

  • సంభాషణలలో లేక పాఠములలో పాల్గొనక పోవడం.

ఇవి బిడియం, వ్యాకులత, లేక ఇబ్బంది పడటం వంటి ఇతర మనోభావాలకు సంబంధించిన సంకేతాలు కూడా కావచ్చును. సంఘంలో వారు క్రొత్త సభ్యులుగా ఉన్నప్పుడు, వేరే దేశం నుండి గాని, వేరే సంస్కృతి నుండిగాని వచ్చినవారు, లేక విడాకులు, లేక కుటుంబ సభ్యుల మరణం, మిషన్‌ను నుండి అకాలంగా తిరిగి రావడం వంటి బాధాకరమైన సంఘటనల వలన జీవితం మలుపు తిరిగి సభ్యుల యొక్క అనుభవము “భిన్నంగా” ఉండవచ్చును.

కారణాలను లక్ష్యపెట్టకుండా, ప్రేమతో వారికి దగ్గరవ్వడానికి మనం సందేహించకూడదు. మన చెప్పేది, మన చేయగలది అందరూ ఆహ్వానితులేనని, మరియు అందరు కావలసిన వారే అనే భావనను కల్పించగలదు.

చేర్చుటకు మరియు ఆహ్వానించడానికి కొన్ని విధానాలు.

  • సంఘములో ఎల్లప్పుడు ఒకే వ్యక్తుల ప్రక్కన కూర్చోవద్దు.

  • నిజమైన వ్యక్తిని చూచుటకు జనుల యొక్క బాహ్య రూపములను చూడకుము. (ఈ అంశముపై మరింత సమాచారము కొరకు “పరిచర్య అనగా రక్షకుడు చూచునట్లు ఇతరులను చూచుట” లియహోనా, జూన్ 2019, 8-11.)

  • సంభాషణలలో ఇతరులను చేర్చుము.

  • మీ జీవితాలలో భాగం అగుటకు ఇతరులను ఆహ్వానించండి. మీరు ఇదివరకే ప్రణాళిక చేస్తున్న కార్యక్రమాలలో వారిని చేర్చుకొనుము.

  • పరస్పర అభిరుచులను కనుగొని, వాటిని నిర్మించండి.

  • కేవలం మీ అంచనాలకు సరిపోలేదని ఎవరితోనూ మీ స్నేహాన్ని నిలిపివేయకండి.

  • ఒక వ్యక్తిలో ఏదైనా ప్రత్యేకతను మీరు గమనించినప్పుడు, దానిపై వ్యాఖ్యానించడం లేక దానిని మానివేయుటకు బదులు దానిపై ఆసక్తిని కలిగించుకొనుడి.

  • ప్రేమను వ్యక్తపరచండి మరియు మనఃపూర్వక అభినందనలను తెలియచేయండి.

  • వారి భేదాలను లక్ష్యపెట్టకుండా, ఈ సంఘము ప్రతి ఒక్కరిది అని మనము చెప్పినప్పుడు నిజముగా దాని అర్ధమేమిటని ఆలోచించుటకు సమయాన్ని తీసుకొనుము. దీనిని ఒక వాస్తవంగా మనము ఏవిధంగా చేయగలము?

మన కంటే విభిన్నమైన మనుషుల మధ్య మనకు సౌఖ్యభావన కలగడం ఎల్లప్పుడూ సులభం కాదు. కాని సాధనతో, భిన్నత్వాలలో విలువను కనుగొనుట యందు మరియు ప్రతీ వ్యక్తి తెచ్చు తోడ్పాట్లను అభినందించుటలో మనము మెరుగుపరచుకోగలము. పన్నెండుమంది అపోస్తలుల సమూహములోని ఎల్డర్ డీటర్ ఎఫ్. ఉక్డార్ఫ్ బోధించినట్లుగా, మనలోని భిన్నత్వములు మనలను మరింత మెరుగైన, సంతోషవంతులైన జనులనుగా చేయుటకు సహాయపడగలవు: “రండి, దేవుని బిడ్డలందరి పట్ల స్వస్థత, దయ, మరియు కరుణగల సంస్కృతిని నిర్మించుటకును బలపరచుటకును మాకు సహాయము చేయండి.”3

చేర్చుట ద్వారా ఆశీర్వదించబడుము

యుద్ధము ఆమె మాతృభూమిని ముక్కలుగా చీల్చివేసిన తరువాత క్రిస్టల్ ఫెక్టర్ మరొక దేశానికి వలస వెళ్ళింది. ఆమె భాష సరిగా మాట్లాడలేకపోయింది మరియు తన క్రొత్త పొరుగులో ఎవరినీ ఎరుగుదు, కనుక ప్రారంభంలో ఆమె వేరుచేయబడినట్లుగాను, ఒంటరిగా భావించేది.

సంఘ సభ్యురాలిగా, ఆమె తన ధైర్యాన్ని కూడగట్టుకొని తన క్రొత్త వార్డులో హాజరుకావడం ప్రారంభించింది. తన భాషలోని మందమైన యాస వలన జనులు ఆమెతో మాట్లాడటానికి ఇష్టపడరేమో లేక ఒక ఒంటరి స్త్రీ అని విమర్శిస్తారేమోనని చింతించింది.

కాని ఆమె భిన్నత్వాలను చూడకుండా ఆమెను తమ స్నేహితుల సమాజములోనికి ఆహ్వానించే ఇతరులను కలుసుకుంది. వారు ప్రేమతో చేరుకున్నారు, మరియు ఆమె త్వరలోనే ప్రాధమిక తరగతి బోధించుటలో సహాయం చేస్తూ తనకై తాను తీరికలేకుండా ఉండుట ఆమె కనుగొన్నది. చిన్నపిల్లలు అంగీకరించుటకు గొప్ప మాదిరిగా ఉన్నారు, మరియు ప్రేమించబడిన మరియు కావాలసిన భావన ఆమె విశ్వాసమును బలపరచి, ప్రభువుకు ఆమె మీదగల జీవితాంతపు సమర్పణను తిరిగి ప్రేరేపించుటకు సహాయము చేసెను.

వివరణలు

  1. అలెక్సా లార్డిఎరి, “అధ్యయనము నివేదిక ప్రకారము: అనేక అమెరికన్లు, ఎక్కువగా యువతరము వారు ఒంటరితనమును అనుభవిస్తున్నారు” U.S. News, May 1, 2018, usnews.com.

  2. కార్లీ కే. పీటర్సన్, లారా సి. గ్రవెన్స్, మరియు ఎడ్డీ హార్మన్ జోన్స్, “అసిమ్మెట్రిక్ ఫ్రాంటల్ కార్టికల్ ఆక్టివిటీ ఎండ్ నెగెటివ్ రెస్పాన్స్ టు ఆస్ట్రసిజం,” Social Cognitive and Affective Neuroscience, vol. 6, no. 3 (June 2011), 277–85.

  3. డీటర్, ఎఫ్, ఉక్డార్ఫ్, “నమ్ముడి, ప్రేమించుడి, చేయుడి,” లియహోనా, నవంబర్ 2018, 48.

ముద్రించు