“దేవాలయం చూడడం నాకిష్టం,” చిన్న పిల్లల పాటల పుస్తకం, 2021.
శనివారపు ఉదయకాల సభ
దేవాలయాన్ని చూడడం నాకిష్టం
సారాంశాలు
ప్రభువు యొక్క దేవాలయాలు పరిశుద్ధ స్థలాలని నాకు తెలుసు. దేవాలయాల గురించి నేడు మాట్లాడడంలో నా ఉద్దేశ్యము, దేవాలయ అనుభవాల కొరకు మన కోసం వస్తున్న అధికమైన అవకాశాలకు యోగ్యులుగా మరియు సిద్ధంగా ఉండాలనే మీ కోరికను, నా కోరికను పెంచడం. …
మీరు లేదా నేను తగినంత పరిశుద్ధంగా దేవాలయానికి వెళ్ళనట్లయితే, రక్షకుని గురించి మనం దేవాలయంలో పొందగలిగే ఆత్మీయ బోధనను పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మనము చూడలేము.
అటువంటి బోధనను పొందడానికి మనం యోగ్యులమైనప్పుడు, మన దేవాలయ అనుభవం ద్వారా మన జీవితాలంతటా నిరీక్షణ, ఆనందం మరియు ఆశావాదం పెరగగలవు. ఆ నిరీక్షణ, ఆనందం మరియు ఆశావాదం పరిశుద్ధ దేవాలయాల్లో నిర్వహించబడే విధులను అంగీకరించడం ద్వారా మాత్రమే లభ్యమవుతాయి. మరణం తర్వాత కొనసాగి, నిత్యము నిలిచియుండే ప్రియమైన కుటుంబ సంబంధాల అభయాన్ని దేవాలయంలోనే మనం పొందగలము. …
… మరియు మన వంశస్థులలో మనకు వీలైనంతమందికి ఇదే శాశ్వత సంతోషాన్ని అందించడానికి మనకు చేతనైనంత చేయడంపై మన నిత్య సంతోషము ఆధారపడి ఉంటుందని మనకు తెలుసు.
దేవాలయం యొక్క ముద్రణ విధులను పొందడానికి, గౌరవించడానికి యోగ్యులు కావాలని కోరుకొమ్మని సజీవులైన కుటుంబ సభ్యులను ఆహ్వానించడంలో నేను అదే కోరికను భావిస్తున్నాను. తెరకు ఇరువైపులా అంత్యదినాలలో వాగ్దానం చేయబడిన ఇశ్రాయేలు సమకూర్పులో అది ఒక భాగము.