2022
సంఘ పిలుపులలో సేవ చేయుట
మార్చి 2022


“సంఘ పిలుపులలో సేవ చేయుట,” లియహోనా, 2022 మార్చి

లియహోనా నెలవారీ సందేశము, 2022 మార్చి

సంఘ పిలుపులలో సేవ చేయుట

సంఘ నాయకులు “పిలుపులు” అని పిలువబడే నిర్దిష్ట నియమితకార్యములలో సేవ చేయమని సభ్యులను అడుగుతారు. సభ్యులు ఇతరులకు సేవ చేయడానికి మరియు దేవునికి దగ్గరయ్యే అవకాశాన్ని పిలుపులు కల్పిస్తాయి.

చిత్రం
వీల్ చైర్‌లో ఉన్న వ్యక్తి సంఘ తరగతికి బోధిస్తున్నాడు

డేవిడ్ బోవెన్ న్యూటన్ చేత ఛాయాచిత్రం

మన పిలుపులలో మనం సేవ చేసినప్పుడు, దేవుని కార్యమును సాధించడంలో సహాయం చేస్తాము. మనము ఇతరులకు పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు గురించి బోధిస్తాము మరియు మనం బోధించే వారు వారికి దగ్గర కావడానికి సహాయం చేస్తాము. మనం నమ్మకంగా సేవ చేస్తే దీవెనలు కూడా లభిస్తాయి.

పిలుపులను పొందుట

చిత్రం
యువకుడు సంఘ సమూహం ముందు నిలబడి ఉన్నాడు

సంఘంలో సేవ చేసే వారు దేవుని చేత పిలువబడ్డారు. ప్రతి పిలుపు‌లో ఎవరిని సేవ చేయమని అడగాలో తెలుసుకోవడానికి సంఘ నాయకులు ప్రేరణ కోసం ప్రార్థిస్తారు. ఒక నాయకుడు అప్పుడు సభ్యుడిని సేవ చేయమని అడిగి, పిలుపు యొక్క విధులను వివరిస్తాడు. వార్డు లేదా శాఖ సభ్యులు సహకార ఓటును అందించే సంఘ సమావేశంలో సభ్యులు ఆమోదించబడతారు. పిలవబడే వ్యక్తికి మద్దతు ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారని దీని అర్థం. సభ్యునికి యాజకత్వ నాయకునిచే దీవెన ఇవ్వబడుతుంది. దీనిని ప్రత్యేకపరచుట అంటారు. పిలుపులోపని చేయడానికి సభ్యునికి అధికారం ఇవ్వబడుతుంది మరియు అతనికి లేదా ఆమెకు సేవ చేయడంలో సహాయం చేయడానికి ఇతర దీవెనలు ఇవ్వబడతాయి.

బిషప్పులు

బిషప్పు ఒక వార్డుకు నాయకుడు. (ఒక శాఖలో, శాఖాధ్యక్షుడు బిషప్పు‌ను పోలి ఉంటాడు.) స్టేకు అధ్యక్షుడు యోగ్యుడైన యాజకత్వము గలవానిని బిషప్పుగా పిలుచుటకు సిఫార్సు చేస్తారు. ప్రథమ అధ్యక్షత్వము ఆ పిలుపును ఆమోదిస్తుంది. అప్పుడు బిషప్పు ఆమోదించబడి, సేవ చేయడానికి ప్రత్యేకించబడతారు. అతడు యాజకత్వపు తాళపుచెవులను కూడా పొందుతాడు, వార్డుకు దర్శకత్వం వహించే అధికారం అతనికి ఉంది అని దాని అర్థం. బిషప్పు‌గా, అతడు వార్డు సభ్యులందరికీ సేవ చేస్తాడు మరియు నడిపిస్తాడు.

అధ్యక్షత్వములు

యాజకత్వ సమూహములు మరియు ఉపశమన సమాజము, యువతులు, ప్రాథమిక మరియు ఆదివారపు బడి మొదలైన సంస్థలు సాధారణంగా ఒక అధ్యక్షుడు/అధ్యక్షురాలు మరియు ఇద్దరు సలహాదారుల/సలహాదారిణిల చేత నడిపించబడతాయి. పెద్దల సమూహపు అధ్యక్షత్వములు స్టేకు అధ్యక్షత్వము చేత పిలువబడి, ప్రత్యేకించబడతాయి. బిషప్రిక్కు వార్డులోని ఇతర అధ్యక్ష స్థానాలలో సేవ చేయమని సభ్యులకు చెప్పి, వారిని ప్రత్యేకపరుస్తారు. నాయకులందరూ వారి సమూహములు లేదా సంస్థల్లో సభ్యులకు సేవ చేస్తారు. వారు సభ్యుల అవసరాలకు పరిచర్య చేస్తారు మరియు దేవుని ప్రేమను అనుభవించడంలో వారికి సహాయం చేస్తారు.

చిత్రం
బిడ్డను చేతపట్టుకొని తల్లికి ఆహారం తీసుకువస్తున్న స్త్రీ

ఇతర పిలుపులు

బోధన, సంగీతంలో సహాయం చేయడం, గ్రంథాలను భద్రపరచడం, యువత లేదా పిల్లల కోసం ప్రోత్సాహకార్యక్రమాలను ప్రణాళిక చేయడం మరియు ఇతర మార్గాలలో సేవ చేయడం వంటివి ఇతర సంఘ పిలుపులలో ఉన్నాయి. సంఘములో ప్రతి పిలుపు ముఖ్యమైనది మరియు ఇతరులకు సేవ చేయడానికి మరియు దేవునికి సేవ చేయడానికి సభ్యులకు అవకాశం ఇస్తుంది. మన పిలుపులను నెరవేర్చడానికి మనమందరం కలిసి పని చేస్తున్నప్పుడు, మనము ఇతరులను బలపరుస్తాము మరియు సంఘ వృద్ధికి సహాయం చేస్తాము.

ముద్రించు