2022
మనము దశమభాగము ఎందుకు చెల్లిస్తాము
2022 డిసెంబరు


“మనము దశమభాగము ఎందుకు చెల్లిస్తాము,” లియహోనా, 2022 డిసెం.

2022 డిసెంబరు, లియహోనా నెలవారీ సందేశము

మనము దశమభాగము ఎందుకు చెల్లిస్తాము

పేర్చబడిన నాణెములు

యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ సభ్యులు వారి ఆదాయములో పదవ భాగాన్ని సంఘానికి ఇస్తారు. ఇది దశమభాగము అని పిలువబడుతుంది. ప్రపంచమంతటా సంఘము యొక్క కార్యమును వహించడానికి ఆ డబ్బు ఉపయోగించబడుతుంది.

దశమభాగము అనగా ఏమిటి?

దశమభాగమును చెల్లించుట అనేది దేవుని ఆజ్ఞలలో ఒకటి, అనగా మన ఆదాయములో పదవ భాగాన్ని సంఘానికి ఇవ్వడం. మనము దశమభాగము చెల్లించినప్పుడు, మన దీవెనల కొరకు మనం దేవునికి మన కృతజ్ఞతను చూపుతాము. మనము ప్రభువునందు నమ్మకముంచుతున్నామని, అన్ని విషయాలందు ఆయనకు విధేయులుగా ఉండడానికి సమ్మతిస్తున్నామని మనము చూపుతాము.

దశమభాగము యొక్క చెల్లింపుగా మెల్కీసెదెకు వద్దకు వస్తువులను తెస్తున్న జనులు.

మెల్కీసెదెకు--నిల్వగృహ కావలివాడు, కార్క్ కెల్లీ ప్రైస్ చేత

పాత నిబంధన బోధనలు

దేవుని యొక్క జనులు పాత నిబంధన కాలముల నుండి దశమభాగము చెల్లించియున్నారు. ఉదాహరణకు, అబ్రాహాము దశమభాగములు చెల్లించాడు (ఆదికాండము 14:18–20 చూడండి). దశమభాగ చట్టము మోషే, మలాకీలతో పాటు ప్రాచీన ప్రవక్తల చేత కూడా బోధించబడింది (లేవీయకాండము 27:30–34; నెహెమ్యా 10:35–37; మలాకీ 3:10 చూడండి).

దశమభాగ చట్టము యొక్క పునఃస్థాపన

1838 లో, సంఘ సభ్యులు దశమభాగమును ఎలా చెల్లించాలని ప్రవక్త జోసెఫ్ స్మిత్ ప్రభువును అడిగారు. ప్రభువు యొక్క జవాబు సిద్ధాంతము మరియు నిబంధనలు 119, లో వ్రాయబడింది, అది సభ్యులు వారి వార్షిక అభివృద్ధిలో పదియవ వంతును సంఘానికి ఇవ్వాలని చెప్తుంది (4వ వచనము చూడండి). “వార్షిక అభివృద్ధి” అనగా అర్థము ఆదాయమని సంఘ నాయకులు బోధించారు.

ఒకరికి ఒకరు కవరును అందిస్తుండగా కరచాలనము చేస్తున్న జనులు

జామీ డేల్ జాన్సన్ చేత ఛాయాచిత్రము

మనము దశమభాగమును ఎలా చెల్లించాలి

donations.ChurchofJesusChrist.org వద్ద ఆన్‌లైన్ విరాళ ఫారంను పూర్తి చేయడం ద్వారా మనము దశమభాగమును చెల్లించగలము. లేదా మనము కాగితపు ఫారంను నింపి, బిషప్రిక్కు లేదా శాఖాధ్యక్షత్వములో ఒక సభ్యునికి డబ్బును ఇవ్వగలము. డబ్బంతా సంఘ ప్రధాన కేంద్రములకు పంపబడుతుంది, అక్కడ సంఘ నాయకులు (ప్రథమ అధ్యక్షత్వము, పన్నెండుమంది అపొస్తులుల సమూహము మరియు అధ్యక్షత్వము వహించు బిషప్రిక్కు) దానిని ఎలా ఉపయోగించాలో ప్రార్థనాపూర్వకంగా నిర్ణయిస్తారు.

దీవెనలు

దశమభాగమును చెల్లించేవారు భౌతికంగా, ఆత్మీయంగా దీవించబడతారని ప్రభువు వాగ్దానమిచ్చారు. దశమభాగము ఆయనను గూర్చి నేర్చుకోవడానికి, సువార్తలో ఎదగడానికి అవకాశముతో కూడా దేవుని పిల్లలందరిని దీవిస్తుంది.

సాల్ట్ లేక్ దేవాలయము

దశమభాగపు నిధులు ఎలా ఉపయోగించబడతాయి

ప్రపంచమంతటా ప్రభువు యొక్క సంఘమును నిర్మించడానికి దశమభాగపు డబ్బు ఉపయోగించబడుతుంది. ఇది దేవాలయాలను, ఇతర సంఘ నిర్మాణాలను నిర్మించుట, లేఖనాలు మరియు ఇతర వనరులను ముద్రించుట, సంఘ యాజమాన్య పాఠశాలలకు నిధులను సమకూర్చుట, కుటుంబ చరిత్రమరియు సువార్త పరిచర్యలో సహాయపడుటను కలిపియున్నది.

దశమభాగపు ప్రకటన

సంవత్సరములో ఒకసారి సంఘ సభ్యులు తాము పూర్తి దశమభాగము చెల్లించు వారమని చెప్పడానికి వారి బిషప్పును (లేదా శాఖాధ్యక్షుడిని) కలుసుకుంటారు.

దశమభాగము దేనికి చెల్లిస్తుంది

ఓక్లాండ్ కాలిఫోర్నియా దేవాలయము

లాంగిన్ లోన్జినా జూ. చేత ఓక్లాండ్ కాలిఫోర్నియా దేవాలయ ఛాయాచిత్రము

వివిధ భాషలలో మోర్మన్ గ్రంథ ప్రతులు
సమావేశ మందిరము