2022
గృహ సాయంకాలము అంటే ఏమిటి?
2022 ఆగష్టు


“గృహ సాయంకాలము అంటే ఏమిటి?” లియహోనా, 2022 ఆగ.

లియహోనా నెలవారీ సందేశము, 2022 ఆగష్టు

గృహ సాయంకాలము అంటే ఏమిటి?

చిత్రం
ఆరుబయట కూర్చొనియున్న తల్లి, తండ్రి మరియు చిన్న అమ్మాయి

వారంలో మీ కుటుంబము సమకూడుటకు కేటాయించబడిన సమయమే గృహ సాయంకాలము. ఈ సమయంలో, మీరు “సువార్తను నేర్చుకోవచ్చు, సాక్ష్యాలను బలపరచవచ్చు, ఐక్యతను పెంపొందించుకోవచ్చు మరియు ఒకరికొకరు ఆనందించవచ్చు” (General Handbook: Serving in The Church of Jesus Christ of Latter-day Saints, 2.2.4, ChurchofJesusChrist.org). గృహ సాయంకాలము ప్రతి కుటుంబానికి కొంత భిన్నంగా కనిపిస్తుంది. కలిసి దగ్గరవ్వడానికి మరియు రక్షకుని దగ్గర కావడానికి ఈ సమయాన్ని వినియోగించడమే లక్ష్యం.

సిద్ధపాటు

మీ కుటుంబం ఆనందించే ప్రోత్సాహకార్యక్రమం గురించి మరియు మీరు కలిసి చర్చించుకుని తెలుసుకోవాలనుకునే సువార్త అంశం గురించి ఆలోచించండి. అలాగే, ప్రతి వారం కుటుంబంలో ఎక్కువ మంది లేదా అందరూ కలిసే రోజు మరియు సమయాన్ని ఎంచుకోండి. సోమవారం రాత్రులు గృహ సాయంకాలమును నిర్వహించమని సంఘము సభ్యులను ప్రోత్సహిస్తుంది. కానీ కుటుంబాలు వారికి అనుకూలమైన సమయంలో కలుసుకోవచ్చు.

చిత్రం
ప్రార్థన చేస్తున్న కుటుంబము

ప్రార్థన

చాలా కుటుంబాలు గృహ సాయంకాలమును ప్రార్థనతో ప్రారంభించి, ముగిస్తారు. ఇది పరిశుద్ధాత్మను వారి గృహాలలోనికి ఆహ్వానిస్తుంది. పిల్లలు మరియు పెద్దలు చిన్న సమూహంతో కలిసి ప్రార్థన చేయడం నేర్చుకోవడానికి గృహ సాయంకాలము అనువైన సమయం.

సంగీతము

అనేక కుటుంబాలు ప్రారంభ మరియు ముగింపు పాటను కూడా కలిగి ఉంటాయి. వారు సాధారణంగా కీర్తన పుస్తకం లేదా ప్రాథమిక పాటల పుస్తకం నుండి ఒక పాటను ఎంచుకుంటారు. సంఘము music.ChurchofJesusChrist.orgలో రికార్డు చేయబడిన పియానో కీర్తనలను కలిగియున్నది. మీరు టెంపుల్ స్క్వేర్ వద్ద టాబర్నాకిల్ గాయకబృందం పాడిన పాటల వీడియోలను కూడా చూడవచ్చు. సభ్యులు గృహ సాయంకాలము సమయంలో పాడడం వలన సంఘములో పాడే కీర్తనలను నేర్చుకోవడానికి సహాయపడుతుంది.

పాఠము

గృహ సాయంకాలమునకు సహాయపడే అనేక వనరులను సంఘము కలిగియున్నది. మీరు లియహోనా, స్నేహితుడు లేదా యౌవనుల బలము కొరకు నుండి తీసుకోబడిన కథనాన్ని చదవడానికి మరియు చర్చించడానికి కొన్ని నిమిషాలు వెచ్చించవచ్చు. ఇది సంఘ వీడియోలను చూడడానికి మరియు చర్చించడానికి కూడా సమయం కావచ్చు. లేదా మీరు సర్వసభ్య సమావేశము నుండి ఒక ప్రసంగాన్ని చదవవచ్చు, లేఖనాలను చదవవచ్చు, లేదా రండి, నన్ను అనుసరించండిలో ఆ వారపు పఠనాన్నిచర్చించవచ్చు.

చిత్రం
బిస్కెట్లను తయారు చేస్తున్న పిల్లలు

బిస్కెట్లను తయారు చేస్తున్న పిల్లల ఛాయాచిత్రము, మిచెల్ లోయిన్స్ చేత

కుటుంబ ప్రమేయం

గృహ సాయంకాలములో పిల్లలు పాల్గొనవచ్చు. ప్రోత్సాహకార్యక్రమాలను ప్రణాళిక చేయడం, ప్రార్థన చేయడం లేదా పాటలను ఎంచుకుని నడిపించడంలో వారు సహాయపడగలరు. వారు పాఠాలు కూడా బోధించగలరు. గృహ సాయంకాలమునకు ముందు, మీరు మీ చిన్నారికి ఫ్రెండ్ పత్రికలోని కథనాన్ని లేదా వారికి ఇష్టమైన లేఖన కథనాన్ని చదవడంలో సహాయపడవచ్చు. బిడ్డ ఆ కథను కుటుంబానికి పాఠంగా చెప్పగలదు. గృహ సాయంకాలము కొరకు లేఖన కథనాలను నటించి చూపడానికి కూడా చాలా మంది పిల్లలు ఇష్టపడతారు. పెద్ద పిల్లలు పాఠాన్ని ప్రణాళిక చేయనివ్వండి లేదా వారు చదవాలనుకుంటున్న సర్వసభ్య సమావేశ ప్రసంగాన్ని ఎంచుకోనివ్వండి. తరువాత వారిని చర్చకు నడిపించనివ్వండి.

ప్రోత్సాహకార్యక్రమాలు

చాలా కుటుంబాలు గృహ సాయంకాలములో భాగంగా ప్రోత్సాహకార్యక్రమాలు చేయడం ఆనందిస్తున్నాయి. ఇంటిలోపల ప్రోత్సాహకార్యక్రమాలలో ఆటలు ఆడటం, హస్తకళలు చేయడం లేదా కలిసి వంట చేయడం వంటివి కలిగియుండవచ్చు.

బహిరంగ ప్రోత్సాహకార్యక్రమాల కోసం మీరు నడవవచ్చు, కుటుంబ విహారయాత్రకు వెళ్ళవచ్చు, లేదా కలిసి బయట క్రీడలు ఆడవచ్చు. కుటుంబ సభ్యులందరూ చేయగలిగే ప్రోత్సాహకార్యక్రమాలు కనుగొని, కలిసి ఆనందించండి. ఆత్మను దూరం చేసే పోటీ క్షణాలను నివారించండి.

సేవ

కుటుంబాలు ఇతరులకు సేవ చేయడానికి గృహ సాయంకాలము గొప్ప సమయం. మీరు కొంతమంది పొరుగు వృద్ధులకు సహాయం చేయవచ్చు, నిరాశ్రయుల ఆశ్రయంలో ఆహారం అందించవచ్చు, సువార్తికులకు వ్రాయవచ్చు, లేదా చెత్తను తొలగించవచ్చు.

ముద్రించు