2020
క్రిస్మస్ సమయంలో రక్షకుని వెలుగును పంచుకొనుట
2020 డిసెంబర్


“క్రిస్మస్ సమయంలో రక్షకుని వెలుగును పంచుకొనుట,” లియహోనా, 2020 డిసెంబర్

చిత్రం
పరిచర్య చేయుట

నిల్ట్జా బీట్రిజ్ శాంటిల్లాన్ కాస్టిల్లో చేత క్రీస్తు పుట్టుక యొక్క చిత్రము; గ్రెట్టీ ఇమేజెస్ నుండి బహుమతి యొక్క చిత్రము

పరిచర్య సూత్రములు, డిసెంబరు 2020

క్రిస్మస్ సమయంలో రక్షకుని వెలుగును పంచుకొనుట

మీరు పరిచర్య చేయువారి గురించి ఆలోచించండి. ఈ క్రిస్మస్ సమయంలో క్రీస్తుకు దగ్గరగుటకు మీరు వారికి ఎలా సహాయపడగలరు?

సంవత్సరమంతా రక్షకుడైన యేసు క్రీస్తును మనము జ్ఞాపకముంచుకొన్నప్పటికి, ఇవ్వబడిన వాటిలో కెల్లా గొప్ప బహుమానమును వేడుక చేసుకొనే కాలము క్రిస్మస్: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిని ఇచ్చెను” (యోహాను 3:16). క్రిస్మస్ సమయంలో మనము పరిచర్య చేసినప్పుడు, రక్షకునికి దగ్గరగుటలో ఇతరులకు సహాయపడే బహుమతులు మనము కూడ ఇవ్వగలము. పరలోక తండ్రి చేత ఇవ్వబడిన బహుమానమునకు అద్దం పట్టేలా మనల్ని మనం ఆలోచించడం అద్భుతమైనది.

నేను ఇంకా బహుమానమును ఆనందిస్తాను

సూసాన్ హార్డి, కాలిఫోర్నియా, అమెరికా

నాకు 11 సంవత్సరాల వయసున్నప్పుడు, నా ఆదివారపు బడి బోధకుడు సహోదరుడు డీట్స్ మేము విశ్వాస ప్రమాణాలను కంఠస్థం చేసి, వాటి అర్ధమును అతడికి వివరిస్తే, ప్రతి ఒక్కరికి లేఖనాలను కొనిస్తానని మా తరగతిలో చెప్పాడు.

సహోదరుడు, సహోదరి డీట్స్ అప్పుడే వైవాహిక జీవితాన్ని ప్రారంభిస్తున్న యువ దంపతులు. సహోదరుడు డీట్స్ ప్రతి ఒక్కరికి బహుమతి కొనగలడని నాకు ఖచ్చితంగా తెలియదు. కానీ విశ్వాస ప్రమాణాలు కంఠస్థము చేసేంత ముఖ్యమైనవని అతడు అనుకంటే, ఆ సవాలును తీసుకోవాలని నేను నిర్ణయించుకొన్నాను.

13 విశ్వాస ప్రమాణాలను నేను కంఠస్థం చేసిన తరువాత, కాలము గమనములో నేను అతడి వాగ్దానమును మరచిపోయాను.

అప్పుడు, క్రిస్మస్ రోజున, నా పేరుతో ఒక ప్యాకేజీని అందుకున్నాను. వాటిని క్రమం తప్పకుండా చదవమని నన్ను ప్రోత్సహిస్తూ వ్రాయబడిన ఒక కార్డుతో పాటు, కేవలం నాకోసం ఇవ్వబడిన లేఖనాలను నేను తెరిచాను. అది 1972లో జరిగింది, ఇప్పటికీ ఆ లేఖనాలు నా దగ్గరున్నాయి. అవి నాకు ప్రశస్తమైనవి.

దేవుని వాక్యమును చదవాలనే లోతైన కోరిక నాలో కలిగించింది అతడు నాపట్ల చూపిన దయ మరియు నా కోసం త్యాగం చేయటానికి అతడి సమ్మతే కాని ఆ బహుమతి యొక్క వెల కాదు. అతడు నన్ను దీవించినట్లుగా ఇతరుల జీవితాలను దీవించగలనని ఆశిస్తూ, నా చుట్టూ ఉన్న వారికి అర్ధవంతమైన బహుమతులను ఇచ్చుట ద్వారా, సహోదరుడు డీట్స్ యొక్క మాదిరిని అనుసరించడానికి నేను ప్రయత్నిస్తున్నాను.

ఒక పాత్రను పోషించడానికి ఒక ఆహ్వానము

రిచర్డ్ ఎమ్. రామ్ని, యూటా, అమెరికా

మా వార్డు క్రిస్మస్ కూడికను ప్రణాళిక చేసేవారు తక్కువ చైతన్యముగల సభ్యుని సందర్శించి, ఆ కార్యక్రమంలో పాల్గొనమని అతడిని ఆహ్వానించమని నన్ను అడిగినప్పుడు, నేను భయపడ్డానని ఒప్పుకుంటున్నాను. అంతకు ముందు వార్డు ప్రోత్సాహకార్యక్రమంలో డారెన్‌నుపాల్గొన్నప్పుడు, అతడిని నేను అంతకు ముందు ఒకసారి మాత్రమే కలిసాను. అతడు తన నుదుటిపై మోటర్ సైకిల్ హెడ్ బ్యాండ్ ధరించాడు. అతడు పొడుగాటి తన తెల్లని వెంట్రుకలను ఒక పోనిటెయిల్ కట్టాడు, అతడు పూర్తి తెల్లటి గడ్డము కలిగియున్నాడు, మరియు అతడి చేతులు పచ్చబొట్లతో నిండి ఉన్నాయి.

ఇప్పుడు, ఒక కమిటీ సభ్యుడితో కలిసి, నేను డారెన్ ఇంటి గుమ్మంలో నిలబడి, అతను ఏమి చెప్తాడోనని ఆలోచిస్తున్నాను. లోపలకి రమ్మని అతడు మమ్మల్ని ఆహ్వానించాడు, మరియు మేము అక్కడ ఎందుకున్నమో అతడికి చెప్పాము. “ఓహ్, అలా చేయడం నాకిష్టమే!” అని అతడు అన్నాడు.

ఆ ప్రోత్సాహకార్యక్రమము అనేకమందికి అర్ధవంతమైనదిగా చేయుటకు సహాయపడుతూ, అతడు ఒక అద్భుతమైన పని చేసాడు. కొద్ది కాలము తరువాత, నా పరిచర్య సహవాసి మరియు నేను డారెన్‌ను క్రమం తప్పకుండా దర్శించమని అడగబడ్డాము. మమ్మల్ని చూడటానికి అతడు ఎల్లప్పుడు సంతోషంగా కనబడ్డాడు, మరియు మా మధ్య కొన్ని ఆహ్లాదకరమైన సంభాషణలు జరిగాయి. వార్డు ప్రోత్సాహకార్యక్రమంలో పాల్గొనడానికి అతడిని ఆహ్వానించుటకు కలిగిన ప్రేరేపణ ఒక ప్రతిష్టాత్మకమైన అనుబంధానికి నడిపించినందుకు నేను కృతజ్ఞత కలిగియున్నాను.

క్రిస్మస్ సమయంలో పరిచర్య చేయుట

ప్రత్యేకంగా సంవత్సరంలో ఈ సమయమందు, వారిని గూర్చి మీరు ఆలోచిస్తున్నారని మీరు పరిచర్య చేయు వారికి తెలియునట్లు నిశ్చయపరచుటకు మీరు చేయగల కొన్ని విషయాలు ఇక్కడున్నాయి.

  1. ఫోను చేయుట లేక ఫోనులో సందేశము పంపుట కొన్నిసార్లు అద్భుతాలను చేయవచ్చు. “హాయ్, మీరేమి చేస్తున్నారు?” అనే సాధారణ సందేశముతో సంభాషణను ప్రారంభించడం గొప్ప ప్రభావాన్ని చూపగలదు.

  2. సముచితమైనప్పుడు వారి వేడుకలలో పాల్గోండి. మనకు ఉమ్మడిగా ఉన్న నమ్మకాలను గూర్చి నేర్చుకొనుటకు క్రిస్మస్ గొప్ప సమయము కావచ్చు. మీ నమ్మకాలను పంచుకున్నప్పుడు మరియు ఇతరులను విన్నప్పుడు, మీరు ఎక్కువ అవగాహనకు తలుపులు తెరుస్తారు.

  3. వారి కోసం పేరు పేరున ప్రార్ధించండి. వారిని ఆయన కుమారునికి దగ్గరగా తెచ్చు విధానములను గూర్చి ఆలోచించుటకు మీకు సహాయపడమని పరలోక తండ్రిని అడగండి.

  4. సాధారణమైన బహుమతులు తరచుగా బాగా గుర్తుంచుకోబడతాయి. ప్రేమించబడుటకు బహుమతులు విస్తృతమైనవిగా ఉండాల్సినవసరం లేదు. సమయమును వెచ్చించుట వినుట అనే బహుమతులు, ఒక చిత్రమును లేక జ్ఞాపకమును పంచుకొనుట —ఇవన్నీ హృదయపూర్వక బహుమతులు కావచ్చు.

  5. సాక్ష్యమనే బహుమతిని ఇవ్వండి. రక్షకుని కొరకు వారు కలిగియున్న ప్రేమను మీతో పంచుకోమని వారిని అడగండి, మరియు ఆయన కొరకు మీరు కలిగియున్న ప్రేమను పంచుకొంటామని చెప్పండి.

  6. ఒక క్రిస్మస్ కార్యక్రమానికి హాజరుకమ్మని ఇతరులను ఆహ్వానించండి. ఆరాధించాలనే కోరికను కొంతమంది కలిగి ఉంటారు కానీ ఎక్కడికి వెళ్లాలో వారికి తెలియదు. మీతో ఆరాధించుటకు వారిని ఆహ్వానించండి.

  7. వారి గృహమును సమాధానముతో నింపండి. వారి హృదయాలకు నిరీక్షణను, ప్రేమను తెచ్చే ప్రత్యేక క్రిస్మస్ సందేశాన్ని సువార్తికులు కలిగియన్నారని వారికి తెలియజేయండి.

ఒక సమూహముగా అందరికీ పరిచర్య చేయుట

ప్రతీ సమూహము యొక్క అవసరాలు ప్రత్యేకమైనవి. పెద్ద ప్రోత్సాహకార్యక్రమమును నిర్వహించుట వలన కొన్ని సమూహాలు ప్రయోజనము పొందుతాయి. మిగిలిన సమూహాలు ఏదైనా చిన్నది మరియు సాధారణమైన దాని నుండి ప్రయోజనము పొందవచ్చు. ప్రోత్సాహకార్యక్రమాలను ప్రణాళిక చేసి, వాటిని నిర్వహించే వారు, అక్కడ ఉన్న అవసరాలను ఎలా తీర్చాలో ప్రార్ధనాపూర్వకంగా ఆలోచించాలి.

  • ఫ్రాన్స్‌లోని పారిస్‌లో మూడు స్టేకుల నుండి సభ్యులు, ఒక ప్రతిభ ప్రదర్శన మరియు ఒక ఫ్యాషన్ ప్రదర్శనతో కూడిన లోకమును వెలుగుతో నింపండి సాయంకాలపు పార్టీకి మద్ధతు ఇవ్వడానికి సహాయపడ్డారు. శరణార్ధులు మరియు నిరాశ్రయతను అనుభవించు జనులకు ఇవ్వడానికి వస్తువులను వాళ్లు సిద్ధపరిచారు.

  • ఆహారం, అంతర్జాతీయ క్రిస్మస్ సంప్రదాయ ప్రదర్శనలు, సంగీతం, సేవా ప్రాజెక్టులు మరియు పిల్లల యొక్క క్రీస్తు పుట్టుక ప్రదర్శన ద్వారా క్రీస్తును పురస్కరించుకొను ఒక ప్రోత్సాహాకార్యక్రమంతో షార్లెట్ నార్త్ కరోలినా సెంట్రల్ స్టేకు సమాజం కోసం “ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్” కార్యక్రమాన్ని నిర్వహించింది.

  • మనము క్రిస్మస్‌ వేడుకలను ఎందుకు జరుపుకుంటాము అనే సమాజపు జ్ఞాపిక కార్యక్రమంలో వెరో బీచ్ ఫ్లోరిడా స్టేకు సభ్యులు చేరారు. సమాజపు స్వచ్ఛంద సంస్థలకు బొమ్మలు విరాళమివ్వబడినవి. ఒక ప్రాథమిక పిల్లల గాయకబృందము ప్రదర్శించబడింది, మరియు అనేక సంఘాలలో సమాచారాన్ని ప్రదర్శించే బూత్‌లు ఉన్నాయి.

  • సమాజం కోసం జాక్సన్విల్లే ఫ్లోరిడా దక్షిణ స్టేకు లోక రక్షకుడు ప్రదర్శనను సమర్పించింది.

ముద్రించు