2022
నిబంధనలు మనల్ని దేవునితో కలుపుతాయి
2022 ఫిబ్రవరి


“నిబంధనలు మనల్ని దేవునితో కలుపుతాయి,” లియహోనా, 2022 ఫిబ్రవరి

లియహోనా నెలవారీ సందేశము, 2022 ఫిబ్రవరి

నిబంధనలు మనల్ని దేవునితో కలుపుతాయి

నిబంధనలు చేయడం మరియు పాటించడం దీవెనలను తెస్తుంది.

నిబంధన అనేది పరలోక తండ్రి మరియు ఆయన పిల్లల మధ్య చేయబడే ఒక వాగ్దానం. ఆయనతో మనము చేసే నిబంధనలకు ఆయన షరతులు విధిస్తారు. ఆయన కోరినది మనము చేసినప్పుడు, మనము అనేక దీవెనలు పొందుతాము. మనం నిబంధనలను చేసి, పాటించినప్పుడు--మనం భూమిపై మాత్రమే దీవెనలు పొందము, ఒకరోజు పరలోకంలో ఉన్న దేవునితో మరియు మన కుటుంబాలతో కలిసి జీవించడానికి తిరిగి వెళ్తాము.

బాప్తిస్మము

నిబంధనలు మరియు విధులు

కొన్ని నిర్దిష్టమైన విధులు పొందే సమయంలో మనం నిబంధనలు చేస్తాము. తిరిగి వెళ్ళి దేవునితో జీవించడానికి మనం ఆ విధులను పొంది, ఆ నిబంధనలకు లోబడాలి. ఆ విధులు యాజకత్వ అధికారము చేత నిర్వహించబడతాయి. ఆ విధులలో బాప్తిస్మము, నిర్ధారణ, (పురుషులు) మెల్కీసెదెకు యాజకత్వమును పొందుట మరియు దేవాలయములో మనం పొందే విధులు కలిపియున్నాయి. సంస్కార సమయంలో సంఘ సభ్యులు దేవునికి చేసిన వాగ్దానాలను నూతనపరుస్తారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 20: 77, 79 చూడండి).

సంస్కారము

నీతికరంగా జీవించడానికి మనకు నిబంధనలు సహాయపడతాయి

మనము యేసు క్రీస్తును అనుసరిస్తామని, ఎల్లప్పుడూ ఆయనను జ్ఞాపకముంచుకొని ఆజ్ఞలను పాటిస్తామని, బాప్తిస్మము పొందే సమయంలో మనం వాగ్దానము చేస్తాము (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:37 చూడండి). పరిశుద్ధాత్మ ఎల్లప్పుడు మనతో ఉంటుందని దేవుడు వాగ్దానము చేస్తున్నారు.

పురుషులు యాజకత్వమును పొందినప్పుడు, దేవుని యాజకత్వ శక్తికి యోగ్యులై జీవిస్తారని వారు వాగ్దానము చేస్తారు. వారిని దీవిస్తానని దేవుడు వాగ్దానమిచ్చారు. (సిద్ధాంతము మరియు నిబంధనలు 84:33-40 చూడండి.)

బ్రెజిల్ రెసిఫ్ దేవాలయము

జేమ్స్ పోర్టర్ ద్వారా రెసిఫ్ బ్రెజిల్ దేవాలయము యొక్క దృష్టాంతము

దేవాలయంలో మనం చేసే నిబంధనలు

సంఘ సభ్యులు దేవాలయంలో తమ వరము పొందినప్పుడు, వారు నీతికరంగా జీవిస్తారని మరియు సువార్త కోసం త్యాగం చేస్తారని వాగ్దానం చేస్తారు. దేవుని నుండి శక్తి వారికి వాగ్దానము చేయబడుతుంది (సిద్ధాంతము మరియు నిబంధనలు 38:32: 109:22) చూడండి.

దేవాలయములో ముద్రించబడు సమయంలో, భార్య మరియు భర్త నిత్యత్వము కొరకు వివాహం చేసుకుంటారు , ఒకరికొకరు మరియు దేవునికి నమ్మకంగా ఉంటారని వాగ్దానం చేస్తారు. వారు ఆయన యొద్దకు తిరిగివెళ్ళి, కుటుంబాలుగా శాశ్వతంగా జీవిస్తారని దేవుడు వాగ్దానము చేస్తున్నారు. (సిద్ధాంతము మరియు నిబంధనలు 132:19-20 చూడండి.)

సువార్తికులు

మనం ఆయన నిబంధన జనులము

యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘములో చేరువారు దేవుని యొక్క నిబంధన జనులవుతారు. వారు అబ్రాహాము నిబంధన యొక్క దీవెనలు మరియు బాధ్యతలను కూడా వారసత్వంగా పొందుతారు (గలతీయులకు 3:27–29 చూడండి). దేవుని నిబంధన జనులలో భాగం కావడమంటే మనం క్రీస్తుకు దగ్గరగా వచ్చినప్పుడు మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటాము. భూమిపై ఉన్న దేవుని సంఘాన్ని బలోపేతం చేయడానికి మనం పాటుపడతామని కూడా దీని అర్థము. మన నిబంధనలను మనం పాటించినప్పుడు, దేవుని నుండి శక్తిని మరియు బలాన్ని మనం కనుగొనగలము.