“లేఖనాలు: దేవుని వాక్యము,” లియహోనా, 2022 జూలై.
లియహోనా నెలవారీ సందేశము, 2022 జూలై.
లేఖనాలు: దేవుని వాక్యము
లేఖనాలు పరిశుద్ధ గ్రంథాలు, అవి ప్రధానంగా ప్రవక్తల చేత వ్రాయబడినవి. లేఖనాలు యేసు క్రీస్తు, ఆయన సువార్త గురించి సాక్ష్యమిస్తాయి. సంఘము యొక్క అధికారిక గ్రంథాలు బైబిలు (పాత నిబంధన, క్రొత్త నిబంధనను కలిగియున్నది), మోర్మన్ గ్రంథము, సిద్ధాంతము మరియు నిబంధనలు, మరియు అమూల్యమైన ముత్యము.
పాత నిబంధన
పాత నిబంధన ప్రాచీన కాలములలో ఆయన నిబంధన జనులతో దేవుని వ్యవహారాల నివేదికను కలిగియున్నది. అది మోషే, యెషయా, యిర్మీయా, మరియు దానియేలు వంటి ప్రవక్తల బోధనలను కలిగియున్నది. అది యేసు క్రీస్తు పుట్టకముందు, వందల సంవత్సరాల క్రితం వ్రాయబడినప్పటికీ, అనేకమంది పాత నిబంధన ప్రవక్తలు ఆయన గురించి వ్రాసారు.
క్రొత్త నిబంధన
క్రొత్త నిబంధన యేసు క్రీస్తు యొక్క పుట్టుక, మర్త్య జీవితము, బోధనలు, మరియు ప్రాయశ్చిత్తమును నమోదు చేసింది. అది క్రీస్తు యొక్క అపొస్తలులు మరియు ఇతర శిష్యుల బోధనలను కూడా కలిగియున్నది. యేసు క్రీస్తు యొక్క సువార్తను ఎలా జీవించాలో గ్రహించడానికి క్రొత్త నిబంధన మనకు సహాయపడుతుంది.
మోర్మన్ గ్రంథము: యేసు క్రీస్తు యొక్క మరియొక నిబంధన
మోర్మన్ గ్రంథము ప్రాచీన అమెరికాలో జీవించిన జనులలో కొందరి యొక్క వృత్తాంతమును కలిగియున్నది. అది ప్రవక్తల బోధనలను కలిగియున్నది, మరియు దాని ప్రధాన ఉద్దేశమేదనగా యేసే క్రీస్తని సమస్త జనులను ఒప్పించుట. ప్రవక్త జోసెఫ్ స్మిత్ దానిని బంగారు పలకల నుండి దేవుని యొక్క వరము మరియు శక్తి చేత అనువదించాడు.
సిద్ధాంతము మరియు నిబంధనలు
సిద్ధాంతము మరియు నిబంధనలు జోసెఫ్ స్మిత్ మరియు మిగిలిన కడవరి దిన ప్రవక్తలకు ఇవ్వబడిన బయల్పాటులను కలిగియున్నది. క్రీస్తు యొక్క సంఘము ఎలా ఏర్పాటు చేయబడిందో బయల్పాటులు వివరిస్తాయి. అవి యాజకత్వము, సువార్త యొక్క విధులు, మరియు ఈ జీవితం తరువాత ఏమి జరుగుతుందో ముఖ్యమైన సువార్త బోధనలను కలిగియున్నది.
అమూల్యమైన ముత్యము
అమూల్యమైన ముత్యము మోషే, అబ్రహాము గ్రంథాలను, జోసెఫ్ స్మిత్ యొక్క సాక్ష్యమును, మరియు సంఘము యొక్క విశ్వాస ప్రమాణాలను కలిగియున్నది. అది జోసెఫ్ స్మిత్—మత్తయిని కలిగియున్నది, అది క్రొత్త నిబంధన యొక్క జోసెఫ్ స్మిత్ యొక్క అనువాదములో భాగము.
లేఖనాలను అధ్యయనము చేయుట
ప్రవక్తలు ప్రతిరోజు లేఖనాలను అధ్యయనము చేయమని మనకు బోధించారు. ఆవిధంగా చేయుట, మన విశ్వాసమును హెచ్చించడానికి, పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుకు దగ్గర కావడానికి మనకు సహాయపడుతుంది. మనము ప్రార్థనాపూర్వకంగా లేఖనాలను అధ్యయనం చేసినప్పుడు, మన ప్రశ్నలకు జవాబులు కనుగొనడానికి పరిశుద్ధాత్మ మనకు సహాయపడుతుంది.
ఆధునిక ప్రవక్తలు
నేడు ప్రవక్తలు మరియు అపొస్తలులు పరిశుద్ధాత్మ చేత మాట్లాడినప్పుడు, వారి మాటలు లేఖనాల వలె ఉన్నాయి. దీనికి ఒక మాదిరి ఈ సర్వసభ్య సమావేశము. మనము సమావేశము నుండి బోధనలను లియహోనా యొక్క మే, నవంబరు సంచికలలో చదవగలము.
© 2022 by Intellectual Reserve, Inc. All rights reserved. అ.సం.రాలలో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly Liahona Message, July 2022 యొక్క అనువాదం Telugu. 18298 421