2019
ఈ పరిచర్య చేయుటలో ఈ ముఖ్యమైన భాగమును మీరు కోల్పోతున్నారా?
2019 అక్టోబరు


పరిచర్య సూత్రములు, అక్టోబర్ 2019

పరిచర్య చేయుటలో ఈముఖ్యమైన భాగమును మీరు కోల్పోతున్నారా?

పరిచర్య చేయుట అనగా “సంతోషించు వారితో సంతోషించునట్లుగానే” “ఏడ్చువారితో ఏడ్చుట” (రోమా 12:15) గా ఉన్నది.

ministering

ఆగష్టొ జంబానాటో చేత దృష్టాంతములు

పరిచర్య చేయుట గురించి మనము ఆలోచించినప్పుడు, అవసరతలో ఉన్నవారికి సహాయపడుట గురించి ఆలోచించుట సులభము. విధవరాలి కొరకు తోట పని చేయుట, రోగికి భోజనము తెచ్చుట, లేక ప్రయాసపడుచున్న వారికి ఇచ్చుట గురించి మనము మాట్లాడుకున్నాము. “ఏడ్చువారితో ఏడ్చుట” అన్న పౌలు సలహాను మనము జ్ఞాపకముంచుకున్నాము, కాని ఆ వచనము యొక్క మొదటిభాగము “సంతోషించు వారితో సంతోషించుటకు”పై మనము తగినంతగా దృష్టిసారిస్తున్నామా? (రోమా 12:15). మనము పరిచర్య చేయు వారితో సంతోషించుట–దాని అర్ధము వారి విజయమును వేడుక చేసుకొనుటకు లేక కష్టకాలములందు సంతోషమును కనుగొనుటకు వారికి సహాయపడుట కావచ్చు–రక్షకుడు చేసినట్లుగా పరిచర్య చేయుటలో ముఖ్యమైన భాగముగా ఉన్నది.

మన జీవితాలలో దేవుడు ఉంచిన మంచిపై దృష్టిసారించుటకు మనము వెదకినప్పుడు (మనము మానవలసిన మరియు) సహాయపడగల మూడు ఉపాయములు ఇక్కడున్నాయి.

1. తెలుసుకొని ఉండుము.

మనము పరిచర్య చేయువారిని—వారి భారములను, ప్రయాసలను చూచుట మాత్రమే కాదు, కాని వారి బలములు, ప్రతిభలు, మరియు విజయాలను కూడా మనము చూడాల్సిన అవసరమున్నదని గ్రహించుటకు యువతుల ప్రధాన అధ్యక్షురాలు బోన్నీ హెచ్. కార్డన్ మనకు సహాయపడుచున్నారు. మనము “వారి పరిస్థితులను ఎరిగిన వారిగా ఉండి, వారి ఆశలు, ఆపేక్షలందు వారిని బలపరచు, ఒక విజేతగా మరియు ఒక నమ్మకస్తునిగా ఉండాలి,”1 అని ఆమె అన్నారు.

గొఱ్ఱెలు, మేకల ఉపమానములో, ఆయన కుడి చేతి వైపు కనుగొన్నవారితో రక్షకుడు చెప్పాడు: “ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగొనియుండుట చూచి నీకాహారమిచ్చితిమి? దప్పిగొనియుండుట చూచి యెప్పుడు దాహమిచ్చితిమి?

“ఎప్పుడు పరదేశివై యుండుట చూచి బట్టలిచ్చితిమి? … (మత్తయి 25:37-38).

“సహోదర, సహోదరిలారా, చూచెను అనేది ముఖ్యమైన పదము,” అని సహోదరి కార్డన్ చెప్పారు. “వారు గమనిస్తున్నారు మరియు కావలికాస్తున్నారు కనుక నీతిమంతులు అవసరతలో ఉన్నవారిని చూసారు. సహాయపడుటకు, వేడుక చేయుటకు, కలగనుటకు మనము కూడా కావలికాయు నేత్రముగా ఉండగలము.”2

2. వేడుక చేసుకొనుటకు కారణములు కనుగొనుము.

పెద్దవి లేక చిన్న విజయాలను వేడుక చేసుకొనుము. అది కాన్సరు అనుభవిస్తున్నప్పుడు లేక ప్రేమ విఫలమై మామూలవుతున్నప్పుడు, ఒక క్రొత్త ఉద్యోగము కనుగొనుట లేక, ప్రియమైన వారిని కోల్పోయిన ఒక నెల గడిచిన తరువాత లేక మధుమేహము లేకుండా ఒక వారము బ్రతికియుండుట కావచ్చు.

అభినందించుటకు ఫోను చేయండి, కార్డు ఇవ్వండి, లేక భోజనానికి బయటకు వెళ్ళుము. మన దీవెనలు కలిసి పంచుకొనుట కృతజ్ఞతతో జీవించుట మరియు ఇతరుల యొక్క దీవెనలు మరియు విజయాలను వేడుక చేసుకొనుట ద్వారా, మనము “మన సహోదరుల యొక్క సంతోషమునందు హర్షములు కలిగియుందుము” (ఆల్మా 30:34).

3. దేవుని యొక్క హస్తమును చూడుము.

కొన్నిసార్లు ఇతరులతో సంతోషించుట అనగా, మన జీవితాలలో ఎటువంటి కష్టముులు లేక ఆనందములు ప్రవేశించినప్పటికినీ—సంతోషించుటకు కారణములు వారు చూచుటకు సహాయపడాలి. పరలోక తండ్రి మనల్ని ఎరిగియున్నారని, మనల్ని పైకెత్తుటకు సిద్ధముగా ఉన్నారనే సాధారణమైన సత్యము సంతోషము యొక్క అనివార్యమైన ఆధారముగా ఉండగలదు.

మీ స్వంత జీవితాలలో ప్రభువు యొక్క హస్తమును మీరు ఎలా చూసారో దానిని పంచుకొనుట ద్వారా, ఇతరుల జీవితాలలో దానిని చూచుటకు మీరు వారికి సహాయపడగలరు. మీ సవాళ్ల గుండా పరలోక తండ్రి మీకు ఏ విధంగా సహాయపడ్డారో పంచుకొనుటకు తగినంత సున్నితంగా ఉండుము. ఆయన వారికి ఏ విధంగా సహాయపడ్డారో గుర్తించుటకు మరియు అంగీకరించుటకు ఈ సాక్ష్యము ఇతరులకు సహాయపడగలదు (మోషైయ 24:14 చూడుము).

4. సంతోషించుటకు మీ సామర్ధ్యమును పరిమితం చేయవద్దు.

దురదృష్టవశాత్తు, కొన్నిసార్లు మనము ఇతరులతో సంతోషించుటకు , ప్రత్యేకంగా మనము ఇతరులకు ఏమి ఇవ్వాలో, లేక జీవితంలో ఎక్కడున్నామో అభద్రతగా భావించినప్పుడు మన స్వంత సామర్థ్యమును పరిమితం చేసుకుంటాము. మరొకరు సంతోషమును కనుగొనుటకు బదులుగా, మనము పోల్చుకొనే ఉచ్చులో పడతాము. పన్నెండు మంది పన్నెండుమంది అపొస్తలుల సమూహమునకు చెందిన ఎల్డర్ క్వింటిన్ ఎల్. కుక్ బోధించినట్లుగా: “దీవెనలు పోల్చుకొనుట దాదాపు సంతోషమును తరిమివేయును. మనము ఒకేసారి కృతజ్ఞతను, అసూయను కలిగియుండలేము.”3

“దాదాపు ప్రతీఒక్కరిలో చాలా ఉమ్మడిగా ఉండే అటువంటి స్వభావమును మనము ఎలా జయించగలము?” పన్నెండు మంది అపొస్తలుల సమూహమునకు చెందిన ఎల్డర్ జెఫ్రి ఆర్. హాలండ్ అడిగారు. “… మన అనేక దీవెనలను మనము లెక్కించగలము మరియు ఇతరుల నెరవేర్పును మనము పొగడగలము. అన్నింటి కంటే శ్రేష్టమైనది, మనము ఇతరులకు సేవ చేయగలము, హృదయమునకు ఎప్పటికి ఇవ్వబడిన శ్రేష్టమైన సాధన.”4 పోల్చుకొనుటకు బదులుగా, మనము పరిచర్య చేయువారిని మనము పొగడగలము. వారి గురించి లేక వారి కుటుంబ సభ్యుల గురించి మీరు ప్రశసించు దానిని స్వేచ్ఛగా పంచుకొనుము.

పౌలు మనకు గుర్తు చేసినట్లుగా, మనమందరము క్రీస్తు యొక్క శరీరము, మరియు “ఒక అవయవము ఘనత పొందినప్పుడు, అవయవములన్నియు దానితో కూడ సంతోషంచును” (1 కొరింథీయులకు 12:26). పరలోకతండ్రి సహాయముతో, మనము ఇతరుల అనుభవాలను తెలుసుకోగలము, పెద్దవి, చిన్న విజయాలను జరువుకోగలము, ప్రభువు యొక్క హస్తమును గుర్తించుటకు వారికి సహాయపడగలము, మరియు అసూయను జయించగలము ఆవిధంగా మనము ఇతరుల యొక్క దీవెనల, ప్రతిభలు, సంతోషమునందు మనము నిజముగా కలిసి సంతోషించగలము.

వివరణలు

  1. బోనీ హెచ్. కార్డన్, “Becoming a Shepherd,” Liahona, నవం. 2018, 75.

  2. బోనీ హెచ్. కార్డన్, “Becoming a Shepherd,” 75.

  3. క్వింటన్ ఎల్. కుక్, “Rejoice!” Ensign, నవం. 1996, 30.

  4. జెఫ్రీ ఆర్. హాలాండ్, “The Ministry of Reconciliation,” Liahona, మే. 2002, 64.